కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది  ఉన్న  వీడియో!దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను.  ‘ఇళయనిలా  పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో  ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది.  సినిమా పేరు ‘మధుర గీతం’.     వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా అనూహ్యంగా , అప్పటికప్పుడు జరిగిన [...]
  ఎదుటి వ్యక్తి పేరును సంబోధిస్తూ సంభాషిస్తుంటే వాళ్ళను ఇట్టే ఆకట్టుకోవచ్చట. మనస్తత్వశాస్త్రవేత్తలు  చెప్పే మాట ఇది! కారణం? ఎవరి పేరు వాళ్ళకు ప్రియాతిప్రియంగా ఉంటుంది కదా? కాబట్టి అలా పిలవటం  నచ్చి, ఆ పిల్చినవాళ్ళమీద ఇష్టం దానికదే వచ్చేస్తుందన్నమాట.  దీనికి మినహాయింపులూ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ పేరు ససేమిరా నచ్చదు. (పాత చింతకాయ పచ్చడి పేరైతే నచ్చకపోవటం [...]
'All is well that ends well' అంటారు.  కథకైనా, సినిమాకైనా తగిన క్లైమాక్స్ లేకపోతే అది వెలితిగా ఉంటుంది.  ఒక్కోసారి ఆ లోపం ఆ కథనో, సినిమానో దెబ్బతీసేదిగా కూడా ఉంటుంది. ‘సాగర సంగమం ’లో చివర్లో  కథానాయకుడి పాత్ర చనిపోకూడదని దర్శకుడు విశ్వనాథ్ భావిస్తే... ఆ పాత్ర చనిపోవాల్సిందేనని కమల్ హాసన్ పట్టుబట్టాడట. ఇక ‘స్వాతిముత్యం’ క్లైమాక్స్ లో ఆ  పాత్ర చనిపోవాలని దర్శకుడు అంటే... [...]
  ఒక వ్యక్తి కళా ప్రతిభలోని ప్రత్యేకత  ఆ  వ్యక్తి  బతికున్నపుడు అంతగా తెలియకుండా... ఆ వ్యక్తి కన్నుమూశాక   తెలిస్తే... ? నాకైతే... ఆ కళాకారుణ్ణి   వ్యక్తిగతంగా  కలుసుకోలేకపోయానని చాలా బాధ వేస్తుంది.   అలా... ప్రతి కళాకారుడి విషయంలోనూ అనిపించకపోవచ్చు.    సినీ సంగీత దర్శకుడు  రమేశ్ నాయుడు అన్నా... ఆయన స్వరపరిచిన  పాటలన్నా  నాకు చాలా ఇష్టం.  ఆయన సజీవంగా ఉన్నపుడు కూడా ఆయన [...]
రచయితలు రాసిన  కథల నిడివిని  కుదించి,  వేరేవాళ్ళు తమ సొంత మాటల్లో చెపితే అది- ‘రీ టెల్లింగ్’. కథ సారాన్ని క్లుప్తంగా చెప్పటం దీని లక్షణం.   రీ టెల్లింగ్ అనే ఈ అనుసరణ కథ.... ఒరిజినల్ కథ పరిధిలోనే  ఉండాలనీ,  కథలోని పాత్రల స్వభావాలను ఏమాత్రం మార్చకూడదనీ ఎవరైనా  ఆశిస్తారు. దానికి విరుద్ధంగా సొంత కల్పనలను జోడిస్తే? అప్పుడది రీ టెల్లింగ్ కాదు... ఫ్రీ టెల్లింగ్  అవుతుంది. [...]
 ఆత్మీయులో, గాఢంగా అభిమానించేవారో మరణిస్తే... ఎవరికైనా అమితమైన బాధా,  దు:ఖం  సహజం. కాలం  గాయాల్ని మాన్పుతుంది కాబట్టి.... రోజులు గడుస్తున్నకొద్దీ  ఆ  జ్ఞాపకాలు పల్చబడి, వారిని తలపోతలు తగ్గిపోవటం కూడా అంతే మామూలు. అయితే అందరి విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెప్పలేం!. మా అమ్మకు వాళ్ళ నాన్న (మా తాతయ్య) అంటే ఎంత ఇష్టం అంటే... ఆయన చనిపోయి దశాబ్దాలు దాటుతున్నా ‘మా నాన్న’ అంటూ [...]
బాస్వెల్ తో పోల్చారు  ఆరుద్ర. కీట్సుతో  సామ్యం తీసుకొచ్చారు  వేటూరి. ఎవరిని? ఎమ్వీయల్ గారిని ! * * *  ఆయన్ను  నూజివీడు మర్చిపోలేదు. అక్కడ కాలేజీలో ఆయన పాఠాలు విని మనసారా ఇష్టపడ్డ  కాలేజీ విద్యార్థులూ, ఆయన వాక్చాతుర్యం,  రచనా చమత్కారం చవి చూసిన  తెలుగు పాఠకులూ, సాహిత్యాభిమానులూ .. ఇంకా ఆయన స్నేహపరిమళం పంచుకున్న సినీ ప్రముఖులూ...  ఎవరూ ఆయన్ను మర్చిపోలేదు. ఆయన  [...]
1719లో తొలి ప్రచురణ ఎక్కడో ఇంగ్లండ్ లో పుట్టి  దేశదేశాల పాఠకులకు చేరువయ్యాడు .. రాబిన్ సన్ క్రూసో !నా చిన్నప్పుడు మా అన్నయ్యల ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం ద్వారా  పరిచయమయ్యాడు.     ఎటు చూసినా అంతు లేని సముద్రం... లోపల ప్రమాదాలకు ఆలవాలమైన చిన్న దీవి!నర మానవుడు కనపడని ఆ నిర్జన ప్రాంతంలో ఒంటరిగా బతకాల్సిరావటం ఎంతటి భయానకం! ఆశ లేశమైనా లేని పరిస్థితుల్లో గొప్ప నమ్మకంతో, [...]
సంగీతమే ఓ లలిత కళ.  మళ్ళీ దానిలోనూ  లలితమైనది-  లలిత సంగీతం! రేడియో మూలంగానే  ఈ లలిత సంగీతం  పుట్టింది.  సినిమా సంగీత  సునామీని  తట్టుకుని  తెలుగు శ్రోతలకు  చేరువైంది. ఏళ్ళు గడిచినా  మరపురాని స్మృతుల  పరిమళాలను  రసజ్జులకు  పంచుతోంది.  అలాంటి  ఒక చక్కని  రేడియో  పాట గురించి  కొద్ది సంవత్సరాల క్రితం తెలిసింది.  సాహిత్యం మాత్రమే  తెలిసిన ఆ పాటను -  వినటానికి మాత్రం చాలా [...]
‘బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్’  అని ఓ పాత్ర చేత అనిపిస్తాడు  షేక్ స్పియర్ ‘హేమ్లెట్’ నాటకంలో. క్లుప్తంగా  ఉంటేనే  జోక్ కి  విలువా,  సార్థకతా!  సాగదీస్తూ చెప్తేనో,  వివరించే ప్రయత్నం చేస్తేనో  .. ఆ జోకు  దారుణంగా విఫలమైనట్టే. చాలా కాలం క్రితం  ‘రసాయన మూలకాల రహస్యాలు’ అనే రష్యన్ అనువాద పుస్తకం చదివాను. పీఠికలో  ఓ  పిట్ట కథ ఆకట్టుకుంటుంది. అదేంటంటే.. ప్రాచ్యదేశంలో ఓ [...]
‘చందమామ’ పత్రికలో  రాతిరథం, యక్ష పర్వతం   సీరియల్స్ వస్తున్న రోజులు.. వాటిలో  ‘చీకటి కొట్లో బంధించటం’  గురించి చదువుతున్నపుడు ఆ శిక్షను  ఊహించుకుని  మనసులో హడలిపోయేవాణ్ణి. మరి  అలా  అంధకారంలో ఉండాల్సిరావటమంటే  భయంకరమే కదా! చిమ్మ చీకట్లో  వెలుగులు  చిలుకుతూ   నింగిలో  మినుకుమనే   చుక్కలూ,  నిప్పు కణికల్లా  గాల్లో  తేలివచ్చే  మిణుగురులూ  ఎంత ఆనందం కలిగిస్తాయో !   [...]
ఓ  సినిమా ఓ రచన... ప్రేక్షకుల, పాఠకుల  విశేష ఆదరణ పొందినంతమాత్రాన వాటిని మెచ్చని వాళ్ళు  ఉండరని చెప్పలేం. అసంఖ్యాకుల అభిప్రాయానికి  అది తేడాగా ఉంది కాబట్టి... ‘ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక  దారి’ అంటూ వారి అభిప్రాయాలనూ  ఈసడిస్తే... ఆస్వాదన తెలియదని  వారిని  తీసిపడేస్తే.. అది న్యాయంగా ఉంటుందా?  ‘పదుగురాడు మాట పాడియై ధర జెల్లు’ నిజమే. ‘ఒక్కడాడు మాట [...]
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాటల పరిచయం కాదిది... ఆమె పాటలతో నాకున్న కొద్ది పరిచయం!ఆమె గురించీ, ఆ సంగీత ప్రతిభ  గురించీ  ఎన్నేళ్ళ నుంచో  వింటూ వస్తున్నటికీ ఆమె పాటలను పనిగట్టుకుని వినలేదెప్పుడూ.  సంగీతమంటే ఇష్టం ఉండి కూడా,   సుబ్బలక్ష్మి  పాటలను వినాలని అనిపించకపోవడానికి  సినీ సంగీత ప్రభావం  కారణం కావొచ్చు.శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రేడియోలో విన్నపుడు  ప్రౌఢంగానూ,  అదేదో  [...]
  కవిత్వం గురించి పెద్దగా తెలియని అమాయకపు రోజుల్లో  నేనూ కవితలు రాశాననుకున్నాను . అవి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పంపిస్తే...  ఒకటి రెండు సార్లు ‘యువవాణి’ కార్యక్రమంలో ప్రసారం అయ్యాయి కూడా. అయితే... Poetry is not my cup of tea... అని అర్థం చేసుకున్నాక  మళ్ళీ కవితలు రాసే జోలికి పోలేదెప్పుడూ!  అంతేకాదు;  కవిత్వాన్ని అర్థం చేసుకునే,  ఆస్వాదించే లక్షణం నాలో తగినంతగా లేదనిపించేది. కవుల  [...]
  టీవీలో  హిందీ ‘మహాభారత్’ సీరియల్ వస్తోంది... 1990 ప్రాంతంలో.  దుర్యోధనుడు భీముడి గదాఘాతానికి తొడలు విరిగి నేలపై పడిపోయిన సన్నివేశం. దుర్యోధనుడికి మద్దతుగా కోపంతో అతడి గురువు బలరాముడి వాదనలూ, అన్నను అనునయిస్తూ భీముణ్ణి సమర్థిస్తూ కృష్ణుడి ప్రతివాదనలూ వాడిగా సాగుతున్నాయి.ఇదంతా జరుగుతున్నపుడు... ఆ నిస్సహాయ స్థితిలో దుర్యోధనుడి మొహంలో భావాలు ఎలా ఉన్నాయి?  దర్శకుడైన [...]
మనిషి కోరుకునేవీ,  అతడికి  సంతోషాన్నీ, సంతృప్తినీ కలిగించేవి ఏమిటి? పోతన భాషలో - బలి చక్రవర్తి  వామనుడికి  చెప్పిన జాబితా చూస్తే.... ‘వర చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులోహరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో...’  వస్తువులూ జంతువులతో సమానంగా ‘కన్యల’ను కలిపెయ్యటం గురించి ఇక్కడేమీ చర్చించబోవటం లేదు. [...]
ఆ  తెలుగు  నవలను  చదివాను... ఉత్కంఠభరితంగా ఉండి, బాగా నచ్చింది. ఆ రచయితపై అభిమానం పెంచేసుకున్నాను. ఇంతలో... ఆ నవలపై  కఠోర  విమర్శ  కనపడింది.  అయిష్టంతో ...  అసహనంగా చదివాను  దాన్ని.     ఘన సమ్మోహనాస్త్రమనుకున్న  నవలను  ఆ విమర్శ గంజాయిదమ్ము  అని ఈసడిస్తుంటే ....  పట్టరాని ఉక్రోషం,  ఆ విమర్శ చేసిన వ్యక్తిపై కోపం కూడా వచ్చేశాయి. అవి నా టెన్త్  రోజులు... దాదాపు ముప్పయి ఏళ్ళ  క్రితం [...]
రేమండ్ షెపర్డ్ ...! ఈ అపురూప చిత్రకారుడి పేరు నాకు తెలిసి కొద్దికాలమే అయింది. నేనింకా పుట్టకముందే ఆయన కన్నుమూశాడు. 1913-1958 సంవత్సరాల మధ్య 45 ఏళ్ళు మాత్రమే జీవించాడీ  బ్రిటిష్ చిత్రకారుడు. అల్లం శేషగిరిరావు గారి తెలుగు వేటకథలు చదువుతూ... ఆసక్తితో సమాంతరంగా ఇంగ్లిష్ వేట కథల కర్త జిమ్ కార్బెట్ కథలనూ పరామర్శించాను. అప్పుడే నాకు ఈ రేమండ్ తారసపడ్డాడు!. ఆ చిత్రకారుడి గురించి [...]
కాల్పనిక రచనలు ఇష్టమా? స్వీయ చరిత్రలూ, జీవిత గాథలూ చదవటం ఇష్టమా అని అడిగితే  చప్పున జవాబు చెప్పలేను. అయితే  నిజమైన వ్యక్తులూ, వారితో సంబంధమున్న వాస్తవిక సంఘటనలుండే బతుకు పుస్తకాలకో  వింత ఆకర్షణ ఉంటుంది. కల్పనకు పరిమితులూ, సత్యంతో ముడిపడివుండటమూ వాటి ప్రధాన బలం. జీవిత చరిత్ర  రాయటమంటే ఆ కాలాన్నీ, పరిసరాలనూ  పున: సృష్టించి మళ్ళీ  కళ్ళముందుకు తీసుకురావటమే కదా! నా [...]
రంగనాయకమ్మ ఒకరు సహజ సుందరంగా, తీయగా  పాడే  గాయని. మరొకరు  మౌలిక భావాలతో  పదునుగా  రాసే రచయిత్రి. వాళ్ళు...  బాల సరస్వతీ,  రంగనాయకమ్మా! ఆపాత మధురమూ, ఆలోచనామృతమూ  అయిన  ఆ ఇద్దరికీ  పరస్పరం...  స్నేహం, గౌరవం, ఇష్టం. వారిద్దరూ ఈ మధ్య  కలుసుకున్నారు.   ఆ గాయని తమ ఇంటికి వచ్చినప్పటి ఘట్టాన్నీ , తన జ్ఞాపకాలూ,  అనుభూతులను  రంగనాయకమ్మ  ఓ వ్యాసంగా రాశారు.  అది ఏ పత్రికలోనూ  రాలేదు. [...]
  రామాయణ, మహాభారత, మహా భాగవతాల్లో  ఏముందో  నా చిన్నవయసులోనే  ‘చందమామ’, ఇతర పుస్తకాల ద్వారా  తెలుసు. వాటి మూల గ్రంథాలను (తెలుగు వచన అనువాదాలే) తర్వాతి కాలంలో చదివాను.  అయితే  వీటన్నిటికంటే ప్రాచీనమైన వేదాల గురించి ఇన్నేళ్ళుగా వింటూ ఉండటమే గానీ,  పెద్దగా తెలుసుకున్నదేమీ లేదు.  అవి  కథా రూపంలో  ఉండకపోవటం  దీనికో కారణం కావొచ్చు! ‘భారతదేశ చరిత్ర’ పుస్తకాల్లో ఆర్యుల [...]
గురజాడ  చూసి  వర్ణించిన ‘హేలీ’ ఇదే   (1910 నాటి ఛాయాచిత్రం)  నింగిలో వెలిగే  హేలీ తోకచుక్కను ‘చన్నకాలపు చిన్నబుద్ధులు’  కీడుగా భావించి బెదిరిపోతే... ఆ మూఢ విశ్వాసాన్ని ఖండించి- దాన్ని భూమికి దూరబంధువుగా, నరుల కన్నుల పండువగా భావించిన, సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగా సంభావించిన మహాకవి గురజాడ అప్పారావు... వ్యావహారిక భాషకు కావ్యగౌరవం కల్పించిన నాటకకర్త. భాషలో, భావంలో.. తన [...]
నిమిషంన్నర నిడివి కూడా లేని ఆ పాట...  నాకు అమితంగా నచ్చింది. నిండా పదేళ్ళు కూడా  లేని ఓ బాలిక...  తన గాన మహిమతో నన్ను సమ్మోహితుణ్ణి  చేస్తోంది! *  *  *  సంగీతమంటే  నాకు ఎక్కువ తెలిసినవి సినిమా పాటలే !  రేడియోలో  లలిత సంగీతమూ,  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళిల పాటలూ వినలేదని కాదు. అయినా అవి పరిమిత స్థాయిలోనే! అప్పుడప్పడూ  ‘అనుపల్లవి’ బ్లాగులో  ‘తెలుగు అభిమాని’ రాసే  [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు