ఆత్మీయులుజ్ఞాపకాలు-1230-1-2019 నాతో బ్లాగ్ లో ఒక అమ్మాయి,"మీరు చాలా అదృష్ఠవంతులు.మీకు ఏమీ కష్టాలు లేవు.ఎప్పుడూ మీ కుటుంబం గురించి హాయిగా, సంతోషంగా చెపుతుంటారు.చక్కగా ఎంజాయ్ చేస్తారు."అంది.దేవతల రాజు ఇంద్రుడి కే తప్పలేదు బోలెడు కష్ఠాలు.మానవమాత్రురాలిని నేనెంత :) కాకపోతే గతం గతః అనుకోవాలి.చిన్న బాధను భూతద్దంలో పెట్టిచూడగలిగే మనం,చిన్న ఆనందాన్ని కూడా అలాగే అనుభవించాలి.గతం [...]
తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్జ్ఞాపకాలు -1025 -1-2019తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ మని ఎగిరిపోతున్నాననుకుంటున్నారా లేదండీ బాబూ లేదు.ఇక్కడే ఉన్నాను :) మా మనవరాలిని ఫొటో తీయించేందుకు మాల్ లో ని స్టూడియో కు తీసుకెళ్ళాము.నేను "ఇంత చిన్న పాపకు ఫొటో ఏమిటి? అసలు ఎట్లా కూర్చోబెడుతారు?" అని గొణిగాను మా అమ్మాయితో."కూర్చో [...]
నల్లంచు తెల్లచీరజ్ఞాపకాలు-1128-1-2019 నేను రెండు జడల నుంచి ఒక్క జడకు, లంగావోణీ నుంచి చీరకు నా పెళ్ళిచూపులరోజే మారాను :) అంతకు ముందు టైఫాయిడ్ వచ్చి జుట్టు ఊడిపోయి,మళ్ళీ చాలా తొందరలోనే భుజాలదాకా పెరిగింది.ఆ రోజులల్లో జుట్టును కత్తిరించే అలవాటు లేదు  కాబట్టి, భుజాల దాకా ఒత్తుగా,ఆ కింద నడుముదాకా సన్నగా ఉన్నది నాజంపు జడ.రెండు జడలు కాబట్టి,సన్నగా ఉన్న జుట్టును ఒత్తుగా ఉన్న జడ [...]
చక్కని పూలకు చాంగుభళా!జ్ఞాపకాలు-921-1-2019ఎప్పుడైనా బంతిపూల జడ వేసుకున్నారా :) మానుకోటలో ఉన్నప్పుడు, ఒక మానుకోట అని ఏమిటి లెండి,కాంప్ క్వాటర్స్ ఉన్న చోటల్లా ఇంటి ముందు వెనుక చాలా స్తలం ఉండేది.ఇంటి చుట్టూ కర్రలతో దడి కట్టించి అమ్మ చాలా మొక్కలు పెంచేది.కాంపౌండు చుట్టూ ఎర్రని కాశీరత్నాలూ,లైట్ క్రీం కలర్ లో ఉన్న గిన్నె మాలతులు , వైలెట్ కలర్ శంఖంపూలు ఇలా ఒకటేమిటి రంగురంగుల పూల [...]
బుజ బుజ రేకుల పిల్లుందీజ్ఞాపకాలు -819-1-2019మా అమ్మగారింటి వెనుక చల్ల కొస్ఠం అనిఉండేది.అది విశాలంగా ఒక హాల్ లా ఉండేది..అందులోనే ఒక మూల నా బొమ్మరిల్లుండేది.ఆ హాల్ లోనే ఒక గుంజకు పెద్ద పొడగాటి చల్ల కవ్వం కట్టి ఉండేది.అక్కడ మా అమ్మమ్మ  పాటలు పాడుతూ,చల్ల కవ్వం తిప్పుతూ,మజ్జిగ చిలికేది.అమ్మమ్మ పాటలు బాగా పాడేది."మీరజాలగడా నా ఆనతి " పాట చాలా బాగా పాడేది.( అమ్మమ్మ,నేను గుంటూర్ లో [...]
మేక ఒకటి మే మే అనుచూ * @  $ % ^ & *జ్ఞాపకాలు -7 "నేను, అమ్మ  కీసర దగ్గర దిగేసరికి, తాతగారు పంపిన బండి అక్కడ రెడీగా ఉండేది.పక్కన ఉన్న మున్నేరు లో కాళ్ళూచేతులూ కడుక్కొని, అమ్మమ్మ పంపిన అన్నం, కందిపచ్చడి, గోంగూర పచ్చడి అమ్మకలిపి ముద్దలు చేసి పెడితే సుష్ఠుగా తిని,బండెక్కి పడుకునేదానిని. ఏమాత్రం తొందర లేనట్లు దారిలో చిన్న చిన్న ఊళ్ళూ , పొలాలు దాటుకుంటూ తాఫీగా వెళుతూ ఉండేవి [...]
పాడమని నన్నడగతగునా! (ఏడిపించటానికి కాకపోతే)జ్ఞాపకాలు-6అవి మేము ములుగులో ఉన్న రోజులు.ముందే చెప్పినట్లు ములుగు ఊరే ఐనా కాంప్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు.ఓ అడవిలాగానే ఉండేది.మా ఇంటి ముందే నాన్నగారి ఆఫీస్ ఉండేది.అక్కడ పెద్ద పెద్ద పున్నాగపూల చెట్లుండేవి.పొద్దున్నే తెల్లటి పూలు నేలంతా పరుచుకునేవి.ఆ పూలను ఏరుకొని , జడలల్లుతూ,రేకులతో, కాడలతో బూరెలు చేసి ఊదుకుంటూ తెగ ఎంజాయ్ [...]
చాయ్ బిస్కత్జ్ఞాపకాలు - 510-1-2029 మా చిన్నప్పుడు మా అత్తయ్యవాళ్ళ ఇంటికి వెళుతుండేవాళ్ళము.పెద్ద అయ్యాక వెళ్ళలేదా అంటే ఎందుకు వెళ్ళలేదు కాకపొతే కాస్త పెద్దయ్యాక పెళ్ళి చేసుకొని ఏమండీ తో కలిసి దేశం మీద పడ్డాను కదా అందుకని తగ్గిపోయిందన్నమాట. మా అత్తయ్యావాళ్ళు ఆసిఫాబాద్ లో ఉన్నప్పటి సంగతి.ఇల్లు అడవిలో ఉండేది. అదేమిటో "సీత"అన్న పేరున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాము [...]
పుట్టినరోజు పండుగజ్ఞాపకాలు-4 6-1-2019నా మొదటి పుట్టినరోజు గురించి అమ్మ చెప్పిన జ్ఞాపకం. అవును మరి అంత చిన్నపాపాయిని నాకేమి గుర్తుంటుంది అమ్మనే చెప్పాలి కదా!"మీ నాన్నగారి కి చదువు పూర్తి కాగానే,వైరా లో  ఉద్యోగం వచ్చింది. కొద్ది కాలానికే తుంగభద్ర ప్రాజెక్ట్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంక మేనల్లుడు పెద్దవాడైపోయాడు, పైగా అటెటో దూరం వెళుతున్నాడు అని మేనమామ పిల్లను ఇచ్చి [...]
జొన్న రొట్టె- ఉల్లిపాయ ఖారంజ్ఞపకాలు -34-1-2019"బేబమ్మా . . . చుక్కీ . . . బేబమ్మా. . . చుక్కీ "బిజిలీ  పిలుపులు గట్టిగా వినిపిస్తుంటే చెట్టు వెనుక దాకున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడి చుట్టూ చూసాను. చీకట్లు కమ్ముకుంటున్నాయి.చుట్టూ పరిసరాలు మసక మసకగా కనిపిస్తున్నాయి.అప్పటిదాకా ఆట ద్యాసలో చీకటిని గమనించని నేను భయపడి బిజిలీ  అని అరుస్తూ పరుగెత్తుకెళ్ళి బిజిలీ  ని [...]
మధురమైనవి-మరుపురానివి జ్ఞాపకాలు -22-1-2019అవి నేను SSLC చదివేరోజులు. ఆ రోజు జనవరి ఫస్ట్.అవి, జనవరి ఫస్ట్ రోజున గ్రీటింగ్స్ ఇచ్చుకోవటం, హాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం తెలీని రోజులు.ఆ రోజు నేను స్కూల్ నుంచి రాగానే అమ్మ , నా నోట్ బుక్ కన్నా చిన్నది నల్లటి కవర్ తో ముద్దుగా ఉన్న బుక్ ఒకటి ఇచ్చి, ఇక నుంచి నువ్వు రోజూ , ఆ రోజు జరిగిన  విశేషాలు ఈ బుక్ లో వ్రాయి అంది.నాకు అర్ధం [...]
కొత్త సంవత్సరంజ్ఞాపకాలు -1 1968డిసెంబర్ 31 స్థలం; మద్రాసు మెరీనా బీచ్ఓ గంటసేపటి నుంచి ఏమండీగారు చాలా ధీర్గాలోచనతో, చేతులు వెనక్కి పెట్టుకొని కాసేపు, పక్కనపెట్టుకొని కాసేపు, గడ్డం రాసుకుంటూ కాసేపు అటూ ఇటూ అచార్లూ పచార్లూ చేస్తున్నారు.నేను ఏమండీగారి వెనక  ఆ కవాతు చేయలేక ,కొత్త కావటం తో మొహమాటం తో ఏమి చెప్పలేక అలాగే నీరసంగా తిరుగుతున్నాను. అప్పటికి మా పెళ్ళై పది [...]
కొన్ని సార్లు కొన్ని కథలు చదువుతుంటే చాలా విసుగ్గా ఉంటుంది. ఏదో సమస్యల మీద రాయాలని మొదలు పెడతారు.అవి కూడా ఏదో ఒక సామాజిక వర్గానికే సమస్యలు ఉన్నట్లు, మిగితా వారంతా ఆనందంగా జీవిస్తూ, వాళ్ళని నానా హింసలపాలు చేస్తున్నట్లుగా ఉంటాయి.పొనీ మధ్య తరగతి వాళ్ళకు సమస్యలు లేవా అవి రాయవచ్చు కదా అనుకుంటే ఒకప్పుడేమో అత్తాకోడళ్ళ పొట్లాటలు, వదినా ఆడపడుచుల విరోధాలూ (ఇప్పటికీ టివీ [...]
అవాల్మికి కదంబమాల  ఆవిష్కరణ మా అమ్మ మాడపాటి సీతాదేవి సేకరించిన కొన్ని రామాయణ ఘట్టాలను , “అవాల్మికి కదంబమాల” పేరు తో అచ్చంగా తెలుగులో ప్రచురుణ అయ్యింది .అది ఈ బుక్ గా చేసి శ్రీరామ నవమి  రోజున అమ్మ తో ఆవిష్కరించాము . ఈ పుస్తకము కవర్ పేజీ మా చెల్లెలు జయ వేసింది. రామునీతో పాటు సీతాదేవి అడవికి వెళ్ళేటప్పుడు నార చీరలు ధరిస్తుందిట.అప్పుడు దశరధుడు వనవాసం చేసేది రాముడు [...]
మాకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఎల్లమ్మ ప్రతి సంవత్సరం  సమ్మక్క ప్రసాదం బంగారం ( బెల్లం) తెచ్చి ఇస్తోంది.దానితో , నా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది :) నా చిన్నప్పుడు ఒక్ గూడెం లో ఉన్నట్లుగా గుర్తు.అక్కడ వెదురు గుడిశెలో ఉండేవాళ్ళం.అమ్మ బయట నులక మంచం మీద కూర్చొని ఉంటే, కింద ఒక లంబాడీ ఆమె కూర్చొని అద్దాలు కుడుతూ ఉండేది.అప్పుడు నాకు అన్నీ అద్దాల లంగాలు జాకిట్లు,గౌన్లు [...]
రేపు తెలంగాణా లోని అతిపెద్ద జాతర "మేడారం జాతర" మొదలు కాబోతోంది. కాని మాఇంట్లో మాత్రం వారం రోజుల నుంచే జాతర హడావిడి మొదలైంది :)మేము ఈ ఇంట్లో కి వచ్చిన పూటే ఎల్లమ్మ మా ఏమండీ ని గేట్ దగ్గరే పట్టుకొని రెండు చేతులూ జోడించి "అయ్య నీ బంచన్ కాల్మొక్కుతా, ఆపీస్ పెడుతున్నావంట నాకూ కొలువియ్యి దొరా " అని దీనంగా అడిగి (దబాయించి ) కొలువులో చేరింది మా సీనియర్ మోస్ట్ పనిమనిషి :) ఏం పని [...]
మేము సిలిగురి లో ఉన్నప్పుడు అక్కడక్కడ ఇళ్ళల్లో ఉన్న అర్టై చెట్లు, వాటికి ఉన్న ఎర్రట్ అరటి పండ్ళ గెలలు చూస్తుంటే నాకు అరటి చెట్టు పెట్టుకోవాలని కోరిక కలిగింది. తెచ్చి పెట్టానో లేదో చుట్టుపక్కల వాళ్ళంతా ,అసలే మనం అడవిలో  ఏనుగుల మధ్య ఉన్నాము అరటి చెట్టుకోసం ఏనుగులొచ్చి పడతాయి తీసేసేయ్ అని గోల పెట్టేసారు. ఊళ్ళో వాళ్ళు పెంచుకుంటున్నారు కదా అంటే వాళ్ళు కంచె వేసి, [...]
రాధామాధావాల పావడాను  కట్టిజాజిపూలను జడలో తురిమిగులాబీల అందాన్ని పొదుపుకొనిపారిజాతాల పరిమళాన్ని అద్దుకొనిముద్దమందారాన్ని ముద్దుగా అరచేత ఉంచుకొని మంచు బిందువులో తడిసిన నందివర్ధనం లాఓ వెన్నెల కిరణంలా, ఓ పిల్ల తెమ్మెరలానా చిన్ని ప్రపంచంలోకి వచ్చి, నాలోని ఊహలకు రూపాన్ని ఇస్తూ , నన్ను తొమ్మిది సంవత్సరాలుగా సాహితీవనంలో విహరింపజేస్తున్న నా చిన్నారి "సాహితి" కి [...]
లక్ష్మీవసంత గారు , పద్మాదాశరధిగారు యద్దనపూడి సులోచనారాణి గారి నవల "జీవనతరంగాలు " మీద సమీక్ష రాసారనీ, అది తనకు చాలా నచ్చిందనీ, ఆ సమీక్ష ఇస్తూ రాసిన పోస్ట్ నాలోని కొన్ని జీవంతరంగాలు నవల కు సంబంధించిన జ్ఞాపకాలను తట్టిలేపింది.అవి మా పెళ్ళైన తొలిరోజులు. ముందుగా పటియాలా వెళ్ళి, అక్కడ ఒక నెల మాత్రమే ఉండి , పూనా మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మా ఏమండీ కి కోర్స్ రావటం వల్ల, ఒక [...]
ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)"ఎప్పుడెళుతున్నావు సభలకు ?" అని అడిగారు ఏమండి."హుం నేనేమి వెళుతాను ? ఓ నాలుగు రోజులాగి వెళ్ళవచ్చుగా పి.యస్.యం గారు.ఉమ్హు సరిగ్గా సభల ముందే యు.యస్ వెళ్ళారు.శీలలితగారు బిజీట.మీరు రానన్నారు.కనీసం రిజిస్టర్ చేయించుకోమన్నా చేయించుకోలేదు.నేనొక్క దాన్ని ఏ వెళుతాను?" నిట్టుర్చాను.కాసేపు ఇద్దరమూ పేపర్ చూడటం లో మునిగిపోయాము.సడన్ గా "నేను ఈ [...]
ఈ రోజు అంగా కార్తీక శుద్ద విదియ . ఉత్తరాదిన ముఖ్యంగా  "భగినీ హస్త భొజన్" అని జరుపుకుంటారు. మన వైపు కూడా కొంత మంది చేస్తారు కాని అంతగా ప్రాచుర్యం లో లేదు. భగినీ అంటే సోదరి. సోదరుడు , సోదరి చేతి భోజనం చేయటమన్నమాట. వివాహమైన అమ్మాయి ఇంట్లో మనవాళ్ళు భోజనం చేసేవారు కాదు. పంజాబ్ అటువైపైతే తప్పని సరిగా చేయాల్సి వస్తే విస్తరి కింద కొంత డబ్బు ఉంచుతారని మా పంజాబీ స్నేహితులు [...]
తటవర్తి జ్ఞానప్రసూనగారు త్రైమాస లిఖిత పత్రిక "మందానికి" లో నా కథ, "బుచ్చిబాబులాంటి మొగుడొద్దన్నాను కానీ. . . "బుచ్చిబాబు లాంటి మొగుడొద్దనుకున్నాను కానీ . . . . ."అత్తయ్యా ఇంక సద్దుకోవటము కాలేదా ?" అని అడుగుతూ లోపలికొచ్చాడు మా మేనల్లుడు."అంతా అయ్యిందిరా .ఇదిగో ఈ మందులే హాండ్ బాగ్ లో సద్దుతున్నాను." అన్నాను. "ఏమిటీ అన్ని మందులు హాండ్ బాగ్ లో సద్దుకుంటున్నావా? ఎందుకు?" [...]
ఈ నెల విహంగ అంతర్జాల మాసపత్రిక లొ నా రచనలను నెను చేసుకున్న పరిచయము :)http://vihanga.com/?p=19997                          మీతో నేనుఈ నెల ప్రయాణం హడావిడి ,   వచ్చాక జెట్ లాగ్ తో సమీక్ష రాయలేకపోయాను ,అని పి.   యస్.   యం లక్ష్మిగారి తో అంటే ఇప్పటి వరకు చాలా మందివి రాసారు కదా ఈ సారి వెరైటీ గా మీ పుస్తకాలనే పరిచయం చేయండి అన్నారు.    ఏమో నా పుస్తకాల మీద నేను సమీక్ష రాసుకుంటే [...]
కళ్ళు తెరవగానే కిటికీ లో నుంచి కనిపిస్తున్న వెలుతురు. . .గోడ మీద గడియారంలో టైం . . . గాలిలో తేలి వస్తున్న ,పారిజాతం , మాలతీ సౌరభాలు. . . చెట్టు మీది పక్షుల కూతలు . . . రోడ్ మీద ఆకుకూరల వాళ్ళ అరుపులు . . . పక్కింటి నుంచి నల్లాలో పడుతున్న నీళ్ళ చప్పుడు . . .ఎక్కడి నుంచో , కాదు మా ఫోనే రింగవుతోంది :)కింద నుంచి అమ్మ " కమలా లేచావా ? కాఫీ పంపనా ?""వద్దమ్మా నేను కలుపుకుంటాను "కాఫీ గ్లాస్ [...]
" అత్తగారిని హీరోయిన్ గా పెట్టి రాసేసిన భానుమతిగారు . వూళ్ళో వాళ్ళ మీద రాస్తే దెబ్బలాటకి రారూ ! మాఇంట్లో వాళ్ళమీద రాస్తే ఏగోలా ఉండదు అన్న బీనాదేవిగారు , తన బాల్యం .తనఫాక్టరీ నేపధ్యంగా ,తీసుకుని కధలు అల్లిన సోమరాజు సుశీలగారూ ,తన పల్లెటూరూ తన అనుభవాలని కధల రూపంలో చెప్పే పొత్తూరి విజయలక్ష్మీ (అంటే నేనే )వీళ్ళందరూ ఆకోవకే చెందుతారు . వీళ్లకధల్లో ఏముంది అని అంటే ఏమీ ఉండదు . [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు