ఫిబ్రవరి/ మార్చి 2017 జాబిలి  సాహితి సామాజిక రాజకీయ మాసపత్రికలో  నేను వ్రాసిన "తమలపాకుతో నువ్వొకటిస్తే.." అనే కథ ప్రచురించబడింది. చదివి మీమీ అభిప్రాయాలు చెపుతారుకదూ! తమలపాకుతో నువ్వొకటిస్తే…                                                                                                       .       “ఇంత లావున్నావు తేలుమంత్రం తెలీదా అన్నట్టు యిన్నేళ్ళొచ్చేయి ఆమాత్రం కంప్యూటర్ చూడ్డం
(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెల్చుకున్న కథ ) మీ అమ్మ మారిపోయిందమ్మా!    “మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని అక్కడితో ఆపేసారు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత అదే [...]
ఉపాయం వుందిగా.. అచ్చంగా తెలుగు సమూహంలో శ్రీమతి మంథా భానుమతిగారు శ్రీ కట్టుపల్లి ప్రసాద్‍గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కథలపోటీలో తృతీయ బహుమతి పొందిన నేను వ్రాసిన కథ.. "ఉపాయం వుందిగా.." “సిరికిం జెప్పడు శంఖ చక్రయుగామున్ చేదోయి సంధింపడు...” అంటూ గజేంద్ర మోక్షంలో పోతనగారు చెప్పినట్టు తనను తానూ పూర్తిగా ఆ భగవంతుని శరణాగతి కోరిన వాడిని రక్షించటానికి వైకుంఠంలో [...]
లలితా మహిళామండలి ఇరవైమూడవ వార్షికోత్సవ సంబరాలు..     అందరం పదకొండు గంటలకల్లా రాజ్యలక్ష్మిగారింటికి చేరిపోయాం. ఆవిడ పరమ వీర పాఠకురాలు. కనిపించిన పుస్తకాలూ, పేపర్లే కాదు, ఎదురుగా చిత్తుకాగితం కనిపించినా చదివి పడేసే స్వభావం. వట్టి చదివేసి వూరుకోకుండా అందులో చాలా చాలా కష్టమైన ప్రశ్నలన్నీ, జవాబులతో సహా ఒకచోట రాసిపెట్టుకుంటారు.  దానివల్ల మీకేం నష్టం అంటారా.. మాకేనండీ [...]
 ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవై వారాలపాటు ధారావాహికంగా వచ్చిన,  "ఒక ఇల్లాలి కథ" అనే   నేను రాసిన నవలను పుస్తకంగా ప్రచురించడం జరిగింది. అక్టోబరు 15, శనివారం సాయంత్రం 5 గంటలకు తార్నాకాలోని స్ప్రెడింగ్ లైట్ స్ లైబ్రరీహాల్లో ఈ  పుస్తకపరిచయం జరిగింది.. ప్రముఖ రచయిత్రి, లెక్కకు మిక్కిలి  పురస్కారాలందుకున్న డి.కామేశ్వరిగారు  పుస్తకాన్ని పరిచయం చేసారు. ముందుమాట [...]
18-9-2016 ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వచ్చిన నేను వ్రాసిన కథ.."ప్రేమా పిచ్చీ ఒకటే.." లింక్ కింద యిస్తున్నాను. ఒకవేళ యెవరికైనా చదవడానికి యిబ్బందిగా వుంటే కింద పెద్ద అక్షరాలతో టైప్ చేసింది పెడుతున్నాను. మీ అభిప్రాయాలు నాకు చాలా అమూల్యమని గ్రహిస్తారు కదూ!.. http://www.andhrabhoomi.net/weekly_special/aadivaram_listing/45 ప్రేమా పిచ్చీ ఒకటే..
కౌముది _ రచన నిర్వహించిన కథలపోటీ (2013) లో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఈ కథ 2014, నవంబర్ నెలలో "కౌముది" అంతర్జాలపత్రికలోనూ, , 2016 మే నెల "రచన.."మాసపత్రికలోనూ ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయాలు చెపుతారు కదూ!.. అమ్మల గన్న యమ్మ "అమ్మాయే పుడుతుందీ అచ్చం అమ్మలాగే ఉంటుందీ... అబ్బాయే పుడతాడూ అచ్చం నాన్నలాగే ఉంటాడూ..." రఘూ సెల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసిన పాటని ఆనందంగా వింటున్న సుమ  [...]
గొ తెలుగు.కామ్ అంతర్జాల కుటుంబ వారపత్రికవారు  మే నెలలో వచ్చే పత్రికలలో పర్యావరణ  పరిరక్షణకు సంబంధించి కథలు, కవితలు, కార్టూన్లు వేయ సంకల్పించి రచయితలకు, కవులకు, కార్టూనిస్టులకు దానికి సంబంధించిన రచనలు పంపమని పిలుపు నిచ్చారు. ఈ వారం ఆ పత్రికలో దానికి సంబంధించి నేను వ్రాసిన "మేల్కొలుపు.." అనే కథ ప్రచురించబడింది. లింక్ కింద ఇస్తున్నాను. చదివి మీ మీ అభిప్రాయాలు [...]
29-04-2016, గొ తెలుగు.కామ్  అంతర్జాల వారపత్రికలో నేను వ్రాసిన కథ వదిన ది గ్రేట్.. లింక్ ఇదిగో.. http://www.gotelugu.com/issue160/4093/telugu-stories/vadina-the-great/
ఏప్రిల్, 24 ఆదివారం "మన తెలంగాణ" దినపత్రిక  హరివిల్లు లో నేను వ్రాసిన కథ "మనసు పొరల్లో.." లింక్ ఇదిగో.. http://epaper.manatelangana.news/788232/HariVillu-Weekly/24-04-2016#dual/10/1 అందరూ చదవడానికి వీలుగా పెద్ద అక్షరాలతో కింద టైప్ చేసినది కూడా పెడుతున్నాను. మీ అభిప్రాయం చెపుతారు కదూ.. మనసుపొరల్లో..
2016,ఫిబ్రవరి నెల "కౌముది" అంతర్జాల మాసపత్రికలో నేను రాసిన "రెండు నాన్నలు.." కథ ప్రచురించబడింది. చదివి మీ మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కదూ! లింక్ ఇదే.. http://www.koumudi.net/Monthly/2016/february/index.html
   2015  సంవత్సరం వెడుతూ వెడుతూ నాకు చాలా ఆనందాన్నిచ్చి వెళ్ళింది. ఎప్పుడూ కలలో కూడా అనుకోని నేను నా కథలను కొన్నింటిని కథలసంపుటిలా తీసుకురావాలనుకోవడం నాకు ఇప్పటికీ వింతగానే వుంటుంది. అలా సంకల్పించుకోగానే కొంతమంది మితృలని సంప్రదించాను. అందరూ చాలా ఉపయోగకరమైన సలహాలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. అలా ధైర్యం చేసి నా కథల సంకలనాన్ని తీసుకొచ్చాను. ఇదిగో ఇదే నా మొట్టమొదటి [...]
వెఱ్ఱిబాగులవదిన వ్రతకథ 4-12-2015, స్వాతి సపరివార పత్రికలో నేను రాసిన "వెఱ్ఱిబాగులవదిన వ్రతకథ"   అనే హాస్యకథ  ప్రచురించబడిందహో.. వెఱ్ఱిబాగుల వదిన వ్రతకథ...   "మీ వదిన ఉత్తి వెఱ్ఱిబాగుల్ది స్వర్ణా.." అని అన్నయ్య తన పెళ్లైన పాతికేళ్లలోనూ కనీసం వెయ్యిసార్లైనా అనుంటాడు నాతో. నా యిన్నేళ్ళ అనుభవంలో వదిన వెఱ్ఱిబాగుల్దో, అన్నయ్య వెఱ్ఱిబాగులవాడో తేల్చుకోలేకపోయేను.    [...]
నాణానికి మరోవైపు ప్రథమ బహుమతి నందుకున్న కథ.. జాగృతి వారపత్రిక నిర్వహించిన కీర్తిశేషులు వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథలపోటీలో నేను వ్రాసిన “నాణానికి మరోవైపు..” అన్న కథకు ప్రథమ బహుమతి లభించింది. 9 – 15 నవంబర్ 2015 తేదీ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది. చదివి మీ మీ అభిప్రాయాలు చెపుతారు కదూ… (చదవడానికి వీలుగా  కింద పెద్ద అక్షరాలతో టైపు చేసి కూడా [...]
TORI---telugu one radio లో శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు "ముఖాముఖీ"  కార్యక్రమం ద్వారా నాగురించి   నలుగురికీ తెలియపరిచారు. దానిని ఈ కింద లింక్ కి వెళ్ళి వింటారుకదూ! http://www.teluguoneradio.com/archivesplayer.php?q=20773&host_id=239
ఈ నెల 28న మా లలితామహిళామండలి యిరవైరెండవ వార్షికోత్సవం అత్యుత్సాహంగా జరిగింది. వార్షిక నివేదిక సమర్పిస్తున్న కార్యదర్శిని భారతీప్రకాష్.        ఎప్పటిలాగానే మా సభ్యులు ఈ సంవత్సరం కూడా కొన్ని పోటీలు నిర్వహించారు. వ్యతిరేకపదాలపై పోటీ పెట్టి సభ్యుల తెలుగు పాండిత్యాన్ని పరీక్షించి, బహుమతు లందించారు దుర్గ.        మహాభారతం మీద సుమారు అరవై ప్రశ్నలవరకు [...]
దసరా సంబరాలు..    దసరా నవరాత్రులంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. అమ్మవారికి ఒక్కొక్కరోజు ఒక్కొక్కపేరుతో రోజుకొక్క రీతిగా అలంకరణ, పూజ, నైవేద్యాలు చెయ్యడం మనందరికీ తెలిసిందే. బొమ్మలకొలువులు, తెలంగాణాలో అయితే బతుకమ్మలు మనలో వున్న సృజనాత్మతని వెలికితీస్తాయి.    చిన్నప్పుడయితే మా అమ్మగారు పూజ అయ్యాక కీర్తన పాడనిదే పూజ పూర్తయినట్టు కాదనేవారు. ఆ పూజాక్రమంలో “గీతం [...]
మాలిక అంతర్జాల పత్రిక ఆగస్ట్ సంచికలో వచ్చిన నా కథ.. "ఎంజాయ్ మేరిటల్ బ్లిస్." అన్నఈ కథను చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ.. http://magazine.maalika.org/2015/08/08/%E0%B0%8E%E0%B0%82%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A4%E0%B0%B0/
'యామిని'  అంతర్జాల పత్రికలో ప్రచురించబడిన నా కథ.. http://www.yaaminii.com/uncategorized/%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B9%E0%B1%8B-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B0%A5/ యామిని పత్రిక సౌజన్యంతో..
జూన్, పదవతారీకు 2015 తేదీ గల నవ్య వారపత్రికలో నేను వ్రాసిన "అమ్మలూ ఒక్కమాట చెప్పనా.." అన్న కథ ప్రచురించబడింది. దానిని ఇక్కడ పెడుతున్నాను. సాహితీప్రియులు చదివి, వారి వారి అభిప్రాయాలను తెలియపరచవలసిందిగా కోరుతున్నాను.  చిన్న అక్షరాలు చదవడానికి  యిబ్బందికరంగా వుంటే  కథ  పెద్ద అక్షరాలతో క్రింద పెట్టాను. అమ్మలూ, ఒక్కమాట చెప్పనా..?  “ఎప్పుడు కొంటున్నావు మీ [...]
మ వదిన మౌనవ్రతం యెందుకు పట్టిందో మీకు తెలుసుకోవాలనుందా..అయితే 10-4-2015 పత్రిక గో తెలుగు.కామ్ లో వచ్చిన ఈ కథ చదివెయ్యండి మరి.. http://www.gotelugu.com/issue105/2762/telugu-stories/maa-vadina-mounavratam/
చెర్రీబ్లూజమ్స్..     ప్రకృతి యెంత అందమైనది. ఆ ప్రకృతిలోని ప్రతి అణువూ భగవంతుని చరణాలను చేరాలని యెంత తాపత్రయపడుతుందీ..    ఈ సుకుమార సుమాల పేరు చెర్రీ బ్లూజమ్స్ ట. పేరులోనే యెంతటి సౌకుమార్యం!  యే భాషయితేనేం, యే పేరయితేనేం వీటి తీరు వింటే మనసు ముద్దమందారమవుతుంది. యేడాదికి ఒక్కసారి, అదికూడా కేవలం రెండువారాలు మాత్రమే పూస్తాయిట ఈ పూలు. [...]
    మాలికపత్రిక సంపాదకురాలు జ్యోతివలబోజు స్వదస్తూరీతో అందరినీ ఆవకాయ గురించి వ్రాయమన్నారు. అసలే మే నెల. కొత్తఊరగాయలకాలం. ఆవకాయ పెట్టడం వచ్చినవాళ్ళూ, రానివాళ్ళూ, దానిని ఆస్వాదించేవాళ్ళూ, దాని పేరు చెప్పుకుని మురిసిపొయేవాళ్ళూ, కొత్తావకాయ అందని దూరదేశాల్లో వున్నవాళ్ళూ అందరూ స్పందించి ఆవకాయ గురించి వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. అందులొ నేనూ వున్నాను. నా [...]
మార్చి పదిహేడు, మంగళవారం మా లలితామహిళామండలి సభ్యులం అందరం అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకున్నాం. మా సభ్యులలో ఒకరైన రత్న ఆరోజు మాకందరికీ వేదిక యేర్పాటు చేసి, మంచి విందుభోజనం అందించారు. ఈవిడే ఆ గృహలక్ష్మి రత్న..       అందరికీ రాగానే వెల్కమ్ డ్రింక్ లు. తర్వాత పలకరింపులు. ప్రతిఒక్కరూ వారికిష్టమైన విషయం గురించి అయిదేసి నిమిషాలు మాట్లాడాలని ముందరి మీటింగ్ లోనే [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు