ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం [...]
లవణం.. ప్రపంచంలోనే ప్రత్యేకమైన పేరు. పేరుకు తగ్గట్లే అత్యంత అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. నిస్వార్థంతో.. సమాజ హితమే పరమావధిగా చిరకాలం జీవించిన మహనీయుడు ఆయన. నాస్తికుడిగా, హేతువాదిగా ఆయన చాలామందికి నచ్చకపోవచ్చు.. కానీ, మానవతావాదిగా మాత్రం అందరి గుండెల్లోనూ నిలిచిపోయే అసలు సిసలు మనిషి ఆయన. మానవ జీవన పరమార్థాన్ని తన జీవనయానంలో ప్రతీక్షణం చూపించిన మహామనీషి.. లవణం.85 ఏళ్ల [...]
టీడీపీ అధినేత  చంద్రబాబు తనయుడు లోకేశ్‌ని తెలంగాణ ఏసీబీ టార్గెట్ చేసుకోగానే.. ఏపీ సీఐడీ నుంచి ప్రతీకార చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. లోకేశ్ కారు డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కారు డ్రైవర్ కు, గన్ మెన్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను చంద్రబాబు పేరు చెప్పాలంటూ బెదిరించారని నమోదైన కేసులో ఈ [...]
ఓటు కు నోటు కేసులో ఏసీబీ వేస్తున్న అడుగులు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇప్పుడు టీడీపీలో కీలక నేత.. చంద్రబాబు వారసుడు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలంటూ.. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఓటు కు నోటు డీల్ జరిగిన రోజు [...]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన మునికామకోటి కన్నుమూశాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబాన్ని అన్యాయం చేసి వెళ్లిపోయాడు. ఆత్మహత్యలకు ప్రభుత్వాలు కదలవన్న సంగతిని గుర్తించలేకపోయాడు మునికోటి. చచ్చి కాదు.. బ్రతికి సాధించాలన్న నిజాన్నితెలుసుకోలేకపోయాడు. మునికోటి ఆత్మహత్యతో [...]
హీరోలందరికీ  ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. హీరోలనే ఫ్యాన్స్ గా మార్చుకునే హీరోలు అరుదుగా ఉంటారు. యాక్టింగ్ లో పవర్ చూపిస్తూ.. తెలుగు సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరో సూపర్ ఫ్యాన్ దొరికాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొడుకు.. చోటా బచ్చన్ అభిషేక్ .. తాను పవన్ కు పిచ్చ ఫ్యాన్ అని చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ తీసే ప్రతీ సినిమాను [...]
మనం పీల్చే గాలి విషం.. మనం ఉండే నేల విషం.. మనం చూసే ఆకాశం విషం.. మనం తాగే నీరు కూడా విషమే. చివరకు వర్థాలను కాల్చడంవల్ల ఎగసిపడే అగ్నికీలలూ విషాన్నే వెల్లగక్కుతున్నాయి. చెప్పాలంటే.. పంచభూతాలూ విషమయమైపోయాయి. మన దేశంలో ఉపరితల నీటిలో 80 శాతం కాలుష్య భరితమేనని తేల్చింది తాజా పరిశోధన. భారత పట్టణాభివృద్ధి శాఖ, భారత కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన వివరాల ఆధారాలను బట్టి.. దేశం [...]
సీఎం అయిన దగ్గర నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రోజూ దాదాపు 18 గంటలకు పైగా ఆయన పనిచేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రకంగా ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన పర్యవేక్షణ సాగుతోంది. క్యాంప్ ఆఫీస్ నుంచే కాన్ఫరెన్స్ లు, సమీక్షలు చేస్తున్నారు కేసీఆర్. అప్పుడప్పుడూ ఫామ్ హౌస్ కు వెళ్లినా.. ఓ పూటో.. ఓ రోజో ఉండి వచ్చేసేవాళ్లు. ఈ సారి మాత్రం నాలుగు రోజుల [...]
రైలు బండి .. చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడో వెనుక బోగీలో ఉన్నవాడికి అర్జెంట్ పని పడితేనో.. అత్యవసర సమస్య తలెత్తితోనే.. బండిని ఆపడానికి ఏకైక మార్గం చైన్ లాగడం. ప్రతీ బోగీలోనూ ఈ మేరకు ఏర్పాటు ఉంటూనే ఉంది. తరతరాలుగా జనానికి కూడా ఇది బాగా అలవాటయ్యింది. అయితే.. ఇకపై రైలు బోగీల్లో మాత్రం ఈ చైన్ సిస్టం ఉండదు. చైన్ ఉండదు కాబట్టి ఎంత అత్యవసరమైనా రైలు బండి ఆగదు. రైలు బోగీల్లో చైన్లను [...]
ఓటుకు నోటు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆడియో టేపులు బయటపడడంతో బాబుపై కేసు నమోదు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. బాబును ఏ వన్ గా చేర్చాలంటూ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే స్టీఫెన్ సన్ తో బాబు జరిపిన ఫోన్ సంభాషణలు బయటకు పొక్కాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ తో బిక్కచచ్చిపోయిన టీడీపీ నేతలను మరింత [...]
తెలంగాణ బడ్జెట్ కాపీ కోసం కింద లింక్ ను క్లిక్ చేయండితెలంగాణ బడ్జెట్
మా నాన్నకు సలాం! నా రెక్కలు విరగగొట్టకుండా.. నన్ను స్వేచ్ఛగా ఎగరనిచ్చినందుకు మా నాన్నకు ధన్యవాదాలు - నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటూ పాక్ బాలిక మలాలా చేసిన వ్యాఖ్యలివి. మతఛాందసవాదంతో కళ్లుమూసుకుపోయిన తాలిబన్లను ఎదిరించినందుకు.. తన తండ్రి తనను ఏమీ అనలేదని, పైగా తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని చెప్పింది మలాలా. దానివల్లే తాను తాలిబన్లతో పోరాటం చేయగలిగానంది.
వ్యాపారాల్లేవు .. ఉద్యోగాలు అసలే చేయరు.. ఉండేది అడవుల్లో.. పైగా ప్రతీక్షణం ప్రాణభయం. కానీ.. వారి సంపాదన ఎంతో తెలిస్తే.. అందరికీ కళ్లు తిరిగిపోతాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు కూడా సాధ్యం కానంత రేంజ్‌లో వారికి ఆదాయం వచ్చి పడుతోంది.. డైరెక్ట్‌గా చెప్పాలంటే.. ఏడాదికి వారి సంపాదన.. ఏకంగా 140 కోట్లు.. ఇంత సంపాదిస్తోంది ఎవరో తెలుసా..? మావోయిస్టులు..  బెంగాల్‌లో వాళ్లే.. దండకారణ్యంలో [...]
నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడ్డ అసలు ఓబులేశుహైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసని ముందే తెల్చేశారు పోలీసులు. సరిగ్గా అక్కడే మొదలయ్యింది మీడియా హడావుడి. ఓబులేశంటూ ఓ వ్యక్తి ఫోటోను ప్రసారం చేసింది. పార్క్ లో స్టైల్ గా కూర్చుని ఉన్న ఆ ఫోటో ను అన్నిఛానళ్లు [...]
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. రైతులను ఒప్పించే విషయంలో మరో వ్యూహం అమలు చేస్తోంది. ప్రభుత్వ హామీలపై నమ్మకం లేని రైతులు భూములు ఇవ్వమంటూ ఇప్పటికే చాలా గ్రామాల్లో ఆందోళన చేస్తున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసేకరణ సభలు కూడా రసాభాసగా మారుతున్నాయి. చాలాచోట్ల అధికారులపై ఎదురుతిరుగుతున్నారు జనం. [...]
పరిపాలనలో, నిర్ణయాల్లో తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిని మించి మరొకరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్టీఆర్ సుజల పథకం మొదలుపెడితే.. తెలంగాణలో ఏకంగా వాటర్ గ్రిడ్ కే రూపకల్పన చేశారు కేసీఆర్. ఏపీలో నదుల అనుసంధానంపై కసరత్తు జరుగుతుంటే.. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు పనులు [...]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కొత్త హెలికాప్టర్ కొనడానికి రంగం సిద్ధమయ్యింది. దీనిపై అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్ లేదు. జిల్లాల పర్యటనలకు వెళ్లాల్సివస్తే అద్దె హెలికాప్టర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు హెలికాప్టర్లు ఉండగా, అందులో బెల్ [...]
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. మ్యూజిక్ మాంత్రికుడు ఏ.ఆర్.రెహ్మాన్ కూడా సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో ఎంతోమంది వీఐపీలను విచారించింది కోర్టు. జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ వివాహానికి భారీగా ఖర్చుపెట్టిన జయలలిత.. అప్పట్లో అందర్నీ వాడేశారు. ఆ వివాహంలో ఫ్రీగా మ్యూజిక్ కొట్టారట రెహ్మాన్. అప్పట్లే తనకు వెండితో చేసిన శుభలేఖ పంపించారని సాక్ష్యం చెప్పారట ఆయన. [...]
తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకుని, అద్భుతం సృష్టించిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్, తన పనిని కూడా ఎంతో సమర్థవంతంగా చేస్తోంది. అంగారకుడికి సంబంధించిన ఫోటోలను తీస్తూ.. వాటిని ఎంతో జాగ్రత్తగా ఇస్రోకుపంపిస్తోంది. ఎంతో క్లారిటీగా ఉన్న ఈ ఫోటోలతో మార్స్ అధ్యయనం మరింత సులువు కానుంది. అంగారకుడిపై ఉన్న ధూళి తుపాన్లకు సంబంధించి మామ్ తీసిన ఫోటోలను విడుదల చేసింది [...]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటరైనర్ గోవిందుడు అందరివాడేలే. కుటుంబ కథాంశమంటూ యూనిట్ అంతా జోరుగా ప్రచారం చేస్తున్నా.. ఇందులో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయంటూ కోత వేసింది సెన్సార్ బోర్డ్. ఆ కోతలు ఇవీ...1. కాజల్ జాకెట్ బటన్ ను రామ్ చరణ్ విప్పుతున్న సీన్ (9సెకన్లు)2. రా..రా.. రాజకుమార పాటలో హీరోయిన్ [...]
ఒకప్పటి సూపర్ హీరోయిన్.. అందాల రాక్షసి..శిల్పాషెట్టి ఇప్పుడు చీరలమ్ముకొంటోంది. అందేంటి.. హీరోయిన్ గా సంపాదించిన సొమ్ము ఏమైపోయింది.. భర్త రాజ్ కుంద్రా ఆస్తి ఏమైపోయిందని ఆందోళన పడకండి.. ఇదంతా ఆమె సైడ్ బిజినెస్. తన అందచందాలే పెట్టుబడిగా సంపాదనా మార్గాలను నిరంతరం అన్వేషించే శిల్పా.. గతంలోనూ యోగాసనాలు వేసి, ఆ సీడీలు అమ్ముకుని  ప్రపంచాన్ని ఊపేసింది. ఆమె పేరుతో కాస్మోటిక్ [...]
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడతో పాటు చుట్టుపక్కల నగరాలైన గుంటూరు, తెనాలి, మంగళగిరిలకు మెట్రో రైలు ప్రాజెక్టును ఇస్తామంటూ విభజన చట్టంలో చెప్పింది కేంద్రం. అయితే, ఈ మెట్రో రైలు బెజవాడలో పరుగులు పెడితే ఎలా ఉంటుందన్నదానికి దృశ్యరూపం ఇచ్చారు ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ విద్యార్థులు. అయితే మెట్రో రైలు బదులు, మోనో రైలును మోడల్ గా తీసుకున్నారు. విజయవాడలోని [...]
సింగపూర్ తరహాలో ఏపీ రాజధాని నిర్మాణానికి కసరత్తును వేగవంతం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే ఓ సలహా మండలి, మరో సబ్ కమిటీ పనిచేస్తుండగా.. ఇటీవలే అంతర్జాతీయ కన్సెల్టెన్సీ మెకన్సీ నుంచి ఓ నివేదికను కూడా తెప్పించుకుంది. రాజధానిలో 40 అంతస్థుల భవనాలను నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆ నివేదికలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. [...]
కాలగ్రహణమో.. దురదృష్టమో.. సినీనటి శ్వేతబసు ప్రసాద్ పోలీసులకు పట్టుబడింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందంటూ ఆమె పరువును బజారున పడేసింది పోలీస్ వ్యవస్థ, మీడియా. శ్వేత పై రోజుకో కథనంతో సొమ్ములు సంపాదించుకునే పనిలో పడింది నేషనల్ మీడియా. సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఈ కూపంలోకి దిగానని నిజాయితీగానే ఒప్పుకుంది శ్వేత. బాలనటిగా జాతీయ అవార్డు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు