భిన్నమైన రీతి యున్నాడ నేననినవ్వుచుందు రెల్ల నన్ను జూచి!ఒక్క రీతి ఎల్ల రున్నా రనుచు నేనుపగులబడి నగుదును వారి జూచి!!  (స్వామి వివేకానంద ప్రవచనానికి నాతెలుగు పద్య రూపం)
కొంచెపు బుద్ధితో ధనము గూర్చు విదేశ మతంపు ప్రేరణన్,ఇంచుక సిగ్గు లేక రచియించె - సమన్వయ సంఘమందునన్వంచన బూని ఒజ్జ, కుల వాదపు చిచ్చును రేపు పొత్తమున్!"కంచె"యె చేను మేసినది! కాసుల కమ్ముడుబోయె నక్కటా!
నాకే గాదు - సమస్తమౌ యువతకున్ నవ్యాంధ్ర సాహిత్య సత్ప్రాకారాంతరమందు జేరి నవ రక్తావేశులై కైతకున్శ్రీకారం బొనరింప, ప్రేమ నిడితో చేయూత! ఓ సాహితీలోకోద్ధారక! "పోతుకూచి" కవి! నీ లోటే గతిన్ తీరునో?ఇటీవల పరమపదించిన సాహితీ మూర్తి, "విశ్వ సాహితి" అధ్యక్షులు డా. పోతుకూచి సాంబశివరావు గారి మృతికి సంతాపంగా ...- డా. ఆచార్య ఫణీంద్ర  
సభను కూరుచుంటి శ్రద్ధాళువై నేనుహస్తములను మడచి, ఆలకింప -బడిని కూరుచుండు పసిబాలలను బోలి!నాకె ముద్దుగొలిపె నన్ను జూడ!!
లైఫ్ "సైకిల్"- "పద్య కళాప్రవీణ", " కవి దిగ్గజ"   డా. ఆచార్య ఫణీంద్రసైకిలు త్రొక్కలేక నొక చక్కని బైక్ కొని, కొన్ని నాళ్ళ కాబైకును మార్చి కారు కొని, భాగ్యము, సౌఖ్యము లింక నెక్కువై -నే కడు స్థూల కాయమున నేడ్చుచు వైద్యుని జేర - సూచనన్నాకిడె త్రొక్కుమం చనుదినమ్మును సైకిలు, లావు తగ్గగాన్!
వారు గణింపబోరు మిము వాస్తవమందున ముందు; మీరలున్వారికి ప్రశ్న వైచెదరు; వా రవమాన మొనర్త్రు; మీర లవ్వారిని పోరు సల్పి, తమ వక్రత నెల్లెడ చాటి, గెల్తురోయ్! వీర మహోద్యమంబు లెవి విశ్వమునందున జూడ నిట్టివే!! (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవాల సందర్భంగా ..) 
కొలను నీర మొకటె - కొనెడు పాత్రలు వేరు!ఎంత పాత్రయున్న నంత దక్కు!గురువు బోధ యొకటె - కొనెడు శిష్యులు వేరు!పాత్రతలను బట్టి పాఠమబ్బు!
ఎవడో "పేంటరు", "వైటు పేంటు" గొని తా నీ నేల "పేంటింగు" నేచివరల్ దా కొనరించె, మొత్త మెదియున్ చిత్రమ్ముగా కంటికిన్వివరం బన్నది నేర్వలేని యటులన్, విస్తారమై "తెల్ల"గా -నవలీల న్నొక రాత్రి యందె! కని, "ఆహా!" యంచు నే విస్తుబోన్!
లంకంత ఇల్లు గలిగిన,నింకెంతయొ ఆస్తి పాస్తు లెన్ని గలిగినన్ -అంకమున పౌత్రి గలుగగనంకించు మహానుభూతి కసమానంబౌ!
పులులు తామే తమ చరిత్ర పుస్తకములవ్రాసుకొననిచో - వెలయు ప్రపంచమందువేటగాళ్ళ ప్రశంసించు వీర గాథలెన్నొ! నిల్చు చరిత్రగా నింక నదియె!!
ఒకరి కారుణ్య మాశించుచుంటి వేని -అమ్ముకొన్నట్లు స్వాతంత్ర్య మతని కీవు!ఒకరిపై నీవు కారుణ్య మొలికిన యెడ -చేసికొన్నట్లు నీ రాజ్య సీమ వృద్ధి!!
విశ్వము నొక ప్రమిద యట్లు వెలయజేసి,సకల సాగర జలములే చమురు గాగ -ఆకసమె వత్తి యనగ, సూర్యాగ్ని తోడదీపము వెలిగించెద నీకు దేవదేవ!
జనుల విఘ్నాల తొలగింపు జమయు, ఖర్చుధీయుతుండై లిఖించు వినాయకుండు -కార్య నిర్వాహ రచనాధికారులకునుదీక్ష, విజయ సిద్ధిని ప్రసాదించు గాక!
కుడి వైపు నిలుచున్న గొప్ప వీరుని పైన    దాడిని గమనించు ధ్యాస లేదు!ఎడమ వైపున నున్న ఎత్తైన నరునిపై     దాడి జరుగ - నేను చూడ లేదు!     వెనుకున్న వానిని వెన్నుపోటు పొడువ -     నా కెందు కనుకొంటి నాదు మదిని!ముందున్న వ్యక్తిని మోదగా బండతో -     దాడిని ఆపి, కాపాడ లేదు!     మీద నూహించ లేదు - నా మీద కూడదాడి జరిగె - తప్పించుకోన్ దారి లేదు!చుట్టు ప్రక్క సాయంబుకై [...]
నిన్న వరకు కాస్త నిలిచియున్న ప్రాణమ్ము నేడు పూర్తి నాశమయ్యె!తాడి దన్ను నోటు తలదన్ను నోటు రాన్ -వేయి నోటు చిత్తు పేపరయ్యె!!
త్యాగరాజు మరల పుట్టి, ధరణి నెల్లస్వరగతుల సౌరభాలను సంతరించి,తరతరాల రసజ్ఞుల మురియజేసి -అరిగె "బాలమురళి"గ నే డమరపురికి!అపర త్యాగరాజుకు అశ్రునివాళిగా -డా. ఆచార్య ఫణీంద్ర 
కష్టము లవి యట్లె కలకాల ముండవు -అలల వోలె ఎగసి తొలగిపోవు!అవియె తొలగు పిదప, అనుభవాలుగ నిల్చు!!జీవితానుభవము చెరగిపోదు!!!
ఈర్ష్య, ద్వేషమ్ము, వెటకార, మీసడింపు -తోటివార నెట్టును నీకు దూరముగను!ప్రేమ, గౌరవ, మర్యాదల్  వెల్లివిరియ -చేరువౌదురు జనులు నీ చెంత జేరి!
నీరము పుట్టి విష్ణుపద నీరజయుగ్మమునందు గంగయై,పారుచు దేవలోకముల పావనమై, శివశీర్షమెక్కి తాజారి, ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై,చేరె సముద్ర గర్భమున కృష్ణయు, గౌతమి, నర్మదాదులై!
"భావన" యను శిలను పరిశుభ్రముగ జేసి,"బుద్ధి"ని ఉలి జేసి పూని చెక్కి,అందమైన శిల్పమటుల తీరిచిదిద్దుశిల్పియె "కవి"! "కవిత" శిల్పమనగ!
వ్యాసుడు పుట్టిన దినమిది -భూసురులున్, కవుల, గురుల పూజా దినమైప్రాశస్త్యము గల దినమిది -దాసుడు పుట్టిన దినమయె దైవము మెచ్చన్!అందరికీ "గురు పూర్ణిమ" శుభాకాంక్షలతో -ప్రత్యేక ధన్యవాదాలతో -                              డా. ఆచార్య ఫణీంద్ర 
నే గమియింతు "నాఫిసు"కు నెమ్మదిగా తలపోయు చేదియో -"వేగము పెంచు - 'ఝా'మ్మనుచు వేడుకగా పయనింత" మంచు తావాగును నాదు వాహనము! "వద్ద"ని నే కడు ప్రేమ దానికిన్సైగను జేసినంత, నది చల్లబడుంజుమి బుంగ మూతితో!   
మా విరితోటలో పెరుగు మల్లియ చెట్టు - కరాల బోలెడిన్తీవలు సాచి, ఆకుల మదీయ భుజంబుల దట్టి పల్కు నేవేవొ గుసల్ గుసల్ చెవుల కింపుగ! ఆ మధురంపు పల్కులేపూవులు; వాని సౌరభమె పుల్కలు రేపెడి భాష యయ్యెడిన్!
ఏడాది కాలాన కెంత విల్వొ - పరీక్ష   తప్పిన యట్టి విద్యార్థి నడుగు!ఒక ఋతు కాలానకున్న విలువ - రైతు   పొలమునందలి కృషి ఫలము నడుగు!ఒక్క మాసంబున కున్న విలువ - గర్భ   వతి పడె డాపసోపాల నడుగు!ఒక్క వారంబున కున్న విలువ - వార    పత్రిక నుద్యోగి పాట్ల నడుగు!రోజు కూలి నడుగు మొక్క రోజు విలువ!గంట విలువను బడిలోని గంట నడుగు!నిమిషమును "ఫ్లైటు మిస్" ప్రయాణికుల నడుగు!సెకను విలువ [...]
"మిమ్ము మీరు పాలించుకోన్ మీకు చేతకాద" టన్నవా రందరు కనులు తెరచికనుడు - చంద్రశేఖరరావు ఘనుని సుపరిపాలన "తెలగాణ ద్వితీయ వార్షికము"న!(తెలంగాణ రాష్ట్రావిర్భావ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలతో - )
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు