రాత్రి కణికల శయ్య మీదఅలసి వాలిన తనువుఆవిరవుతుందివిడవని గతంవీస్తూనే ఉందినివురు రేపుతూనిప్పు రగుల్చుతుంది.కోట గోడలు పాడేఆ పదును గీతాలుసేద తీర్చడంలేదుగతం, ప్రతి రాత్రీరెప్పలు చీల్చుకునిఉదయిస్తుందిఅన్నీ అస్తమయ మెరుగనిఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.
బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరుగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్లపదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.
ఆ వీడ్కోలు క్షణంలోనిర్వీర్యమయిన నీ ముఖంనన్ను వెంటాడుతూనే ఉందిఎంతో అనుకుంటానుఏదో చెయ్యాలనిఎంతైనా చెయ్యాలనిదూరాలు పెరిగే కొద్దీప్రేమలు ఆప్యాయతలుఫోను తంత్రులకుచెక్కు ముక్కలకేపరిమితమై పోతున్నాయినీ ఒళ్ళొతలపెట్టిన తృప్తినా తలపై తిరిగిన నీ చేతి వెచ్చదనంఏ చెక్కుతో కొనగలను ?ఒద్దనుకున్న క్షణాల్లోస్థంబించే కాలంఇపుడు చిన్నగా నైనాకదలదే?బరువైన శ్వాసలుఅదిరే [...]
నిశిరాతిరిమాలిణ్యాలను కరిగిస్తోంది.వెచ్చని అశక్తతమంద్రంగా వీస్తోంది.అసంకల్పితంగా వికసించిందిఓ నిశ్శబ్ద పుష్పంగంధరహిత పుప్పొళ్ళనుగుండెలనిండా పులుముతూతనువునూపుతూస్వరరహిత గీతంతోమనసును తాకుతూమూసిన రెప్పల వెనకకరిగిన కాలంమిణుగురులవుతుందిరేపటి ఆశ లేదుఈ నిశి రాతిరే శుభోదయం.
ఎప్పటినుంచో..కాళ్ళు పరిచిన దారికంపలు తప్పుకుంటూపూదోటలనానుకుంటూ..ఊచలకు ఇవతలనిశ్శబ్దం నింపుకున్నమంచు ప్రమిదల్లోతడి దీపాల ఆరాటంఆ దారి మొదలు కోసంఈ లోపే మరో అంకం..పారే నీటి క్రిందగులక రాయిలా..ఆ దారి..అవిచన్నం, నిశ్చలంఈ మబ్బు విడవాలి
తెరలు తెరలుగాఅవే ప్రశ్నలు.. అలలవుతూమనిద్దరి మధ్యనన్ను శోధిస్తానునిన్ను ప్రశ్నిస్తానుతెలుసుకునే లోపేమరోప్రశ్న ..తెలుసనుకున్న దాన్నితిరిగి ప్రశ్నిస్తూ..వృత్తంలా పరిచుంచినపట్టాల మధ్య, ఇది,ముడులు విప్పుకుంటూ..గుంటలు పూడ్చుకుంటూ..పరుగనిపిస్తుంది ..మనమధ్య దూరమికలేదనిపిస్తుంది.ఈలోపలనీ అస్థిత్వాన్నీ,నా విశ్వాసాన్నిప్రశ్నిస్తూ.. మరో నెర్ర.అతుకుల చక్రం సాగుతుందిమరో [...]
గమ్యం ఎక్కడో శిఖరాలమీదఉద్భవిస్తుంది,పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగాపెదవి విరుస్తూ.. సామూహిక నిస్సహాయతకుసాక్ష్యమన్నట్టువికటాట్టహాసం చేస్తూ.. వాడి ప్రశ్నల వాలుమీదఆత్మావలోకనమే ప్రయాణం.. ఆ నవ్వులు ముల్లుకర్రలుప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ.. ప్రత్యామ్నాయం దొరికేలోపేమైనపు రెక్కలు కరిగిఆత్మ విమర్శై పలుకరిస్తుంది.ఈ చిత్రం www.thecreativecreative.com నుండి తీసుకొనబడినది.http://poddu.net/?p=4942 [...]
తలపు తడుతూ నేల గంధంతలుపు తీస్తే..ఆకాశం కప్పుకున్నఅస్థిరమయిన రూపాలుతేలిపోతూ.. కరిగిపోతూ ..అలజడిచేస్తూ..అక్షరాల జల్లునిలిచే సమయమేది ?పట్టే ఒడుపేది ?పల్లంలో దాగినజ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.తడుపుదామనోకలిసి తరిద్దామనో..గుండె నిండేసరికినిర్మలాకాశంవెచ్చగా మెరిసింది.picture by Jean-Sébastien Monzanపొద్దు లో ప్రచురించబడినది http://poddu.net/?p=4829
ఆకు నీడన చేరిన పువ్వుగాలి తట్టినప్పుడల్లాతెరిపె కోసం తొంగిచూస్తూ..నేల కురిసిన వానహత్తుకునే అడ్డులు...నింపుకున్న గుంటలు..నవ్వులు చిందిస్తూ..నింగిలోని చుక్కలన్నీమెల్లగా..గరిక కొనలమీదుగాఉదయిస్తూ..ప్రతికిరణమూరంగులద్దుతూ..మనసునద్దం పడుతూ..ప్రకృతి.పొద్దులో చూడండి http://poddu.net/?p=4833
నగ్నంగా నిలబడ్డా..నిలువెత్తు సత్యాన్ని,కనుమరుగు చేస్తుంది.కనబడ్డా కాదేమోనన్నసందేహన్ని కొనిపెడుతుంది.ఎంత పెద్ద నిజాన్నయినా..గొంతులోతుల్లోనే సమాధి చేస్తుంది.నోటు,ఓ చిత్రానికి తగిలించిన పటంలాంటిదినిజాన్ని, గోడకు బంధించిఅందనంత ఎత్తులో..అందంగా చూపిస్తుందిఏ వేలిముద్రలు అంటకుండాఆదుకుంటుంది.త్రినాధ్ గారి కవిత నుండి ప్రేరణతోhttp://musingsbytrinath.blogspot.com/2010/07/seeing.html
జీవం లేనిదే ఐనాపాత పుస్తకం పేజీల మధ్యప్రత్యక్షం అయినపుడల్లాఓ కధ చెపుతుంది ..చూపుగాలాలు శూన్యంలోదేవులాడుతూ మిగిలిపోతాయిపరిసరాలు ఒక్కసారిగాపారదర్శకమయిపోతాయిఇంతలో ఏదో శబ్దంఘనీభవించిన గడియారంఒక్క ఉదుటున పరుగెడుతుంది.అసంతృప్తిగా కధ ఆగిపోతుంది.కధ అంతం తెలిసినా..ఎందుకోఆ పుస్తకం తెరవాలనిపిస్తుందిమళ్ళీ ఆ కధ వినాలనిపిస్తుంది.
దగ్గరయ్యేకొద్దీదారి చూపిస్తూ ..మసక రూపాలకుమెల్లగా రంగులమరుస్తూ..మురిపిస్తూ..తేమతగిలిస్తూ..కంటి వెనక దారి మూసేస్తూ..ముందు వెనకలను ఏకం చేస్తూ..ఉదయమయ్యేదాకాసగం రంగుల పరిధినేఆస్వాదించ మంటూ..తాత మాటలు తవ్వి తీస్తూ..పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744
పలచ బడ్డ ప్రస్తుతం మీదవయసునూ అలసటనూ అరగదీస్తూబాల్యాన్ని చేరుకున్నానుపరిసరాలను కమ్మినసొంత ఊరు, చిన్నతనపుకేరింతల మధ్యనెరిసిన రెప్పకట్టలు తెగికళ్ళనుండి పొంగిన పాత కబుర్లుకాలాన్ని కరిగించిగెలిచామంటూ గేలి చేశాయిఅయినా.. అయిష్టంగా..గుండెనిండిన తృప్తికడుపు నిండిన జ్ఞాపకంతోవాస్తవంలోకి తిరుగు ప్రయాణం
ఒకటే వానబరువుతగ్గిన ఆకాశంచినుకుల మధ్యగాఆటలాడుతూ చిరుగాలిగుప్పుమంటూగుంటలు నింపుకున్న నేలతలదాచుకునే ఆరాటంలోపడుచుదనం పట్టించుకోని పాఠం..పల్లానికి పరుగెట్టి..చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ..తాత చేతిపై జ్ఞాపకమవుతూ..చూరుక్రిందా తడిసిన తలలతలపుల్లో గుబులు ఒలకపోస్తూ..ఒకటే వాన.
తడి మెరుపులుల్లోకరిగిన చూపులు ..ఉరుము ధ్వనుల్లోమమైకమైన మౌనం ..జడివాన జల్లుల్లో..జోరు గాలుల్లో..వాడిన రెక్కమందారాలుఎర్రబారిన చందమామనుఎదలోతుల్లో గుచ్చేసరికిఏడడుగులు నడిచిన తృప్తివెచ్చగా తాకింది.గుండెలపైన మరో రాత్రిబద్ధకంగా అస్తమించింది.
నిద్ర జార్చుకున్న నింగి మధ్యవిరగ పూసిన కలువఆపై వేచిన తుమ్మెద పలకరింపు..కంటి కొలకులు చూసినముత్యాల పలవరింపు..అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..ఒడిలిన తెరల వెనకగాఎగబ్రాకిన వేకువ కిరణం..వెచ్చగా ఒళ్ళిరిచుకున్నజ్ఞాపకాల గుబాళింపు..
గుండె గదిలో బందీని చేసిగురుతుకొచ్చిన ప్రతిసారీతలుపు తడుతున్నావు ...కంటి రెప్పల్లో ఖైదు చేసిఅలసి సోలిన ప్రతిసారీఅలజడి చేస్తున్నావు...మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..తలనెత్తి నీకు దూరమవలేకఒదిగి చెంతన చేరినపుడల్లా..నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..పొంగు ప్రేమను పంచచేజాచినపుడల్లా..ఓడిపోయానంటు మోకరిల్లుతావు..అగాధాల అంచు కాకమరి [...]
పురిటినొప్పుల్లా తెరలు తెరలుగాతడిమిన తరుణాలుమౌనాన్ని ప్రసవించి మరలి పోతాయిజ్ఞాపకాలు ఆలపించిన గీతాలుఎండురెప్పల మధ్యనిశ్శబ్దంగా దొరిలి పోతాయిసెలయేటి గలగలలుఘనీభవించి గొంతు లోతుల్లోపదాలు వెదుకుతూ ఉండిపోతాయిభాష జార్చుకున్నబరువు భావపు ప్రతి కదలికాఏ రంగూ తగలని కవితే..ఈ కవితా సాగరంలో తేలుతూ నేనూ...
బరువు దించమంటూ..రెప్ప జారిన చివరి బొట్టుఆర్తనాదం ఎవరికోసం ...బాధ కాల్చమంటూనిట్టూర్పులొదిలిన సెగచివరి మూల్గు దేనిఓసం ...బంధాలు త్రుంచమంటూఅదిరే పెదవుల అభ్యర్ధన,ఆత్మ సమర్పణ ఎందుకోసం ...కురిసి వెలిసిన నింగి వెలితిమనసు నిండా నింపుకుటూ..మెరుపు వెలుగులో..మరో మెరుపుకై తడుముకుంటూ..చీకటి రాత్రిలో.. గుడ్డి దీపము తోడుగా..రాని వానకై.. నిరీక్షణ ఎవరికోసం..ఎవరికోసం .. ?
గుర్తుకొస్తుంది.. నీ చెక్కిళ్ళ తడిలోరగిలిన బడబాగ్ని..కాగితమెక్కడం..మరువలేనుగా.. చెలమ ఒడ్డున మొలిచినచిలిపి మొగ్గలుమాలలవడం .. జ్ఞాపకముండిపోదూ.. అడవినడకనఅదిరి ఆగిన అడుగులుతాళమవడం .. తలపుకు రావడంలేదూ ..ఆశ సంధించిన శుభోదయాలూ..బాధ ముంచిన సాయంకాలాలూ..ఇవన్నీ..చిత్తడి అడవిలో..బెరడు గంధంలా ..చీకటి పొదల్లోకీచురాళ్ళ గానంలా ..అజ్ఞాతంగా..తాకుతున్నాయి..జారిపోతున్నాయి..బ్రతుకు బండి [...]
రెప్ప క్రిందగులాబీ వనంలోరాలిపడినవీ..పారుతున్న ఏటి ధారల్లోఏరుకున్నవీ..వీడని మెళుకువ కీచురాళ్ళతో పాడుకున్నవీ.నిట్టూర్పుల వేడికి ఎండుటాకులై దొర్లుతున్నవీ..ఎన్ని పదాలో ..ఎటుచూసినా పదాలే..ఇవి కవిత లెప్పుడవుతాయో !!?
దొర్లే ఆకుల గుసగుసల్లో..కొమ్మల్లో చిక్కిన గాలి ఊసుల్లో..కొండలు పాడే ప్రతి ధ్వనుల్లో..కొలను చూపే ప్రతి వృత్తములో..ఎన్ని జీవిత సత్యాలో..తపన చాలించిన అలల్లో..తనువు తగిలెళ్ళిన తెమ్మెరల్లో..తేలిపోతున్న నల్ల మబ్బుల్లో..తీరమొచ్చిన తెప్ప తనువుల్లో..ఎన్ని జీవిత సత్యాలో..నుదుటి కాగితం మీదకాలం విదిల్చిన అక్షరాలనుకూర్చుకుంటూ..గుండెలోతుల్లో..తడవకోకటిగా చెక్కిన [...]
తప్పు బరువు పెరిగి రెప్పతోడు చేరిందికాళ్ళు విరిగిన ప్రేమకరిగి జారిందిదిశ మళ్ళిన చూపునేలపాలవుతూ..గోరు గురుతును చేరిసేదతీరిందిగుండె ఒలికిన గంగదొప్పల్ని నింపితేవేడి శ్వాసల హోరుఆవిరిగ మార్చిందిముడిబడిన భృకుటివిప్పలే లేకేమోఅదిరెడి చుబుకముపెదవి విరిచిందినీట తేలిన జగతినిలువ నేర్వని స్థితినివురు గప్పిన ఆశనేటి బ్రతుకు.
అనుభవాల శిధిలాలనూ,గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన సౌధాల మధ్యగా..అనుబంధాలు అణచి మొలిచిన వృక్షాల మధ్యగా..ఆ నీడకు మురిసేదెలా ?ఈ అందాలను ఆస్వాదించేదెలా ?ప్రతి మలుపు వేసుకున్న మేలిమి ముసుగు వెనకదేనికోసమో వెదికే కళ్ళకుఏమి చెప్పను ?క్రొత్త దారుల్లో..పాత గుర్తులు దేవుకుంటూ..నిర్లిప్తంగా..నా పయనం !ఈ సాగర సరంగు దాహమెప్పటిదో!తీరమెప్పటికో !!?
నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటెపిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటెతాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టివెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ...ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లువెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.వాన నాప పురిని విప్పి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు