మిసమిసల రేకుల పొదివసంత వేడుకకి బాకా ఊదుతుంటే.. పుడమి లో పుష్పకాలంపరవశాల పల్లకీలో ఊరేగుతుంటుంది...!
Illinois State Bird- Northern Cardinal అంటూ కాస్త గౌరం ఎక్కువే ఇస్తుంది ఈ అమ్మి..కానీ, "బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది," అని వెంట వెంట వస్తుంది.. ఎట్టా పలికేది నేను.. నా పక్షిగానం ఎరుగని మనసు కాదులే అని సరిపెట్టుకుంటా మరి! పెట్టిన మేత, పళ్ళు రుచి చూసి పోతా...     
ఆంధ్రమాత గోంగూర వరకు మరి నేను భోజనం పెట్టే మాతనే!అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః |నమస్కార ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః ||హరిహరులు, సూర్యచంద్రులు అలరారిన లోగిలి మాది! నిత్యం లక్ష్మీ కళ ఉట్టిపడే పెరటి తోట, వాకిలి తట్టున వనం మా ఇంటికి చిరునామా... నువ్వుల నూనె/కాచిన ఆవనూనె నలుగుతో అభ్యంగన స్నానం అదీ కుంకుళ్ళు/శీకాయ పులుసుతో తలారా స్నానం కర్చూరాలు, బావంచాలు, [...]
"పిడికెడు బియ్యం పిచ్చుకకి వేసి, గంపెడు సంబరం నాదేనంటూ ఎగిరితే ఊరుకోనోచ్.. అరిచి గీ పెట్టి, 'చిన్ని నా పొట్టకి నీవే రక్ష' అని నీకు అనిపించేలా చేసి మరీ సాధిస్తా నా భుక్తి," అంటూ ఇదిగో యిలా ...!
దుప్పట్లో మిన్నాగు లా ఇదేమిటో అనుకుంటున్నారా!?స్నేహ కి నాకు నడుమ ఒకానొక ఉదయాన- అమ్మా! ఇక్కడ చీకటిగా ఉంది ఏమి పిల్లల్రా ఈ మాత్రం వెలుగు చాలదా? నువ్వే చూడు..చాలా చీకటిగా ఉందమ్మా, Light అనకుండా Bright ఏంటి? సరే! లైట్ వేసుకో గిన్నెలో చీకటిగా ఉంది, లైట్ వేస్తే ఎలా పోతుంది? లైట్ చెయ్యాలిగా... ప్చ్! స్నేహీ.. వస్తున్నా ఉండు చూడు, ఎంత చీకటిగా ఉందో! ఇంకొంచం పాలేస్తావా ఓ......ర్నీ, "టీ" సంగతా [...]
తెలుగు పాటలు విని కూనిరాగాలు తీసేవారికి ఓ క్విజ్ .. విన్నారా ఈ పాట?  "కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా ... అదేరా ప్రేమంటే కన్నా"విని ఉన్నట్లయితే ఇంతకన్నా బాగా మరెవరైనా చిత్రీకరించగలరా...!
Bird watchers/lovers! Hawk on my Deck..నేనీ ప్రకృతీ పరమైన పురా పునీత పరవశాన- పరవళ్ళు తొక్కుతూ- ఇలా...! ఏ మాట కామాటే చెప్పుకోవాలి; ఇంత దగ్గరగా, కేవలం 5 అడుగుల దూరం కి (నడుమ కిటికీ అడ్డుగా ఉన్నా) గ్రద్ద వచ్చి వాలటం అదేదో గండభేరుండ పక్షి వచ్చినంత సంబరం గా ఉంది.దశదిశలా తన చూపు, తన రూపే దశావతారాలు నాకు... "ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావు" అని ఇరువురమూ ఒకరికొకరం...మేత వేసీవేయగానే ఇట్టే వచ్చి [...]
11/11/2016:  ఓరోరి నువ్వుండ్రా, ఆమె గోరు సూరీడ్ని చూస్తూ తచ్చిట్లాడేప్పుడు వచ్చి కాచుక్కూచ్చున్నాము. ఇదిగో మనం బొద్దు గా కాక స్థూలకాయం పెంచుతూ ఉన్నామంటే, రాబోయే చలికాలం లో ఉధృతి ఎక్కువంట,   ఇదిగో అందుకే ఈ బల్లలు బోర్లేసి "రండర్రా వర్కౌట్ చేద్దాము, చైర్ స్వింగ్, చీర్ఫుల్ సింగ్," అంటూ రొద; తన కొత్త పిట్టయోగ క్లాసులో చేరితేనే మేత పెడుతుందట.."నీ అల్పాహారం నువ్వే సాధించు, [...]
చెప్పేస్తే ఒక పనై పోతుంది- నాకు హాయి, నలుగురికి నవ్వు లేదా ఎకసెక్కం కాదూ మూతివిరుపు కసింత ఊదాసీనత కొండొకచో యేదో భావన కలుగుతుందిగా!? పుట్టగానే నాకు ఇవ్వబడిన పేరు "పార్వతి" అది మా సీతమ్మామ్మ పెట్టారు కనుక, నేను నానమ్మ కూచిని కనుక, క్రమేణా అమ్మ మార్చుకున్న 'ఉష' కన్నా "చిన్న సీతమ్మ" గా చలామణి అయ్యాను, ఆ పేరు విన్నప్పుడు కోపం వచ్చినా, "నేను 'పారు' ని లేదా 'ఉష' ని," అని అరిచి [...]
మేఘపు మెరుపు రూపు మారుతుంటేనే ఈ బింబపు ఆకృతి ఊహామాత్రం గా తోస్తుంది కదా!? ఇప్పుడు నేను మేఘాన్ని చూస్తున్నానా..భ్రమణం తో నా చూపు ఆవరణ మార్చే మౌనమూర్తి భూమి ని కాంచానా..నిశ్చలంగా నిలిచినా కర్మసాక్షిని దర్శిస్తున్నానా..ప్రతి ఉదయం లో నాలోని ఒక నేను ఉద్భవిస్తూ వస్తున్నానని మాత్రం తెలుసుకున్నాను...! (సప్త అశ్వాల సాక్షి గా కొన్ని ఉదయాల పయనాలు ఈ చిత్రమాల తో సమాప్తం, అందరికీ [...]
తనకన్నా ముందుగా మరేవో జాడలు వెలికి వచ్చాక, తప్పదన్నట్లు సాగినంతనే మరి కొన్ని మాయమౌతాయి..ఉద్భవం ఉన్నచోట నిష్క్రమణ కూడా తావు చేసుకుంటూ ఉండదూ...మరి!
ఊడల్లా నేలలోకిదిగుతుంటాయి కొన్ని వెలుగు ధారలుఒడుపుగా కొసలు ముడివేస్తూ ఊయలూగుతుంటుంది ఒంటరి గాలినీడలే ఇటుకలుగా కొమ్మకి కొమ్మకీ వంతెన వేస్తూ పనిచేసుకుంటూ పోతుంది పగటివేళ ...!
నల్ల మబ్బులు రెక్కలు విప్పుకుని రివ్వు రివ్వున  ఎగిరిపోతాయిఅల్లరి గువ్వలు అమాంతం పట్టేసి రయ్యి రయ్యిన లాక్కుని వస్తాయి ...! 
అదేవిటో పొడుస్తూ యే ఛాయలో ఉన్నాడో ఆలాపిస్తూ 'గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ' అంటూ అసలు కంటి ఆవరణకి వస్తూ ఏ రూపున ఉన్నాడో ఆ ఛాయలకి ఎవరూ పోరేమి!? అదేమో గానీ ఇదిగో అసలు పొద్దుగూకులా పూస్తూనే ఉండేటి పూవు!
దొంగాటల, దోబూచుల మునిగి తేలుతూ ఉంటాడతనుతటాలున ఆకాశం దారి పరిచి చూపులకి జాడ తెలుపుతుంది..దాగని ద్యుతులు వ్యక్తమయే వేళలో మదిలో కొత్త రంగు మిగిలిపోతుంది...!
మంచు పరుచుకుని ఉన్నప్పుడు ఆకాశం రాత్రంతా తెల్లగా కనిపిస్తుంది, తెల్లారుతుండగా రంగుల కుంచె పని మొదలుపెడతాడు ఆదిత్యుడు...
ఓ వెలుతురులో వన్నెలు మరింత ఒదిగి వేకువ పట్ల ఒక అణకువ ని మనసంతా వ్యాపించేలా చేస్తుంటే..ఇలా...!
ఇరుకుబాటలో ఇరుసులేని బండిలో కృషీవలుడు, చెంత సోయాచిక్కుడు, మొక్కజొన్న విత్తుల మూటలు, ఐదుమాసాల్లో అవి పండించును బంగారు పంటలు. కాలినడకన ఎదురువస్తూ, ఏరువాకని తలపోస్తూ నేను. చుట్టూరా విరగకాయనున్న పళ్ళతోటలు, బళ్ళునిండే గుమ్మళ్ళ, ఖర్బూజాల తీగెల మడులుఆ పూలలో తల పెట్టుకుని ఎన్నో దుఃఖాలను జయించాను... తల్లితండ్రులు పెంచే తాత్కాలిక తోటలు- ఏడాదికొక యజమాని- మరొక రకపు పంట మా [...]
(NRI గా ఎదిగిన తను, పాటకి తనకి నడుమ అనుబంధాన్ని పూర్తిగా తనకి వచ్చిన తెలుగుతో అనుసంధానం చేస్తూ రాసుకుంది.. నేను కేవలం సరైన పర్యాయపదం, వ్యాకరణం సరిదిద్దాను)వరాల వానగా వచ్చిందో గీతం-మునుపెరగని ఆ పరిచయంలో రేగిన వాంఛతో మొదలైయిందీ, బంధం గట్టిపడింది.గానంతో కీర్తి శిఖరాలు చేరే అభిమతం ఉత్సాహపు వెల్లువైంది నాలో...హత్తుకొని మత్తెంకించేసి, బానిసైననాతో రాగాలు కట్టించింది.పాటలుగ [...]
"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర, ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... " అనే ఎత్తుగడతో ఒక శీతగానం రాసాను ఆ మధ్యన..పాశ్చాత్యులకి నాలుగు ఋతువులు, అవి కూడా కవుల కల్పనలో చూడనక్కరలా; కంటికి స్పష్టంగా మనసుకి మరింత దిట్టంగా తెలిసే ఋతువుల నడుమ విభజన, వాటి రాకపోకలు వలననే ప్రకృతి తో ఇక్కడ మనిషికి మరింత అవినాభావ సంబంధం ఏర్పడుతుందని నా అనుభవరీత్యా [...]
ఈసరికేఇంకొన్ని రంగులుకలగాపులగం చేస్తూపోతుంటాయా అల్లరి మేఘాలు నన్నో, నా ఊహలనో అందబుచ్చుకునినువ్వు సృజించేవర్ణాల వలెనే.. ఒక్కసారిగాఎన్నో చుక్కలు హత్తుకున్నఆకాశంసిగ్గుగా చీకటిలోకితప్పుకుంటుంది, మెత్తగా వత్తిగిల్లిననా తనువులో, కనులు విప్పని చూపులలోనీ జాడమెరుపు నింపినట్లే...!
తడి చుంబనాలతోనేలని ఆవరించుకున్నఆకాశపు ఉనికి, కమ్ముకునే ఉంది ఇంకావాన పెదవులు విచ్చుకుని...పొడి ముద్దులతోధూమ్ర వర్ణపు మేఘాన్ని తోసుకుంటూపుడమి,ఎండ పొడతో పొగమంచు దేహంలో దాగినింగి కౌగిట చేరుతూ..అనునిత్యం!!!
సముదాయింపు సముద్రపు అలలా తీరాన ఆగక వెనుకకు పరుగులు తీస్తుంటే- వేదనలో నానిన మనస్సు సారం పెట్టిన భూమిలా తోస్తుంటే స్థిరంగా తెలుస్తుంది.. విషాదం వెదుక్కునేది సాంత్వన కాదని.ఫలించిన దుఃఖ్ఖం విచ్చి ప్రశాంత విత్తులుగా రాలుతుంటే తెరిపిన పడుతుంది.. మొలకెత్తే భావోద్వేగం శోకం వెలిసాక.ఓ ఘటన అనంతరం- నడి కడలి నీటి వంటి మనస్సు నిదానిస్తుంది..నిరంతరం...!
గాలి కడలి మీద అలల్లారాలిపడే రంగుటాకులు ఆకుకొసనో, కొమ్మ మూలనో మొగ్గతొడుగుతూచినుకు ముత్యాలువాన కాలువ మీద పడవల్లా తేలియాడే పూరేకులుమొండిపూలలో, నీడగీతలలోలెక్క తేలనిఎండ సమయాలుశిశిరానికి తరలిపోయే తరుణానకలలు, ఊహలు... !!!
వెన్నెల దయగా వర్షిస్తూదారి వదిలినట్లే ఉన్నా బెదురుపోని చీకటిగదిలోకి చొరబడి వెలుగు చేరని దరికిదాగిపోతూ ఉంది. పూలమొముతో నిటారుగా నిలిచిన కొమ్మ కిటికీ నీడ కట్టిన ఫలకంలో చేరి తలవాల్చి నిలుచున్న కొమ్మలా కనపడుతోంది, ఏమీ పాలుపోని స్త్రీ ఊహలోకి వచ్చింది. 'బహుశా నా ప్రతిబింబమేన'ని భ్రమింపచేస్తుంది... ఎదలో దీపపు వత్తి సర్ది, నూనె తిరిగి నింపుకుని వదలిపోని దిగులు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు