ఉత్పలాలమాల చంద్రునికి -పున్నమి తోడుగా జిలుగు పొంగుచు వెల్లువలౌచు నింగిలోవెన్నెల రాజిలెన్, వెలుగు వెల్లలు వేసినయట్లు నేలపైకన్నులకింపుగా కళలు కాంతులు నింపుచు వేడుకై, యహో! చెన్నుగనుండగా నితర చెల్వములేల, సఖా! సుధామయా!చంపకాలమాల చంద్రునికి -దినమొక తీరుగా కళలు తేరుచు, మెల్లగ మెల్లమెల్లగామనమున నింగిలో వలెనె మక్కువ నిండుచు చల్లచల్లగాకనులను మూసినన్, తెఱచి గాంచిన వోలెనె [...]
కవి అనుభూతినీ, పదకల్పననూ సొంతం చేసుకోగల చదువరి అంతే లోతైన అనుభూతితో తాదాత్మ్యం పొందిఉండడం సహజమైన సత్యం. అప్పుడే, ఆక్షణంలో అయినా, జన్మలకతీతమైన కాలాంతరంలోనైనా.--------లక్ష్మీదేవి.
ఆశలతో కరచాలనం చేయాలని,ఆ కరగ్రహణం చేసి ఆనందాకరాల మెట్టాలని,ఆవలి తీరం చేరేదాక దిగంతాలవైపు పయనం సాగించాలని,గమనమే గమ్యం కన్నా రమ్యం చేయాలని, జీవం పోయిన శవంకనులు కలలు కనవు, ఏనాడో ఎండిపోయి ఉన్నా తేనెపాప ఈదేంత కొలనుగానిండిపోవడం తప్ప.
మొయిలు పల్లకీ లోనచినుకురేడు, మెరుపు రాణిపయనమైతే వాన!కలల అందలమందునతలపురేడు, పలుకురాణిపయనమైతే విరిసోన!కవన ఆందోళికపైనఊగనెంచెనుమరుల మానసవీణ!🎵🎶
ఊపిరి శాపం తీరేదాకాఊహల రాగం వినిపిస్తుంటేబాగుండు.మాయలు మర్మం తెలియకముందేమట్టై పోతేబాగుండు.మానసవీణలు మ్రోగుతుండగామరణం అంచులు దాటేస్తేబాగుండు.తట్టిలేపగల పలుకులు వింటేమెలకువ కోరగల కలలను కంటేబాగుండు.------✍️
వెన్నెల నగవుల ఏ విలాసాలో, వన్నెలు చిలికిననే సరాగాలు.కన్నుల దాగిన ఏ సల్లాపాలో, చిన్నెలు చదివిననే ఉల్లాసాలు.అన్నున కురువగా ఏ పదాల జాలోమిన్నులు దాటునవే ఆనందాలు. ۝۝۝۝۝కనుగవ మూసినంతనే కలల జాతరలు!కలరవముల కలవర పరిచే సందడులు!మనముల విడనను మోహములు,మనుటలు వీడని దేహములు.ఫలముల కోరని సేద్యములు,చలనము తెలియని పయనములు! ۝۝۝۝۝చీకటి అలల్లో వెన్నెల తరగలానీలిజలధిలో [...]
      మాయని వసంతమిదిఇట పూయని లతాంతమేది!     తీయని మధుచంద్రికలివిఎడబాయని తడబాటున్నది.      వ్రాయనిదొక కావ్యమిదిఎలప్రాయపు పలు నవ్యతలున్నవి.------✍️
చీకటి అలల్లో వెన్నెల తరగలానీలిజలధిలో ముత్యపుమెరుగులామనసు పొరల్లోలోపలి అరల్లోనిక్షిప్తమైన నిధివైజీవం పోసిన రాగసుధవైఉండిపో స్మృతిసౌందర్యమా!----లక్ష్మీదేవి. 
కనుగవ మూసిన కలల జాతరలు!కలరవముల కలవర పరిచే సందడులు!మనముల విడనను మోహములు,మనుటను వీడని దేహములు.ఫలముల కోరని సేద్యములు,చలనము తెలియని పయనములు!
వెన్నెల నగవుల ఏ విలాసాలో, వన్నెలు చిలికిననే సరాగాలు.కన్నుల దాగిన ఏ సల్లాపాలో, చిన్నెలు చదివిననే ఉల్లాసాలు.అన్నున కురువగా ఏ పదాల జాలోమిన్నులు దాటునవే ఆనందాలు.--------లక్ష్మీదేవి.
పలుకుల ముత్యములెప్పుడుజలజల రాలునొ, కరగని చనువులతోడన్! చెలిమిని మొగమాటమ్ములుతొలగుటలెన్నడొ కరుగుట దూరములెపుడో! పరిపరి మూసిన కన్నులనరుగుటదేలనొ యొకపరి యనువుగ కనులన్తెరచిన వేళల కుదురుగనరుదెంచగ రాదొ! తపన నరయగ రాదో! ----లక్ష్మీదేవి.
                                          విద్యావికాసం(ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారిచ్చిన ఒక అంశం మీద ఫిబ్రవరి 26 నాడు ప్రసారమైన నా ప్రసంగ పాఠం)                   ఇతర ప్రాణులనుంచి  భిన్నంగా నిలబెట్టేదీ, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసికెళ్ళేదీ ఒకటి ఉంది- అది ఆలోచనా భాండాగారం  మానవజాతికి గల గొప్పలక్షణం. దీనిని సక్రమమైన మార్గంలో [...]
ఈ ఉగాది కి కొత్తగా మొదలైన సంచిక పత్రిక లో వచ్చిన నా వ్యాసం-http://sanchika.com/kavi-hrudayam-lo-vaisvika-spruha/
గుండెసడి వినవచ్చే నీరవాలూఆరావాలు వినరాని సందోహాలూశ్రవణానంద తీర్థాలు వెదికే ఎడారులేమెత్తని హృదయ తల్పాలూవెచ్చని వేదనాశ్రు తర్పణాలూతలపుల పన్నీటి గంధాలచూపుల చిలకరింపులూఆ చిత్త చోరునికంకితాలే.
                  నాగాలాండ్ లో ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం మొదలైనవి కావాలని, ఇండో నాగా ఒప్పందం అమలు జరగాలని అక్కడి కొన్ని నాగాల బృందాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నదే. దాదాపు అక్కడి పార్టీలేవైనా  ప్రాంతీయభావోద్వేగాలకు వ్యతిరేకంగా నడచుకోవడం దాదాపు అసాధ్యమే. కానీ ఇన్నేండ్లనుంచీ ఉంటున్న ఈ భావాలు అక్కడి పరిస్థితులలో ప్రత్యక్షంగా [...]
           నోట్ల రద్దు ఆకస్మికంగా ప్రకటించడం వల్ల అక్రమంగా దాచుకున్న కోట్లాది రూపాయలు పనికిరాకుండా పోవడం అన్నది దేశానికి ఉపయోగకరమైన విషయం. వీటివల్ల అనేక అసాంఘిక కార్యకలాపాలకు కనీసం తాత్కాలికంగా ఆటంకం కలిగించినట్లైంది. సక్రమ సంపాదనలోనూ పన్ను కట్టకుండానో లేక చెల్లింపులు చేయకుండానో దాచుకున్న సొమ్ము చాలావరకూ పన్నులు, చెల్లింపుల రూపాల్లో ఆయా [...]
                     సూర్యోదయం ఎక్కడ చూసినా ఎంతో అందంగానే ఉంటుంది. కానీ నంది గిరిధామం (సాధారణంగా 'సొంత'భాషలో అందరూ నందీహిల్స్ అంటుంటారు.) లో సూర్యోదయం పర్యాటకులకు ప్రత్యేకం.           దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున్న కొండమీదికి పొద్దున్న ఐదుగంటలకు కారు చేరేసరికే, అక్కడ ఇంకో ఏడెనిమిది కార్లు, అంతే సంఖ్యలో బైక్ లలో సూర్యోదయాన్ని [...]
అల్లి బిల్లి భావవల్లిమైత్రీలతఎండానీడలు        ఆశాపాశాలు                 మోహామోహాలుజీవనం                                               ఆత్మవిశ్వాస ఊనికలు                                  ఒక పూవనం!
అనుభూతి ఒకటేదోతొలకరి చినుకల్లేమమతల జల్లైఅక్షరమై ఒలికేనోమట్టిని మరువమల్లేమనసును మురిపెంగా చేసేనోధాన్యపు మొలకలల్లేధ్యానపు పులకలనుపెంచేనో పంచేనో...
పండు మిరప ఎఱుపు, ఆపై నారింజ రంగు,అటు వెనుక పసిమి వెలుగులు పసుపు, ఇంద్రధనుస్సుల రంగులన్నీ నింగిలోవెలిగిపోయీ,కరిగి పోయీ,కలిసి పోతూదివినీ భువినీ నింపుతున్న తెల్లని వెలుగుశ్వేతాంబరంలాఏ రంగూ కాకపోయినాఎందుకంత అందమైనది?ఆ లోపల లోలోపలఆ రాగ రాజితాలునిక్షిప్తమైన వేడుకకనులకు కట్టినట్లుమనసును చుట్టినట్లుకానరాగాఎగసిపడే అలలు దాటినడిసంద్రపు నిరామయమైనది కనుక.--------లక్ష్మీ [...]
కడలి నీలాలూ,తరువు పచ్చలూ,సంధ్యల పగడాలూ, గగన మరకతాలూ,పువ్వుల పుష్యరాగాలూ,నవ్వుల ముత్యాలూ,గోధూళి గోమేధికాలూ,చిగుళ్ళ కెంపులూ,మంచి మనసుల వజ్రాలూ,అనుభూతుల వైఢూర్యాలూ,విశ్వంభరునికే అలంకారాలై భాసిల్లే అసలైన నవరత్నాలు!
చివరి పాదము సమస్యగా నేను చేసిన పూరణము- చక్కటి భావధారయును, శబ్దపు మాధురితోడ నింపుగా,పెక్కు సుభాషితమ్ములకు పేరిమి నిచ్చెడు అర్థ సంపదన్,మిక్కిలి నేర్చు పెద్దలును మెచ్చగ వ్రాయుము. ప్రాసకై సదాలెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖమెంతమాత్రమున్. ----లక్ష్మీదేవి.
ఏ చలన చిత్రముఁ గనిననే చిత్రకథలఁ గనినను నేముందోయీ? యోచన లేని పడుచునకువైచును వలలను నొకండు, పడగొట్టుటకై.నిత్యము నిదియే చూచుచు,సత్యమునుఁ గనక యదెట్టి చపలమ్మేమోసత్యమె చెప్పును నీతడసత్యమె పలుకడటనుచును సంబర పడుచున్,మరిమరి నమ్ముచు, పడుచును, కరఁగుచు నుందురు పడుచులు కారణమేమో!యెరుకనుఁ దప్పుచు, బొటబొటకురిపించెదరే తమ, కనుకొలకుల నీటిన్.  వ్యవహారపు జ్ఞానమ్ముల,నవనాగరికపు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు