క్రిందటి సారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు ఒక పెద్దమనిషితో పరిచయం అయిందని చెప్పానుగా, ఆ పెద్దమనిషి మాటల్లో ఇంకో పెద్దమనిషితో తనకు చాలా పరిచయం ఉందనిన్నూ, తమ ఇంటికి ఆయన రాకపోకలు కూడా ఎక్కువగానే ఉన్నట్టూ చెప్పారు.ఈయనకి అంత పరిచయం ఉన్న పెద్దమనిషిని ఎప్పటినుండో కలుద్దామనీ ఉంది నాకైతే. నేనే అని ఏమిటిలెండి, ఛాన్సంటూ వస్తే, ఎవరైనా ఆయన్ని ఒక్కసారి కలిస్తే [...]




