రెండో ప్రపంచ యుద్దం మీదా, హిట్లర్‌ మీదా ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చార్లీ చాప్లిన్‌ తీసిన ''ది గ్రేట్‌ డిక్టేటర్‌'' విలక్షణమైనది.టాకీ చిత్రాలు మొదలైనా మూకీ చిత్రాలనే నిర్మిస్తూ వచ్చిన చాప్లిన్‌ మొట్టమొదటి సారిగా తన గొంతు విప్పింది ఈ చిత్రంలోనే.రెండో ప్రపంచ యుద్ధం ఇంకా మొదలు కాకముందే 1938లోనే చార్లీ చాప్లిన్‌ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు. [...]
కుక్క తప్పిపోయింది(కథ)ఫోన్ గణ గణ మోగింది !జ్యోతి పరుగు పరుగున వెళ్లి ఫోన్ అందుకుని “హలొ...” అంది ఆదుర్దాగా."నమస్కారం అండి" అట్నుంచి ఎవరిదో గొంతు !"నమస్కారం. ఎవరు?”"మీరు కుక్క తప్పిపొయింది అని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా!"“అవును. కానీ అది కుక్క కాదండీ. టామీ. మా ప్రాణం....”“...”“...టామీ మా కన్న కూతురు కంటే ఎక్కువండీ. అది కనపడకుండా పోయినప్పటి నుంచీ నాకూ మావారికీ నిద్రాహారాలు [...]
విమానం మోతవరంగల్‌ ఎ.వి.హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ అమితాబచ్చన్‌లా సన్నగా, ఆరడుగుల ఎత్తున్న ఓ తెలుగు టీచర్‌ వుండేవారు. తెల్లని పంచె కట్టుకుని, పొడుగు చేతుల కమీజు వేసుకుని, నుదుట నిలువు నామం దిద్దుకుని చక్కగా పెళ్లికొడుకులా తయారై స్కూల్‌కి వచ్చేవారు. పాఠాలు కూడా అరటి పండు వొలచి చేతిలో పెట్టినట్టు బాగా చెప్పేవారు. అంత సాత్వికంగా కనిపించినా ఆయనంటే చాలామంది [...]
''పత్థర్‌ పూజే హరీ మిలై తో మై పూజూ పహాడ్‌!''                  ''బండను మొక్కితె దేవుడు దొరికితె(బండనేమి ఖర్మ) నేను కొండనె పూజిస్తాను!''                                               - కబీర్‌ దాస్‌(దాదాపు 650 సంవత్సరాల క్రితం విగ్రహారాధనపై సంత్‌ కబీర్‌ దాస్‌ ఎక్కుపెట్టిన ధిక్కార కవితల్లోని ఒక చరణమిది. ''పిండిని ఇచ్చి కడుపును నింపే తిరగలిని [...]
GO NOT TO THE TEMPLEby Rabindranath Tagore:Go not to the temple to put flowers upon the feet of God,First fill your own house with the Fragrance of love and kindness...Go not to the temple to light candles before the altar of God,First remove the darkness of sin from your heart...Go not to the temple to bow down your head in prayer,First learn to bow in humility before your fellowmen...Go not to the temple to pray on bended knees,First bend down to lift someone who is down-trodden.Go not to the temple to ask for forgiveness for your sins,First forgive from your heart those who have sinned against you!........................................................................................................వెళ్లకు గుడికి- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌...................................వెళ్లకు గుడికి దేవుడి పాదాలపై పూలను [...]
కవీనువ్వు బతికున్నంతకాలంఏలినవారికి బద్ధ శత్రువ్వినీపై పన్ని నిర్బంధాలు, ఎన్ని ఆంక్షలు !నువ్వు చనిపోగానే వారికిఆప్తమిత్రుడివి, ఆదర్శప్రాయుడివి !!నీ కవిత్వాన్ని పారాయణం చేస్తారునీ పటానికి దండలేసి దండాలుపెడ్తారుమనువు సైతం వచ్చి అంబేడ్కర్‌ విగహ్రానికిపాలాభిషేకం చేసివెళ్లినట్టు !!                                  - ప్రభాకర్‌ మందార
("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం) కూర్గ్‌. దేశం దృష్టిలో ఇదొక అపురూపమైన ప్రాంతం. ఇక్కడి దట్టమైన అడవులు, వరి పొలాలు, తోటలు అన్నీ పోస్ట్‌కార్డు ఫోటోల్లో ఎక్కదగ్గంత అందంగా ఉంటాయి. కాని చుట్టూరా పర్వత శ్రేణులున్న ఈ చిన్న కర్ణాటక జిల్లా ఇకముందు ప్రశాంతంగా వుండే పరిస్థితి కనిపించడం లేదు. కూర్గులు (లేదా కొడవలు) ఈ ప్రాంత మూలవాసులు. వారిదో [...]
నిర్భీతికి ప్రతీక గౌరీ లంకేశ్గౌరి లంకేశ్‌ 29 జనవరి 1962న షిమోగాలో జన్మించారు. డిగ్రీ వరకు బెంగళూరులో చదువుకున్నారు. ఆ తరువాత పి.జి. డిప్లొమా (మాస్‌ కమ్యూనికేషన్స్‌) ఐ.ఐ.ఎం.సి., దిల్లీలో (1983-84) చేశారు.ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో బెంగళూరు, దిల్లీ (1985-90), సండే వీక్లీలో (1990-93, 1998-2000), చీఫ్‌ బ్యూరోగా ఈ టీవీ న్యూస్‌, , దిల్లీలో (1998-2000) పనిచేశారు. ఆతరువాత తండ్రి పాల్యాద లంకేశ్‌ మరణానంతరం ఆయన [...]
అరుంధతీ రాయ్ "ధ్వంసమైన స్వప్నం" పునర్ ముద్రణ'చిదంబరం వార్,బ్రోకెన్ రిపబ్లిక్,వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ 'అనే అరుంధతీ రాయ్ మూడు ఆంగ్ల వ్యాసాలను తెలుగులోకి అనువదించి 2015 మార్చ్ లోమలుపు బుక్స్ వారు "ద్వంసమైన స్వప్నం" పేరుతొ ఒకే పుస్తకంగా ప్రచురించారు. ఇప్పుడు ఆ పుస్తకం పునర్ముద్రణ వెలువడింది.చిదంబరం వార్‌చిదంబర రహస్యం - అనువాదం : ప్రభాకర్‌ మందారభారతదేశం అనే దేశం గానీ, [...]
జెండర్‌-కులం... విడివిడిగా కనబడే ఈ రెండు అంశాల నడుమనున్న సంబంధం విడదీయరానిది.కులవ్యవస్థ బలపడుతున్న క్రమంలోనే స్త్రీలపై జెండర్‌పరమైన వివక్ష, అణచివేత పెరుగుతూ వచ్చింది. వ్యక్తిగత ఆస్తి, కులవ్యవస్థ కలిసి కుటుంబ నిర్మాణాలను స్త్రీలపాలిటి నిర్బంధ శిబిరాలుగా మార్చాయి. ఆస్తినీ, సామాజిక హోదానూ ఆధిపత్య కులాలకు వంశపారంపర్యంగా అందించటానికి ఆ కులాల స్త్రీలను సాధనాలుగా [...]
నయాగరా ! ప్రపంచంలోనే అతిపెద్దదైన నయాగరా జలపాతాన్ని చూసేందుకు ఆరోజు బాల్టిమోర్‌ నుంచి ప్రొద్దున్నే కారులో బయలుదేరాం. 'నయాగరా సిటీ' చేరుకునేసరికి మధ్యాహ్నం రెండయింది. నగర పొలిమేరలోనే 'నయాగరా నది' మమ్మల్ని పలకరించింది. రోడ్డుకు సమాంతరంగా చాలాదూరం మాతోపాటే పరవళ్లు తొక్కుతూ వచ్చింది. ఆన్‌లైన్‌లో ముందే బుక్‌ చేసుకున్న హోటల్‌కి నేరుగా వెళ్లాం. కాసేపు నడుం [...]
వాషింగ్టన్‌ డీ.సీ.ని చూడటానికి రెండు ''కాళ్లు'' చాలవు !..................................................................................అవును. వాషింగ్టన్‌ డీ.సీ.ని చూడటానికి రెండు కళ్ళే కాదు రెండు 'కాళ్లు'' చాలవు అనే అనిపించింది.వైట్‌ హౌస్‌కు ఎదురుగా రెండు మైళ్ల ఓ సరళ రేఖ గీచి- దానికి ఒక చివరన 'లింకన్‌ మెమోరియల్‌' మరో చివరన 'కాపిటల్‌ బిల్డింగ్‌' నిర్మించినట్టుగా వుంటుంది. మధ్యలో ''వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌''. అంతే. ఆ [...]
 పాతాళ లోకం !..................................వర్జీనియా లోని ల్యురే కావెర్న్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అదేదో చిన్న థియేటర్ లాగా , షాపింగ్ మాల్ లాగా అనిపించింది.టికెట్స్ మాత్రమే అక్కడ ఇస్తారు - అసలు కేవ్స్ మరెక్కోడో దూరంగా వుండొచ్చని అనుకున్నాం.కానీ ఉదయం 9 కాగానే ఒక డోర్ ని ఓపెన్ చేసి లైన్ లో రమ్మన్నపుడు తెలిసింది - ఆ గుహల ప్రవేశ ద్వారం అక్కడే వుందని!మాదే ఫస్ట్ బాచ్.ప్రొద్దున్నే వెళ్ళడం [...]
చెట్టంత మనిషి !........................ బాల్టిమోర్ ఇన్నర్ హార్బర్ లోని "రిప్లేయిస్ బిలివ్ ఇట్ ఆర్ నాట్ " ఆడిటోరియంలో చూశాం ఈ చెట్టంత మనిషిని.పేరు 'రాబర్ట్ వాడ్లో'.ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో నమోదయ్యాడు.ఎత్తు 8 అడుగుల 11 అంగుళాలు.బరువు 439 పౌండ్లు (199 కిలోలు).1918 లో ఇల్లినాయిస్ లో పుట్టిన ఇతను 22 ఏళ్ల వయసులోనే (1940) చనిపోయాడు."రిప్లేయిస్ బిలివ్ ఇట్ ఆర్ నాట్ " ఆడిటోరియంలో [...]
చలో అమెరికా !2 జులై 2016ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ - ఇవై 0277రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, హైదరాబాద్‌ నుంచి రాత్రి 9-45 కి బయలుదేరి అదే రాత్రి 12-20 కి అబు ధాబి ఎయిర్‌పోర్ట్‌ చేరుకుంటుంది.అక్కడ సుదీర్ఘ నిరీక్షణ తరువాత అదే ఎయిర్ వేస్‌ కు చెందిన ఇవై 0131లో 3 జులై 2016 ఉదయం 10-45 కి బయలుదేరి 14 గంటలు ప్రయాణం చేసి (కొన్ని గంటలను ఆకాశానికి అర్పించి) సాయంత్రం 5 గంటలకి వాషింగ్‌టన్‌ డిసి [...]
స్థలం: ఆదర్శ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, జమ్మికుంట, కరీంనగర్‌కాలం: 1968- 69 మధ్య.ఫొటోలో వున్న వారు వరుసగా ఎడమ నుండి కుడికి: శ్రీ యం.వి తిరుపతయ్య (తెలుగు లెక్చరర్‌), శ్రీ రంగనాథ (వైస్‌ ప్రిన్సిపాల్‌), శ్రీ లక్ష్మారెడ్డి (ప్రిన్సిపాల్‌), శ్రీ కృష్ణ (ఇంగ్లీష్‌ లెక్చరర్‌), చివరగా మొండి ప్యాంట్‌, హవాయి చెప్పులతో బెరుకు బెరుకుగా నేను.సందర్భం: కాలేజ్‌ మ్యాగజైన్‌ ఎడిటోరియల్‌ [...]
బుద్ధుడూ - బౌద్ధమత భవిష్యత్తూమత ప్రవక్తలు ఎంతోమంది వున్నప్పటికీ ఈ ప్రపంచాన్ని నలుగురు మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేశారంటారు అంబేడ్కర్‌ ఈ రచనలో. వాళ్లు బుద్ధుడు, జీసస్‌, మహమ్మద్‌, కృష్ణుడు. జీసస్‌ తనని తాను దేవుని కుమారుడిగా చాటుకుంటే, మహమ్మద్‌ తాను  దేవదూతగా వచ్చినట్టు చెప్పుకున్నాడు. ఇంకో అడుగు ముందుకువేసి తానే 'చిట్టచివరి దేవదూతను' తన తదనంతరం మరే దేవదూతా [...]
ఈ రోజు (19-10-2015) నమస్తే తెలంగాణా (జిందగీ పేజీ)లో ప్రచురించబడ్డ నాచిన్ననాటి బతుకమ్మ పండుగ జ్ఞాపకం : అంటరాని బతుకమ్మ!నలభైఐదేళ్ల కిందట వరంగల్లుల జరిగిన ముచ్చట. గారోజు సూర్యుని కంటె ముందుగాలనే లేసి దోస్తులతోని కట్టమల్లన్న దాన్క పోయి సంచెడు తంగేడు పూలు తెంపుకొచ్చినం. కొన్ని గునుగు పూలను ఇంటిముందటికి అమ్మొస్తె మా అమ్మ కొన్నది. ఒక్కొక్క కట్టని ఒక్కొక్క రంగునీళ్లల్ల ముంచి [...]
1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామారచన : మనోజ్‌ మిట్ట, హెచ్‌.ఎస్‌ . ఫూల్కాఆంగ్లమూలం: When A Tree Shook Delhi, The 1984 Carnage and its Aftermath (Roli Books, New Delhi); The Fiction of Fact-finding: Modi and Godhra (Harper Collins publishers India), .తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార, రివేరాప్రధమ ముద్రణ : సెప్టెంబర్ 2015441 పేజీలు, వెల : రూ. 250/-ప్రతులకు వివరాలకు:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,హైదరాబాద్‌ - 500006ఫోన్‌ : 040 2352 [...]
భారతదేశం ప్రజాస్వామ్యం - బి.ఆర్‌.అంబేడ్కర్‌''ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వరూపమే ప్రజాస్వామ్యం'' - అంబేడ్కర్‌రాజ్యాంగం, ఓటు హక్కు, ఎన్నికలు ... ఈ మూడూ వుంటే చాలు ఆ దేశంలో ప్రజాస్వామ్యం వున్నట్లే అని భావించడం పొరపాటు. అవన్నీ పాలకవర్గానికే ఉపయోగపడుతున్నాయనీ, పైగా వారి పెత్తనానికి చట్టబద్ధత [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు