సాధారణంగా మనకి కొన్ని ఇష్టాలుంటాయి. చాలా యిష్టాలను దేనికి దానికే ఆస్వాదిస్తాం. కానీ రెండు ఇష్టాలని కలిపి ఒకేసారి ఆస్వాదించడం బావుంటుంది. మనలో చాలామందికి ప్రయాణాలు చేయడం… అందులోనూ రైల్లో ప్రయాణించడం ఇష్టం. అలాగే చాలామందికి ఉండే మరో అభిరుచి పుస్తక పఠనం… అందులోనూ కథలంటే మరీ ఇష్టం. ఈ రెండిటినీ మేళవిస్తూ, రైల్లో పుస్తకాలు చదువుకునేవాళ్ళెందరినీ మనం చూస్తూంటాం. [...]
కొల్లూరి సోమశంకర్ కథల సంపుటి దేవుడికి సాయంపై నా సమీక్ష సంచిక డైనమిక్ వెబ్ పత్రికలో ప్రచురింపబడింది.కొల్లూరి సోమశంకర్ ఈ ఏడాది మొదట్లో వెలువరించిన కథల సంపుటి "దేవుడికి సాయం" పాఠకులను ఆకట్టుకుంటుంది. దీనిలో 16 కథలున్నాయి. మన చుట్టూ కనిపించే సమాజం ఇతని కథలలోని ముడిసరుకు. ఈ కథలలో 8 కథలు ఆత్మాశ్రయపద్ధతిలో  ప్రథమపురుషలో నడుస్తాయి. కొల్లూరి సోమశంకర్ కథలలో మనకు [...]
టోరీ రెడియోలో 14-4-2018 శనివారం టోరి ఓ తెలుగమ్మాయి ప్రోగ్రాంలో రైలుకథలు పుస్తకాన్ని గురించి చర్చ జరిగింది. దానిని వినదలచినవారు ఈ క్రింది లంకెను నొక్కండి.Telugu Radio 24/7 live radio ( TORI) | Telugu Radio | Online Radio | LIVE Music | Radio Music India OnLine
వదరుఁబోతు పుస్తకం పై నా సమీక్ష గ్రంథాలయ సర్వస్వం పత్రిక జనవరి 2018 సంచికలో ప్రచురింపబడింది. 
ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది. రచయిత డా. పి. రమేష్ నారాయణ ఎరుపు వేశ్యావృత్తికి, ఆకాశం విషయ వ్యాప్తికి సంకేతాలుగా స్వీకరించి ఈ పుస్తకానికి ఎర్రని ఆకాశం అనే [...]
నేను హైదరాబాదుకు 1987 చివరలో వచ్చాను. మధ్యలో ఉద్యోగార్థం బయట గడిపిన ఐదారేళ్ళు మినహాయిస్తే ఈ పాతికేళ్ళ నా హైదరాబాదు జీవితంలో డా.సి.నారాయణరెడ్డిని కొన్ని వందల సార్లు చూసి ఉంటాను. అది రవీంద్రభారతి అయినా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అయినా, శ్రీకృష్ణదేవరాయాంద్రభాషా నిలయమైనా, త్యాగరాయ గానసభ అయినా, సిటీ సెంట్రల్ లైబ్రరీ అయినా, మహాసభ అయినా, చిన్న సభ అయినా ఆయనను అనేక సందర్భాలలో [...]
    ఇది కొత్తగా నేను పరిశోధించి వ్రాస్తున్నదేమీ కాదు. ఇదివరకే అనంతపురం జిల్లా గ్రామాల పేర్లు పుట్టుపూర్వోత్తరాల గురించి చిలుకూరి నారాయణరావు, ఆదవాని హనుమంతప్ప, సర్దేశాయి తిరుమలరావు మొదలైనవారు శ్రీసాధనపత్రిక, భారతి  మొదలైన వాటిలో వ్యాసాలు వ్రాశారు. చర్చలు చేశారు. ఇది వాటి పునశ్చరణమాత్రమే.  ఈగ్రామాల  పేర్లవ్యుత్పత్తి తెలుసుకొంటే అనేక ఆసక్తికరమైన [...]
ప్రజాసాహితి మార్చి 2016 సంచికలో మొదటితరం రాయలసీమ కథలు పుస్తకం పై వి.ప్రతిమగారి సమీక్ష ! 
ఈ టపాకు ఈ శీర్షిక కాస్త ఎబ్బెట్టుగా ఉండవచ్చేమో కానీ ఈ టపా మటుకు ఆసక్తిని కలిగిస్తుందనే అనుకుంటున్నాను.  పుట్టపర్తి నారాయణాచార్యులు తాను వ్రాసిన పెనుకొండలక్ష్మి అనే కావ్యాన్ని విద్వాన్ పరీక్ష కోసం తానే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక అపురూప  ఘట్టం. దీని గురించి సాహిత్యలోకంలో చాలామందికి తెలుసు. ఇలాంటి సంఘటనే వానమామలై వరదాచార్యుల జీవితంలో కూడా చోటు చేసుకుంది. [...]
చిగురుకల అంతర్జాల మాసపత్రికలో మొదటితరం రాయలసీమకథలు పుస్తకం పరిచయం చేయబడింది. 
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తురుపుముక్క పాఠకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!ఆంధ్రభూమి దినపత్రిక 15 ఆగస్టు 2015 సంచికలో ప్రచురితం
మొదటితరం రాయలసీమకథలు పుస్తకంపై చెన్నై ఆకాశవాణి బి స్టేషన్‌లో 25-07-2015 ఉదయం ప్రసారమైన తెలుగు కార్యక్రమంలో సమీక్ష వచ్చింది. సమీక్షించిన వారు ప్రముఖ కథారచయిత శ్రీవిరించిగారు! అదే సమీక్ష 20-07-2015 సోమవారం సూర్య దినపత్రిక అక్షరం పేజీలో ప్రచురింపబడింది. చదివి ఈ పుస్తకంపై శ్రీవిరించి గారి అభిప్రాయాన్ని తెలుసుకోండి.
[పుస్తకం పేరు : గోదావరి పుష్కరాలు - నా అనుభవాలు, రచన: డాιι సప్పా దుర్గాప్రసాద్, పేజీలు: 36, వెల: రూ30/-, ప్రతులకు: నటరాజ నృత్య నికేతన్, దానవాయిపేట, రాజమండ్రి]“నృత్య ప్రపూర్ణ” డాιι సప్పా దుర్గాప్రసాద్  గోదావరి పుష్కరాలతో తనకున్న అనుబంధాన్ని వివరించిన చిన్ని పుస్తకం ఇది. 1920 నుండి 1956 వరకు వచ్చిన నాలుగు గోదావరి పుష్కరాల గురించి తెలుసుకున్న విశేషాలను, 1967 నుండి 2003 వరకు వచ్చిన నాలుగు [...]
పత్రికలలో స్వైరవిహారం చేస్తున్న మొదటి తరం రాయలసీమకథలు 
మొదటి తరం రాయలసీమ కథలు పేరుతో ఒక కొత్త పుస్తకాన్ని అతి త్వరలో ప్రచురిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాము. జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధనపత్రిక, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త మొదలైన పత్రికలనుండి సేకరించిన 42 కథలు ఈ సంకలనంలో ఉంటాయి. ఈ కథలన్నీ క్రీ.శ.1882 - 1944ల మధ్య ప్రకటించబడ్డాయి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత [...]
[పుస్తకం పేరు: నాగావళి నుంచి మంజీర వరకు, రచన:రావి కొండలరావు, వెల: రూ.150/-, పేజీలు:184, ప్రతులకు: ఆర్కే బుక్స్,502, సన్నీ రెసిడెన్సీ, 166, మోతీనగర్, హైదరాబాదు - 18 మరియు అన్ని ముఖ్యమైన పుస్తకశాలలు]  ప్రముఖ నటుడు, జర్నలిస్టు, హాస్య రచయిత, నాటక రంగ ప్రముఖుడు అయిన రావికొండలరావు గారి జ్ఞాపకాల దొంతర ఈ పుస్తకం.  తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్క ప్రముఖుణ్ణి, సామాన్యులను, అసామాన్యులను ఈ పుస్తకంలో [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు