మహ్మద్ కులీ కుతుబ్ షా తన ముద్దుల ప్రేయసి భార్య ఐన భాగమతి కోసము కట్టిన ఊరు ఈ భాగ్యనగరము. అందరు ఒక హిందు స్త్రీ పేరు పెడతావా అని గుస్సా చూపించారు . ఆయన ఏమైన తక్కువ తిన్నాడా! వెంటనే భాగమతిని హైదర్ మహల్ గా మార్చి , భాగ్యనగర్ ని హైదరాబాద్ గా మార్చేసారు. అది మన హైదరాబాద్ ప్రేమకథ. దీనిమీద యం . యల్.  ఏ సినిమా లో“ఇదేనండి ఇదేనండి భాగ్య నగరం మూడుకోట్ల ఆంద్రులకు ముఖ్యపట్టణం, ” [...]
రామప్ప - కోట గుళ్ళు"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో "ఏ శిల్పి చేతిలో నుంచి రూపు దిద్దుకున్నాయో! తొమ్మిది శతాబ్ధాలుగా ఎన్ని చరిత్రలు చూసాయో! వాటికే నోరు ఉంటే ఎన్ని కథలు చెపుతాయో! ఐనా ఈ శిల్పాలకు నోరు అవసరము లేదు కళ్ళ తోనే భావాలు పలికిస్తున్నాయి! రామప్ప దేవాలయము లోని శిల్పాలు చూస్తుంటే నాలో కలిగిన భావాలు ఇవి.వయ్యారం, ఆగ్రహం,కరుణ నవరసాలు [...]
ఈ తిరుమలగిరి కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట కు దగ్గరలో వుంది . ఇక్కడ వున్న వెంకటేశ్వరస్వామి మా ఇంటి ఇలవేలుపు.మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్ కు రాక ముందు ,మా ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ ఇక్కడే జరుపుకునేవారట.చాలా సంవత్సరాల నుంచీ అనుకుంటూ వుంటే ఇప్పటి కి ఇక్కడకు రావటానికి వీలయ్యింది .ఇక్కడ వెంకటేశ్వరస్వామి పుట్టలో నుంచి వచ్చినట్లుగా వుంటారు . విగ్రహం ఏదీ వుండదు. పుట్ట [...]
యూసుఫ్ గూడా బస్తీ కీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత అట .ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో , ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగినవాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు . మా కాలనీ లో వున్న సీతమ్మగారు 20 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడి కి వచ్చేసరికే ఈ గుడి వుంది అన్నారు . ఇక్కడ ఆ రోజులలో ఎక్కువగా బలులు ఇచ్చేవారట.13 సంవత్సరాల క్రితం యన్. జనార్ధన రెడ్డి గారు , ముత్యాలమ్మ గుడి కి [...]
రంగారెడ్డి జిల్లాలో వుంది "చిలుకూరు " . ఇక్కడ వెలిసిన "బాలాజీ" , వీసా బాలాజీ గా చాలా ప్రసిద్ది . అమెరికాకు విసా కావాలనుకున్నవారు ఈ బాలాజీ ని తప్పక దర్శించుకుంటారు .చాలాకాలం క్రితం చిలుకూరులో ఒక గొప్ప వెంకటేశ్వరస్వామి భక్తుడు 'గుణాల మాధవ రెడ్డి ' వుండేవాడు .ప్రతి ఏటా పంట చేతికి రాగానే తిరుపతి వెళ్ళేవాడు .చేలో పండిన ధాన్యం కొంత స్వామికి అర్పించేవాడు . స్వామికి [...]
మావారు పనిమీద బీదర్ వెళుతుంటే , ఒక్కరే వెళుతున్నారని నేను కూడా వెళ్ళాను . బీదర్ చేరగానే నాకు ఓ కార్ డ్రైవర్ ఇచ్చి తిరగమని చెప్పి తను పని మీద వెళ్ళారు . డ్రైవర్ మురళి ముందుగా బీదర్ కోటకు తీసుకెళ్ళాడు .హైదరాబాద్ కు దగ్గర లో వున్న చారిత్రక ప్రదేశము " బీదర్ " . ఇక్కడి వాతావరణము , ప్రకృతి అందాలకు ముచ్చట పడ్డ బహ్మనీ సుల్తాన్ 1429 లో బీదర్ నిర్మాణానికి పూనుకున్నాడని చారిత్రిక [...]
సూర్యుడిని మనము ప్రత్యక్షభగవానునిగా పూజిస్తాము . సమస్త జీవులకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తున్న ఆరోగ్యప్రధాత శ్రీ సూర్యభగవానుడు . శ్రీసూర్య భగవానుని , దాదాపు ప్రతి ఆలయములో వున్న నవగ్రహాలలో వుంచి పూజిస్తూ వున్నప్పటికీ , ఆయనకు విడిగా దేవాలయాలు కూడా వున్నాయి . వాటిల్లో నాకు తెలిసినవి , "కోణార్క్ దేవాలయము " , " అరిసివిల్లి " లోని సూర్య దేవాలయము . అందులో అరిసివిల్లి [...]
హైదరాబాద్ లో పండుగలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ.ఆషాఢ మాసము లో గ్రామదేవతలకు చేసేది ఈ పండుగ. బోనము అంటే నైవేద్యము.ఎవరెవరి మొక్కులను బట్టి వారు అమ్మవారికి నివేదన చేస్తారు.ఒకప్పుడు బలులు ఇచ్చేవారట. కాని ఇప్పుడు మటుకు అన్న నైవేద్యమే ఇస్త్తున్నారని విన్నాను.ముఖ్యముగా ఎక్కువగా ఆషాడమాసములో వచ్చే ఆదివారాలు చేస్తారు. ఆ రోజు ఉదయమే తలస్నానము చేసి శుచిగా [...]
హైదరబాద్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్.,హైదరబాద్ చరిత్రకు గురుతుగా ,ప్లేగ్ మహమ్మారినుండి రక్షించేందుకు గాను పదిహేనువందల తొంబైఒకటి లో కులికుత్బ్ షా నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. .పైవరకు ఎక్కి చూస్తే హైదరబాద్ మొత్తమును దర్షించవచ్చు .మొత్తము ఏడుగురు కుతుబ్ షా వంశీయులు గొలుకొండ కోట నుండి హైదరాబాద్ ని పాలించారు.అందరు కుడా ఇక్కడి సన్స్క్రుతి [...]
మహ్మద్ కులీ కుతుబ్ షా తన ముద్దుల ప్రేయసి భార్య ఐన భాగమతి కోసము కట్టిన ఊరు ఈ భాగ్యనగరము.అందరు ఒక హిందు స్త్రీ పేరు పెడతావా అని గుస్సా చూపించారు .ఆయన ఏమైన తక్కువ తిన్నాడా!వెంటనే భాగమతిని హైదర్ మహల్ గా మార్చి ,భాగ్యనగర్ ని హైదరాబాద్ గా మార్చేసారు.అది మన హైదరాబాద్ ప్రేమకథ.దీనిమీద యం .యల్. ఏ సినిమా లోఇదేనండి ఇదేనండి భాగ్య నగరం మూడుకోట్ల ఆంద్రులకు ముఖ్యపట్టణం,అని ఘంటసాలా, [...]
" ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం , నృసిమ్హం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్య్హం :" యాగంటి నుండి అహోబిలం బయిలుదేరాము . కొంచము దూరము వెళ్ళగానే దారి తప్పినట్లుగా అనిపించింది . అడుగుదామన్నా అక్కడ ఎవరూ లేరు ! కొంత సేపటి కి ఓ మోటర్ సైకిల్ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చారు . వారిని ఆపి దారి అడిగాము . దాదాపు 10 కిలో మీటర్లు వెనకకి వెళ్ళాలసి వచ్చింది ! [...]
జోగుళాంబను , బాల బ్రహ్మేశ్వరస్వామి ని దర్శించుకున్న తరువాత , అక్కడే వున్న కరివెళ్ళవారి సత్రములో భోజనము చేసి , జోగుళాంబ దర్శనము బాగా జరిగింది అన్న సంతృప్తి తో నంద్యాలకు బయలు దేరాము . సాయంకాలానికి నంద్యాల చేరాము . బస్ స్టాప్ కు దగ్గర లో వున్న శశిహోటల్ లో రూం తీసుకొన్నాము . ఫ్రెషప్ అయ్యాక హోటల్ కు దగ్గరలోనే వున్న శివాలయము ను , సాయిబాబా మందిరము ను దర్శించుకున్నాము . [...]
ఉదయము 7.30 కల్లా హైదరాబాద్ దాటాము , నేనూ , మా అమ్మా , లక్ష్మిగారు . షాద్నగర్ దాటాక టిఫినీలు కానిచ్చాము . 9.30 కల్లా బీచుపల్లి చేరుకున్నాము . కృష్ణ వడ్డున వున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాము . ఈ దేవాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఏమీ లేదుట . చాలా పెద్ద విగ్రహము . స్వామివారు కళకళ లాడిపోతున్నారు .చాలా మహిమ గల స్వామి అట . హనుమాన్ చాలీసా చదువుకొని , కాసేపు గుడి లో కూర్చొని మా [...]
సెక్రటేరియట్ దగ్గరి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వైపుకు వెళ్ళేటప్పుడు , ఫ్లైఓవర్ ఐపోగానే ఎడమ వైపు వుంటుంది ఈ దేవాలయము . ఇది దాదాపు 450 సంవత్సరాల క్రితముదట . హుసేన్ సాగర్ కు కట్ట కట్టేందుకు తవ్వుతుండగా అమ్మవారి విగ్రహము కూలీల కంట పడిందట . ఆ విగ్రహాన్ని అక్కడే స్తాపించి , కట్ట తవ్వుతుండగా వెలసిన అమ్మవారు కాబట్టి " కట్ట మైసమ్మ " అని పూజించారట . ఆ తరువాత ఎండొన్మెంట్ వారి [...]
1. శ్రీ కనకదుర్గ ఆలయము చాలా సందడి గా వుండే అమీర్ పేట్ కూడలిలో వుంది , శ్రీ కనకదుర్గ దేవాలయము . గుడి మొద్ట్లోనే వినాయకుడు దర్శనం ఇస్తాడు . లోపలి కి వెళ్ళగానే , ఎదురుగా వినాయకుడు , నాగదేవత ల చిన్న గుడి వుంటుంది . ఎడమ చేతివైపు సంతోషీ మాత , కుడి చేతివైపు ఎల్లమ్మ వుండ గా మద్యలో నిలువెత్తు విగ్రహము తో శ్రీ కనకదుర్గ అమ్మవారు కళ కళ లాడుతూ దర్శనం ఇస్తారు . అమ్మవారి కి ఇరువైపులా [...]
సాయంకాలము మల్లికార్జునుని దర్శనం చాలా బాగా జరిగినందున చాలా తృప్తి గా అనిపించింది . మరునాడు ఉదయమే టిఫిన్ పని కానిచ్చుకొని , త్రిపురాంతకం బయిలుదేరాము . శ్రీశైల శిఖర దర్షనము నుండి కుడి వైపు ఘాట్ రోడ్ మీదు గా వెళితే శ్రీ త్రిపురాంతక క్షేత్రం వస్తుంది . వూరి లోని కి ప్రవేశించగానే ముందుగా త్రిపురాంతకీశ్వరుని దేవాలయము . కొద్దిగా కొండమీదికి ఎక్కి వెళ్ళాలి . ఇక్కడ పూర్వము [...]
ఈ మద్య లక్ష్మి గారి ఫ్రెండ్షిప్ లో పురాతన దేవాలయాలు చూడాలని అనిపించి , అప్పుడప్పుడు నేనూ , లక్ష్మి గారు మా అమ్మా వెళ్ళి వస్తున్నాము. అలా పోయిన వారం శ్రీశైలం వెళ్ళి వచ్చాము . శ్రీశైలం ఇంతకు ముందు చాలా సార్లే వెళ్ళాను కాని చుట్టు పక్కల ఒక్క ఉమా మహేశ్వరం తప్ప ఇంకేదీ చూడలేదు . ఈసారి త్రిపురాంతకం చూద్దామని వెళ్ళాము . ఉదయమే 7 గంటలకు మా కార్ లో , నేను , లక్ష్మి గారు , మా అమ్మ , మా [...]
నాకు ఏమైనా టెన్షన్ గా వున్నా , మనసు బాగున్నా బాగలేకపోయినా బడి చావిడీ లోని హనుమాంజీ ని దర్శించుకోవటము అలవాటు . ఈ రోజు వెళ్ళాలి అనిపించి , పొద్దున వెళ్ళి వచ్చాను . అసలు నాకు ఈ గుడికి వెళ్ళటము మా అత్తగారితో అలవాటు అయ్యింది . ప్రతి మంగళవారమూ వెళ్ళేవాళ్ళము . అప్పుడప్పుడు కాచిగూడా లోని హనుమంతుని గుడి కి వెళ్ళేవాళ్ళము .ఈ దేవాలయము , బడిచావిడీ లో , పోలీస్ స్టేషన్ పక్కన వుంటుంది . [...]
హైద్రాబాద్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో హైవే మీద పటాంచెరువు నుంచి ఇంచుమించు 16 కిలోమీటర్ల దూరములో వున్నది ఈ గణపతి ఆలయము . ఇది 300 సంవస్తరాల పురాతనమైన ఆలయము . ఒకొప్పుడు ఇక్కడ చింతల తోపు వుండేది . శివరామ భట్ అనే భక్తుడు అనంత చదుర్దశి నాడు వినయకుని పూజించేవాడు . ఒక సారి ఆయన తిరుపతి కి పాద యాత్ర చేస్తూ ఇక్కడ విశ్రమించాడు . ఆ రోజు అనంత చతుర్దశి అయ్యింది . అప్పుడు ఆయన పూజ [...]
హైదరాబాద్ నుంచి , బి హెచ్ యల్ తరువాత , దగ్గర దగ్గర 8 కిలోమీటర్లు దాటిన తరువాత , కుడి వైపు " బీరంగూడ " అని చిన్న వూరు వస్తుంది . మేన్ రోడ్ కు కుడివైపు పెద్ద కమాన్ , " భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానము ' అని రాసిన ది కనిపిస్తుంది . ఆ కమాన్ నుండి లోపలికి వెళ్ళి , జంక్షన్ లో ఎడమవైపుకు తిరిగి కొద్ది దూరం వెళ్ళితే అంతా చిన్న చిన్న కొండలతో వున్న ఖాళీ మైదానములో వున్నది 6 వ లేక 7 వ [...]
ఈ మద్య మావారు అలా అలా జూబిలీ హిల్స్ లో కార్ లో నన్ను షికారు తిప్పుతూ వుండగా దూరం నుంచి మట్టిరంగులో ఓ గుడి గోపురం కనిపించింది . అరే ఇదేదో ఒరిస్సా గుడి గోపురం లావుందే అనుకొని , మావారిని అడిగాను . ఆయన ఇంతకు ముందు గమనిచలేదుట . పోనీ ఇప్పుడు వెళుదామా అనుకుంటే రాత్రి పదైంది . ఆ సమయము లో గుడి తలుపులు తీసి వుండవులే అనుకొని , ఆ గుడి ఎక్కడుందో వెతకకుండానే [...]
మావారు పని వుంది నేను రాలేను , నువ్వే వెళ్ళి చూసిరా అన్నారు . ముందు ఒక్క దాన్నే తెలియని ప్లేస్ లో వెళ్ళేందుకు సంశయించాను . కాని ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్ లో ఔరంగాబాద్ చూసేందుకు బయిలుదేరాను . ఔరంగాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ . కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే వున్నాయి . ఇక్కడ ముఖ్యం గా చూడవలసినవి , ' పంచక్కి ' , ' బీబీ - కా - మక్బారా ' , ' [...]
కార్తీక మాసం లో శివుని దర్శించుకొని , గుడి ప్రాంగణము లో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం అంటారు . ఆ పుణ్యమేదో కాస్త సంపాదించుకుందామనుకొని , psm .లక్ష్మి గారు , మా అమ్మ , నేను , నల్లగొండ జిల్లా లోని కొన్ని పురాతనమైన శివాలయాలు దర్శించుకుందామని ఓ శుభోదయాన బయిలు దేరాము . psm.లక్ష్మి గారు , వాటిని ఇంతకు ముందు చూసి వుండటము వలన మాకు వాటి ప్రాశస్త్యము గురించి వివరము గా చెప్పారు [...]
శివ శివ మూర్తివి గణనాథానువు శివుని కొమరుడవు గణనాథాఈ మద్య హైదరాబాద్ లో కాలనీ లలో పెట్టిన వినాయకుని దగ్గర మనము పూజ చేసుకునేందుకు , పూజారిని, పూజ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు . అలా ఔరంగాబాద్ లో ఏమైనా వీలుందా అని మావారు వెతికారు . కాని లేదట. సరే అనుకొని , ఔరంగాబాద్ కు 30 మైళ్ళ దూరము లో నున్న , ఎల్లోరా వద్ద , వేరూళ్ గ్రామం దగ్గర , శివాలయ్ అనే తీర్థ స్తానం లో ఘృష్ణేశ్వరుని [...]
హైదరాబాద్ లో నవాబుల సంస్కృతి ఎక్కువగా వుంటే , సికందరాబాద్ బ్రిటిష్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది . బ్రిటిష్ వాళ్ళు తమ స్తావరం కోసం , కంటోన్మెంట్ ఏరియా నిర్మించారు . అక్కడ చాలావరకు వారు నిర్మించిన భవంతులే వున్నాయి . ఒకొప్పుడు , సికిందరాబాద్ లో మిలిటరీ ఆఫీసులూ , వాళ్ళ కాలినీసే ఎక్కువగా వుండేవి . మావారు పని చేసిన ఈ .యం . ఈ వారివి , కాలేజ్ , సెంటర్ , స్టేషన్ వర్క్ షాప్ ఇక్కడే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు