''నేనంతే ''అంటాను కాదేమోనన్న సంశయం నువ్వు చెప్పకుండానే ముఖ కండరాలు ముక్కలు చెక్కలౌతాయివేపపూత ప్రేమని ఏ గాలీ దయ తలచదు ఛాతీ మధ్య దుఃఖం లో అన్నీ మసౌతాయి పోనీ భస్మమౌతాయి నడక కూడా నమ్మకం లేకుండా వెంట పడుతుంటే నువ్వు మాత్రం ఏంచేస్తావ్ ఐనా ఒక బాధని ధ్యానించు కుంటూ నీ అర్ధం లో ప్రేమించుకుంటూ బతకడం గొప్పే నని నిశ్చయించు కున్నాక ఇక మిగిలిన [...]
తన్మాత్రలు లేవో తదర్ధాలు లేవో మూసిన ప్రార్ధనల వేళదారులు కనిపించ కుంటే మాత్రం నువ్వొక్కడివీ వస్తే వస్తావు మాటల నాడులు తెగినాయో తదర్దాల శరీరాలు చితికాయో రెండో దారి లేని కాలం వెంట రాతలు పులకరించకుంటే మాత్రం రావాలనుకుంటే వస్తావు కనుపాపల నక్షత్రాలు రాలాయో తద్దీపపు వెలుగులు కుమిలాయో హృదయం గడియ మూసే వేళ వేచిన తరువులు వీయకుంటే [...]
తపనలు ఒంటరివే నీవు కలియక పోతే రాత్రి కూడా ఒంటరిదే వెన్నెల వెంట లేకపోతే నీ ఆలోచన లేకపోతే ప్రేమ ఒంటరిదే ఈ మసక లోకం ఎందుకనో?????ప్రియురాలా...!మన భాషకు చిక్కనే చిక్కదు.          .....
కూర్చున్న చోట కుప్పలు గా కలలు రాలాయి వెలుతురు కింద ఒకటే నీడ పడింది చూపులు కలిసి చుక్కల్ని దింపాయి ఈ మసక లోకం ఏదీ ఏరుకోదు ప్రియురాలా...!ఇద్దరి చేతుల్లో ఏముందో పరులకు తెలియదు .        .....
దుఃఖం రుచి తెలుస్తుంది ప్రేమించడం మొదలైతే త్యాగం గురించి తెలిసేది ఆనందించడం మొదలైతే అన్నీ పోగుట్టుకున్నాక జీవితం తెలుస్తుంది ఈ మసక లోకం ఎప్పటికీ నమ్మక పోయినా సరే ప్రియురాలా ...!కొన్ని నిజాలు మనవెంటే వుంటాయి .         .....
నీకు పరదాలుంటాయి ,తొంగిచూసే సమ్మోహ సరదాలుంటాయి నువ్వు నాభి నుండి రావచ్చు నాలుక నుండి పేలవచ్చు నిజం చిలకొచ్చు ఎవరో నమ్మక పోవచ్చు అబద్దం అందరికీ నచ్చొచ్చు నిప్పులు కొందరినే కాల్చొచ్చు అందరికీ భిన్నం కాదు అంతా శేషం రాదు ప్రయాణం ఆగదు ప్రపంచానికి దిక్కుండదు           .....
బాల్యం కొంత  యా..యా...యవ్వనం కొంత వణుకు వార్ధక్యం కొంత అనుభవం కొంత బంధం కొంత స్నేహం కొంత ప్రేమ కొంత దుఃఖం కొంత చదువు కొంతే మెలుకువ కొంత జ్ఞానం కొంతే వాసన కొంత అసలు జీవితం?     .....
కొన్ని ప్రశ్నలతో పుట్టినందుకు అవెప్పుడూ నాతో పాటే పెరిగి ,ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాయి ఒక్కోసారి అవి నా ముందు పరుగెడతాయి నిద్రలో పక్కకు తిరిగితే ఒత్తుకుపోతాయి కళల మీద రాళ్ళు వేస్తాయి మెలకువకు రాగానే వ్యంగ్యంగా వెక్కిరిస్తాయి ఎప్పటికీ ఓ దుఃఖం ఈ ప్రశ్నలకు నాకు మధ్య సంధి చేస్తుంది ఈ శరీరం చుట్టూ అల్లుకున్న అనేక వలల్ని తెంపుకోవాలని చేసే [...]
ఐనా "ప్రేమ రెప రెప లాడుతూనే ఉందా?" అడిగాను "దుఃఖం దూరం కాలేదుగా "అన్నది తను మళ్ళీ తనే "దుఃఖం తో పదిలమైన ప్రేమకు కాలంతో,అవయవాలతో పని లేదు"మిగిలిన సంభాషణ సిగ్గుతో మౌనంలో లీనమైంది.       .....
నువ్విలాగే వెంటాడతావ్చెప్పిందే చెప్పి మొదటిది చివరికి వేసి చివరిది మధ్యకి చేర్చి తిరగేసి తిప్పేసి ...ముఖం లోని ముడతల మధ్య కములుతున్న రక్తం చుక్కలు కనిపించవు చెమట చేతికి చిక్కిన క్షణాల్ని సేద తీర్చుకునే యోగ్యత వుండెందుకో ...ప్రశ్నల్ని మోహించుకుంటూ ప్రశ్నల్ని ప్రోగు చేసుకుంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని పేర్చుకుంటూ వాలిన వసంతాలు ఎండిన [...]
మళ్ళీ పరిచయం చేసుకుందాం కొత్తగా నడక మొదలుపెడితే బాగుండునని...ఇప్పటికే వచ్చిన దారి మనల ఆహ్లాదంగా ఆహ్వానించినా పట్టించుకోని నిర్దయులం.అయినా సరేఏ సలహాలు సహాయపడకుండా ఎవరూ ఉపోద్ఘతాలతో ఉపమాన రసాలతో అలంకరించకుండా ఉన్నదున్నట్టుగా ౩జి లో ,౩డి లో ప్రయాస పోకడల్ని పోగొట్టుకొని నిమ్మళంగా కళ్ళని మనసుని మాత్రమే కష్టపెట్టకుండా ప్రతిబింబాలకి [...]
దేనికోసమో నాలుగు దిక్కుల్నినమ్మలేని దిగులుపొర్లినంత మేరా ఒత్తిడికి నలిగిన వెన్నెల గమనానికి రాదురసం రుచించని రక్తికిరంగులపూతఅపోహ సొంతమేదురూహా సొంతమేఅజ్ఞానపు బాధలో గుమికూడిఎగపడతాయిమేధస్సు కున్న అన్ని లక్షణాలుతెలుసుకునే వీలులేదుచిలక ప్రాణం ఎక్కడోదానికీ తెలియదుఒక లెఖ్ఖ కోసమేకాలం అక్కరకొస్తుంది......28-3-2013.
ఎందుకోగాని ...కోలుకోనివ్వవు కొన్ని కోసుల దూరాన వుండి కుడా కోసేస్తావు మర్మం చిక్కని మాయ పాటల కింద కళ్ళు మూసుకుంటాను ప్రత్యక్షమయ్యేది నువ్వే పరవశించడానికి ఏముంది?ఫై ఫై కాగితాల రాతల మీది చెత్త చికెన్ తీసిన స్కిన్ కంపు ఈకల కలవరింపు నువ్వెక్కడో......నిద్ర ముసురుకున్న వొడిలో చొంగల రాత్రి ఇక పోలేక పోలేక ఒలికిన చుక్కలు అదే మీ భాషలో [...]
           ఎదురుచూస్తున్నాను ఈ రోజు ఎవరు పుచ్చిన గుండెల్ని మోసుకొస్తారో తెలీదు ఎవరు భారీ సుతి మెత్తని గునపాల్ని సిద్ధం చేసుకొస్తారో తెలీదు ఎవరు కణకణ మనే మెసేజీల్నిప్రశ్నలు ప్రశ్నలు గా అల్లిన చెయిసంచీ లోంచి విసురుతారో తెలీదు ఎన్నిసార్లు పక్కనుండి పలకరించకుండా పోయిన హితులు ,చూసీ చూడనట్టు నటిస్తూ జీవించి నట్టు కనబడగానే [...]
లేత పసుపు ఎండ పొద్దు పొద్దున్నేపలకరిస్తున్నప్పుడు పిచ్చుకలు,మైనాలు,గువ్వలు బావి తొర్రల్లో బుర్రున ఎగురుతూ టపటప రెక్కల్ని గాలికి తాడిస్తూ వాయిద్య కారులంతా వాకిట్లోకోచ్చినట్టు...కచేరీ వింటున్న వెడురుకొమ్మల నుండి కిందికి పాకిన లతలు,గూడూచి తీగలు పసి మెత్తని చేతులూపి ప్రతి రోజును ఒకేలా స్వాగతించే నేర్పును ఏరోజుకారోజు జీవించే సొగసు ను పరిచయం చేస్తున్నట్టు.ఎవరి [...]
ఎక్కడో పోగొట్టుకుంటాం .వెతుకుతూ ఉంటాం.పాత పాత పుస్తకాల వెలిసిన కాగితాల కువకువల్లో రాలిన ముత్యాల వాసన వసంతాలలో గజ్జెల ఘల్లు ఘల్లు కాలువనీటి హోరు కాంతిలో.ఎక్కడో దారి తప్పుతాం.పురాతన రహస్య రాతి చెక్కడాల మీద దుమ్ముగా రాలిపోతాం.గట్టిగా ఊపిన గాలి కోసల వేలాడినపూల సువాసనలా తెగిపోతాం.ఏదో కల లేపిన నిద్రని వేడుకుంటాం.ఎప్పటికీ వేడుక చేయని ఉదార భారాన్ని ప్రయత్నించి [...]
అనంతంగా ప్రవహిస్తున్న మనుషుల గురించి కొత్త ఏమీ లేదు.అన్ని మూలలూ తడిమిన పెద్దలు కావ్య చరిత్రలై ....నిక్షిప్తమై.బతకడం గురించిన బాధ లేదు.బతుకే బతికిస్తుంది.నడుస్తున్నపుడు ఏదో ఓ మూల పచ్చని చెట్టు పుష్పించిన వాసన పసిగడుతుంది.పట్టించుకోకుండా పరుగు తీస్తావు.అదే కోల్పోయేది.నీడగా వెంట పడుతున్న సూక్ష్మ నిశ్శబ్దాన్ని పట్టించు కోవు.అదే జారిపోయేది.పరుగెడు తున్నపుడు మీదుగా [...]
ఏదీ నిన్ను కోరి వెంటపడదు సంపదల కొలమానం ఆనందపు కోలాహలంఅదృష్టపు పాచికలు దురదృష్టపు గ్రహపాటు మెచ్చుకోలు నటన ఏవీ నిన్ను కోరి అనుసరించవునీ భాషకి నువ్వు  సలహాదారువి నీ మనసుకు నువ్వు ప్రత్యక్ష సాక్షి సందు తిరిగింతర్వాత నువ్వు నవ్వుకుంటూ పోతావు ఇక్కడ వదిలిన విషయాలు కూడా అలాగే నవ్విస్తాయి ఏవీ నిన్నే కోరి వ్యతిరేకించవు ప్రియమైన ప్రేమ ఆత్మీయ [...]


నన్నొక సారి  కలకలంలా 
కనుక్కున్నందుకు 


నా కిరణాల వేళ్ళకి 
పూలు పుట్టిన్చినందుకు 
ఆ గాలుల తడిసిన శరీరాలు 
మానని పాటలు 
చెక్కుకునేలా చేసినందుకు


తేనె కుండీలో మునిగిన పదాల్ని  
నా శరీరం మీద 
ఏరినందుకు 


ఖాళీ మట్టి కుండలో 
మిగిలిన శూన్యాన్ని 
అక్షరాల తో ఆడించినందుకు 


నా ఊరి కల్లెడ వాగులో 
ఎండిపోయిన [...]


వెలిగించ లేని సమయాలు 
దగ్గరనుండే వెళ్ళిపోతాయి 
ఒక దాపు దొరకక 
గీసే చిత్రం దారి తప్పుతుంది 


అనాధ ఎవరో తెలియని 
మనసు 


పనీ పాటల సాయంత్రాలు 
చెమట గాలుల మీదుగా కరిగిపోతాయి 
ఈరోజోక ప్రశ్న 
రేపటికి సమాధానం తయారు కాలేదు 


నడక తెలియని వారే 
అందరూ నడుస్తూ వుంటారు 


చేతులు కలుస్తూ వుంటాయి 
కాళ్ళు విడి [...]



మంచు మఖమల్ మనసు మీద 
నడిచి రా...!


ఇక్కడ ఆకాశం విరిసి
ప్రవహించిన గాలులు 
నింపుకున్న నేరేడు ,చింత వేప సోయగాలు 
నిలువెల్లా మీటడానికి  
నీ నాద శరీరం సిద్ధమేనా...!
కలలు తీరని అలలు ఊగిసలాటలు ఆపవు తడి పాదాలు చూసుకుంటూ నడుచుకుంటూ .....ఆలోచన్లు అవయవాల్ని ఒదిలేస్తాయి నిశ్శబ్ధం చుట్టుపక్కల ఒక సవ్వడి గర్వంగా పొడుచు కొస్తుంది అలల్లేని మహా సముద్రాన్ని గల గల పారుకుంటూ మీటుకుంటూ....కౌగిలిలో కలిసి పోతావు సమయం ఇంకిపోతుంది అటూ ఇటూ సూర్యుడు కొంత ఆశని కలుపుతుంటాడు సొందర్యానికి సవరణ మొదలౌతుంది బొట్టు బొట్టు గా ఆకాశం కరిగి పోతుంది ......19.1.2013.
 సముద్రం నీ కాళ్ళు కడుగుతున్నపుడు ఆకాశం నీలం అలలైవాలుతున్నపుడు మనుషులు తమ ఆకారాల్ని విడవకుండా పరవశించి పొతున్నపుడు దిక్కులు కరిగి పోయి కన్నీటి బిందువులో ఇంకిపోయినపుడు తడిసి పోతున్న రాళ్ళూ రప్పలు పులకిస్తున్న గుట్టలు గుండ్లు నిశ్శబ్దరాగాల్ని ఆలపిస్తున్నపుడు మంచు చలిముత్యాల్లా స్పర్శిస్తున్నప్పుడు వెగటు దాపరికాల మేకప్ తొలగి గులక [...]
పూరి గుడిసెలో వున్నా నగరాల గోడల్లో వున్నా నువ్వు నువ్వే ఆకాశం అందదు  భూమి వదలదు మసిపూసిన దుప్పటి కాలం తగిలి మాసిపోక మానదు చాతీ మీది గర్వం కనిపించక పోయినా మనసు లోని బిలాలు కప్పబడి కనిపించినా నువ్వు నువ్వే అగ్గిని పట్టుకోవాలంటే చేతులు వదులుకోక తప్పదు దిశలు తిరిగిన కాళ్ళు దిగుల్లో దిగబడక తప్పదు నగిషీలు చెక్కిన నటనలు [...]
ఎవరూ కాజేయని విలువలకి సెలవుండదు ఎటో వెళ్ళిపోతూ కొన్ని కుంగి పోయే సమయాల్ని నిమురుకుంటూ పరువపు వాక్యాల తోడుగా నీక్కావాల్సిన పూలని కంటి మైదానం లో పూయించు కుంటావు ఎడారులను నిమురుకుంటూ ఎవరూ కొలువని భూదేవత కట్టమీది ఉగ్ర రూపాన్ని నీ తడి నెత్తురుతో ఆరబోసుకుంటావు నీ లోపల ప్రవహించే గాలి దుమారాన్ని వృధాగా ఎగిరిపోకుండా కాసేపు నీ తల రంధ్రాలను మూసిపెట్టు గాలి పటం ఆనందమై [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు