ఊరందరిదీ ఒక దారైతె ఉలిపిరికట్టది మరో దారి అన్నది సామెత అని విన్నట్టు జ్గ్యాపకం. అందరిలా మనమూ ఉంటే ఎలా అని అనిపించినప్పుడు..మనల్ని ఎవరూ గుర్తించట్లేదు అనిపించినప్పుడు...జివితం లో కొత్తదనం కావాలి అనిపించినప్పుడు...జివితం మరీ సాదాసీదాగా పోతోంది అనిపించినప్పుడు... ఏదో ఒక చిలిపి చేయాలి అని అనిపించినప్పుడు....కడుపు మండినప్పుడు... తలలో నిషా ఎక్కినప్పుడు....పక్కవాడి పెరుగుదల [...]
కాంగ్రెస్ అనుకున్నది సాధించింది.తెలంగాణాకు జైకొట్టి సీమాంధ్రుల నోట్లో మన్ను కొట్టింది. సరే వారి కోరికమేరకు విభజన చెసినా సీమాంధ్రుల భయాలకు తగిన ధైర్య వచనాలు కూడా చెప్పకుండా తోసిరాజు అనడం కేవలం ఒక్క సోనియాకే చెల్లింది. నాకు కేసీఅర్‌ని చూస్తే ముచటేస్తోంది. పార్టీ్‌కోసం తెలంగాణాకోసం సోనియాను ముప్పుతిప్పలు పెడుతూ తనకోర్కెలన్నీ తీర్చుకుంటున్న కేసీఅర్‌ని చూస్తే [...]
ఎలచ్చన్లు అయిపోయాయి...... అనుకున్నదే..ఎర్రిబాగులోళ్ళమంతా గన్‌బాబుని గెలిపుంచుకున్నాము. గన్‌బాబు ఇప్పుడు ప్రజాహోమంలోంచి నూతనంగా జనించిన  సత్శీలుడు. వారి తప్పులనీ ప్రజా "గుండం"లో కాలి ఒప్పులయ్యాయని అవి అస్సలు తప్పులేకావని సదరు పార్టీ వక్తలు చెప్పుకుంటు ఉంటే విని అవునని తలూపడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది లేదు. ఇక కాబోయే ముఖ్యమంత్రి వారేనని కూడా ప్రకటించారు. ఇది దేవుడి [...]
"లక్ష కి పడకపోవచ్చు, కోటికి పడకపోవచ్చు, కానీ వందకోట్లు ఇస్తానంటే పడనివాడుంటాడా?" ఇదో సినిమాలోని డైలాగు. సీబీఐ కోర్ట్ జడ్జి పట్టాభిగారి విషయంలో ఇదే జరిగి ఉంటుందా? ఆయన లాకర్లలో దొరికిన డబ్బు కూడా కొంత అనుమానాల్ని దృవీకరిస్తోంది. సుడిగాలి బ్రదర్స్ ( గన్ & గాలి) హస్తవాసి అంత మంచిది కాదని స్పష్టమౌతోంది. వారి చేతిలోంచి ప్రసాదాలు పొందినవాళ్ళెవ్వరూ కూడా సుఖంగా లేరు. [...]
సీబీఐ ఒక యువకుడిని, కాబోయే ముఖ్యమంతిని అరెస్ట్ చేయించింది. ఏంత అన్యాయం? కక్షగట్టి ఒక తండ్రిలేని పిల్లవాణ్ణి కటకాలపాలు చేస్తారా? ఒక ఆశయంతో  బుద్ధిగా ఎన్నికల్లో పోటిచేసి ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్న ఒక యువకిడిని చెరసాలపాలు చేస్తారా? వారి తండ్రి సెజ్‌ల పేరుతో రైతుల భూముల లాక్కుంటే మాత్రం, వేల కోట్లు సంపాదించుకుంటే మాత్రం అలా జైలుపాలు చేయడం సహించం. జైలులో [...]
కొంత కాలంగా తెలుగు న్యూస్ చానల్స్ అంటే విసుగొచ్చింది. పేపర్ మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు న్యూస్ పేపర్ అన్నా విసుగొస్తొంది. జగన్ అరెస్ట్ అవుతాడా? ఎప్పుడవుతాడు? ఆయన ఆస్తుల్ని జప్తు చేస్తారా? ఆయనకు  అన్ని ఆస్తిపాస్తులు ఎలా వాచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వానికి తెలియదా? ఆస్తులని కూడబెట్టడం వైయెస్సార్ ఉన్నప్పటినుండీ ఉన్నదని ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదా? [...]
సకల జనుల సమ్మె బాగానే సా..గుతోంది. జనాన్ని మూకుమ్మడిగ ఎలా ముంచచ్చో పులకేసికి తెలిసినంతబాగా మరెవ్వరికీ తెలియదు. ఎవరి చేత్తో వారికే వాతలు పెట్టుకోవడం చక్కగా నేర్పిస్తున్నాడు. వీరికితోడు నత్తి సత్తిబాబు, ఎల్కేజీ టీచర్. ఇకపై మిలటెంటు కార్యక్రమాలు మొదలు పెట్టాలిట. పైగా గాంధీజి కూడా మిలటెంట్ కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. అంటే తనని తాను గాంధిజితో [...]
మిలీనియం మార్చ్ మొత్తం మీద అయింది. పదిలక్షల మంది కాకపోయిన వేలమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మార్చ్ చేద్దామనుకున్న వారికి కుదరక పరుగులు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చాలా సంయమనంతోనే వ్యహరించారని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యహారమే ఎవ్వరికీ మింగుడుపదలేదు.కేకేకి గానీ తెలంగాణా తరప;ున పూర్తిగా వకల్తాపుచ్చుకొని వాదిస్తూ వచ్చిన మధు యష్కీగానీ [...]
నోరు విప్పితే గబ్బు...మాట్లాడితే మాయమాటలు...జనాల అమాయకత్వంతో ఆటలు...ప్రజల మనోభావాల మాటున కపట రాజకీయాలు....ఆశయాల సాధన పేరుతో అక్రమ సంపాదన...ఇది గులాబీల వికృత చేష్టలు. దీనికి వారు పెట్టుకున్న మరో ముద్దు పేరు "మా సంస్కృతి". అసెంబ్లీ సాక్షిగా వీరి వికృతి హేల నిన్న హద్దులు దాటింది. గవర్నరు పై దాడిని జరిగిన తరువాత వారి చర్యను ఖండించబోతే జేపీకి జరిగిన అవమానానికి యావత్ మీడియా [...]
దశరధమహారాజు ఒకానొక సమయంలో కైకకి ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించమని శోకమందిరంలో ఉన్న కైక కోరుతుంది. వాగ్దానం ప్రకారం కైక కోరికలు దశరధుడు మన్నించాలి. భరతుడికి పట్టాభిషేకం చేయడం ఒకటైతే మరోటి శ్రీరాముడిని అడవులకు పంపివేయడం. ఆమె మాట ప్రకారం సీతారాములు అడవికి బయలుదేరుతారు. వారితోబాటోబాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. నార దుస్తులతో వారు అడవికి బయలుదేరుతారు. నారబట్టలు [...]
బ్లాగులో రాతలు తీటలాంటిదే. మనం గొప్ప అనుకున్న అభిప్రాయాన్ని మనం రాసుకుంటే తీరిక ఉండి బ్లాగులొకి తొంగిచూసినోడు నచ్చితే "ఆహ!" అంటాడు లేకపొతే "యాహ!" అంటాడు. మన అభిప్రాయాలు కొద్దిగ అతిగా, తిక్కతిక్కగా అనిపిస్తే, ఎదుటివాళ్ళని రెచ్చగొట్టేల ఉంటే చదివినవాడు మనల్ని గిచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఇది మాటలవరకే ఐతే పర్వాలేదు, శృతిమించి వ్యక్తిగత ధూషణలకు వెళ్ళడం మాత్రం అర్ధం [...]
మా అపార్ట్‌మెంట్లో సెక్రటరీ ఒక నిర్నయం తీసుకున్నాడు. ఫ్లాట్లలో ఉండే కార్లను ఇకనుండీ వాచ్‌మెన్ తుడవడని. ఎందుకంటే కార్లు తుడవడంవల్ల ఎక్కువ సమయం దానికే పోతే అసలు పనులు చేయడానికి వాచ్‌మెన్ కి సమయం చాలట్లేదని. ఏమి చేస్తాము? ఎవరినైన మరొకరిని వెతికిపెట్టమని వాచ్‌మెన్‌కె అప్పచెప్పాను. ఒకరోజు ఉదయాన్నే వాచ్‌మెన్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చాడు. సార్ ఇయన కార్లు శుబ్రం [...]
ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు [...]
తెలుగు భాషాభివృద్ధికోసం బ్లాగర్లంతా "తెలుగు బాట" కార్యక్రమం చేబట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. గిడుగు రామ్మూర్తిగారి జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని చేబట్టడం మరింత ఆనందించాల్సిన విషయం. నాక్కూడా ఆరోజు బ్లాగర్లందరితోనూ పాల్గొని నేనేగాకుండా మరింతమందిని తీసుకురావాలని ఉంది. కానీ కొంతమంది వక్రదృష్టి దీనిమీద పడుతుందేమో అనే సందేహం కలుగుతోంది. మొదటిది తెలుగుభాష [...]
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనేది ఒకప్పటి మాట. చానల్స్ చానల్స్ ఊళ్ళు పంచుకోవడం అనేది ఇప్పటి మాట. దొంగల ఆగడాలు కొంతవరకు పోలీసులు అరికడతారు. ప్రభుత్వ ఆగడాలను ప్రతిపక్షాలు అరిచి అడ్డుకుంటాయి. కాని మీడియా ఆగడాలను ఆపడం ఎవరి తరము కాలేదు. కానీ ప్రజల అదృష్టం కొద్దీ వారి ఆగడాలు వారే బైట పెడుతున్నారు. ఆ మధ్య రెండు చానల్స్ ఒకరిపై ఒకరు ప్రత్యక్ష వాదోపవాదనలు చేసుకుంటూ ఒకరు [...]
రాష్ట్ర ప్రజలు అన్నీ మరచి కొద్దిగా ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, టీవీ చానల్స్ కేవలం ఎండవేడి, వడగాడ్పుల విశేషాలు మాత్రమే ప్రసారం చేస్తున్నవేళ రాష్ట్రంలో మరో సంఘటన. కులాల కుంపటి నెత్తినపెట్టుకొని గ్రూపు రాజకీయాలతో ఒకరు, ఆ ప్రాంతంలో తమ ప్రాభవానికి గండిపడుతుందేమోనని మరొకరు పోటిపడి అసలే ఎండలతో మండుతున్న రాష్ట్రాన్ని మరింత వేడెక్కించడం సాధారణ ప్రజలను [...]
ఈ మద్యకాలంలో చర్చలకు వేదిక కల్పించాల్సిన మీడియానే చర్చనీయాశమైంది. ముఖ్యంగా బ్లాగుల్లో మీడియా ముఖ్యవిషయమైంది. మీడియాపైన ఎక్కువమంది వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు అన్నది సత్యం. వీరికీ వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్నయం వచ్చినా పత్రికా స్వాతంత్ర్యం మంటగలిసిపోతోంది అని పెడబొబ్బలు పెట్టే వ్యక్తులు దానికి కారణాలు శొధించాల్సినప్పుడు ఆ బాధ్యతను యాజమాన్యంపై [...]
గత కొన్నిరోజులుగా హైదరాబాదులో జరుగుతున్న అల్లర్లకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చెప్పకపోయినా పండగ చేసుకొనేది మాత్రం మీడియానే. ఈ అల్లర్లలో కేవలం ఇద్దరే చనిపోయారు. పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనైతేనేమి ప్రభుత్వ కృతనిత్చ్యయం వల్లనైతెనేమి బాగానే అదుపులోకి తేసుకొచ్చారు. కానీ జరిగిన అల్లర్లు మీడియాకు తగినంత [...]
ఒక మనిషి రోడ్డుమీద ప్రమాదవశాత్తూ గానీ దాడికి గురైగానీ నెత్తురోడుతూ కనిపిస్తే మీరేమి చేస్తారు? అతన్ని సేదదీర్చడానికి సురక్షిత ప్రదేశానికి మార్చి వెంఠనే ఆంబులెన్స్‌కో లేక పోలీసులకో కబురంపుతారు. కానీ ఇవేమి చేయకుండా అతని బాధను ఏవిధంగా అనుభవిస్తున్నాడో తెలుసుకుంటూ అతను చెప్పలేని స్తితిలో ఉన్నాకూడా సహాయం చేయడం మానేసి అతన్ని ప్రశ్నలతో విసిగిస్తూ కారుతున్న రక్త [...]
ఈ మద్య లోకమంతా అప్రశాంతంగా, ఏదో కోల్పోయినట్టు, టీవీలన్నీ బోసిపోయినట్టు, విలేకరులంతా తెగులుపట్టిన కోళ్ళలా మెడలు వంగిపోయి, ముఖ్యంగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ దివాళా తీసిన వ్యాపారుల్లా దీనంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. కారణం మీకు తెలిసి ఉండదు! అదే మా తెలంగాణా పులకేసి అస్సలు పేపరోళ్ళవైపు, చానల్స్‌వైపు చూడడం మానివేయడంవల్లే. ఇదిగో నిన్నటినుండీ విలేకరులకు కాస్త [...]
చిన్నారి వైష్ణవి చనిపోయింది. కాదు చంపబడింది. అందుకు పురిగొల్పింది స్వయానా ఆ చిన్నారి మేనమామట. ఆ వార్త విని తట్టుకోలేక ఆమె తండ్రి ప్రభాకర్ చనిపోయాడు. ఇలాటి సంఘటనలు మనం ఇరవై నాలుగు ఘంటలు ప్రసారమయ్యే టీవీ సీరియళ్ళలో మాత్రమే చూసి ఉంటాము. సీరియళ్ళలో ఆడవిలన్లు కోపంగా రెండుకోట్లు ఖర్చైనా వాడి అంతు చూడాలి అనడం మనం చాలసార్లు చూసి ఉన్నాము. ఇవి అంతరిస్తున్న మానవ బంధాలు [...]
చినారి చిట్టితల్లి, టీవీలో చిత్రాలలో చిరునవ్వులు ఒలకబోస్తూ అమాయకమైన కళ్ళు గోళీల్లా తిప్పుకుంటూ పుట్టినరోజుగాబోలు జరుపుకున్న కన్నతల్లి, నిండా పదేళ్ళనా లేని పసిమొగ్గ దుర్మార్గుల కర్కశత్వానికి బలైపోయింది. కిడ్నేపైన ఆ చిన్నారి గుంటూరులో నిర్జీవంగా దొరికింది. ఆమె మృతదేహాన్ని కునుగొన్నారని టీవీలో చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. దారికాచి కారు డ్రైవర్‌ను [...]
తెలంగాణా ఉద్యమంలో ఒకవ్యక్తి ముగ్గుబుట్టలంటి జుట్టుతో వేదికలను అలంకరిస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఏకు మేకైనట్టు, తొండ ఊసరవెల్లిగా మారినట్లుగా ఆయన తన స్వరూపాన్ని మర్చుకుంటూ ఒక కరడుగట్టిన రాజకీయవేత్తగా మారుతూ కాకలు తీరిన రాజకీయవేత్తలనే హెచ్చరించే స్థాయికి చేరాడు. ఆయన మరెవ్వరో కాదు కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాం. మేధావిగా తెలంగాణా ఉద్యమంలో అడుగుపెట్టి రాజకీయ జేఏసీలో [...]
వరంగల్ జిల్లాలో రెండేళ్ళ పిల్లవాడు బోరుబావిలో పడి ప్రాణలకోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంధ్రదేశమంతా ప్రార్ధనలు చేసింది, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని. ఆ బిడ్డ ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు అందరూ ఒక్కలా కన్నిరుమున్నీరై విలపించారు. అది మానవత్వం. కానీ రాష్ట్రాన్ని విభజించండీ అంటూ తనకుమాలిన కోరికలతో ఆత్మత్యాగాలు పేరిట ప్రాణాలు తీసుకుంటున్న యువకులపట్ల అందరూ అలా [...]
బ్లాగుల్లో కొన్ని టపాలు చదువుతూ ఉంటే చిన్న చిరునవ్వు అలా మెరిసి చటుక్కున మాయమౌతుంది. అలా అనిపిస్తే ఆ టపాకు ఒక సార్ధకత చేకూరినట్టే. టపా బాగున్నప్పుడు కామెంటడానికి బాగుంది అని చెప్పడం రోటీన్ అనిపించినప్పుడు నేనైతే చిన్న చిరునవ్వు :) వదిలిపెడతాను. నేను చదివాను మీ టపా నాకు నచ్చింది అని చెప్పడానికి. కానీ కొన్ని బ్లాగరుల రూటే వేరు. వారు ఏది చేసినా ఒక సంచలనం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు