ఆకాశంలో అమావాస్య నిండా నక్షత్రాలే కనిపిస్తాయి. నిజానికి అవి నక్షత్రాలు కావేమో. అక్షరాలేమో. ప్రతిరోజూ తనతో పాటు ఆడుకునే చందమామ రాలేదేంటా అని ఆలోచించి ఆలోచించి గగనసఖి వ్రాసుకున్న ఉత్తరంలోని అక్షరాలేమో. ఎక్కడ ఉన్నా కనిపించేలా, ఆకాశం అంతటా నిండేలా మనసు పరచి చెప్పుకున్న భావాలేమో. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా ఆ భావమంతా చందమామని మళ్ళీ రమ్మనే కదా! చిన్న చిర్నవ్వంత [...]
విరిసే కిరణమైన పూర్ణచంద్ర కరస్పర్శకుఎగసిపడకపోతే కెరటమెందుకు?ఎగసి పడి అలలై తాకే సాగర కరస్పర్శకుకరిగి జారని సైకత తీరమెందుకు?సమీరడోలలలో ఊయలూగని తీవెలెందుకు?చినుకు తాకిడికి చిగురించని తరుశాఖ ఎందుకు?పలకరింపుకు పులకరించని ఎడదలవెందుకు?
మూసిన నీ కనురెప్పలలోజ్ఞాపకాల అలల నిటుల చెక్కిట చేయి చేర్చికన్నార్పక చూస్తూన్నా.విరిసిన నీ వదనములోదాపరికపు తలపులెన్నొలెక్కించే నెపము తెల్పువిన్నాణము కంటున్నా.ఒలికిన నీ పలుకులలోతీపి గుళిక గురుతులెన్నొసొక్కించే తీరు గాంచినన్నే కోల్పోతున్నా.
కళ్ళు ఆకాశాన్ని చేరుతున్నా,కాళ్ళు అవనిని వీడజాలవు.కనిపించే ఊళ్ళనూ, కనిపించని ఒత్తిళ్ళనూదాటడమొక కల ఐనా, కలనైనా దాటేనే!చిక్కు ముళ్ళై గుచ్చుకుంటున్నా,కొన్ని ముళ్ళు విడజాలవు.  ఆరని వాకిళ్ళుగా తడిసే పక్ష్మాలలోచాటడమొక కల ఐనాకలనైనా చాటేనే!
మెరిసే గగనసుమంనను గని మురిసిన తరుణంవిరిసే నవసుమంనాకై కురిసెనె మకరందంవీచే చిరుపవనంఒంపినదెంతో సుగంధంలేచే ప్రతి కెరటంనింపెను నాలో సంరంభంతలపుల పరుపుల శయనించికొలువులు సేయగ మదినెంచిపలవరింతల కలరవమ్ములకలతనిదురలకిరవై, రెప్పలు బరువైచలియించిన మది పాడినదిదియే రాగం.
మౌనాలతో పేర్చుకున్న నిశ్శబ్దపు కోటలోకిగానాలతో చేరువై వేణువొకటి అలరించిందిప్రాణాలను తోడేస్తూ ప్రాణము లను పోస్తుందిగానమాగకుండగా ఊపిరూదవలెనంటేఅధరముపై చేర్చనెంచు కరములకది అందదేగాలివాటు కొకపరిమాలలల్లి విసరుతూమేలమాడుతోంది
          ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమైందని కవులంటారు. (ఆకాశం -శబ్దం, వాయువు-స్పర్శ, అగ్ని-రూపం, జలం-రసం, భూమి - గంధం)  వీటి నిరూపణ ఏమిటో అవగాహన లేదు.                  ఎప్పుడో ఉరిమినప్పుడు తప్ప ఆకాశం నుంచి శబ్దం వినలేని చెవుడుందేమో. లేదా ఆకాశం ఏం చెప్తున్నా ఎలా చెప్తున్నా తెలుసుకొనే అవగాహన లేదేమో. ఎప్పుడూ వీడని మౌనంగా ఆకాశం కనిపిస్తూ [...]
సంపెంగ గుబాళింపులైసాయంకాలాలు సాయం వస్తుంటేఇంపైన ఇచ్చకాలతోమాయాజాలంలో చిక్కుతుంటేకంపించే మదితీవలురాయబారాలు పంపుకుంటుంటేసొంపైన బాంధవమేదోఛాయామాత్రంగా దృశ్యమౌతోంది. ✉
ఆషాఢమ్మీ ప్రథమదివసంబందు మేఘమ్మ! నేడేే, యోషాపృథ్వీ నినుగనినదే యుల్లమందెల్ల- తా సం తోషానందమ్ముల, కలతలంద్రోసి త్రుళ్ళెంగదోయీ! పాషాణమ్ముల్ కరగునటులన్ వర్షమై చేరుమోయీ! మేఘమై శబ్దజాలమై (కాళిదాసు మేఘసందేశంలో) లయమాధుర్యాన్ని వర్షించిన మందాక్రాంతము గురించి  చదివిన ఆనందంలో  ఆషాఢప్రథమదినం కాబట్టి ఈ మందాక్రాంతం వ్రాస్తున్నాను. :) ********** ఎంతైనా కాళిదాసు మందాక్రాంతంలో [...]
మబ్బు పట్టినా,  ముసురు కవిసినామన్ను, మాను తడిసిపోతాయి; మొలకెత్తుతాయి.మాట విన్నా, మనసు తెలిసినామేను, మనసు మురిసిపోతాయి; పులకరిస్తాయి.ఎదురు చూపులు ఫలించిన ఆనందమేవాటికకూ , మనోవాటికకూ కూడా.నేలా నింగీ అంత దూరమున్నాచక్రభ్రమణాలు తెలిసినపుడు నేలా నింగికున్నంత దూరమున్నా అంతరంగాలు కలిసినపుడుబీటలు వారడాలు, మాటలు పడడాలూ నమ్మకాలను వమ్ము కానీవుతమకాలను కోలుపోనీవు.
మౌనాల పంజరాల్లో నుంచిఊహల రెక్కలు కట్టుకొనిపలుకు చిలుక వాలితే...'రుచి'రమే!మేఘయానాల్లో తేల్చిమధుర ధ్యానాల్లో ముంచిమమత తీరగా పలికితే...సుభగమే!కలలు తీరాలను చేరలేనికలతల అలలు ఎన్నో విరుగుతూ,ఇంకెన్నో వరుస కడుతున్నాయి.మాయా మోహాల వీడలేనితలపులు వలలు బంధనాలు గాసంకేత స్థలాలకు చేరుస్తున్నాయి.సందేశాలందే దారుల్లోసందేహాలింకే తీరుల్లోపదం కలుపుతూపదం కదపలేమా?
నలుదిక్కులనూ చుక్కలు వెలిగిస్తున్నవేళ  అలి చూపులు చిక్కులు పడుతుంటే-కొలుకులైన పలుకుల ముడులు విడుతూ- దాటి వచ్చిన చిగురాకు వాకిళ్ళ గడియలు పెడుతుంటే-   ఒలికిన శర్కర చిరుచుక్కగా-చుబుకపు పుట్టుమచ్చై పుడుతూ-  రసనాస్వాదనలో ఆవిరౌతుంటే-ఇరుల తెరలు జారగా యామినులు ఆమనులను తలపించునో!---------☺
లక్షల కొమ్మల్లో కోట్ల కాయలైపండుతున్న ప్రకృతిని నేను. ఆకలి తీరగా!లక్షల స్థానాల్లో కోట్లపాయలైపారుతున్న ప్రకృతిని నేను.దాహం తీరగా!లక్షల తీవెల్లో కోట్ల పువ్వులైవేడుకైన ప్రకృతిని నేను.మోహం మీరగా!లక్షల మనసుల్లో కోట్ల ఆశలైప్రేమనైన ప్రకృతిని నేను.స్నేహం తోడుగా!---☺
ఉత్పలాలమాల చంద్రునికి -పున్నమి తోడుగా జిలుగు పొంగుచు వెల్లువలౌచు నింగిలోవెన్నెల రాజిలెన్, వెలుగు వెల్లలు వేసినయట్లు నేలపైకన్నులకింపుగా కళలు కాంతులు నింపుచు వేడుకై, యహో! చెన్నుగనుండగా నితర చెల్వములేల, సఖా! సుధామయా!చంపకాలమాల చంద్రునికి -దినమొక తీరుగా కళలు తేరుచు, మెల్లగ మెల్లమెల్లగామనమున నింగిలో వలెనె మక్కువ నిండుచు చల్లచల్లగాకనులను మూసినన్, తెఱచి గాంచిన వోలెనె [...]
కవి అనుభూతినీ, పదకల్పననూ సొంతం చేసుకోగల చదువరి అంతే లోతైన అనుభూతితో తాదాత్మ్యం పొందిఉండడం సహజమైన సత్యం. అప్పుడే, ఆక్షణంలో అయినా, జన్మలకతీతమైన కాలాంతరంలోనైనా.--------లక్ష్మీదేవి.
ఆశలతో కరచాలనం చేయాలని,ఆ కరగ్రహణం చేసి ఆనందాకరాల మెట్టాలని,ఆవలి తీరం చేరేదాక దిగంతాలవైపు పయనం సాగించాలని,గమనమే గమ్యం కన్నా రమ్యం చేయాలని, జీవం పోయిన శవంకనులు కలలు కనవు, ఏనాడో ఎండిపోయి ఉన్నా తేనెపాప ఈదేంత కొలనుగానిండిపోవడం తప్ప.
మొయిలు పల్లకీ లోనచినుకురేడు, మెరుపు రాణిపయనమైతే వాన!కలల అందలమందునతలపురేడు, పలుకురాణిపయనమైతే విరిసోన!కవన ఆందోళికపైనఊగనెంచెనుమరుల మానసవీణ!🎵🎶
ఊపిరి శాపం తీరేదాకాఊహల రాగం వినిపిస్తుంటేబాగుండు.మాయలు మర్మం తెలియకముందేమట్టై పోతేబాగుండు.మానసవీణలు మ్రోగుతుండగామరణం అంచులు దాటేస్తేబాగుండు.తట్టిలేపగల పలుకులు వింటేమెలకువ కోరగల కలలను కంటేబాగుండు.------✍️
వెన్నెల నగవుల ఏ విలాసాలో, వన్నెలు చిలికిననే సరాగాలు.కన్నుల దాగిన ఏ సల్లాపాలో, చిన్నెలు చదివిననే ఉల్లాసాలు.అన్నున కురువగా ఏ పదాల జాలోమిన్నులు దాటునవే ఆనందాలు. ۝۝۝۝۝కనుగవ మూసినంతనే కలల జాతరలు!కలరవముల కలవర పరిచే సందడులు!మనముల విడనను మోహములు,మనుటలు వీడని దేహములు.ఫలముల కోరని సేద్యములు,చలనము తెలియని పయనములు! ۝۝۝۝۝చీకటి అలల్లో వెన్నెల తరగలానీలిజలధిలో [...]
      మాయని వసంతమిదిఇట పూయని లతాంతమేది!     తీయని మధుచంద్రికలివిఎడబాయని తడబాటున్నది.      వ్రాయనిదొక కావ్యమిదిఎలప్రాయపు పలు నవ్యతలున్నవి.------✍️
చీకటి అలల్లో వెన్నెల తరగలానీలిజలధిలో ముత్యపుమెరుగులామనసు పొరల్లోలోపలి అరల్లోనిక్షిప్తమైన నిధివైజీవం పోసిన రాగసుధవైఉండిపో స్మృతిసౌందర్యమా!----లక్ష్మీదేవి. 
కనుగవ మూసిన కలల జాతరలు!కలరవముల కలవర పరిచే సందడులు!మనముల విడనను మోహములు,మనుటను వీడని దేహములు.ఫలముల కోరని సేద్యములు,చలనము తెలియని పయనములు!
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు