తెలంగాణాను మరో కాశ్మీరంగా మార్చబోతున్నారా? కాంగ్రెస్ వ్యూహం ఇదేనా? జరుగుతున్న పరిణామాలు వీటినే సూచిస్తున్నాయి. కాశ్మీర్ ను సంపూర్ణంగా పరిష్కరించకుండా నాడు నెహ్రూ వ్యవహరించిన తీరునే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సీమాంధ్ర పెట్టుబడి దారుల ప్రాబల్యాన్ని దాటి, వారు గీసిన గీటును దాటి కాంగ్రెస్ అధిష్ఠానం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని [...]




