నగరపు నడిబొడ్డున నిలవనీయని /మనిషి/తనాన్ని ఒప్పుకోని చెట్టు ఉంది నిజానికి ఉంటుంటాయి బోలెడన్ని విడివిడిగా. అడవిలో గుంపులుగా ఉంటాయోమో వేరు వేరు కలుపుకుని వెన్నుదన్నుతో ఎదుగుతుంటాయి. ఇక్కడేమో- ఇంటికొక ఒంటరి చెట్టు తప్పనిసరి మీటలు నొక్కి విరిచిపడేసే ఎందరెందరో యంత్రాల మరిడయ్యలు చేతబడి చేస్తుంటారు. బతుకులేని, చావలేని మొండిమాను ఎండుదనంతో నిండిపోయాక ఆకృతులు [...]
అంగుళాలు, అడుగుల ప్రమాణంలో నేను ఎదుగుతున్న దశలో, మా నాన్న మూరెడు బారున్న ఓ వేపమొక్కని నాటారు గుప్పెడు మట్టి చల్లిన ఊసు నాకెంతో గొప్ప ఈనాటికీనూ! వసారా నిండా మనుషులు, మాటలు పరుచుకుని ఉన్న సమయాల్లో నేను, మొక్క ఏపుగా ఎదిగాము మొక్క చెట్టు అయింది, నేను ఎదగటం నేర్చుకున్నాను. చెట్టు నీడకి, నాన్న కాలక్షేపానికి లంకె పడింది, వచ్చే పోయేవారి లెక్క తరిగిపోయింది, నాన్న నేను [...]
ఏమి కావాలి? 'చివురించే చెట్టు ప్రవహించే వాగు కురిసే మబ్బు ఎగిసే పిట్ట నేలని తడిపే వాన మెల్లగా వీచే గాలి ఎడతెరిపిలేని ఎండావెన్నెలలు ఇవి మాత్రం చాలా! ఇన్నిటినీ కాచే మనిషి కావద్దూ!?' ఏనాడో ఇన్నీ ఇచ్చిన భూమి ఈనాడు ఏవీ మిగలని ఆగామి ని తలచి కుమిలినట్లు, అన్నీ కావాలి అని అరిచినట్లు... అడవి దాటి అభయావాసం లోకి, నేల వదిలి ఆకాశసౌధం లోకి నడత మార్చిన మనిషికి 'భూమి అంటే ఎండావానల [...]
ఇప్పుడు యీ త్రోవ లోనే వస్తూ పోతూ ఉంటాను తరుచుగా... తొలిసారి అగమ్యగోచరంగా చీకాకుగా అనిపించింది త్వరపడి చేరాల్సిన స్థలి దిశగా, దృష్టి మారకుండా దాటిపోయాను ఏదో పోటీ పందెపు ఉద్విగ్నత నాతో ప్రయాణిస్తూ ఉంది ఆనాడుఇంకొన్నాళ్ళు గడిచాక ఏదో దేవాలయం ఉందని వెదుకుతూ నిదానంగా సాగాను బాట వెంబడి గురుతులు పదిలంగా పోగేసుకుంటూ వెళ్లిన పని ముగించేసరికి ఏదో శాంతి నిండిన నిలకడ నన్ను [...]
ఎవరో నన్ను కౌముదికి తప్పా, వేరే పత్రికలకి పంపరా? అని నిష్టూమాడారు..కిరణ్ ప్రభ గారు- అరుదైన అభిరుచి కలిగిన సంపాదకులు,- ఒద్దికైన తీరు కలిగిన సాహిత్యాభిమాని. చాలా పదిలంగా భావన చెడని విధంగా మార్పులు చేస్తారు, విలువైన సమయం వెచ్చిస్తారు. అందుకు ఉదాహరణ, నేను పంపిన ఈ క్రింది పాదం లో తను చేసిన సూచన ప్రచురించిన కవితలో ఉంది. ఆపై, ఆయన సునిశితం గా నా అల్లికలోని బిగి కనిపెట్టిన [...]
లెక్కకి పాతిక వారాలు మా పూలసాగుకి-ఈ యేటి మధుమాసపు వెచ్చనల్లోమరోమారు ఉత్సాహపు పల్లవింపుపడమర నేలలోనూ, నాలోనూ.ఓ గ్రీష్మ సంధ్యాసమయాన పచ్చని మడుల్లోలెక్క పెంచుతూ ఈ రెండు మొక్కలు.కలుపుగా పెకిలించలేని నా తనంవల్లమాలిన ప్రేమ ఉబికే ప్రతి వనమాలి వైనమే!ఉదయారుణ కాంతిలో వాటినే చూసుకుంటానుఒకవైపు పసుపు పచ్చని పూలుఆ వంక చివురు మెత్తని మ్రోలకలివిడిగా తిరుగుతూ గాలులు, నా [...]
"యథో మనః తథో భావ, యథో భావ తథో రసః" వంటి తాదాత్మ్యం కలుగజేసిన ఆణిముత్యాల వంటి ఈ Aligarh హిందీ చలనచిత్ర కవిత్వపు పలుకులకి నేను స్వేచ్ఛానువాదం చేస్తుండగా,  "త్రిపుర" కలంపేరు తో రచనలు చేసే నా మిత్రురాలు చేసిన అనుసృజన అందింది.  మేలైన భావన పొదిగిన ఆ రచన బాగుందని (నా అనువాదం ఆపి) మీకూ పంచుతున్నాను.  "poetry शब्दों में कहाँ होती है बाबा. कविता शब्दों के बीच में मिलती है. साइलेन्सस में. [...]
అప్పట్లోఏదో పండుగ కాలం లో,కనీసం ఎండాకాలం సెలవుల్లోఎవరో ఎగురవేస్తారురంగురంగుల గాలిపటాలుఎగిరే మబ్బుల్లా ఉంటాయి అవి!అంతకు మించిన ఎత్తుకి ఎగరాలనిఉవ్విళ్ళూరే ప్రాయం పరుగు పెట్టించేదిపసి హృదయం కూడా పటమైయేది కనుక...బడికి వెళ్లి వచ్చేదారిలోతుమ్మకంపల్లో,చిటారు కొమ్మల్లోగాలివానకు ఒరిగిన పిట్టల్లాచిరుకు పట్టిన చీరల్లాఅవే గాలిపటాలువంతులు వేసుకునివెదుక్కుని, [...]
పున్నాగల వానలై, పారిజాతాల పాన్పులైకొన్ని పూలు నేల కొరకే పూస్తాయిమరి కొన్ని తావులీనుతూగాలిని వదలని మల్లెల, జాజుల పరిమళాల చిలుకరిస్తే ఆగి ఆగి కదిలే వాయువులన్నీ వేణుగానాలై పోతాయినీటి ఒడిలో నిర్మలంగా పవళిస్తూతామర జాజరగా, కలువల కాంతిగాఆ పూలు మరి అలా విరియగానేకొలనులన్నీ అలల నవ్వులే. పుష్పించని జాతులు ఉంటాయి తరువుల్లోపంచవన్నెల పత్రాలు తయారు చేసుకుంటాయిసుమాల కాలాలు [...]
పడకింటి కప్పు మీద ఓ పావురాయి గూడు కట్టిందిఈ మధ్య రాత్రంతా గునింపు మొదలుపెట్టిందిపట్టరాని విసుగు కలిగిస్తూ పరిచయమైనాలాలిపాటలా, నన్ను జోకొడుతూ ఉన్న తోడుగా మారిందినిన్న రాత్రి  కప్పు క్రిందగా జారుతున్న వాన చుక్కలునిదుర ఆగని మనసుకి నెమ్మదిగా మెలుకువ ఆగి ఆగి కురిసిన వాన, పిట్ట గొంతుని పట్టి ఆపినట్లుందిగుండె నిండా తడి భావనలు, గూడు కూలిందేమోనని గుబులుఉన్నపళాన [...]
ప్రేమారా ఆలింగనం చేసుకునే ఏకాంతం అనే ప్రియుని వదిలిఒక్కోసారిమెత్తగా పిలిచి చేయిచాపేపాత మిత్రుని వంటి ఒంటరితనందరికి పారిపోవాలని ఉంటుందికనులారా నీరూరేతన చెంతన తాకే వెచ్చదనంకదలనీక నిలిపేసేచెలికాని ఉనికిని మరిపిస్తుందిఎద నుంచి పదాల బరువుతానూ మోస్తుంటాడు...కాలపు అడుగుల సడిలోఉద్వేగపు ఊపిరి ధ్వనిస్తుందిప్రియుని సందిట ఆగిపోయినఉద్రేకం, అనురాగం పిలుస్తూనే ఉంటాయి [...]
పురాతనమే కావచ్చు ఈ చంద్రోదయంకాస్త వెనుగ్గా రానున్న సూర్యోదయమూ...చీకటి కమ్మిన హృదయాలునీడలో నివృతమైన పరిసరాలుమరి కాస్త ప్రాచీన ఆచూకీకిత్రోవ చూపవచ్చుగమనించాలి, గుర్తించాలి, గమనం సాగించాలిరిక్త హస్తాలు చాపగానే వెన్నెల నిండినట్లుగాకనులు తెరవగానే కాంతి చేరినట్లుగాగాలి, నీరు గలగలలాడుతూపూరేకుల్లో,  ఆకుదొన్నెల్లోమబ్బుగిన్నెల్లో, అలల కుంచెల్లోకొత్త పరిచయం [...]
పెనుగాలి లా తలపుచెల్లాచెదురయే ఆకుల్లా ఊహలుధ్వనిస్తూన్న దారుల్లోకిపదేపదే మనసు దెస మార్చుతూపరుగులు తీసిన తరుణాన..నైసర్గిక స్వరూప దర్శనమైందిలోలోని కాననం కానవచ్చిందిపరిచిత జాడలుకొన్ని మోడులుఅల్లుకున్న అనుబంధపు లతికలుఎరుగని మోహపు పూలుఅలవి కాని తావులీనుతూఇప్పుడక్కడచిగురుటాకు మోజుల సవ్వడిమొగ్గ తొడుగుతున్న సన్ననవ్వులప్రతిధ్వనులుపరుగు నడకగా మారేటి వేళకి..కోన [...]
అప్పుడక్కడచీకటి కమ్మి చాలాసేపయిందినిదానం గా నేల కి సమీపంగాతారకల వంటి మిణుగురులునింగిని తాకుతూన్నమిణుగురుల వంటి నక్షత్రాలుకంటిలోనూ, కాంతితోనూ చిత్రాలుగాసర్దుకున్నాయిఆమె పెదవి విప్పుకునిచిన్న నవ్వు మొలిచింది'మోటబావి గోడలు చీల్చుకున్న పచ్చని మొలకలా'దృశ్యం, సాదృశ్యం నడుమనడయాడే మది ఊసూ పుట్టిందిఅంతలో-ఏదో అసంబద్ధమనిపించింది..మొలకది జీవితేచ్ఛ, అస్తిత్వ [...]
లోపల వాతావరణం నెలకుని ఉంది-మిణుగురులు ముసిరిన మునిమాపుల్లోపట్టువిడవని మబ్బుల మారాము వేళల్లోఉండుండి ఉరుము ఒకటి ధ్వనిస్తూ ఉంది,మెరుపు ఉలిక్కిపాటున దాగినట్లుగా మాయమైపోతూ...వాన మొదలైందిమది నదిగా మారింది వాగులు వచ్చి కలుస్తున్నాయిదొంతరలుగా మేటవేసిన ప్రాయంతెప్పలై సాగే కలల తాకిడిలో కరిగినట్లుగా...జల్లులు వచ్చి పడుతూనే ఉంటాయి
ముదమారా పెంచుకున్నతోటలోకిఅనుదినంఅనురక్తితో నడిచినప్పుడు-నేల ఫలకం మీదనీటిజాడ, ఎండా చిత్రిస్తున్ననిత్యనూతన దృశ్యాలు  జీవితానికొక పోలికనిస్తూ...మనసు కదంబంలోతలపు, తపన మెలికపడిపూలమడిలోస్వీయ దర్శనమౌతూ...ఒక్కసారిగాతోట పిలిచినట్లౌతుంది,పూలు నవ్వినట్లు తోస్తుంది.ఊహ మాయమౌతూమనిషి రూపు ఎదురౌతుంది.చేయి, చేయీ తాకిన క్షణానతనువు చేతన సంతరించుకునిమేలువచనం [...]
నీటి గుసగుసలు,  ఏటి గలగలలు, రెక్క హోరు, గాలి జోరు పందిరి గుంజలై నిన్ను అల్లుకోమంటే...పాదాలు పరుగిడి,  మళ్ళీ మళ్ళీ రావాలి ఈ ఉదయం అనిపించిన ఒకానొక వాహ్యాళి కథనం; ఈ నది, నేను అతి సమీపం గా ఉంటూ ఆ పిట్టల పాటలలో మునిగి తేలుతూ ఉంటాము. అవేమో నదితో, గాలితో కలిసి కచ్చేరీలు కడుతూ ఉంటాయి.    
పుష్పించినదేదో ఫలించటానికి ఒదిగిన క్షణమా, ఒరిగిన తరుణమా అని అచ్చెరువున మునిగే మది ఆలోచన కి ప్రతీక! జీవితం సమస్తం ఈ స్థితి...
అంటే..అంత ఆనందంగా ఉంది అని అన్నమాట!  ఆత్మ బంధువు అనో ఆత్మీయ స్థానం అనిగాక మా మనిషి, మనవాడు అని చెప్పాలని లేదు. ఉత్సాహో వ్యవసాయ ప్రతీక వంటి ఒకరిని పదిలపరుచుకునే ఓ ఊసు. ప్రకాశం బారేజ్, నాగార్జున సాగర్ డాం, ధవళేశ్వరం అంటే నాన్నగారి ఉద్యోగానుభవాల విజయపరంపర మనోయవనిక మీద నాట్యమాడుతుంది.  ఇప్పుడు విజయవాడ, గన్నవరం అనుకోగానే హర్షాతిశయం మిన్నంటుతుంది నీ వల్లే నీ [...]
నిర్నిమేఘ ఆకాశం అమాంతంగా అల్లికల పోగుల్లా గుట్టలు పోసిందికొలను దాచుకున్నవన్నీ బింబాలై తేలియాడాయి  మబ్బులు పుటలుగా కవిత రాసుకుంటూ ఉన్నానా..అంతలోనేఆకుల్లా పరిచి ఎవరో మరి చిత్ర రచనలు చేస్తూ పోయారు...విస్తుపోతూ నేనూ కనుల యానం చేస్తూ గడిపాను, గుమ్మాన ఆగిన నీలి మబ్బు కన్ను గీటి కదిలిపోయేవరకు!
పంతంగా నీడల్ని పరిగెత్తిస్తూమొండి దేహంతో ఎండరూపం, రంగు లేని నీటిలోకి జారిపడిందిభళ్ళుమని నిశ్శబ్దశ్రుతితో తెల్లారిందివంతుగా ఆకుల్నీ, కొమ్మల్నీ ఊపుతూమొగ్గ దేహంలోకి గాలిరూపం, రంగు అద్దుకుంటూ ఒదిగిపోయిందిరివ్వుమని రెక్కలతో పిట్టపాట హోరెత్తిందినీళ్ళు, పూలు నవ్వుతున్నాయిముళ్ళు, రాళ్ళు నీడల్ని మోస్తున్నాయినిండుగా ఉనికి సంతరించుకుని జాగృతిరెండుగా చూస్తున్న [...]
చుక్కల మెడ తిప్పుతూ పావురాయి,ముక్కున కరిచిన మేతతో కొక్కిరాయిదిగువ పాయల వెంట ఎగిరిపోయాయికనుల కొలనులో చూపు ఎగువకి సాగిందిరంగురంగుల రేకులలో ఉషస్సు,రంగు మీద రంగుగా ఇంద్రధనుస్సుమెరుపు దాడుల దూతలమంటున్నాయిమేని సీమలో మైమరపు  పరుగులు తీసిందితనివి తీరని కాలం, ఋతువు దాటి ఋతువులోకిఅలవి కాని మోదం, అక్షర భారతి పాద సన్నిధికిబిరబిరల గోదావరి మారురూపాలౌతున్నాయిపదాల [...]
'మారాము చేసానులే...'మూసిన కిటికీ కమ్మీ నుంచిదూసుకువచ్చే వాన సడిలాబిగించిన ఆ పెదాల నుంచిచిన్న మాట!దుఃఖ మేఘం కమ్ముకున్నకనులుదిగులు భారం మోయనన్నతనువూఈ చేతులలో...'గారాము అనుకున్నా..లే!?'నిమిరిన మమత,సవరించిన మాటల ధార..తేటపడ్డ ఆకాశమైఅనుబంధం.
ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారు మలిచిన నృత్య రూపకం "సాగరసౌధం" గూర్చిన అన్వేషణ తో పాటుగా నా చిరు అనుభవం కలగలిసిన అనుభూతి.  ఎవరికైనా ఈ నృత్య నాటిక పరిచయం ఉంటే పూర్తి పాటల సాహిత్యం సంపాదించటానికి సహాయపడండి.అలుపన్నది యెరుగక పరవళ్ళతో, ఉరవళ్ళతో ఉరికే నదిని చూస్తే- ఉప్పొంగే ఆనందం,  అలాగే- అంతులేని అనురాగం, ఆవేశం, అదుపులేని ఆరాటం కూడ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు