చాలా రోజుల తర్వాత భాగవతం లోని ఒక భాగం చదివాను. భాగవతుడు అక్రూరుని ప్రసంగమే చదవడం అదృష్టమే.ఈ మత్తేభం నా దృష్టినాకర్షించింది.కలలం బోలెడి పుత్త్రమిత్త్ర వనితాగారాది సంయోగముల్జలవాంఛారతి నెండమావులకు నాసల్ సేయు చందంబునందలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృథాతత్త్వజ్ఞుఁడన్ నాకు నీవిలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ! అర్థము-లక్ష్మీనాథుడవైన కృష్ణా! దప్పిక [...]
అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాలలో కొన్నిఉత్పలమాలలు -ముగ్గురమ్మలు-వీణను చేతఁ బూని యలివేణిగ బ్రోచిన వాణి రూపమైపాణిని శూలమున్నిలిపి భక్తుల గాచిన గౌరి రూపమైరాణిగ, మెండుగా ధనపు రాసుల నిచ్చిన లక్ష్మి రూపమైజాణవు నిల్చితే ! జనని , సంతత భక్తిని నిల్పు నా మదిన్. ప్రవచనకర్త -వేదిక పైన నిల్చి సభ విస్మయమంద వచించు శక్తితోసాదరభావనన్ పరులు సంతసమందగ నుండు భక్తితోసోదరులంచు [...]
శార్దూలవిక్రీడితముకర్మంబందునఁ దక్క నే ఫలములన్ కాంక్షించలేదెన్న, డే దుర్మార్గంబుల క్రుంగుటల్ కనద, వే దుర్వ్యూహముల్ తోచినన్ మర్మంబుల్ సడలంగ జీరు తన సమ్మానంబు వర్ధిల్లగా. ధర్మంబియ్యది నిల్చియున్నది సదా దైవాంశ కన్పట్టగా తీర్మానమ్ముగ నెల్ల వారి శుభముల్ దృక్కోణమందుండగా. అలాగే ఈ ప్రసంగం కూడా వినదగ్గది.https://www.blogger.com/blogger.g?blogID=4174482763145446746#editor/target=post;postID=924532607569542971
కష్టమైన ప్రాసతో గురువుగారిచ్చిన సమస్యకు నా పూరణ ప్రయత్నాలు. సుజ్ఞానమ్మను భిక్షను నా జ్ఞానులు నరులకిడుదు,రప్రతిహతమౌ యజ్ఞతఁ బోగొట్టు కదా విజ్ఞతలే! నట్టి నరుడె విజయముఁ బొందున్. ( ఆ జ్ఞానులనబడే వారే నరులకు సుజ్ఞానమను భిక్షను ఇడుదురు. అడ్డూ ఆటంకమూ లేకుండా పెరిగే అజ్ఞను అట్టి విజ్ఞతలే కదా పోగొట్టును! అని వ్రాశాను. అన్వయము కుదరలేదంటే దిద్దుకుంటాను.) ధర్మ్యమ్మౌ నడవడికయు, [...]
భారతీయం ప్రవృత్తి , నివృత్తి మార్గాలను రెండిటినీ విశ్వసిస్తుంది. బోధిస్తుంది. కానీ ప్రధానంగా ప్రవృత్తిమార్గం ఎందుకైందిఅంటే నివృత్తి మార్గం బహు క్లిష్టమైనది. -- భగవద్గీత -కర్మయోగాన్ని, కర్మసన్యాస యోగాన్ని రెండిటినీ భగవద్గీత వివరిస్తుంది. అర్జునుడు అడుగుతాడుకూడా. కృష్ణా, మీరు ఒకపరి కర్మసన్న్యాసమును, ఆ వెంటనే కర్మయోగమును ప్రశంసించుచున్నారు.ఈ రెండిటిలో నాకు [...]
వాల్మీకి రామాయణములో కౌసల్య, కైకేయి రామ వనగమన సమయంలో భావోద్వేగాలకు గురి అవడం కనిపిస్తుంది. కౌసల్యా సుతుడైన రామయ్య , కైకేయి పుత్రుడు భరతుడు ధర్మాగ్రహం మాత్రమే చెందుతారు. కానీ సుమిత్ర ఎప్పుడూ పరమ శాంతంగా ఉంటుంది. శాంతమూర్తి అయిన సుమిత్ర తనయులిరువురూ కూడా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తొందరపాటుతో, ఉద్వేగంతో ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇది వింత కాకపోవచ్చు కానీ ఇందులో [...]
రచయిత్రి నిడదవోలు మాలతి గారికీ నాకూ జరిగిన చిన్న చర్చ-సుఖదుఃఖాలు, సదసత్తులు, జన్మాంతర కర్మఫలాల గురించి మామూలుగా మనకొచ్చే సందేహాల గురించి ఒక చిన్న చర్చ - కథ రూపంలో.********************************************************************************** [[గమనిక:   ఈమధ్య నేను చదువుతున్న కొన్ని పుస్తకాలవల్ల నాకు కలిగిన కొన్ని సందేహాలకి అక్షరరూపం ఈకథ. నాకే అయోమయం కనక మీకు కూడా అయోమయంగానే తోచవచ్చు. చదువుతారో లేదో [...]
ఈ నెలలో స్వరమాలిక జాలవాణి myindmedia.com (web radio) లో నా కార్యక్రమాలు--- మధ్యాహ్నం (1.30 pm -2.30pm) ఈ గంటలో మిగతావాటితో పాటు నా ఈ పఠన కార్యక్రమాలూ ఉంటాయి. శనివారం-11/17 సూర్య శతక పఠనం-రెండవ భాగం శనివారం- 18/17 సూర్యశతకపఠనం మంగళవారం- 21/17 లెక్కంటే లెక్కే {శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి గారు వ్రాసిన కధ-november 20, 2016 సాక్షి ఫన్ డే లో ప్రచురితం}
కొత్తగా ప్రారంభించిన మై ఇండ్ మీడియా లోని స్వరమాలిక వారి కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి నాడుసూర్యభగవానుని గురించీ, ఎండ గురించీ నా చిన్ని ప్రసంగాలు రెండు.ఈ లింక్ లో వినవచ్చు.మై ఇండ్ మీడియా డాట్ కామ్ లో స్వరమాలిక అనే లింక్. http://myindmedia.com/index.php/2017/01/29/jan-14th-2017-svaramaalika-presented-myindmedia/
శార్దూల విక్రీడితము- తల్లీ! విద్యల నేర్వ నాశగలిగెన్, దక్కించు, దీవించు, వ ర్ధిల్లన్ కూర్మిని విద్యలందుఁ, గనుమా! దేవీ, సతీ,శారదా! తెల్లంబై సకలంబు, జ్ఞానమది యుద్దీపింప నన్యంబు నే నొల్లంబోవను, పాదపద్మములనే యుండంగ కాంక్షించుదున్. మధ్యాక్కర- మంచిది, కానిది యన్న మాన్యవిచక్షణ తెలియ కొంచెము విజ్ఞత యుండు గొప్పలక్షణమును మాకు పెంచుము, లోకము నందు పెరుగు సమరసము తల్లి! యుంచుము [...]
భారతదేశం ఎప్పుడెప్పుడు ముక్కలయిందో చూస్తే ఆశ్చర్యమౌతుంది. మొన్నటి శతాబ్దం అంటే 1800 నుంచే ఇలా ముక్కలైంది.మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు సింహరూపంలో కనిపిస్తోంది . కదా!
పేస్బుక్ లో సుధీర్ కుమార్ , ఎమ్మిగనూరు గారి పోస్ట్. 2016 సెప్టెంబర్ 29 భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. కడచిన నాలుగున్నర దశాబ్దాల్లో మొట్టమొదటిసారి మన సైనిక బలగాలు మాటువేసి, గీతదాటి, పాకిస్తాన్‌కి దానికి అర్థమయ్యే భాషలో, జన్మలో మరవలేని గుణపాఠం నేర్పాయి. అదీ ప్రపంచంలో ఎవరూ వంకపెట్టలేని రీతిలో! దెబ్బతిన్నవారే కనీసం తమకు దెబ్బతగిలిందని చెప్పుకోలేక [...]
కం. కృష్ణా! నిను నా మనమున విష్ణువునవతారమంచు వేడుచునుందున్, తూష్ణీకరణమ్మువలదు, నిష్ణాతుడవీవె మమ్ము నీ కడఁ జేర్పన్. ఉ. శ్రావణమాసమందు నిలఁ జల్లగ వచ్చితివంద్రు, వేడుకల్ నీవిట పుట్టినావనుచు, నిర్మల ప్రేమలఁ దేల్చు కృష్ణుడే దేవుడు మాకటంచు పలు తీరుల పూజల చేసి, భక్తితో త్రోవల పాదముల్ పువుల తోరణముల్ వెలయింపజేయరే! చం. కలకల నవ్వ క్రొవ్విరులు కన్నెలమోముల పూచె నెల్లెడన్ జలజల [...]
మనసు మూగదనుచు జాలి మానగవలెనోయి! మూగతనమేమొ, మనుజుని తనదు దారినిఁ గొనిపోవుచుండు,కనుమయ్య! కట్టివేయగల కాఠిన్యమొకయింత లేకమునుగుచునుందురు జగతి, మోహపు సాగరమందు.ఎల్ల మరచి యాటపాటలేను గొప్పవటంచు నుంద్రుకల్ల కపటములు లేని కలకల నగవుల బాల్యమెల్ల, పిదప లోకములను మిగుల బాగుపరచ కాలమెల్ల గడుపుచుందు,రేమి మేళులు చేయగ జాలు?నిజమునెరుగునంతలోన నేల విడుచుకాలమౌను,సజలనయనములతోడ [...]
ఒక్క పుత్రకామేష్టిని యోగమబ్బె,రెండు చేతుల ప్రాప్తించె దండి ఫలము.మువ్వురు సతులకొసగగ మురిపెముగను,నల్వురదొ సుతులు జనించినారు కనుఁడు.పంచచామరముకులీనుడైన రాజు నిండుకుండ తీరు మానుచున్, భలే భళీ యటంచు ముద్దు పాపలన్ ముదమ్మునన్విలాసరీతి నుయ్యెలన్ వివేక గీతి పాడి వారలెల్లరన్ పరుండజేయు రాజసమ్ము చూడుమా!శార్దూలవిక్రీడితమువీరాగ్రేసర! [...]
శివ! శివ! నీదు పాదమునుఁ జేరుదు నీదు కటాక్షమున్నచో, భవమును దాటిపోనగును పాపము, పుణ్యము, చావుపుట్టుకల్, రవ పరిమాణమేని మిగులంగల జాలవు దేవరా! హరా! కవనము వ్రాసి నిన్నుఁ గన కౌశలమైన యొసంగనెంచుమా!
వీరసేనల ఊపిరాగెను నీకు ఊపిరులూదగాదేశభక్తుల గుండెలాగెను నీదు ఆయువుపెంచగా|ప్రజలసేమము కోరుధీరులుసాగిరసువులుబాయగాధ్వజము నిలుపుట పరమ ధర్మమ్మను నిజము నీవెఱుగగా| వీర|తాత తండ్రులు అమ్మలక్కలు రూపుదిద్దిన స్వేచ్ఛకేమాట దెచ్చెడు పనులు మూర్ఖపు చేష్ఠలేవో ఎఱుగరా!జాతి పతనముఁ జేయు చేతలు ఏలరా? నీకేలరా?|వీర|జయపతాకము నిలుచు వరకే కుశలమనునది నీకురాభయమరాచకమన్నవెల్లను [...]
యమునా తటిపై గోమిని సముఖముకౌముది వెలుగుల సుమకోమలికి..కమనీయముగా రమణుని శ్వాసేమురళీరవమై మది దోచునుగా!
మొక్కకు పుట్టీ, చెట్టుగ పెంచిన చిత్రమీ పత్రము!రాలిన వేళల చాచిన చేతుల మిత్రమీ ధాత్రియు!చక్కటి అందము చెట్టుకు నిచ్చిన రీతినేనేలకు పంచిన నేర్పును చూడుము మిత్రమా!
http://www.telugunighantuvu.org/ఈ చిరునామాలో , తెలుగు నిఘంటువు అనే పేరుతో రంగులతో, హంగులతో అలరారుతూ తెలుగు భాషానురక్తులకు,1. తెలుగు పదములు, పద్యములు, వ్యుత్పత్తి తెలుసుకోగోరే వారికి,2 .తెలుగుని ఇతర భాషలోని పదాలతో పోల్చి చూడాలనుకునేవారికి,3.ఆ యా పదాల్ని పద్యంలోనూ , వచనం లోనూ ఎలా ప్రయోగించారో నేర్చుకోడానికి,4. పర్యాయ పదాలకోసం వెతికేవారికి,5. ఒక్కో పద్యానికీ ఛందోరూపం తెలుసుకోవాలని [...]
మంగళదాయిని మా గౌరిజంగమరాయని శ్రీ గౌరిసింగముపై కొలువై యుండేబంగరు తల్లీ, మముఁ గనుమా!త్రుంచగ లోభము, మోహము తొలగగ..సంచిత కర్మల సంగము విడువగ..మంచీ చెడులూ నిండిన జగముననెంచి మసలుకొను తెలివిడి నిడుమా! ॥ మం॥కంటికి కనపడు కాయము కతముననంటును పాపము పుణ్యములన్నియు..కంటకమగునవి మోక్షపు దారులనొంటరిగా విడ నొల్లకు మమ్మా!                             *         *         *
      విశాలమైన భారత సరిహద్దులను సర్వదా, సర్వథా కనిపెట్టి యుండి కాపాడేందుకు ఒకప్పటి భారత ప్రధాని శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారు ఏర్పాటు చేసిన సరిహద్దు భద్రతా దళం సేవల్ని ఎన్ని నోళ్ళ కొనియాడినా చాలదు.         మన సరిహద్దులను సైనికులు భద్రంగా కాపాడడం వల్లనే సరిహద్దుల మధ్యలో ఉన్న భారతంలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. బహిశ్శత్రువులనుంచి వారు [...]
క. మును పాపములెన్ని యొన,    ర్చినఁ బిదపను గంగనాడఁ జీఁకటి రవి దోఁ    చిన విరియుగతి విరియు న,    య్యనఘుఁడిలాతలము దొఱఁగి యమరతనొందున్.తా. ఎన్ని చీకట్లున్నా రవి ఉదయించగనే అన్నీ అంతరించినట్లు, గంగా స్నానము చేసినవెంటనే పాపాలన్నీ తొలగి పోయి పాపరహితుడై జీవుడు అమరత్వమును పొందగలడు.క. మేనించుక సోౕఁకిన గం,    గానదితోయములు జనుల కల్మషకోటిం    బో నడచి పురందర లో    [...]
       వందేమాతరం పలుకునే నిషేధించి కఠినంగా అప్పటి దురాక్రమణదార్లు ప్రవర్తిస్తున్నప్పటికీ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో వెనుదీయని గుండెబలంతో మన జాతీయస్ఫూర్తిని పెంపొందించే విధంగా జనచైత్యన్యం కదం తొక్కే విధంగా కవులు ఎందరో ఎన్నో జాతీయ రచనలు చేసినారు.    గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అటువంటిదే. రాయప్రోలు వారి సిరులు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు