శంకరాభరణంలో ఇచ్చిన చిత్రమునకు నా పద్యం..స్కూలుకు బోయెడి పిల్లలహేలను తాను గమనించి యేవిధి నటులన్మేలుగ బోవుదునోయనిబాలయె మదిదలచుకొనుచు బండిని నడిపెన్!!!              
                                               దశావతారములు(ఖండిక)వేదములను దెచ్చి నవియెమోదంబుగ బ్రహ్మకొసగ మూకము నీవైయీధర సోమకుని దునిమివేదాలను గాచినట్టి విభునకు ప్రణతుల్!!!మంధరగిరి నెత్తగహరిసుందర గూర్మంబువగుచు సురలను గావన్పొందుగ నమృతము బంచుచుబృందారకుల తలగాచు వృష్ణికి  జోతల్!!!భూదేవిని పైకెత్తగభూదారమువై నయముగ బ్రోవుచు వసుధన్మోదితివి [...]
                                           తెలుగు భాష …(ఖండిక)అమ్మ నాన్నయన్న అమృతమ్మును చిలుకుమమ్మి డాడి యనగ మధురమేదిమాతృభాషలోన మమకారమున్నదితెలుగు భాషవిలువ దెలుసుకొనుమ!!!ఆంగ్ల మందు మోజు నబ్బరముగనున్నఅలుసు చేయబోకు నచ్చ తెనుగుభావి తరములందు బాగైన నిధివోలెవిశ్వమందు తెలుగు వెలగవలెను!!!ఇతర భాషలెన్ని యింపుగా వచ్చినవరము గాదె మాతృ భాషమనకుపట్టి పట్టి బలుక [...]
                                              సిద్ధిధాత్రితొమ్మిదవనాడుముదముగఅమ్మని సద్భక్తి తోడ నర్చన జేయన్నెమ్మినిడి సిద్ధిధాత్రియెనెమ్మనమున గోర్కెలన్ని నెరవేర్చునిలన్!!!స్థిరముగ కమలమునందునకరముల శంఖమ్ము మరియు కమలమ్ములతోశరణను వారిని నిరతముకరుణించెడు సిద్ధిధాత్రి కైచాపులివే!!!
                                                మహాగౌరిఅష్టమ దినమున భూరిన్స్పష్టంబగు ధవళవర్ణ భాసము తోడన్నిష్టముగ మహా గౌరియెశిష్టుల రక్షించి భువికి సిరులనొసంగున్!!!
                                                                           కాళరాత్రిఏడవ దినమున శ్రద్ధగవేడుకతో కాళరాత్రి పేరు జపింపన్పీడలను జేరనీయకపోడిమితో నరయు సతికి మ్రొక్కదనెపుడున్!!!
                                                                            కాత్యాయనికాత్యాయన ముని పుత్రికకాత్యాయని దేవి గొలువ కమనీయముగన్సత్యమగు తల్లి కరుణనునిత్యము మరి బొందగలరు నిజభక్తులిలన్!!!ఆరవ దినమున భక్తిగగారవముగ బూజసేయ కాత్యాయనినేకోరిన గోర్కెలు దీర్చుచుధారుణిలో జయము లొసగు తల్లికి ప్రణతుల్!!!
                                            స్కందమాతస్కందుని యొడిలోనిడుకొనియిందీవరములు మెరియగ నిరుచేతులలోనందముగ నభయమిడుచున్నందరకును స్కందమాత నాశిసు లీయున్!!!పంచమదినమున విధిగామంచిగ జనులంత స్కందమాతను గొలువన్త్రుంచుచు బాధల నిలలోపెంచును గద సంతసమ్ము విజయములిడుచున్!!!
కూష్మాండఇష్టంబుగ కూష్మాండయెసృష్టిని సృజియింపజేసె చిరుహాసముతోఅష్టభుజాదేవి గొలువ కష్టములను దీర్చి గాచు కలకాలంబున్!!!నవరాత్రులలో నాల్గవదివమున బూజించి ధూప దీపమ్ములతోశివ సతియౌ కూష్మాండను స్తవమును జేయంగతల్లి సౌఖ్యము లీయున్!!!
చంద్రఘంటశిరమునమరి నెలవంకయుకరముల జపమాల ఘంట ఖడ్గము దమ్మిన్బరిసయు శూలమ్ములతోసురుచిరమగు చంద్రఘంట జోహారులివే!!!
దేవీనవరాత్రులుశైలపుత్రినవరాత్రులలో ముందుగశివశంకరి శైలపుత్రి  క్షేమను భక్తిన్ప్రవరంబుగ బూజింపగ శివముల నిడి గాచు మనల శివవల్లభయే!!!బ్రహ్మచారిణిపరమేశుని వరియించగకరమున జపమాలదాల్చి కడునీమముతోస్థిరముగ దపమొనరించెడు కరుణామయి బ్రహ్మవిద్య  కైమోడ్పులివే!!!
                    శ్రీ రావి రంగారావు గారు నిర్వహించిన                           "బొట్టు శతకం"లో                            నా పద్యములు...తేటగీతి....1..వన్నె చిన్నెల బిందీలు వసుధ నున్నచెన్నుగానుండు కుంకుమ మిన్న గాదెపూర్ణ బింబమ్ము వలె జూడ మోము నందుబొట్టు మెరియంగ సిరులొల్కు పూవుబోడి !!!2కనుబొమలమధ్య బెట్టిన కలికి బొట్టు శాంతి సౌఖ్యమ్మలలరారు [...]
కందము...గురువే బ్రహ్మయు విష్ణువు గురువేగద నీశ్వరుండు గురుదైవమ్మే గురువే సర్వము నిలలోగురువులకివె వందనములు కువలయమందున్!!!బడియే తొలిగుడి జనులకు బడిలో దైవమ్మె గురువు బ్రహ్మము తానేబడిపంతులె సర్వులకును నడవడికను నేర్పుగాదె నయముగ నెపుడున్!!!నిరతము విద్యను నేర్పుచు పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతోసరిరారు గురువుకెవ్వరుగురుదేవోభవ యనుచును గొలువగ [...]
                                                                      మల్లెపూవుఉత్సాహ..చల్ల నైన రూపమున్న చక్కనైన మల్లికావెల్లి విరియు నీదు తావి విశ్వమందుహాయిగామల్లె పూల మాలలన్న మాత దుర్గ మెచ్చునేమల్లికేశు డాదరించు మల్లె జన్మ ధన్యమే!!! కందము..తెల్లని మల్లెల తావియెయుల్లము రంజింపజేయు నుర్వీతలమున్చల్లని వెన్నెల రేయినిమెల్లిగ  విడు [...]
ఏకవింశతి పత్రి పూజ....సీసపద్యం....విఘ్ననాయక నిన్ను వేడ్కతోబూజింతు.........చక్కంగ నిరువది యొక్కపత్రిమామిడి దానిమ్మ మరువమ్ము గండకీ...........ఉమ్మెత్త నశ్వద్ధ నుత్తరేణిమారేడు జిల్లేడు మద్ది జమ్మియు మాచి........దేవదారు తులసి రావి జాజిగరిక మునగ విష్ణు క్రాంతయు రేగుయు..........చిన్న ములక దెచ్చి శ్రీకరముగఆటవెలది....వెండిపళ్ళెరమున మెండుగా మేలైన పంచభక్ష్యములిడి భక్తితోడదీపములను బెట్టి [...]
                                      శంకరాభరణం బ్లాగులో                                        2015 లో                        శ్రీ కందిశంకరయ్య గురువుగారు ఇచ్చిన                                                             సమస్యలకు నాపూరణలు.గురువుగారికి కృతజ్ఞతలతో...కొత్తసంవత్సరము దెచ్చె కోటి వెతలు..(1)శ్రీకరమ్ముగ [...]
ప్రహేళిక:కం.చీమల కాళ్ళు లావగుసామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా !భామల కాళ్ళు లోకువభూమీశా ! జనుల కాళ్ళు భోజన మౌగా !పైకి కంపించే అర్థం:చీమల కాళ్ళు లావుగా ఉంటాయంట! ఏనుగుల కాళ్ళు చాలా సన్నగా ఉంటాయంట ! భామల కాళ్ళు లోకువంట ! ( ఎవరికో ? ఎందుకో?) ఓ రాజా ! జనుల కాళ్ళే భోజన మౌతుందిగా ! ( ఇదేమిటో?)ఓ రాజాస్థానానికి వచ్చిన కవి ఈ చమత్కార పద్యం చెప్పాడు. విన్న వారందరూ తికమక పడ్డారు. ఏమీ బోధ [...]
ఇతని పేరేమిటి?సీ. ఖాండవమ్మను పేరు గలిగినట్టి దదేది?వెలుఁగు నిచ్చెడునట్టి వేల్పెవండు?జలమందు ముదమున జన్మించు పువ్వేది?ఉచ్చైశ్శ్రవాఖ్యమై యొప్పు నేది?స్తంభమున జనించి దనుజుఁ జంపె నెవండు?దట్టమౌ వని కే పదంబు గలదు?వనిలోన సీతఁ బట్టిన రాక్షసుఁ డెవండు? *శిబి దేనికొఱకు నిచ్చెఁ దన పలలము?తే. గీ.అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ములందు రెండవ యక్షరా లరసి చూడదేశరాజకీయములలోఁ [...]
     ప్రహేళిక-51                                       నామగోపన పద్యంతే.గీ."కంజదళనేత్ర! మాధవ! కంసభేది!శంఖచక్రగదాధర! సాధులోకరక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు. పై పద్యంలో దాగిన పేరేదో చెప్పండి.నాసమాధానం ....(గురువుగారి పేరు)...అన్ని పాదములందున నంత్య ప్రధమనక్షరములను గలుపగ లక్షణముగవచ్చు నామమ్ము జనులార ఖచ్చితముగసందియమ్మేల [...]
కృష్ణాష్టమిపర్వంబునవృష్ణిని బూజించి పాలు వెన్నలతోడన్కృష్ణునికి నివేదవలిడికృష్ణా ! మము గావుమనుచు కృపగోరవలెన్!!!శ్రీ యదునందన శ్రీకర కృష్ణా!మాయలు జూపెడు మాధవ కృష్ణా!శ్రేయము గూర్చెడు చిన్మయకృష్ణా!బాయక నుండుము బాగ్యద కృష్ణా!నందుని యింటను నర్తిలు కృష్ణా!విందగు నీకృప వీక్షణ కృష్ణా!సుందర వందిత శోభిత కృష్ణా!వందనమో హరి చందన కృష్ణా!వెన్నుని బుట్టినరోజునసన్నుతి [...]
జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...కందం —1తాపము బెట్టెడి భానుడుపాపము తన వేడికి తనె వడగొనె నేమో!సూపరుగా స్ట్రా వేసుకురూపరి బుంగన జలమును రొప్పుచు ద్రాగెన్!!!కందం —2కుండను తలపై బెట్టుకుయెండన బడి నడచి పోవు ఇంతిని గనుచున్మెండుగ దాహము వేయగకుండన గల పీథమును గ్రోలె గుట్టుగ రవియే!!!కందం —3మంటలు రేపే సూరుడతుంటరి [...]
జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...భర్త గారి జేబు బాగుగా కనిపింపఫస్టు మాట మరచి పర్సు జూడకాన వచ్చెనందు కాగితం బొక్కటిఫూలు జేసె పతియె మేలు గాను !!!గుట్టుగ దాచగ సొమ్మునుకొట్టెను పతి జేబునుండి కోమలి పర్సున్బిట్టుగ దెరువగ నహహా !నట్టింట్లో ఫూల యెనుగ నారీ మణియే!!!చెక్కుచు రేఖల నింపుగచక్కని కార్టూను మలచి సంతస [...]
జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...బట్టలు బాదుచు నీవటబట్టితి మరి గరిటె నేను బావా! గనుమా!నెట్టున కులసతులుండగపట్టదె! నాధులకు బాధ పంకజనాభా !!!నట్టింటనుండు సతులేనెట్టింట్లో పీఠమేసి నేర్పుని జూపన్గుట్టుగ సంసారంబునునెట్టగ కుడియెడమలైన నేరము గాదే!!
జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...పెట్టితి భోగీ మంటనుహిట్టందురు నెట్టులోన నిది జూడగనేచుట్టము లందరు వరుసగకొట్టరె మరిలైకులనుచు కోమలి మురిసెన్!!!
దత్తపది- 85పాప - రూప - దీప - తాపపై పదాలను ఉపయోగిస్తూ `దీపావళి' పర్వదిన ప్రాశస్త్యాన్ని తెలుపుతూమీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.తాపము నణచగ భువిలో పాపపు నరకుని వధింప  భామయె పతితోరూపము దాల్చగ హాళియెదీపపు వెలుగులను దెచ్చె దీపావళియే!!!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు