కష్టము లవి యట్లె కలకాల ముండవు -అలల వోలె ఎగసి తొలగిపోవు!అవియె తొలగు పిదప, అనుభవాలుగ నిల్చు!!జీవితానుభవము చెరగిపోదు!!!
ఈర్ష్య, ద్వేషమ్ము, వెటకార, మీసడింపు -తోటివార నెట్టును నీకు దూరముగను!ప్రేమ, గౌరవ, మర్యాదల్  వెల్లివిరియ -చేరువౌదురు జనులు నీ చెంత జేరి!
నీరము పుట్టి విష్ణుపద నీరజయుగ్మమునందు గంగయై,పారుచు దేవలోకముల పావనమై, శివశీర్షమెక్కి తాజారి, ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై,చేరె సముద్ర గర్భమున కృష్ణయు, గౌతమి, నర్మదాదులై!
"భావన" యను శిలను పరిశుభ్రముగ జేసి,"బుద్ధి"ని ఉలి జేసి పూని చెక్కి,అందమైన శిల్పమటుల తీరిచిదిద్దుశిల్పియె "కవి"! "కవిత" శిల్పమనగ!
వ్యాసుడు పుట్టిన దినమిది -భూసురులున్, కవుల, గురుల పూజా దినమైప్రాశస్త్యము గల దినమిది -దాసుడు పుట్టిన దినమయె దైవము మెచ్చన్!అందరికీ "గురు పూర్ణిమ" శుభాకాంక్షలతో -ప్రత్యేక ధన్యవాదాలతో -                              డా. ఆచార్య ఫణీంద్ర 
నే గమియింతు "నాఫిసు"కు నెమ్మదిగా తలపోయు చేదియో -"వేగము పెంచు - 'ఝా'మ్మనుచు వేడుకగా పయనింత" మంచు తావాగును నాదు వాహనము! "వద్ద"ని నే కడు ప్రేమ దానికిన్సైగను జేసినంత, నది చల్లబడుంజుమి బుంగ మూతితో!   
మా విరితోటలో పెరుగు మల్లియ చెట్టు - కరాల బోలెడిన్తీవలు సాచి, ఆకుల మదీయ భుజంబుల దట్టి పల్కు నేవేవొ గుసల్ గుసల్ చెవుల కింపుగ! ఆ మధురంపు పల్కులేపూవులు; వాని సౌరభమె పుల్కలు రేపెడి భాష యయ్యెడిన్!
ఏడాది కాలాన కెంత విల్వొ - పరీక్ష   తప్పిన యట్టి విద్యార్థి నడుగు!ఒక ఋతు కాలానకున్న విలువ - రైతు   పొలమునందలి కృషి ఫలము నడుగు!ఒక్క మాసంబున కున్న విలువ - గర్భ   వతి పడె డాపసోపాల నడుగు!ఒక్క వారంబున కున్న విలువ - వార    పత్రిక నుద్యోగి పాట్ల నడుగు!రోజు కూలి నడుగు మొక్క రోజు విలువ!గంట విలువను బడిలోని గంట నడుగు!నిమిషమును "ఫ్లైటు మిస్" ప్రయాణికుల నడుగు!సెకను విలువ [...]
"మిమ్ము మీరు పాలించుకోన్ మీకు చేతకాద" టన్నవా రందరు కనులు తెరచికనుడు - చంద్రశేఖరరావు ఘనుని సుపరిపాలన "తెలగాణ ద్వితీయ వార్షికము"న!(తెలంగాణ రాష్ట్రావిర్భావ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలతో - )
ఆద్య కవుల్ జగద్ధితమె ఆశయమై రచియింప పద్యముల్,మధ్య కవుల్ రచించిరి సమత్వము భిన్న మతాల నెంచి; నవ్యోద్యమ పద్యకర్త దళితోద్ధరణంబును గోరె - ఇట్టులాపద్యమె నిల్చె మానవత పట్టము గట్టి సహస్ర వర్షముల్!
నిధుల పంపకముల నిష్పత్తి ద్రోహమ్ము      నిలిచిపోయి ఇపుడు నిధులు దక్కె -ఉన్నతోద్యోగాల ఉనికిలో మోసంబు,      లన్యాయములు నాగి, అవియు దక్కె -భాష, సంస్కృతులకు ప్రామాణికత గూడి      గౌరవాదరములు కలిగె నిపుడు -నీటి ప్రాజెక్టుల నిర్మాణ లక్ష్యమ్ము      నిర్వీర్య క్షితి నింక నీళ్ళ దడుపు -"నిధులు,నుద్యోగములు నింక నీళ్ళ కొరకు,ఆత్మ గౌరవమ్ము కొరకు" ననుచు, నాడుసాగిన [...]
ఫలమునందు సగము పంచి నీకిచ్చుచోసగము నాకు మిగులు – సగము నీకు –పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్నాకు మొత్తముండు! నీకునుండు!
"తప్పుడు శబ్దముల్ పలుక తప్పని నే ననబోను గాని, మా ఒప్పుగ నున్న శబ్దముల నుమ్మడి రాష్ట్రమునందు నేళ్ళుగా నెప్పటి కప్పు డేల అవహేళన జేసి"రటంచు బాధతో  జెప్పిన నా పయిన్ విషము జిమ్ము ఖలుల్ నశియింత్రు భారతీ! 
ధర్మ మెటనుండునో, అట దైవముండు!దైవ మెవరి పక్షమొ, వారినే విజయముతప్పక వరించు!! కావున ధర్మము నెపుడాచరించ వలయు ప్రజ లవనియందు!!!
గెలిచి  వత్తునేని, కేల జాతీయ పతాక ఎగసి యాడ దాల్చి వత్తు!ఓడి చత్తునేని, ఒడలుపై ఆ పతాకను స్థిరముగ కప్పుకొనుచు వత్తు!!
తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో ముదితలు వెలయింప ముగ్గు బాట – గగన వీధులయందు కదన రంగము బోలి బాలల గాలిపటాల వేట – ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి గంగిరె ద్దాడంగ గంతు లాట – “హరిలొ రంగో హరి! హరి హరీ! హరి!” యంచు హరిదాసు పాడంగ చిరత పాట –గోద, రంగనాధుల భక్తి గుడులు చాట – అరిసెలు, చకినాల్, పొంగళ్ళు కరుగ నోట – పులకరించు మనసు, జిహ్వ  తెలుగు నాట – కలుగు సంపూర్ణ తృప్తి సంక్రాంతి [...]
ఈ శుభోదయ వేళ ... నీవింక నిద్రమేలుకొని చూడగా - నీకు మేలు గూర్చదేవతలు వేచినటు, నీ హృదిని అనేకచిత్ర చిత్రానుభూతులు చేరు గాక!
"ఈ నిద్రాణ నిశీధి, జాగృత మహా హేమ ప్రభా పుంజమైకానంగా నది నా తపస్సు! అటులన్ గానిచ్చుటే, భారతీ!ఈ నా జీవితమందు నా ప్రతిన!" యం చెవ్వాడు కష్టించెనో -ఆ నా ఇష్ట ప్రధానమంత్రి 'నరసింహా రావు'కున్ మ్రొక్కెదన్!(పూర్వ ప్రధాని "స్థిత ప్రజ్ఞ " శ్రీ పి.వి. నరసింహా రావు" గారి వర్ధంతి నివాళిగా ...- డా. ఆచార్య ఫణీంద్ర)   
ఇల వైకుంఠ పురంబులే - నగరిలో నే మూల నే మందిరంబుల నేకాదశి దివ్య పర్వదినమున్ బోవంగ; శేషోదరస్థల పర్యంక రమా సుసేవిత పరంధా మోత్తర ద్వార సద్విలస ద్దర్శన భాగ్యము న్నమిత భక్తిన్ బొంద "పాహీ" యటన్! 
నెలవంక రూపమే ’తలకట్టు’గా మారె –శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె –మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై వెల్గె –’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి –’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ –’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ –’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె –ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె –"ఓం నమ శ్శివాయ" యటంచు నూని యట్టిఅక్షరముల తొలుత దిద్దు నందు చేత -అక్షరములే తెలుగు వాని కక్షతలగుఅలరి [...]
సాయంకాలము ముగియగవేయి పనులనన్ని మాని, విశ్వంభర తారేయి కవుంగిలి నొదుగుచుహాయిగ నిదురించు - సూర్యు డగుపడు దనుకన్!
వినదగు నెవ్వరు జెప్పిన;వినినంతనె దాని గూర్చి వివరము లెరుగన్కను నెవ్వడు "గూగులు", నామనుజుడె పో జ్ఞాని నేడు మహిని! ఫణీంద్రా!
'భూదేవిం'గని మోహితుండయి తనన్ భోగింపడో నాథుడంచేదో సన్నని సందియమ్ము 'సిరి'కి న్నే మూలొ! తానందుకే,ఆదేశించి వసింప నామె నహి శీర్షాగ్రమ్ముపై, చాటునన్ -పాదాబ్జంబుల బట్టి స్వామి కెదుటన్ వాసించు వాల్జూపులన్!
శివుడును, శివానియు కలసిఅవలీలగ ఏక దేహ మందున నిముడన్,ఎవ రెక్కువ, తక్కువ యనిఅవసరమా ఇక వివాద మాడ, మగలలో?
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు