ఇది కొత్తగా నేను కనిపెట్టిన వంటకమేమీ కాదు, పేరును చూసి కొత్తదనుకునేరు!పేరు మాత్రం నేను పెట్టానన్నమాట.కావలసిన పదార్థాలు ----శనగపిండి -  ఒకటి (ఎంత గిన్నె వంటివన్నీ ఎవరికి వారే నిర్ణయించుకోవాలి)చక్కెర    - రెండుకొబ్బెర    - 3/4 వంతు (ఒకటి లో)నెయ్యి   - ఒకటిపాలు   - ఒకటితయారు చేసే పద్ధతి ---మొదట తాజా శనగపిండిని జల్లించుకొని బాణట్లో మంచి వాసన వచ్చేవరకూ [...]
ఇది కన్నడ ప్రాంతాల వైపు చాలా పాతకాలపు ప్రసిద్ధమైన తీపిపదార్థము. వీటిల్లో కొద్ది కొద్ది తేడాలతో డీప్ ఫ్రై లేదా  రోస్ట్ విధానాల్లో రెండు మూడు రూపాల్లో చేయవచ్చును. సాధారణంగా మునుపు పెండ్లిండ్లలో ఇటువంటి ఘనమైన తీపి రకాలు చేస్తుండేవారు.కొద్ది పరిమాణంలో ఇంట్లో చేసుకొన డానికి తగిన పేణీల గురించి ఇప్పుడు చూద్దాం.పేణీ రవ - దీనిని చిరోటీ రవ , భక్ష్యాల రవ అన్న పేర్లతో కూడా [...]
పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, ఆవాలు&మెంతుల పొడి, ఒక తిరగవాత. ఇంకేం?వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుంటే ఆహాఁ.. అనకుండా ఉండలేనిది కొరివికారమే.ఎఱ్ఱటి పండు మిరపకాయలు ఏమాత్రం కారం ఉండవు. రుచిగా ఉంటాయి.(ఫోటోలు మరీ క్లోజప్ లో తీసినట్టున్నాను.😛) పావు కేజీ పండుమిరపకాయలు కాస్సేపు నూనెలో మగ్గనిచ్చి, ఒక పిడికెడు (అందాజుగా) చింతపండు వాటిలో ఉంచేసి కాస్సేపు చల్లారనిచ్చి, [...]
          పాలతో కోవా చేయడం అందరికీ తెలిసినదే. చాలా సులభం. కాకపోతే ఓపిక కావాలి. ఇప్పుడు బాదం పొడితోకూడా కలిపి బాదం కోవా చేస్తే తినడానికి చాలా బాగుంటుంది.తయారు చేయడానికి కావలసినవి:-అడుగు మందం ఉన్న వెడల్పు గిన్నె లేదా బాణలి (చాలా ముఖ్యం. పలుచగా ఉంటే మాడి పోగలదు.)పాలు మనక్కావలసినన్ని తీసుకోవచ్చు. అరలీటరు పాలకు మూడు నాలుగు  కోవా బిళ్ళలు రాగలవు అని [...]
అతి సర్వత్ర వర్జయేత్ - ఏదైనా మితంగానే ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో మామిడి ఎక్కువ దొరుకుతుంది. ఈ యేడు కొంచెం తక్కువగానే కన్పిస్తున్నాయనుకోండి.మామిడి కాయలు, మామిడి పండ్లు చాలా ఇష్టంగా తింటాం.మామిడి కాయతో పప్పు, రోటి పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు, ఊరగాయలు మామూలే. మామిడి పండ్లు ఎక్కువ తింటే వేడి చేస్తుందంటారు గానీ, మామిడికాయ చలువ చేస్తుంది.మామిడికాయ చారు లేదా రసం సులభంగా [...]
వంకాయతో పాటు మామూలుగా ఇంకాకొన్ని వేసి చెట్నీ అందరం చేస్తాం. ఉల్లిగడ్డలు, టమేటోలు, చింతపండు ఇలా...ఇది కావాలంటే ఇక్కడ. http://seemavanta.blogspot.in/2010/05/blog-post.htmlఅవేమీ లేకుండా అద్భుతమైన రుచితో మరొక్కసారి కలుపుకొనే చెట్నీ అందరికీ నచ్చేది ఈ సులభతరమైన వంకాయ చెట్నీ.కావలసిన పదార్థాలు-- లేత వంకాయలు                                పచ్చిమిరపకాయలు తగినన్ని             (వంకాయ సైజును [...]
బుడ్డలు, చనక్కాయలు, వేరుశనక్కాయలు, పల్లీలు అన్నింటికీ అర్థం ఒకటే.బుడ్డలు వలిచి విత్తనాలు తీస్కోవాల.ఎన్ని అనేదేముంది? ముందుగా ప్రయత్నం చేస్కొనేటపుడు ఎవరైనా ఒక లోటాడు, లేదా ఒక్క చిన్న గిన్నెడు తీసుకుంటే మేలు. బాగా వచ్చిందంటే కొలతలు పెంచుకోవచ్చు.ఏ కొలత లో బుడ్డల విత్తనాలు తీస్కున్నామో అదే గిన్నెడు బెల్లం మెత్తగా దంచినది తీసుకోండి.కావలసిన పదార్థాలివే.బుడ్డల [...]
ఈ నెల తెలుగువెలుగు పత్రికలో ముప్ఫయ్యైరెండవ పేజీలో నా యొక్క "మా వంటా వార్పూ" బ్లాగు గురించి వ్యాసకర్త మధురవాణి గారు వ్రాయగా; పత్రిక వారూ కొన్ని ప్రశ్నలు  అడిగి నా సమాధానం తోపాటు ప్రచురింపబడటం సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా మధురవాణి గారికి, పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.
ఆకుకూరల్లో మెంతికూర ఎంత మంచిదో అందరికీ తెలిసిన సంగతే. స్త్రీలకు, మధుమేహరోగులకు మరీ మంచిది.ఈ మెంతికూర  సరిగ్గా చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎవ్వరూ వద్దనరు. ఇంక వంకాయతో కలిపి పప్పులో వేస్తే ఆ రుచే వేరు. అద్భుతంగా ఉంటుంది. ఈ బ్లాగులోనే వంకాయమెంతికూర పప్పుకు వచ్చినన్ని హిట్లు మరి దేనికీ రాలేదు.ఇప్పుడు మెంతి కూరను కూరగా ఎట్ల చేయాలో చూద్దాంకావలసిన పదార్థాలుః-పెద్ద [...]
ఉన్నట్టుండి తీపి తినాలనిపించినా కూడా టక్కున చేసేసుకొనే తీపి వంటలు మనకెన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ పెసర ఉంటలు. అంటే పెసరబేడలతో లడ్లన్నమాట.నిముషాల్లో అయిపోయేదీ, నిలవ ఉండటంలో వెనకాడనిదీ ఈ తీపి వంటకం. పది పదిహైదు రోజులున్నా తాజాగా ఉంటుంది. పది పదహైదుగురు పిల్లలున్నచోట అయితే ఫట్ మని అయిపోయేదీ ఈ తీపి వంటకం.కావలసిన పదార్థాలు:-పెసరబేడలు (ఎన్నో)చక్కెర (అంతే )అంటే సమానంగా [...]
కావలసిన వస్తువులు:౧.బొంబాయిరవ  ఒక గిన్నె౨.పచ్చికొబ్బెర     ఒక గిన్నె౩.చక్కెర            రెండు గిన్నెలు౪.నెయ్యి           సగం గిన్నె౫.యాలక్కాయపొడి కొద్దిగాచేయవలసిన పద్ధతి:ముందుగా రవ, కొబ్బెర తురిమినది సమానంగా తీసుకొని చిన్న సెగ మీద నెయ్యి వేసి నిదానంగా వేయించాల. రెండూ కలిపే వేయించాల.ఇంకా ఎక్కువ చెయ్యాలనుకున్నా కూడా రెండిటినీ [...]
మా సీమలో దోసకాయ అంటారు కానీ కొందరు కీర దోసకాయ అంటారనుకుంటా. అంటే చూడటానికి ఆకుపచ్చని గీతలో లేతాకుపచ్చ రంగులో బీరకాయకు తోబుట్టువు లాగా ఉంటుందే. ఆ దోసకాయన్నమాట.దోసకాయ పెరుగు పచ్చడి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ టెంప్లేట్ మాదిరి తెలుపుమీద ఆకుపచ్చ డిజైన్.కాయ లో సహజ సిద్ధంగా ఉన్న నీరు వల్ల ఎండాకాలంలో ఎంతో మంచిది. పచ్చికాయ ముక్కలు గా కోసుకుని తింటే చాలా [...]
జొన్నలు పిండి చేయుదము, సోకుకిరీటము తీసి వంగ, నానున్నని మేను చీల్చెదము, నొవ్వక నాలుగు ముక్కలొప్పగన్సన్నని యుల్లి, దంచిన మసాలలు కూర్చిక; జొన్నరొట్టెలోవెన్నను పూసి తిందుమిక; వేడిన వారికి కొంత బెట్టుచున్.వంగ ను + ఆ= వంకాయను 
పచ్చి కొబ్బెర తో చేసే ఈ తీపు చాలా బాగుంటుంది.కావలసిన పదార్థాలు.పచ్చి కొబ్బెర ఒక చిప్ప తురిమి ఉంచుకోవాల.చక్కెర తురిమిన కొబ్బెర కన్నా ఎక్కువ తీసుకొవాల.అంటే ఒక  గిన్నెడు   తురిమిన కొబ్బెరకు ఒకటిన్నర గిన్నెడు చక్కెర అన్నమాట.శనగపిండి రెండు చెంచాలు.నెయ్యి రెండు చెంచాలు.అంతే.చేసే పధ్ధతి.మందపాటి బాణలి లేదా గిన్నె తీసుకొవాల.ముందుగా చక్కెర తడిసేటట్టు నీరు కొంచెం [...]
అన్నంలో కలుపుకుని గాని, దోసెల్లోకి గాని , చపాతీల్లోకి గాని అన్నిటికీ బాగుండేది, తిరుగులేనిది, ఉత్తది కూడా నోట్లో వేసుకుంటే ఆహా అనిపించేది, ఇలా తలుచుకుంటేనే నోరూరించేది............అబ్బబ్బా ఇంకెంత సేపు ఈ సుత్తి అనుకుంటున్నారా?కావలసిన పదార్థాలుచిగురు _____ ఒక పిడికెడునువ్వులు/నూగులు ____ ఒక ౧/౨పావు(లేదా)౧/౨చిట్టి (ఇది పేరు కాదండోయ్ , మా వైపు ఒక కొలత సుమారు ౧౦౦ గ్రాములు [...]
                                                                          మరంతే గదండీ, వాళ్ళు నూడుల్స్ అంటారు. మనం సేమ్యాలు అంటాం. చూట్టానికి అలాగే ఉంటాయికదా!  మా నాన్నమ్మ కు మేనత్త, మా తాతయ్యకు పిన్ని ఒకావిడ ఉండేది. పేరు లక్ష్మీ దేవి కానీ పేరు పెట్టి ఎవరైనాఆవిడను పిలువగా మేమెప్పుడు చూశాం గనుక? అవ్వ అనే వాళ్ళం. మాకు ఊహ తెలిసేసరికే ఆవిడకు ఎనభైకి [...]
                              ఇది మా ఉరి పక్క భోజనాల్లో వడ్డిస్తారు. పండగలు, శుభకార్యాలు - ఈ సందర్భాల్లో వడ్డనలో ఉప్పు తర్వాత ఇదే వడ్డిస్తారు. తప్పనిసరిగా చేస్తారు.                                                               ఇప్పుడు స్ప్రౌట్స్ తినాలి , పచ్చికూరలు తినాలి - మంచిదని కనిపెట్టారు అంటారు కానీ మా పక్క భోజనాల్లో అదీ విందు [...]
శ్రావణమాసం వచ్చిందిగదా!  శ్రావణ మాసం శుద్ధ చవితి నాడు మేము నాగదేవ పూజ చేస్తాం.నాగుల చవితి   మేమెలా చేసుకుంటామో ఇక్కడ చూడండి. ఇదే పూజని కొందరు కార్తీక మాసంలో చేస్తారు. నాగుల చవితి నాగన్నా, పూజలు గొనుమన్నా అని పాట కూడా ఉన్నట్టుంది కదూ.నాగుల చవితి నైవేద్యానికి నూల ఉంటలు , చలిమిడి చేస్తాం.నాగులకి నూగులు -- బాగుంది కదూ.నువ్వులు --నూగులు---పలికేటపుడు నూలు అయిపోతుంది. [...]
ఏంటి పేరు అదోలా ఉంది అని చూస్తున్నారా? మరేం లేదు. సూపు అనటం విసుగేసి అలా రాశానన్నమాట.(ఈ పదము మన నిఘంటువు లోనిదే నండోయ్!) . కాదంటారా? సరే ,ఏదో ఈ సారికిలా కానిచ్చేద్దాం.నేను ఇందులో టమాటాలు ఎక్కువ వేస్తానన్నమాట. ఎవరికేది ఎక్కువ కావాలంటే వాళ్ళు అది ఎక్కువ వేసుకోవచ్చు కదా!సుమారు ఒక మూడు కప్పుల సూపము నకు --కావలసిన పదార్థాలు :- టమాటాలు నాలుగు/ఐదుఉల్లిగడ్డ ఒకటి [...]
ఈ పేరు చూసి ఏమబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారేమో. మా అవ్వ (నాన్నమ్మ) ఇలాగే అనేది. మా వూళ్ళో ఈ కూరకి ఇదే పేరు. మాండలీకాల్లో ఉన్న సొగసే వేరు. ఆ కోస్తా జిల్లాల భాష అందం గా రేడియో లో వినిపిస్తుంటే అప్పట్లో పడిపోయానుఁగానీ ఇప్పుడు ఆ వ్యామోహం లేదు. కాకపోతే కొన్నేళ్ళు కోస్తాలో ఉండి అలవాటయిపొయింది. సరే , ఈ ప్రాంతీయభావాల గొడవలు నాకిష్టం లేదు. తెలుగంతా నాదే. అన్ని యాసలూ [...]
పచ్చికొబ్బరి కూరఇప్పుడే పాకవేదంలో చూశాను. కొబ్బరికూర గురించి.మేమింకో విధంగా చేస్తాం కదా సరే రాద్దాం అనిపించింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. రెండవ రోజు కూడా ఏమీ కాదు.అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది. వేరే ఏదైనా కలుపుకున్నప్పుడు నంజుకోవటానికి కూడా బాగుంటుంది.కావలసిన పదార్థాలు :పచ్చి కొబ్బరి తురిమి ఉంచుకోవాలి.పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు చిన్నచిన్నముక్కలుగా [...]
కొన్ని కొన్ని భలే జంట కుదురుతాయి. అలాగే మెంతికూర , వంకాయ కూడా.ఇవి రెండూ కలిపి పప్పు చేస్తే చాలాబాగుంటుంది. మెంతికూర కూడా పచ్చిది కావాలనేం లేదు. ఎండుమెంతికూర అయితే చాలు.కసూరీ మేతీ అని దొరుకుతుంది చూడండి. అది కూడా వేసుకోవచ్చు. మెంతికూర కొత్తిమీర లాగే చిన్న కట్టలు, పెద్దకట్టలుగా దొరుకుతుంది.మెంతికూర చిన్న కట్టలు అసలు సగం మెంతి ఆకు ఉన్నట్టు ఉండవు. [...]
శనగబేడల పరవాన్నంకావలసిన పదార్థాలు: శనగ బేడలు - ఒక పిడికెడు తీసుకుంటే కప్పున్నర వస్తుందనుకుంటా. అందాజుగా చూసి వేసుకోవడమే. బియ్యం - ఒక చెంచా బెల్లం - శనగ బేడలతో సమానంగా (ఎక్కువ తీపు తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.) యాలక్కాయలు - ముగ్గురికి చేస్తే రెండు చాలు. పొడి చేసి [...]
బెండకాయ/వంకాయ గొజ్జుదీనికి తిరగవాత పెట్టటానికి మాత్రమే స్టవ్ అవసరం. అంటే దీన్ని తూర్పునాటోళ్ళు (అంటే కోస్తా వాళ్ళు అన్నమాట)పచ్చిపులుసు అంటారనుకుంటా. ఇక ఈ వంటకం మేమెలా చేస్తామో చెపుతాను.ఇది ముఖ్య ఆధరువు కాదు. చప్పని పప్పుకి గానీ, దద్ధోజనానికి గానీ, వఠ్ఠి పెరుగన్నానికి గానీ జోడీ గా బాగుంటుంది.చప్పని పప్పు అంటే ఏమిటీ చెప్పని పప్పు అనేరు సుమా! గోంగూర పప్పు, మామిడికాయ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు