అక్షరం రాయబడని  కాగితంపై పరుచుకున్న మనసుని  చదువుతున్న తనని చూసి విషాదం విరిగిపోతున్న చప్పుడు కరిగించేస్తున్న  నిశ్శబ్దంలో నుండి గుండె కిందగా ఒక నవ్వు మొదలవుతున్న సవ్వడి వినగానే ఇందాక  తెల్లకాగితంపై రాలిపడ్డ రెండు కన్నీటి చుక్కలు ఇప్పుడు నవ్వుల చిగుర్లు వేసుకుంటూ తడి తడిగా  మనసుని  అల్లుకుంటున్నాయికంటి నిండుగా  వెన్నెల పూలని పుష్పిస్తూ
మట్టికుండ లాంటి పురాతనమంతా పరిమళమే అనుకున్నంత సేపూ ఈ లోకం నచ్చకపోవడం  పెద్ద వింతేమీ కాదు మరకతాలు పొదిగినవన్నీ అలంకారమే  అనుకుంటున్నామంటేమనం నేర్చినవన్నీ  మర్చిపోయి మరోసారి  కొత్తగా  లోకాన్ని చదవాల్సిందే మనసు పాత్ర మారనంత వరకూ మట్టి కుండ అయినా మరకతాలు పొదిగిన కలశమైనా ఒకే ఆనందాన్ని నింపుకుని ఉంటాయి అనంతమైన కాంతినీ…గాడాంధకారాన్ని ఆప్తంగా  హత్తుకునే [...]
నల్లని రాత్రిని మూసేస్తూ సూర్యుణ్ణి తెరచిన కాంతి ద్వారం ఆకాశాన్ని మరింత స్పష్టపరిచే కథని చూస్తున్న కళ్ళ వైపుగా శూన్యాన్ని మూసేసుకున్న రాజసాలుగా నడిచే అడుగుల కోసం ఎన్నాళ్ళైనా  ఎదురుచూపులు సాగాల్సిందే మరో చోటకి వలస పోయే చూపుల్లోని  పొడిదనంలో తనకు పనిలేదంటూ ఎప్పటికప్పుడు కళ్ళని శుభ్రం చేసుకుంటున్న నిరీక్షణలకి చేరువ కావడమన్నది లోలోన గూడు కట్టుకున్న [...]
వెలసిపోయిన కాగితాలను చూసిన కథలున్నాయి గానీ వెలసిపోయిన అక్షరాలచరిత్ర ఎక్కడా కనపడలేదు. మనసుకి చేరిన అక్షరాలు చరిత్రలో కొనసాగటానికి ఏ శాసనాలూ… కాగితాలూ అవసరం లేదు అప్పటికే అవి తమ విలువని ఉన్నతంగా రాసేసుకున్నాయి మరి అందుకే అనిపిస్తుంది అక్షరమంటే అమృతమని నేటి అమృతమంటే అక్షరమని
ఇన్నాళ్లూ నేను చూసిన అన్నిటినీ చరిత్ర నడకలతో నలిగిన దారిపైనే  చూసానుఇకమీదటంతా నాకే ప్రాధాన్యతలూ లేవు పరిచయమయ్యే ప్రతి నిజాన్నీ ఆప్యాయంగా ఆదరించటం తప్ప దారి మలుపుకి ఆవల ఏమున్నదో అనుకుంటూ నడుస్తుంటే బాట పక్కనున్న అందాలని చూడలేమంటూ మనసు గొంతు సవరించుకున్నప్పుడు ఒక ఆనందం ఎంత ప్రశాంతంగా పరిచయమవుతుందో అనుభవమయ్యింది.ఇప్పటి వరకూ చూసినదంతా మరోలా పరిచయమయ్యింది [...]
మన మరణం మనదైనంత వరకూ… మన కథ సమకాలీనం మాత్రమే. అదే మరణం లోకాన్ని ఒక్క సారి కుదిపిందంటే… మనం చరిత్ర పుటలకెక్కిన అక్షరాలం   అప్పుడనిపిస్తుంది మరణమంటే ముందే రాయబడిన విజయమని...!
మనకెప్పుడూ అబద్దమంటేనే ఎక్కువ ఇష్టం . ఇదే అసలైన నిజం. మూడు రంగుల జండా ముచ్చటైన జండా అంటూ పెద్దగా కనిపించే రంగులనే నిజం అంటూ మనల్ని మనం మభ్య పరచుకుంటూ నాలుగవ రంగైన నీలాన్ని మనం ఎప్పుడూ బయటకు తీయలేదు. ఝండాలో నాలుగు రంగులు ఉండటం అబద్ధమా? మరెందుకు మనం గుర్తించం? ఎందుకంటే మనం అబద్ధాలని నమ్మటానికి అలవాటు పడ్డాం. అంతేనా అవే అబద్దాలని నిజాలని ప్రచారం చెయ్యటం లో [...]
స్వేచ్ఛ అంతా తమ రెక్కల సత్తువలోనే ఉందని  తెలుసుకున్న పక్షులని ఆపడానికిఎన్ని రెక్కలని కత్తిరించగలవు నువ్వు?వీలయితే…ఆ రెక్కలపై నీ కుంచెతో కాస్త రంగులద్దు తమ స్వేచ్ఛతోపాటే నీ చిత్రకళనూ లోకమంతా గానవిస్తాయి మరప్పుడు కాలమండలమంతా నీ స్వచ్ఛతా చిత్రమే కదా!
Do you hear her?All the time she is telling your storyWhole day she is waiting for youAnd tries to exhaust your tirednessWithout moving from where she stood,She listens to you throughout your daily lifeAnd the world's storiesShe hides your secrets from the worldShe is the witness for your generationsAnd gathered breaths of your parentsShe kisses your childish footAnd Afterwards,Witnessed when you become steps for your child’s footAnd she is the witness of your life with your sweetheartShe becomes wet for your tearsAnd joy of your smilesShe shows you like a mirrorAnd becomes address for your existenceShe conceals you from the world's exasperationsAnd she is with you even in destructionLook at her and listen to herShe is craving for a whole-hearted touchNow, do you hear her?Yes, true…that she is… Your roomNow… Give affectionate,Warm touches to herAnd then, you can hearSplashes of holy soulsThat enlighten your life
గాలి పంజరంలో చిక్కుకున్ననిశ్చల… నీరవ… నిశ్శబ్దం!నగిషీలు చెక్కబడ్డ హిమ ధ్వనిలో పేరుకుపోతున్న నిరీక్షణ ఓ యాత్రికుడా...ఇది నువ్వు రావాల్సిన సమయం   ఈ చిన్ని దీపాన్ని కాపు కాస్తున్న చిక్కటి చీకటికి  విశ్రాంతినిచ్చే విద్యుత్తరంగమై రూపాంతరం చెందే  సకలానివై ఓ యాత్రికుడా...ఇది నువ్వు రావాల్సిన సమయం మహా మౌన స్థితిలో గడ్డకట్టిపోతున్న చల్లని ధ్వనిని గోరు వెచ్చగా [...]
తేమ గాలి ఒకటి లోకాన్ని ఊడ్చుకుంటూ వెళుతుంది బహుశా... వాన వచ్చేలా ఉన్నట్లుంది లోకమంతా పొడి నేలకై పరిగెడుతుంటే ఇదిగో ఈ  కిటికీ మాత్రం ఎప్పటిలా నీటి చిత్రాలకి కాన్వాస్ గా మారటానికి అటూ ఇటూ తలని ఊపేస్తుంది నాలా… తనూ పిచ్చిదే మరి గాజు మెరపుల నీటి చిత్రాలెప్పటికీ శాశ్వతమనుకుంటూ తడి కోసం తపన పడుతూ
నీటి చెలమలని నింపుకున్న…చెమటని తెంపుకున్న…రక్తమోడుతున్న...వాదవివాదాలని చర్చిస్తున్న ఆదర్శాలని నిద్రపోనివ్వని    అక్షరాల మధ్యలో నుండి జారిపోతున్న పాత్రలని అనునయిస్తూ 'మీరెంతగా కదిలించినా ముగింపుని దాటేసాక పొందికగా అలమారలో సర్దేస్తాం కానీ మేమంటూ కదిలిపోయేటంత మనసు నగ్నత్వం మాలో లేదంటూ ఇది కథేలే మీకు ఇదే శాశ్వతనివాసం 'అని చెప్పి వచ్చేద్దాం రా మరి...ఈ ఒక్క [...]
మనమొక వార్తగా మారాలంటే ఈ రోజు ప్రధానవార్తని మన హస్తగతం చేసుకోవాలి. అభినందనో… విమర్శో అతి తీవ్రంగా ఉండాలి. అది వ్యక్తిత్వ సరిహద్దుల్ని దాటిపోవాలి. ఇదే కదా నేటి సమాజ పోకడ. ఈ సమాజంలో భాగస్వాములుగా ప్రతి విషయం మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి. మన అభిప్రాయాలని మనం వెలిబుచ్చే హక్కు మనకు ఉంది. అవును నిజమే. మనకి హక్కులున్నాయ్. ఉండాలి కూడా. మన రాతలకి మనమే సంపాదకులం . [...]
చిరు కొమ్మ చివరన చిగురేసుకుని వచ్చినప్పుడు కొంగ్రొత్త చిలకపచ్చదనపు మెరుపులో వళ్ళు విరిచింది యవ్వనం యక్ష గానం చేస్తున్నప్పుడు గాలి చేస్తున్న గాంధర్వానికి మైమరపుతో తాళం వేసింది ఎండ బారిన మనిషి  మేనిపై నీడల దడితో శుశ్రూష చేసింది చెట్టుకి తాను మోయలేని బరువనుకున్నప్పుడు మౌనాన్ని శబ్దిస్తూ రెప్పపాటులో  రాలిపోయింది ప్రకృతికి  సారవంతమైన నేలని కానుకిస్తూ [...]
నేనేం చదివానో నేనేం చెప్పానో చూసి నన్ను వెల్లడి చెయ్యడం సులువనుకోవటంలో నీ తప్పేమీలేదు...నీ దాకా వస్తే నేనైనా అంతేమరి మనవైన అవగాహనలన్నీ మనకున్న అభావనలన్నీ మన ఆంతరంగిక మిత్రులు కదా మరి...మన మాటలోనే సాగుతాయిలేనేను నేర్చుకున్నదేదో యే రూపుగా యే వేళలో తాను బయల్పడటం మొదలవుతుందో  ఇంకా నాకు ఎరుకపరచలేదుయే పచ్చి మట్టి వాసనలో మరే పచ్చడి అన్నం ముద్దలోనోఒక శబ్దాన్ని కూరిన [...]
లోలోపల నిర్మితమవుతూ వస్తున్న ఆకాంక్షలన్నీ చిరస్మరణీయాలైఅలలు అలలుగా దేహపు అంచులను అలా అలా తడుముతున్నంతసేపూ దేహమే నా విలువకి గుణింతమని విర్రవీగిన అహానికి  సింహాసనమేసుకుంటూ నాలోనే నేనింకా మిగిలి ఉన్నాననుకుంటున్న ఒక అందమైన అబద్ధపు కథనే ఈ ‘నేను'దేహమంటే మాంసఖండాల అమరిక అని వర్ణాన్ని నిర్దేశించే చర్మమంటే దానిపై కప్పిన తోలు అట్ట అని ఆత్మ వసించినంతసేపు దేహం [...]
ఒక నల్లని వెలుతురు అవును… నలుపే వెలుగుని గాఢంగా రాయగలదుఆకాశం నిండా కాసిని మెరుపులని ఓ గుప్పెడు తారలనివెళ్లాడదీసుకుంటూ తనే ఒక వెలుతురుని అవిశ్రాంతంగా మోయగలదునమ్మవా ఏం?సరే మరి... నువ్వు చూపించు… ఏ పగలైనా నీకోసమంటూ కాసిన్ని నక్షత్రాలని  చల్లగా పూసిందేమో…!***రా మరి !వెలుగుపై కప్పిన చీకటినీ సీతాకోకచిలుక రెక్కలంత ఇష్టంగా హత్తుకుందాం
ఒక రాత్రిని నెమ్మదిగా అల్లుకున్న మల్లె పందిరి క్రింద చల్లగా సేద తీరుతున్న వేసంగికి గాలే పంజరమైన గాథలోకలువ రేకుపై మెరుస్తూ ఎవరో వస్తున్నట్లున్నారు పూలకి ఈతనేర్పే గాలి వాకిట్లో కాసేపలా గడ్డకట్టుకు పోతూ ఇదిగో ఇక్కడే ఆగి చూసా మట్టి తునకని ఆఘ్రాణిస్తున్న ఒక విశ్రాంతి వాన చినుకులా చాలా చిన్నగా మొదలయ్యావు ఇప్పుడేమో ఈ కాగితంపై కవిత్వమై పిలుస్తున్నావు [...]
బ్రతుకు నడిచే మార్గంలో గురువులుగా మార్గమిచ్చినవన్నీ అల్పప్రాణులే నన్న నిజం ఏనాడూ ఒప్పుకోబడకుంటేనేం బతకడం చావడమంత భయంలోకి నడచినప్పుడు జంతువులని చూస్తే అసూయపుట్టడం వింతేమీ కాదుఅశాంతిని ఆప్తంగా కొనితెచ్చుకోవడం వాటికి రాదనిఏ తెలివైన జాతికి  కొత్త బాట పరుస్తాయోనని నక్షత్రాల చుట్టూ చీకటి తెరలు కప్పేసి వెలుగు కారకాలన్నిటినీ మట్టు పెట్టేసి ఎవరి చంద్రుణ్ణి వారే [...]
నీ కోసం నన్ను నేను తుంచుకుంటాను ఇంతలో నువ్వు నడిచిన దారి ఎక్కడికో తప్పిపోతుంది కాలమంతా నిన్నే వెదుకుతూ గాజు కలల గాలిలో కొట్టుకుపోతుంటాను కంటి కింద కాస్త తడిని దాచుకున్న ఎవరో ఒకరు నన్ను నీ దగ్గరకు చేర్చుతారు ప్రపంచం భుజం మీద మనిషి అలికిడిని భరోసాగా తడుతూ
వాళ్ళు వచ్చారు కాస్తంత చీకటి కొండంత వెలుగుతో వెలుగు కోసం ఎగబడ్డారంతా వాళ్ళు చెబ్తూనే ఉన్నారు వెలుగుని సూటిగా చూస్తే చీకటౌతుందనిఆశ చేసిన ఇంద్రజాలంలో ఏ మాటా చెవికెక్కలేదు మరి ఇప్పుడేమో అంతా చీకటే
ఆత్మ కథ అంటే ఒక విధమైన స్వోత్కర్ష అనే అభిప్రాయం ఉండటం సహజం. కానీ ఒక ఆత్మకథ ఒక జీవన ప్రవాహంగా సాగటం చూశాక మన అభిప్రాయం మార్చుకోక తప్పదు. మన ముందు తరాల్లో ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలియకుండానే కొన్ని అభిప్రాయలని స్థిరంగా ఏర్పరుచున్న మనల్ని ఒక ఆలోచనా స్రవంతిలోకి అలా తీసుకుని వెళ్ళడం అన్నది ఒక విజ్ఞానజ్యోతిని మన అంతరంగాల్లో వెలిగించడమే. అలాంటి సమున్నతమైన రచనయే అక్షర [...]
నా తాళం చెవి తన ఇల్లుని పారేసుకుంది ఇల్లుల్లూ తిరిగాను దేనికీ సరిపోలేదువెదుకుతూనే ఉన్నాను ఇళ్ళన్నీ ముగిసే వరకూ బహుశా నా ఇంటికి ఎవరో కొత్త తాళం వేసినట్లున్నారు నా కాలం ముగిసింది వెదుకులాట ఆగింది తాళంచెవి కొనసాగుతుంది నా వారసుడి చేతిలో మరింత ఆశగా
గుడికెళ్ళినా బడికెళ్ళినా వేడుకైనా వేదికైనా ప్రముఖులంటూ మెహార్బానీ  చేస్తూ… సామాన్యుడి సమయాలకి ఎదురుచూపుల కళ్ళెమేసే రాచ బానిసల కార్యశీలతలో మాన్యుడు సామాన్యుడిలో కలిసేదెక్కడ? భుజాల మీద చేతువేసి తట్టగానే జీవితమే ధన్యమయ్యిందనుకునే అమాయక జీవాలకి,  ఉరుకుల పరుగుల జీవన యానంలో మనిషి మనిషియొక్క ప్రతి క్షణానికీ విలువ ఉందని తెలిసీ , ప్రముఖుల కోసమంటూ  రహదారులని [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు