కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్"లేదా..."గరుడుని చూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై"ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.
కం.    వచ్చిన యుగాది పండుగ        తెచ్చినది వసంతశోభ దీపింపగ; మా        యచ్చపుఁ గోర్కెలు దీరఁగ        వచ్చు ననెడి యాశఁ గొలిపెఁ బంచాంగమ్ముల్.కం.    క్రొత్తగ వచ్చెను వత్సర        మిత్తఱి షడ్రుచులతోడ నింపై సొంపై        చిత్తాహ్లాద మొసంగగ        నిత్తురు పచ్చడిని, దినిన హితకరము గదా!ఆ.వె.  క్రొత్తచీతఁ [...]
చ.       తెలుఁగుల నూత్నవత్సరమ! తీరని కోరిక లెన్నియో మనఃస్థలమున నిండి తీర్చుకొను జాడను గానక బిక్కుబిక్కుమంచలఘు భవిష్య సౌఖ్యములకై నిలువెల్లను గన్నులుంచి దిక్కులఁ గలయంగఁ జూచెదము, కోర్కెలఁ దీర్చవె హేవిళంబమా!ఉ.       దుర్మతులైన ముష్కరులు దోచిన యిల్లయి నాదు మానసంబర్మిలికై నిరంతర నయానునయమ్మునుఁ గోరుచుండఁగాదుర్ముఖి వచ్చి పోయినది, దుష్టమొ శిష్టమొ భావ [...]
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."హేవళంబి జగతి కిడుము లొసఁగు"లేదా..."వచ్చిన హేవళంబి కడు వంతలు లొసంగును మానవాళికిన్"ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,నూతన సంవత్సర శుభాకాంక్షలు!పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."విషముఁ ద్రాగె హరియె విందటంచు"లేదా..."విషమును ద్రాగె మాధవుఁడు విందనుచున్ పరమానురక్తితోన్"ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్"లేదా..."పడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్"ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే"లేదా..."భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై"ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."అమృతపానమ్ముచే సుర లసురులైరి"లేదా..."అమృతముఁ గ్రోలినంత సుర లక్కట రాక్షసులై చరించిరే"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్"లేదా...నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచోఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్"లేదా..."భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద"లేదా..."పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"లేదా..."కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."గాంగేయుం డన్న నెవఁడు గంగాపతియే"లేదా..."గాంగేయుం డెవఁడన్న నా కెఱుక గంగావల్లభుండే సుమీ"ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులారా,పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్"లేదా..."రామునిఁ జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే"
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు"లేదా..."పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్"లేదా..."చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...."రణము ప్రాంగణ మది రణము గాదె"లేదా..."రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్"(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు