యధాప్రకారం స్కూల్ బస్సు దగ్గరకి వెళ్ళిన సూరిగాడు, అయిదునిమిషాల్లోపే మెసేజ్ పెట్టాడు. వాడికీమధ్య ఫోన్ (ఫోన్ అనటం మోటు ఈరోజున తెలుగు అందునా ఈనాడు ప్రపంచంలో. చరవణి అనాలి ట. ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉవాచ. అదికూడ చఱవాణి కాద ట) కొనిపెట్టాను. అవసరం అనిపించింది. లేట్ ఈవెనింగ్ క్లాసులు గట్రా. ఫోన్ చేతిలో ఉంటం మంచిది అనిపించింది. life360 అని ఒక అప్లికేషన్. అది వేస్తే, ఫోన్ [...]
పిల్లలీమధ్య  పిల్లలున్న వాళ్ళు ఎవరు ఇంటికొచ్చినా స్లీపోవర్కి ఉంటారా అని అడుగుతున్నారు. ముఖ్యంగా అనఘ. తన మిత్రురాళ్ళ బృందంలో ఎవరొచ్చినా స్లీపోవర్కి ఉండండి, ఉండనివ్వండీ అని వచ్చిన తల్లితండ్రుల్ని, ఉండమని చెప్పండి అని మమ్మల్ని పోరుతున్నారు.బాగనే ఉన్నా ఇది ఎక్కడన్నా వికటిస్తుందేమో ఎక్కడో ఓ భయం. ఆ భయానికి మూలం ఓ మితృడి ద్వారా విన్న ఒక సంఘటన!ఒక దేశీ తెలుగు [...]
మొన్నీమధ్య ఏకస్థలబహుళసముదాయంలో ఓ దేశీ పిల్లాడు, సూరిగాడికన్నా ఓ ఏడాది పెద్దవాడు, పిల్లలతో ఆడుతూ ఓ బూతుకూత అలవోకగా కూసినాడు. వెనువెంటనే కొందరు పిల్లలు ఆ పిల్లాడి తల్లికి ఆ విషయాన్ని మోసుకెళ్ళినారు. సదరు తల్లిగారు ఇలా వాక్రుచ్చినారు"ఓహ్! అవునా! తప్పుకదూ! కానీ, కావలని అన్నాడా లేక ఊతపదంలా అన్నాడా? ఓహ్! ఊతపదంలా అన్నాడా! అయితే తేలిగ్గా తీసుకుని వెళ్ళి ఆడుకోండి పోండి".అదే [...]
జనవరి నెలలో ఉత్కృష్ట సోమయాగం జరుగనున్నది. శ్రౌత సంవర్ధనీ సభ వారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర కాప్రే గారి అధ్యక్షతన జ్యోతిరప్తోర్యామం - ఉత్కృష్ట సోమయాగం జనవరి ౧౯ నుండి ౨౪ వరకు,  ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో జరుగనున్నది. అవకాశం ఉన్నవాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలయందు ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక పాల్గొనవలసిన కార్యక్రమం.
ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: దేశరాజధాని నగరం దిల్లీలో సరి-బేసి సంఖ్య వాహన విధానం నేడు అమలు చేసినప్పటికీ కాలుష్య స్థాయి అధికంగానే ఉందని అధికారులు వెల్లడించారు. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు దిల్లీలో సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్‌ సంఖ్య వాహనాలు రోజు మార్చి రోజు తిరగాలనే నిబంధన అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈరోజు కూడా [...]
మీ అందరికీ తెలుసు, కేవలం బళ్లో పాఠ్యపుస్తకాల వల్ల విజ్ఞానం పెరగదూ అని. విజ్ఞానం పెంపొందాలంటే కావాల్సింది చదవడం, చిన్నవయసప్పటినుండే పుస్తకాలు, రకరకాల పుస్తకాలు చదవడం ఒక వ్యసనంలా మారాలి.నేను ఇక్కడకి వచ్చాక, నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది మన దేశీ పిల్లల్ని గమనించే అవకాశం లభించింది. అలాంటివారిలో అజిత్ గారి కూతురు, నాలుగో గ్రేడ్ అనుకుంటా, ఎన్ని పుస్తకాలు చదువుతుందో ఆ [...]
ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -౧. వ్యాయామం ముఖ్యం౨. మానసిక ఒత్తిడిని తగ్గించుకోటం ముఖ్యం౩. బరువుని అదుపులో పెట్టుకోటం ముఖ్యం౪. వేళపట్టున భోజనం ముఖ్యం౫. కంటి నిండా నిద్ర ముఖ్యం౬. ఇంటికి వెళ్తూ ఆఫీసుని, ఆఫీసుకి వెళ్తూ ఇంటినీ తీసుకువెళ్ళకుండా ఉంటం ముఖ్యం౬. గీత గీస్కొని, అది దాటకుండా ఉంటం ముఖ్యం. అనగా, ఒక పెగ్, లేక ఒక బీర్.  అంతే! ఒక చుట్ట. మానేయండి అని చెప్పను. [...]
అలా ఆడి సెంపపేల్సినాక యెడ్డు మమ్మలొందర్ని అదరగొట్టి సెప్పేడు; ఉరే యెదవలఁజాకొడకల్లార, సెంట్రల్జెయిల్దప్ప ఇంకో యెడ్రసే లేని దొంగలంజాకొడకల్లార, బేచీలకింద సెట్టయిపొయ్యి ఊరుని దోసుకునీ దగుల్బాజీ నా కొడకల్లారా! ఊరంట దిరిగీ ఎర్రిపీరు నా కొడుకుల్ని దోసుకొమ్మని జెప్పి మీకు ఒవడిచ్చేడ్రా అక్కు? ఏడుకొండల ఎంకటేస్సెర సోవి ఇచ్చేడా, లేక, మాల కొండ మల్లికార్జునస్సోవి ఇచ్చెడా? [...]
అటుచూస్తే కొడబండలు,ఇటు చూస్తే రాక్షసి డొంకలు.కాని ఇది విమల.అటుచూస్తే పెద్దపులుల కోరలు, ఇటు చూస్తే పడగలెత్తిన పాములు,కాని ఇది విమల.అటు చూస్తే సెగలు సెగలు, ఇటు చూస్తే పొగల సుడులు,కాని ఇది విమల.అటు చూస్తే దొరికే ఎండలు, ఇటు చూస్తే కొరికే నీడలు,కాని ఇది విమల.అవును సరే, కాని ఇది విమల.అటు చూస్తే ఎత్తుదొరకని మహా పర్వతాలు, ఇటు చూస్తే లోతుచిక్కని చీకటి అగాధాలు లేదా ఒడ్డులేని మహా [...]
కూడలిని మూసివేయటం బాధగా అనిపించింది. ఎందరో తెలుగు బ్లాగులోకపు బావిలో కప్పలకు దొరికిన ఒక పెద్ద తామరాకు కూడలి. నా బ్లాగుగుకి ఇన్ని హిట్స్ తెచ్చిపెట్టిన కూడలిని మూసివేయటం కన్నా ప్రజలకు అంకింతమిచ్చి మీరే మేనేజ్ చేస్కోండర్రా అనుంటే బాఘుండేది. నాబోటి కప్పలు కొన్ని కాస్తోకూస్తో విత్తసహాయం కూడా చేసే అవకాశాం ఉంది. ఏవైనా - గూగుల్ లాంటి వాళ్ళే ఈరోజు టెక్నాలజీని రేపు [...]
నీలోని చీకట్లనుజ్ఞానపు దీప అవళులతోపారద్రోలుకోనిన్ను నమ్ముకున్న వారి మనసునదీప అవళులను వెలుగించుకుల దీపకుడివై ప్రజ్వరిల్లుసత్ సమాజ నిర్మాణానికిదారులు వేస్తూఆ దారుల వెంటదీప అవళులని జ్వలింపజేయుఅదే నేటి సమాజంరాబోయే తరానికినీవందించేనిజమైన దీపావళిదీప అవళిజై హింద్
హ్యూస్టన్ డౌన్ టౌనుకి దగ్గర్లో మిత్రులు ఎవరన్నా ఉంటే admin.websphere@gmail.com కి మెయిల్ ఇవ్వగోరతాను
ప్రవాసభారతీయుల మనసుల్లో  ఎన్ని ప్రశ్నలో. సరిగ్గా సమాధానం దొరక్కా, మింగలేక కక్కలేక లాక్కోలేకా పీక్కోలేక మానసికంగా  ఎన్ని అవస్థలుపడతారో. అసలు అమెరికా  ఎందుకెళ్ళాలటా అంటారు కొందరు, అది వాళ్ళు వెళ్ళనంతవరకే. అదే  అవకాశం వారికొస్తే వెళ్ళటానికి వెనుకాడరు. అదలా ఉంచితే ఒకతని ప్రశ్నలు దానికి మరొకతని సమాధానం ఇక్కడ పెడుతున్నా. మీరేవంటారో చెప్పండి?Question by someoneSorry to post this here, but since [...]
జస్ట్ టు ఇన్స్పైర్!నేను వెయ్యి మైళ్ళు నడిచినానని గొప్పగా చెప్పటంలేదు కానీ, ఆనందంగా చెప్పుకుంటున్నా. ఈ వెయ్యిమైళ్ళ నడక కేవలం బయట నడుస్తూ రికార్డ్ చేసినవి మాత్రమే. మధ్యలో అనేకం ట్రెడ్ మిల్ మీద నడిచినవి ఉన్నాయి. ఈ సొద ఎందుకంటే, నడవండి!నడక మంచిది!!
తల్లీతండ్రీ తర్వాత గురువే అన్న సంస్కృతి మనది. తల్లీతండ్రులు దేవుళ్ళు అని అంతటితో ఆగలేదు, గురువుకూడా దేవుడితో సమానం అన్నారు. గురువుకి అంతటి గొప్ప స్థానాన్ని ఇవ్వగలిగిన, ఇచ్చిన సంస్కృతులు ఇతరదేశాలలో ఉన్నాయోలేదో  మరి నాకైతే తెలియదు. గురువుకి శుశ్రూష చేసి గురువు చల్లని చూపులద్వారా  తృప్తిపొందిన రోజులు ఈకాలంలో లేకపోయినా, ఒక మంచి ఉపాధ్యాయుడు బజారులో వస్తుంటే ఊరి [...]
మొన్న శనివారం మా ఊళ్ళో భారతీయ ఉత్సవం జరిగింది. ఇది పదొవ వార్షికోత్సవం అన్నమాట.ప్రతీఏటా భారతీయ ఉత్సవం జరిపి, భారతీయ భోజనం, గోరింటాకు, చీరలు, ఇలాంటి తతంగం నిర్వహించటం జరుగుతూ వస్తున్నది. ఇంతక మునుపు నేను పెద్దగా పాల్గొనకపోయినా ఈఏడు మిత్రుల ఆహ్వానం నెల ముందే అందింది. భాస్కర్/హరిత దోశలు పోసే లిస్టులోకి చేరుకున్నారు దోశాస్టాల్లో. దోశ స్టాల్, స్నాక్ స్టాల్, పూరి స్టాల్, [...]
యొప్లైట్ లాంటి యోగర్ట్ కొనేప్పుడు కంటెంట్స్ చూసి కొనుక్కోటం మంచిది. యోప్లైట్ యోగర్ట్ లో కొషర్ జిలాటిన్ ఉంటుంది. యొప్లైట్ వాడి సైట్లో ఇలా ఉంది -Why does Yoplait use gelatin?Gelatin gives consistency and texture to yogurt and Yoplait uses kosher gelatin that's beef-derived. Yoplait yogurt carries KD (Kosher Dairy) Certification, certified by Rabbi Barnett Hasden.అనగా! సదరు జిలాటిన్ అనేది ఆవు మాంసం నుండి రాబడినది.యోప్లైట్ వాడిదగ్గరే ఈ కింది సమాచారం కూడా ఉన్నది - Yoplait Greek 100 is a great option for those looking for a gelatin-free Yoplait option. [...]
_వంశపారంపర్య పాలనకు చెక్ చెప్పేందుకు రాహుల్ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని ఏఐసిసి కార్యదర్శి జీవన్ వాల్మీకి చెప్పార #ట_ రాహు పేరు త్యాగరాజు అనిపెట్టుంటె ఎంత బాగుండేడ్చేదోవాళ్ళ అమ్మ సాని'యా త్యాగాలువాళ్ళ సిస్టరు త్యాగాలువాళ్ళ నాన్న త్యాగాలువాళ్ళ బావ త్యాగాలుబాబోయ్సివరాకరికి వీడు *స్టేటు త్యాగాలు* లేక *త్యాగం అనే  స్టేట్* లో మునిగిపోయాడు.వయసు [...]
మాచర్ల పాలనా రాజధానిగా చేయాలి అని నా ప్రపోజల్.అన్నిటికీ దూరంగా ఉంటుంది. రైల్ మార్గం ఉంది. దగ్గర్లో నాగార్జున సాగర్ ఉంది. ఐసొలెటెడ్ ప్లేస్. ప్లెంటీ ఆఫ్ అడవి. ఎలాగూ కబ్జాకి గురైయ్యెదే. అదేదో ప్రభుత్వమే కబ్జాచేస్తే బెటర్.
ఓట్లకోసం రాజ్యాన్ని చీల్చేదరిద్రపు రాజకీయ రాబందులురేపొద్దున నరుణ్ణి చీల్చరనీమాంసాన్ని కొట్టి ఇటలీకో చీనాకో అమ్మరనీనమ్మకం ఏంటీ?జాతి నరాలతో ఇటలీలో వీణలు అమ్ముకునేబేహారులను తరిమికొట్టకుండానెత్తినపెట్టుకు పూజించే మనం!మరోమారు బలౌదాంమరోమారు వారినే గెలిపిద్దాంమనల్ని మనం పాతాళానికి తొక్కుకుందాం
నాన్న పుట్టినరోజు జూలై 5
మొన్న నా కారులో మరోమారు రఫి గారి పాటల సిడీ పెట్టి వినటం మొదలుపెట్టినాను. ఒక్కోపాటా ఒక్కోపాటా విన్నాక వచ్చిందీ పాటబహారోఁ ఫూల్ బరసావోమేరా మెహబూబ్ ఆయాహైనోరు దానంతటదే హమ్ చేయటం మొదలెట్టిందని చెప్పాల్సిన పనిలేదు. ओ लाली फूल की मेंहँदी लगा इन गोरे हाथों मेंउतर आ ऐ घटा काजल, लगा इन प्यारी आँखों मेंఓ లాలీ ఫూల్ కి మెహింది లగా ఇన్ గొరె హాథోం మేఁఉతర్ ఆ యె ఘటా కాజల్, లగా ఇన్ [...]
సూరిగాడికి అనేక పిచ్చులు ఉన్నాయి. వాటిల్లో అత్యంత గొప్ప పిచ్చి పజిల్స్! చిన్నప్పుడు మూడేళ్ళ వయసప్పుడనుకుంటా, మికీ మౌస్ పజిల్ తెచ్చిచ్చాను. ఇరువదినాలుగు పీసులు ఉండే పజిల్ అన్నమాట. మొదలెట్టాడు ఏకాగ్రతతో! మొత్తానికి సాధించినాడు. వాడి ఇంటరెస్ట్ చూసి, వాడి ఇంటరెస్టుని ఉత్సాహపరుద్దాం అనిపించింది. ఓరోజు టాయిస్-స-రస్ కి వెళ్తే మెలీసా అండ్ డగ్ వాళ్ళ పజిల్స్ సేల్లో ఉంటే [...]
ఈనాడు, గుంటూరు: గుంటూరు నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు పోతురాజు వెంకటశరత్‌కుమార్‌ అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో అదృశ్యమైన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. గుంటూరు నగరం ఎ.టి. అగ్రహారానికి చెందిన విశ్రాంత ఏసీటీఓ వెంకట కృష్ణమూర్తి కుమారుడు శరత్‌కుమార్‌ గత కొన్నేళ్లుగా అమెరికాలో టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే ప్రేమ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు