తెలుగు లో కొంచం పెట్టుబడి కి కొంత రాబడి వొచ్చే దర్శకుల ఉన్నది చాలా కొద్దిమంది . వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు .  అతుకుల బొంత సినిమా ని కూడా రంగులు అద్ది మాయ చేసి జనాలని ఎదో విధం గా థియేటర్ కి రప్పించగలిగిన కొద్దీ మంది లో ఇతను ఒకరు . అది అతని మాటల గారడీ కావొచ్చు మారేదన్న కావొచ్చు.  గత కొన్ని సినిమాలు గా అయన వేరే వాళ్ళ భావచోర్యం మీద బాగా ఆధారపడి , ఎలాగోలా నెట్టుకొస్తున్నారు [...]
మార్చ్ 1984పొద్దున్న 8:30 ..  పొద్దునే పేపర్ చదువుతూ పక్కింట్లో నుంచి వచ్చే వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు వింటున్నా.  అప్పుడే ఫిబ్రవరి లో విడుదల అయినా ముద్దుల కృష్ణయ్య మీద మొదటిసారిగా గణేష్ పాత్రో గారి పేరు విన్నా .  ఆ సినిమా దాదాపు గా సంవత్సరం ఆడేసింది సుభాష్ థియేటర్ (ముషీరాబాద్ , హైదరాబాద్ ) లో అప్పుడు ఆ సినిమా కి పంపిణీదారులు శ్రీనివాసా ఫిలిమ్స్ వాళ్ళు.  ఆ తరవాత [...]
     సుకుమార్  - మహేష్ బాబు సినిమా , సక్సెస్ బాట లో ఉన్న మహేష్ ,  కర్చు కి వెనకాడకుండా తీసిన సినిమా ఇంకా ఈ సినిమా తెలుగు సినిమా ల లో ఒక నూతన అధ్యాయం అని మాములుగా నే ఉదారగోట్ట బడ్డ సినిమా .      ముందర నుంచి నాకు సుకుమార్ మీద మరి అంత గొప్ప అభిప్రాయం లేదు .   వాణిజ్య పరమైన సినిమాలు తియ్యడం బాగా నే వచ్చు సుకుమార్ కి .  స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది. కాని తీసిన [...]
కొన్ని నెలల క్రితం మెహర్ రమేష్ అనే ఒక గొప్ప దర్శకుడు , వెంకటేష్ అనే  హీరో ని డిఫరెంట్ గా చూపిస్తా , ఈ సినిమా డిఫరెంట్ గా చేశా అని కాకమ్మ కథలు చెప్పి షాడో అని మహత్తర చిత్ర రాజాన్ని తీసి అటు నిర్మాతని , హీరో ని పనిలో పని గా ప్రేక్షకులని హింసించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది.  మనవాళ్ళు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోకుండానే , వీరబద్రం అనే దర్శకుడు నాగార్జున ని అదే కథ ని కొంచం అటు [...]
   త్రివిక్రమ్ అభిమానులని (నాకు తెలిసి చాల మందిని ) నిరాశ పరిచిన సినిమా ఇది.  ఒక రకం గా గుండమ్మ కథ సినిమా కి ఇంకా బోలెడు శ్రీను వైట్ల , వినాయక్  లని కలిపి దానికి కొంచం విదేశి సొగసులు అద్ది న  స్వదేశి సినిమా ఇది.   సినిమా రిలీజ్ కి ముందరే అంతర్జాలం లో సినిమా ప్రత్యక్షం కావడం తెలుగు లో ఇదే మొదటి సారి.  దెబ్బతో సినిమాకి బోలెడు పబ్లిసిటీ ,  నిర్మాతకి టెన్షన్ [...]
సిరు గారు కేంద్రమంత్రి గా కావడం .... జంజీర్ సినిమా హిందీ ప్రకటన దాదాపు గా ఒక సమయం లో జరిగాయి. తెలుగే  సరిగ్గా రాని  అంజని పౌత్రుడు హిందీ లో  ఇరగ తీసేస్తాడు అని మన వాళ్ళు బోలెడు నమ్మకాన్ని , కొండంత ఆశని పెట్టుకున్నారు (కొంతమంది ). కాకపోతే బాబు గారి కోయ్యమొహం మీద ఇంకాస్త ఎక్కువ నమ్మకం ఉన్న నాలాంటి వాళ్ళు ముందరగానే ఫిక్స్ అయిపోయాం ఇదో గాలివాటం సినిమా నే కాని వాళ్ళు [...]
ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి   వ్యాసకర్త: శ్రీ అట్లూరి***** ఈ పుస్తకం మాములుగా కన్నా ఎక్కువ సమయం పట్టింది చదవటానికి. నిజానికి ఈ పుస్తకం చదవటానికి కారణం బాపు గారి బొమ్మ. అది చూసి ఈ పుస్తకం కొన్నాను. మొత్తం పదిహేను కథలు, మూడు ఇతర విశేషాలతో ఉన్న పుస్తకం ఇది. సరళమైన భాష అందరికి అర్థమయ్యే పదాల [...]
వ్యాసకర్త: Sri Atluri******దాదాపు గా నాలుగు ఏళ్ళ క్రితం అనుకుంటా ప్రళయ కావేరి కథలు చదివాను. భాష కొంచం నాకు కష్టం గానే ఉండింది. కానీ రెండు కథలు చదవగానే అర్ధం కావడం మొదలు పెట్టింది. నిజానికి ఈ కథలు అన్ని ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురించబడ్డాయి కాని అప్పటికి ఆన్లైన్ లో ఆంధ్రజ్యోతి రాకపోవడం వల్లో లేక నేను సరిగ్గా చూడకపోవడం వల్లో చదవలేకపోయాను. అనుకోకుండా ఒకసారి [...]
రంగుటద్దాల కిటికీ .... ఎస్. నారాయణస్వామి ఈ కథా సంపుటం లో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి.  వీటిలో తప్పకుండా చదవల్సిన కథ తుపాకి ... కథ ముగింపు లో మనకి తెలీకుండానే కళ్ళలో నీళ్ళు తిరగక మానవు. మిగిలన కథల్లో వీరిగాడి వలస మధ్యతరగతి మనస్తవాన్ని తెలియ చేసే కథ. efficency ప్లీజ్ , వలయం, నిరసన లాంటి చిన్న కథలు అమెరికా లో జరుగుతున్నా కథలు . అమ్మాయి మనసులని తెలియ చేసే కథలు ఇండియన్ వాల్యూస్, [...]
కథ కాకరకాయ లేని మిర్చీ ....   సినిమాలో బాగున్నది ... ప్రభాస్ ఆహార్యం , దుస్తులు...  అక్కడక్కడ సంభాషణలు... చాలాకాలం తరవాత కనపడ్డ నదియ .  సత్యరాజ్ పర్వాలేదు బాగానే చేసాడు . సంపత్ కూడా బాగా చేసాడు ... బాగాలేనిది సినిమా కి బేసిక్ కథ ....హీరో మిలన్ లో రోడ్ మీద స్నేహితులతో కలిసి సంగీతం సాధన చేస్తూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి రక్షించండి అని వాటేసుకుంటుంది . అబ్బాయి ఆ వెంటపడిన వాళ్ళని [...]
. నామిని గారి వి మొదటగా మిట్టూరోడి కథలు చదివా, అప్పట్టికి ఇంకా తెలిసి తెలియని వయసు .. అందువల్లో లేక మామూలుగా చదివే కృష్ణ జిల్లా బాష కాకపోవడం వల్లో కాని ఎక్కువగా దాని గురించి ఆలోచించాలా .. నిజానికి అవి నాకు పేపర్ లో వచ్చాయని అని కూడా తెలీదు అప్పుడు. వేసవి సెలవులకివూరు వెళ్ళినప్పుడు అన్నయ్య దగ్గర ఉన్న పేపర్ కట్టింగ్ లో చదివా ... ఆ తరవాత వాటి గురించి అంతగా ఎక్కువ ఆలోచన [...]
ఖంగారు పడకండి ఇదేమిటని ,,, మా వేణు కొడుకు విభు కి నేను భస్మసురుడిని. వాడి వయసు నాలుగేళ్ళు . చిన్నప్పటినుంచి వాడికి పాలతో పాటు రామాయణం , భారతం పట్టించాడు వాళ్ళ బాబాయి. దాంతో వాడికి రాముడు , కృష్ణుడు కన్నా రాక్షసులు బాగా నచ్చేసారు. అంతే కాకుండా అన్ని రకాల ఆయుధాలు వాటి ప్రయోగాలు గట్రా బ్రహ్మాండంగా తెలిసి పోయాయి. నేను ఒక రోజు వాడికి ఫోన్ చేశా (వాళ్ళ బాబాయి కి చేసాలెండి). ఆ [...]
అర్. పి. పట్నాయక్ 'అందమైన మనసులో' సినిమా చూసిన తర్వాత.. ఆ సినిమాలో ఫోటోగ్రఫి బాగా నచ్చి పట్నాయక్ గారి దగ్గర సంతోష్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. అలా సంతోష్ తో మొదటి పరిచయం. ఇప్పుడు 'కుదిరితే కప్పు కాఫీ'కి పని చేసాడని తెలిసి..ఆ సినిమా దర్శకుడు రమణ తో కలిసి ఇద్దరినీ ఒక సారి ఇంటర్వ్యూ మొదలు పెట్టాను. ఇద్దరూ ఫోటోగ్రఫి నేపథ్యం నుంచే కాబట్టి, వారి అనుభవాలను తెలుసుకునే [...]
.పని లో బోలెడు హడావిడి గా ఉన్న నాకు జేబులో ఉన్న ఫోన్ లో ఎస్ ఎం ఎస్ సౌండ్ కి ఫోన్ ఆన్ చేసి చూస్తె ...పిడుగులాంటి వార్త ... ఈ వి వి గారు పోయారు అని. సైట్ లో వార్హ పెట్టమని . ఒక క్షణం సరిగ్గా చూసానా అని సందేహం. అప్పుడే ఎక్కడన్నా న్యూస్ ఉందేమో అని గూగుల్ చేసి చేశా .. ఎక్కడా లేదు.. నరేష్ కి కాని రాజేష్ కి కాని కాల్ చేసి చూద్దామా అని అనుకోవడానికి ఇదేమ సుభావార్హ్త కాదు. ఎం చెయ్యాలో కూడా [...]
అతనొక్కడే , హరే రాం విజయవంతం అయ్యాక కళ్యాణ్ రాం జయీభవ అని ఒక డకోటా సినిమా తీసాడు.. అది గల్ల పెట్టి దగ్గర గల్లంతయ్యింది. దాని తరవాత వరసగా పరాజయాలే సోపానాలుగా ఉన్న మల్లికార్జున్ తో కత్తి అని సినిమా మొదలు పెట్టాడు. మూడు పరాజయాలు కదా ఈ సారి అన్నా ఈ దర్శకుడు ఏదన్నా కొంచం కొత్తగా ప్రయత్నిస్తాడు ఏమో అని చూద్దాం అనుకున్నామో... మన మంగలి కత్తి తో మన గొంతు కోసుకున్నట్టే.సినిమా [...]
మేము ఉండేది ఎనిమిదో అంతస్తులో, ఎక్కువగా హాల్ లో నే పడుకుంటాం, పొద్దున్నే లేచే అప్పటికి రోజు ఆకాశం రోజుకో రకం గా కనపడుతుంది ... ఈ రోజు లేచే అప్పటికి ఆకాశం అంతా ఎర్రగా ... కింద అంతా సముద్రం లా మంచు పొగ .. మధ్య మధ్య లో కానీ కనపడకుండా చెట్లు .... అందులో కొన్ని ఆకులు లేకుండా , కొన్ని రంగు రంగు ల ఆకులతో భలే అందంగా కనపడింది. అలా చూస్తూ ఉండగానే పొద్దునే వీధిన పడుతున్నందుకు సంధ్యా దేవి [...]
నేను మొట్టమొదటి సారిగా కమెరా ముందర నిల్చుంది బాగా చిన్నప్పుడు ఉహ తెలీని వయసులో. చిన్నప్పుడు చాలా మంది లాగే తిరుపతి మొక్కు ఆలస్యం అవ్వడం వల్ల కొన్ని రోజులు పిలక కట్టే వాళ్ళు.. ఆ ఫోటో మొదటి ఫోటో.. దాంట్లో నన్ను మా నాన్న ఎత్తుకుని ఉంటారు రెండో పక్క మా పక్కింటి సత్యం అన్న ఉన్న ఫోటో ఇప్పటికి మా ఇంట్లో ( మా సత్యం అన్న ఇంట్లో కూడా) గోడకి వేలాడుతూ కనపడుతుంది. ఆ తరవాత ఫోటో మా [...]
చిన్నప్పుడు మా ఊర్లో వీధి లో రెండు రావి చెట్లు ఉండేవి ... దాని ఆకులు అప్పడప్పుడు రంగు మారుతూ సంక్రాంతి సమయానికి చెట్లు మొత్తం బోడిగా ఉండేవి ఎండాకాలం లో ఆ చెట్ల కింద పులి మేక ఆటో , పెకాటో ఆడేవాళ్ళు.. వేసవి లో చెట్టు ని పచ్చగా చూసి, సంక్రాంతి పండగ కి ఊరికి వచ్చి అలా చూడాలి అంటే బోలెడు బెంగ వేసేది. మళ్ళా ఎప్పుడు ఆకులతో చూస్తామో అని అనిపించేది. అదే కాదు ఇంటి ముందర ఉన్న వేప [...]
సినిమా వాళ్ళల్లో మందు మగువ జోలికి పోనీ అతి కొద్ది మంది లో వై వి ఎస్ గారు ఒకరు. ఆ విధం గా అయన అంటే నాకు మంచి గౌరవం ఉంది. దానికి నేను కింద చెప్పబోయే దానికి సంబంధం లేదు. భారతీ రాజా గారి దర్శకత్వం లో వచ్చిన సీతాకోక చిలక సినిమా గుర్తు ఉంది కదా ... ఆ సినిమా లో నాయకుడు మురళి కార్తికేయన్ (తెలుగు లో మురళి అని తమిళ్ లో కార్తిక్ అని అంటారు..) ప్రముఖ తమిళ నటుడు ముత్తురామన్ కొడుకు . ఆ [...]
ఖలేజా సినిమా రివ్యూ మళ్ళి మళ్ళి రాసి విసిగించదలచుకోలేదు ...ఖలేజా సినిమా దాదాపుగా పూర్తీ అయ్యింది అన్న వార్త వచ్చినప్పటినుంచి బోలెడు అంచనాలు... అభిమానుల హుంగామ... ఇంకో పక్క రోబో డబ్బింగ్ సినిమా చరిత్రలో కానీ విని ఎరుగని ధరకి అమ్ముడుపోవడం.. ఒక వారం ముందర అది కూడా విడుదల కి సన్నాహాలు చేసుకోవడం తో టెన్షన్ మొదలు అయ్యింది. మధ్యలో బృందావనం కూడా విడుదల అవ్వొచ్చు అన్న ఒక [...]
దాసరి గారికి ఉత్తమ నటుడు అవార్డు అది కూడా మేస్త్రి సినిమా కి ... ఆ సినిమా వచ్చి వెళ్ళినట్టే చాలమన్డికి తెలీదు సొంత వూరు అన్న సినిమా ఎ ఊర్లో ఆడిందో దేవుడికి తెలవాలి ఒక రకం గా అది డాక్యుమెంటరీ సినిమా. అంతే మనకి డాక్యుమెంటరీ సినిమాలకి అవార్డు ఇస్తారు ఏమో ... తెలుగు ఏంటో తెలీని హీరోయిన్ కి ఉత్తమనటి అవార్డు... ఇంకోసారి దర్శకుడు కి ఉత్తమ నూతన దర్శకుడి అవార్డు ఇచ్చారు... బాణం [...]
దాదాపు మూడేళ్ళ క్రితం బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు ముఖ్యం గా మా సైట్ లో ఉన్న పాత ఆర్టికల్స్ వెతకడం కష్టం అవుతోంది కాబట్టి ఇక్కడ అన్ని పెడదాం అని మొదలు పెట్టాను. నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ... తరవాత ఏవో కొన్ని ఆర్టికల్స్ పెట్టాను.. మళ్ళా కొన్ని రోజులు ఎం పెట్టలేదు... తరవాత ఒక సారి డెట్రాయిట్ వెళ్ళినప్పుడు చాలా మంది బ్లాగర్లు కలిసారు... అప్పటికి నేను బ్లాగ్ రాస్తున్నా అని [...]
మరీ చెత్త ప్రశ్న ... కొవ్వొత్తి వెలిగించుకోవచ్చు కదా...అని చిన్న పిల్లాడు కూడా చెప్తాడు.. దానికి మళ్ళా బ్లాగ్ లో రాయాలా సోది కాకపోతే అని తిట్టిపోయకండి ..మామూలుగా అయితే అంతే.. అది ఒక గంట రెండు గంటల కట్ అయితే సమస్య లేదు ... భారత దేశం లో అయితే రోజు కరెంటు పొతూ నే ఉంటుంది కాబట్టి అంత పెద్ద విషయం అసలు కాదు... కోవోత్తో ,ఊళ్ళో అయితే కిరసనాయిలు లాంతరు వెలిగించి జీవితం గడిచిపోతుంది. [...]
వంశీ గారి సినిమా అంటే ఒక రకమైన అంచనాకి రావడం మానేసి చాల కాలం అయ్యింది. అయన అనుమానాస్పదం తిసినప్పుడే అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ నిజాలే అని అనుకున్నా... దింపుడు కళ్ళం ఆశ లాగా ఏదన్నా ఒక మెరుపు మేరిపిస్తారేమో అని ఎక్కడో కోడగట్టిన దీపం లాగ ఉన్నది కూడా సినిమా చూసాక కొందేక్కింది. కంగాళి కథ కి తోడు పాత పాటలనే మళ్ళి రెమిక్ష్ చేసి వాటిని వంశి గారి గొంతుకుతో వినిపించారు .. [...]
సినిమా అసలు చూడాలా వద్ద అని ఆలోచించా ... మా వాడు పవన్ నటన లో కొంచం మేరుగుపడ్డాడు అంటే కాబోలు అనుకున్నా... సరే కొంచం ప్రయత్నిద్దాం అని సినిమా డౌన్లోడ్ చేశా... (ధియేటర్ కి వెళ్ళే ధైర్యం లేక పోయింది మరి ... మరీ పద్దెనిమిది డాలర్లు పెట్టి తలనొప్పి తెచ్చుకునే కోరిక కూడా లేక పోయింది... మా ఊర్లో రెండు షో లు ప్రకటించి ఒక షో నే వేసారు ... పన్నెండు మంది వచ్చారు సినిమాకి అని తెలిసింది. ) [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు