తెలుగు ప్రజలు గర్వించదగ్గ ఇంగ్లిష్ ఎడిటర్లలో రామ్ కరణ్ గారు అగ్రగణ్యులు అని చెప్పుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా వారి హైదరాబాద్ ఎడిషన్ దూసుకుపోవడం లో ఆయన పాత్ర జర్నలిస్టులకు తెలిసిందే. కారణాలు ఏమిటో గానీ, ఆయన కుదురుగా ఒక పత్రికలోగానీ న్యూస్ ఛానెల్ లో గానీ  ఉండలేకపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్-టైమ్స్ ఆఫ్ ఇండియా-టీ వీ 9, ఐ-న్యూస్, ది హిందూ లలో ప్రస్థానం సాగించి మొన్నీ మధ్య [...]
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఫోటోలో ఉన్నది (ఎడమ నుంచి కుడికి) మా నాన్న, అమ్మ, అన్నయ్య, వదిన, మామయ్య (వదిన తండ్రి). వీళ్లంతా... మా ఊరు గొల్లపూడి లో మా ఇంట్లో  భోగి మంట దగ్గర కూర్చుని ఈ ఉదయం దిగిన ఫోటో ఇది. మా నాన్న, మామయ్యా పదవీవిరమణ తర్వాత ఈ ఊళ్ళో ఉంటున్నారు. పెద్దమ్మాయిని అమెరికాకు, రెండో అమ్మాయిని చైనా కు మూడో అమ్మాయిని హైదరాబాద్ కు చదువుల నిమిత్తం [...]
సమాచార సేకరణ, వ్యాప్తి కోసం అహరహం శ్రమించే జర్నలిస్టులు అప్రజాస్వామిక శక్తుల చేతిలో బలవుతున్నారు. వ్యక్తిగత పగ, ఇతరత్రా ద్వేషాలతో 2017లో 67 మంది జర్నలిస్టులను అత్యంత క్రూరంగా అంతమొందించారని 'రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌' సంస్థ ప్రకటించింది. మొత్తం హతుల్లో 60 శాతం మందిని వ్యక్తిగత కక్షతోనే హతమార్చినట్లు నివేదిక తెలిపింది. మరో 202 మంది జర్నలిస్టులను [...]
తెలంగాణా పబ్లికేషన్స్ లిమిటెడ్ వారి ఆంగ్ల పత్రిక 'తెలంగాణా టుడే' ఈ రోజుతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్ శ్రీనివాస రెడ్డిగారి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందానికి, పత్రిక వివిధ విభాగాలలో పనిచేస్తున్న అందరికీ ఈ బ్లాగ్ శుభాభినందనలు తెలుపుతోంది. ఆల్ ద బెస్ట్!పక్కా లోకల్ ఇంగ్లిష్ పత్రికగా పేరు తెచ్చుకున్న 'తెలంగాణా టుడే' [...]
అక్టోబర్ నాలుగో తేదీన సిల్వర్ జూబ్లీ చేసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బూతుపై సమరం ప్రకటించిన తర్వాత సైబర్ క్రైమ్ విభాగం వేగంగా స్పందించి, మార్ఫింగ్ తో అశ్లీల సైట్స్ నడుపుతున్న పలువురిని అరెస్టు చేసింది. ఈ క్రమంలో... ఇలాంటి పలు వెబ్‌సైట్లను నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన ఠాకూర్‌ మహేష్‌ కుమార్‌ జయంతీజీ, ఠాకూర్‌ బాలూసిన్హా [...]
మీడియాలో పనిచేసేవాళ్ళతో పాటు, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవాళ్ళు కూడా తమ మోటార్ సైకిళ్ళు, కార్ల కు ముందూ, వెనకా 'ప్రెస్' అన్న స్టిక్కర్లు అంటించుకుంటారు. కొన్ని పట్టణాలలో దాదాపు అన్ని బండ్ల మీదా 'ప్రెస్' గుర్తు ఉండడం మనం గమనించవచ్చు. ఇట్లా అతికించుకుంటే... కొన్ని వెసులుబాట్లు ఉంటాయని ఎక్కడా రాసి లేదు కానీ... 'ప్రెస్' అన్న మాటలు చూసి పోలీసులు చెకింగ్ కోసమని బండి ఆపరు. [...]
వద్దు... ప్లీజ్... అని ప్రాధేయపడుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని ఒక పోకిరీ గాడు వెకిలిగా నవ్వుతూ హత్తుకుంటాడు. దాన్ని ఆపడానికి ఇంకో అమ్మాయి ప్రయత్నిస్తుండగా... ఇంకొక దగుల్బాజీగాడు... 'ఇప్పరా... తియ్యరా' అని అంటుంటే... ఆ పోకిరీ గాడు ఆ పిల్ల జాకెట్ తెలగించాలని  ప్రయత్నిస్తాడు. 'నన్నే మోసం చేస్తావే... తియ్యరా... తియ్యి' అని ఆ దగుల్బాజీగాడు ఎగగొస్తుంటాడు-ఈ ఘోరాన్ని సెల్ ఫోన్లో [...]
సర్కార్ చేయాల్సిన పని.. గోగినేని బాబు బృందం చేసింది!తెలంగాణా లో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. చేతబడి చేశారని పాపం... పేద, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలను కొట్టి చంపుతూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కటీ దారుణ హత్యే కానీ నిందితులకు శిక్షలు పెద్దగా ఉండవు.మాబ్ ఎటాక్స్ (గుంపులుగా వెళ్లి దాడి చేయడం) కావడాన సాక్ష్యాలు సేకరించడం కష్టం. న్యాయం కోసం పోరాడే [...]
తన తండ్రి రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చిన మహా పాదయాత్ర లాంటి పాదయాత్రకు నవంబర్ 6 నుంచి సిద్ధమవుతున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సాక్షి మీడియా అధిపతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం (అక్టోబర్ 23, 2017) సాయంత్రం...  ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీ రావు గారిని కలుసుకున్నారు.రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్లిన జగన్ పెద్దాయన యోగక్షేమాలు తెలుసుకున్నాక... తన [...]
అక్టోబర్ 22, 2017, ఆదివారం, క్రీడాప్రియులకు నిజంగా పసందైన రోజుగా గుర్తుండి పోతుంది. నాలుగు క్రీడల్లో (హాకీ, బాడ్మింటన్, క్రికెట్, టేబుల్ టెన్నిస్) మంచి మ్యాచ్ లు కనువిందు కలిగించాయి. టెలివిజన్ లైవ్, లైవ్ వెబ్ స్ట్రీమింగ్ ద్వారా ఏకకాలంలో ఇంట్లో కూర్చుని ఈ నాలుగు ఫైనల్స్ చూసే మహద్భాగ్యం కలిగింది.ఆసియా ఛాంప్స్... మన హాకీ వీరులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో జరిగిన ఆసియా కప్ [...]
హాలీవుడ్ లో ప్రసిద్ధ డైరెక్టర్ హార్వీ వెయిన్స్టీన్ (Harvey Weinstein) మీద నటీమణులు చేస్తున్న లైంగిక ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా అయనపెద్ద సంఖ్యలో మహిళల మీద చేసిన అఘాయిత్యాలు ఒకటికటి బైటికి వస్తున్నాయి. హాలీవుడ్ లో తన ప్రతిభను, పలుకుబడిని, డబ్బును అడ్డం పెట్టుకుని చేసిన అఘాయిత్యాలు మనందరికీ నిజంగా మేలుకొలుపు!హార్వీ బాధితుల కథనం ఒకటే. 30 [...]
గత మూడేళ్ళుగా తెలుగు టెలివిజన్ న్యూస్ లో ఒక సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి (వీ-6 fame) ఈ దీపావళి రోజున వివిధ చానెల్స్ లో తన ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు.ఎంతో కష్టపడి కింది నుంచి పైకిఎదిగిన ఈ చేవెళ్ల కుర్రోడికి (అసలు పేరు రవి కుమార్)... ఇన్నాళ్లు పడిన కష్టానికి ఈ రోజు ఒక మంచి ఫలితం లభించట్లు అనిపించింది. ముఖ్యంగా... ఈ టీవీ  లో 'పండగ చేస్కో' ప్రోగ్రాం లో [...]
అధికారం లో ఉన్న పార్టీ...  మీడియాను గుప్పెట్లో పెట్టుకోవడం రానురాను మరీ ఎక్కువయ్యింది. పాలకులు ఆశించిన దానికన్నా ఎక్కువగా మీడియా యజమానులు అడుగులకు మడుగులొత్తడం ఇబ్బంది కలిగిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యాక...మీడియా ఆయనకు, కుమారుడికి, కుమార్తె కు, సర్కార్ కు బ్రహ్మరథం పట్టడం నిత్యకృత్యమయ్యింది. మంచి రాసినప్పుడు పొగడడంలో [...]
ఆయన... 'ఈనాడు' రామోజీ రావు గారి లాగా పట్టిందల్లా బంగారం చేసే రకం కాదు.ఆయన... 'సాక్షి' జగన్ మోహన్ రెడ్డి గారి లాగా నోట్లో బంగారు చెంచా తో పుట్టలేదు.అయన... 'టీవీ-9' రవి ప్రకాష్ లాగా నిండు విగ్రహం కాదు.అయన... 'డీ సీ' జయంతి గారి లాగా బుర్రతో జర్నలిజం నడిపే బాపతు కాదు.నమ్మింది ఆచరించే సత్తా, మనసులో మాట కుండబద్దలు కొట్టే తెగువ, సిగ్గూ ఎగ్గూ లేకుండా కలిసిపోయే తత్త్వం, నిర్భయత్వం, [...]
దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రతి చోటా జర్నలిజం కోర్సులున్నాయి. జర్నలిజం బోధన కోసమే ప్రత్యేకించి ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వంటి సంస్థలూ వెలిశాయి. ప్రతి ఏడాదీ వీటిలోంచి పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన జర్నలిస్టులు బైటికి వస్తుంటారు.అయినా... హైదరాబాద్ లో ఇంగ్లిష్ మీడియాను సరుకున్న జర్నలిస్టుల కొరత పట్టి పీడిస్తున్నది చాలా ఏళ్లుగా. రెండు రాష్ట్రాలు [...]
"ది హన్స్ ఇండియా" పత్రికను ఒక గాట్లోకి తెచ్చిన ప్రముఖ జర్నలిజం ఆచార్యుడు, రాజకీయ-సామాజిక-ఆర్థిక విశ్లేషణలో దిట్ట  ప్రొ. కె . నాగేశ్వర్ ఆ పత్రికకు నిన్న గుడ్ బై చెప్పారు. పత్రిక యజమాని వామన రావు గారు (కపిల్ గ్రూప్ ఛైర్మన్) సేల్స్, సర్క్యులేషన్ కు సంబంధించిన ఒక మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకొని నాగేశ్వర్ గారు అక్కడికక్కడే రాజీనామా ప్రకటన చేశారు. బోర్డు [...]
ఇది రాసే సమయానికి సమయం నాలుగున్నరదాటింది. తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ లను నిర్దోషులుగా తెలుస్తూ అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇచ్చి చాలా సేపు అయ్యింది.అయినా... ది హన్స్ ఇండియా వెబ్ సైట్ లో ఇంకా పాత వార్తే...పైగా తీర్పు కు విరుద్ధమైన అర్థం వచ్చేది... నడుస్తోంది. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ చూడండి. వెబ్ సైట్లు [...]
మీడియా కట్టు కథలు, అర్థ సత్యాలు, అసత్యాలతో వర్ధిల్లడం సహజం! తమ తమ కులాలకు చెందిన రాజకీయ పార్టీల జెండా మోయడం, అధికార పార్టీల అడుగులకు మడుగులొత్తడం తప్పనిసరైన వాతావరణంలో ఉన్నాం మనం.సంప్రదాయ పత్రికలను తలదన్ని ఆధునిక తెలుగు జర్నలిజంలో ఒక చరిత్ర సృష్టించిన 'ఈనాడు' ఈ మధ్యన మరీ సిల్లీ వార్తలు ప్రచురిస్తూ... చవకబారు పత్రికలతో పోటీ పడడం ఆ పత్రిక అభిమానులకు [...]
హైదరాబాదు కేంద్రంగా ఆనతి కాలంలోనే వినుతికెక్కిన 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రిక పరిణామాలు ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటాయి. కపిల్ గ్రూప్ మీడియా బాధ్యతలు చూస్తున్నపుడు ప్రసిద్ధ తెలుగు ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి  మస్తిష్కంలో మొగ్గతొడిగిన ఆలోచనే 'ది హన్స్ ఇండియా'. కృష్ణా రామా అంటూ  ఎక్కడో కూర్చున్న  డెక్కన్ క్రానికల్ ఫేమ్ నాయర్ గారిని పూర్ణకుంభ [...]
దక్షిణాదిలో ప్రతి విద్యావంతుల కుటుంబం, విద్యార్థులు, ఉద్యోగార్థులు తప్పక చదివే 'ది హిందూ' దినపత్రిక రిపోర్టర్ వేదికా చౌబే  బాధ్యతారాహిత్యం వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. చివరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి షో కాజ్ నోటీస్ అందుకోవాల్సి వచ్చింది.ముంబాయి ఎల్ఫీన్ స్టోన్ రైల్వే దగ్గర తొక్కిసలాటలో చిక్కుకున్న ఒక మహిళకు మానవత్వంతో సహాయపడుతున్న ఒక వ్యక్తి [...]
జర్నలిజం ఒక వ్యసనం. జర్నలిజం లోకి అడుగుపెట్టిన వాళ్ళు దాని నుంచి బైట పడలేరు. సంఘోద్ధరణ చేస్తున్నామన్న భ్రమ, ఇంత గొప్ప భావప్రకటన వేదిక ఇంక ఎక్కడా ఉండదన్న నిజం, నేతలు-పోలీసులు నిజంగానే అభిమానిస్తున్నారన్న అబద్ధం, పైరవీకి పనికి రాకపోతారా అన్న భావంతో మన చుట్టూ చేరి భజనపరులు చేసే యాగీ, బైలైన్స్ ఇచ్చే కిక్కు, ఇంకో రంగంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం... తదితరాల [...]
ఈ రోజున అంటే అక్టోబర్ నాలుగో తేదీన సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బూతుపై సమరం ప్రకటించింది. బూతు వెబ్ సైట్స్ మీద చర్య తీసుకోండని కోరుతూ సైబర్ క్రైమ్ కు 'మా' బృందం ఒక పిటిషన్ సమర్పించింది. ఇంతకన్నా గొప్ప వార్త ఇంకోటి ఉంటుందా?నిజంగానే కొన్ని సైట్లు ఘోరంగా రాస్తున్నాయి. పిచ్చి బొమ్మలు జమ చేసి, మార్ఫింగ్ చేసి, బూతు మాటలు చేర్చి, [...]
జర్నలిస్టులు, ఎడిటర్లు కూడా మానవ మాత్రులే. వృత్తిలో భాగంగా వారు కొన్ని తప్పిదాలకు పాల్పడడం సహజం. చేసింది తప్పని నిరూపితమైతే/ తెలిసిపోతే వెంటనే తప్పయ్యిందని ప్రకటించి క్షమాపణలు కోరడం మంచి సంప్రదాయం.తాము దైవంశ సంభూతులమని నమ్మే ఎడిటర్లు ఎక్కువగా ఉన్న తెలుగు మీడియా లో... చేసిన తప్పులకు చెంపలు వేసుకునే సంస్కారులు పెద్దగా కనిపించరు. కొద్దో గొప్పో... నైతిక జర్నలిజానికి [...]
ఘోరమైన తప్పులు చేసినా తప్పించుకునే వెసులుబాటు మీడియా లో ఉంటుంది. తెలుగు మీడియా లో అయితే ఆ సౌలభ్యం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. వీళ్ళను అడిగే నాథుడే లేడు.తెలుగు జాతి గర్వపడే ఆర్టిస్టు మోహన్ గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే ఆయన తనువు చాలించినట్లు ఇంటర్నెట్ లో, వాట్సప్ గ్రూపుల్లోనే కాకుండా... పలు తెలుగు ఛానెల్స్ లో స్క్రోలింగ్స్ వచ్చాయి. ఎవడైనా తప్పు చేస్తే నానా [...]
బీబీసీ అనగానే... సాధారణ పాఠకులకు 'నిష్పాక్షికత', 'వృత్తి నిబద్ధత' వంటివి గుర్తుకు వస్తాయి. అలాంటి బీబీసీ తెలుగు వార్తా ప్రపంచంలో కొత్త శకం ప్రారంభించింది... ఈ రోజున. అదే తెలుగు వెబ్ సైట్ ఆవిష్కరణ. బీబీసీ కాచివడపోసిన మంచి జర్నలిస్టుల బృందం... ప్రత్యేక తర్ఫీదు పొంది... ఒక రెండు మూడు నెలలుగా దేశ రాజధానిలో ఇందుకు వేదిక సిద్ధం చేసింది. తెలుగు జర్నలిజం లో తమకంటూ ఒక స్థానం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు