ఎర్రటి ఎండాకాలం,మధ్యాహ్నం ఎండ సర్రసర్రమని వీపు బద్దలుగొడుతుంది.అప్పుడే పాలు తాగి సగం నిద్రలో జోగుతున్నాను నేను.అంతకన్నా ముఖ్యమైన పనులేమి లేవు చెయ్యడానికి.ఎందుకంటే మరి నా వయస్సు ఇంకా మూడు రోజులే కదా!ఏదో నాపాటికి నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా నా బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటుంటే నాకోసం విజిటర్స్!ఈ టైంలో విజిటర్స్ ఏంటి? ఏ!ఓ వేళాపాళా లేదా అని నా [...]




