M.Tech  కెమికల్ ఇంజనీరింగ్ లో నా స్పెషలైజేషన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ కెమికల్స్. రెండు సెమిస్టర్లయిపోయి మూడవసెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి. అందులో భాగంగా రిలయన్స్ మా కాలేజీకి క్యాంపస్ ఇంటర్వ్యూ కు వచ్చింది. టెస్ట్ పెట్టారు. వ్రాశాను కానీ సెలక్ట్ కాలేదు. ఆ సందర్భంగా అప్పుడు నా డైరీ లో వ్రాసుకున్న ఆనాటి నా భావాలు :)  ఇప్పుడు [...]
జిల్లెళ్ళపాడు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా లోని ఒక కుగ్రామం. కనిగిరికి దరిదాపు 22 కి.మీ దూరంలో పట్టణవాతావరణం మచ్చుకైనా లేని గ్రామం. ఊరు రెండు భాగాలుగా విడిపోయి వుంటుంది. "పాతూరు", "కొత్తూరు" అని. పాతూరికి కొత్తూరికి మధ్యన కొంతపొలం వుంటుంది. నడిచి వెళితే ఓ పదినిమిషాలు పడుతుంది. పాతూరికి ఓ ప్రక్కగా మాల,మాదిగ పల్లెలుండేవి. అన్నింటిని కలిపి జిల్లెళ్ళపాడు అని అంటారు.  [...]
మనిషి  మనిషిగా రూపాంతరం చెందినప్పటినుండి బ్రతుకు కోసం పోరాటంలో తెగలు తెగలు గా సంచరించుచూ ఆ తెగలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటు సాటి మనిషితో సంభాషిస్తూ తన మనసులోని భావాల్ని రకరకాల శబ్దాలతో తెలియచేస్తూ సహాయాన్ని పొందుతూ సహాయపడుతూ వేల ఏళ్ళుగా సాగే పరిణామ క్రమంలో కొన్ని వేల భాషలు ఏర్పడుంటాయి. జన బాహుళ్యం నుంచి పుట్టే ఏ భాషకైనా మొట్టమొదట లిఖిత రూపముండదు.  అది జానపదమై [...]
చం|| ధరణియె విశ్వమూలమని ధారుణిమానవులెల్ల రూఢిగన్ విరచితిరాపురాణకథ వీనులవిందుగ బైబులందుఁగా ని రుసి గెలీలియో యిల దినేంద్రునిఁజూప వధించె నాడు, నా విరసపుఁగావ్యమొప్పినది వీనులవిందయి మెచ్చిరెల్లరున్
వివిధ ఆర్థిక,రాజకీయ,సామాజిక కారణాల రీత్యా ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలసలు వెళ్తుతుంటారు.ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వ్యక్తిగా గుర్తించటానికి జనాభా గణన వాళ్ళు రెండు ప్రామాణికాలును ఉపయోగిస్తారు. ౧) జన్మస్థలం ౨) ఇంతకు ముందు నివాసం వున్న స్థలం. ఒక వ్యక్తి వలసవచ్చిన వ్యక్తిగా గుర్తించటానికి ఆ వ్యక్తి ఇంతకు ముందు నివాసమున్న ప్రదేశం కాకుండా ఇప్పుడు తానున్న [...]
 కూతురి పెళ్ళికి చేతికి అందని డబ్బు. చిన్నారి జబ్బుకు ఆసుపత్రికయ్యే డబ్బులు లేక ఒక అమ్మ విలవిల. బ్రతకడానికి నిత్యావసర సరుకులు కొనడానికీ చేతులు కట్టేసుకోవాల్సినట్లుంది.మరోవైపు వారాంతాలలో సరదగా బయటకెళ్ళి ఒక్క దమ్ము పీకుదామన్నా చిల్లరకోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కథనాలు పార్టీలకతీతంగా ప్రతి టీ.వీ ఛానల్ లో ప్రసారమవుతున్నాయి కాబట్టి ఇవి సామాన్యుని [...]
నవంబరు ఎనిమిదవ తేదీ యధావిధిగా ఎనిమిది గంటలకు లేచి అబ్బా ఆఫీసుకు వెళ్ళాలా అనుకుంటూ తయారై ఆఫీసుకు వెళ్తూ mobile లో All India Radio  పెట్టుకొని వెళ్తూ ఆంగ్లవార్తలు వింటూ కారు నడుపుతున్నాను.ముఖ్య వార్తల్లో 1000 రూపాయలు, 500 రూపాయల ను రద్దు చేస్తున్నట్లు వినగానే రోమాలు ఒక్కసారి నిక్కబొడుచుకున్నాయి. ఈ దెబ్బతో బడాబాబులదగ్గరున్న బ్లాక్ మనీ అంతా దిబ్బలో వేసుకోవడమే నని ఆనంద పడ్డాను.భారత [...]
బ్లాగునొకకంట చూడక ఇన్ని దినంబుల్ సంసార సాగరంబందీదులాడి కార్యాలయమున భారమున్మోసి తప్పటడుగుల నడకనేర్చు చిన్నారి ఓలె తిరిగి వచ్చు చుంటి నా ప్రియసఖి చెంతకు మనసులోని మాటలన్ మురిపెముల ముచ్చట్లు పూసగ్రుచ్చినట్లు ముచ్చటించుకొరకు మరిచితిని ఛందోగణాంకములను మరిచితిని యతిప్రాసలను పద్యలక్షణముల్ చూడగ తెలుగే తరిగిపోవు సంధి కాలమున తిరిగి చూచు చుంటి బ్లాగ్దేవి [...]
80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో [...]
మా ఊరి వార్త మంచిదో చెడ్డదో  రెండు పేపర్లలో కనిపించేటప్పటికి నాకు ఎక్కడలేని ఆనందమేసింది :-). నేను ఎప్పటినుంచో మా ఊరి పేరు ఒక్కసారన్నా పత్రికల్లో వస్తే చూడాలని కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందెప్పుడన్నా వచ్చేయామో నాకు తెలియదు కానీ, నేను అసెంబ్లీ నియోజకవర్గ పేపర్లు చదవడం మొదలు పెట్టిన తరువాత మా ఊరి పేరు వార్తాపత్రికల్లో ఒక వార్తగా  చూడడం ఇదే [...]
మొన్న digital library of india (http://www.dli.ernet.in/)  లో అలా పుస్తకాల కోసం సంచరిస్తుంటే రాయలనాటి రసికతా జీవనము కనిపించింది. ఈ పుస్తకం చూడటంతోనే ఆనాటి ప్రజల సాంఘిక జీవనము గురించి ఏమైనా వ్రాశారేమోనని చదవడం మొదలు పెట్టాను.ఈ పుస్తకాన్ని సరస్వతీ పుత్ర శ్రీ  పుట్టపర్తి గారు రచించారు.మొదటి ముద్రణ 1955 లో రెండవముద్రణ 1957 లో వెలువడింది. రాయలనాటి కాలంలో రచించిన ఆముక్తమాల్యద,కాళహస్తీశ్వర మహాత్యము,
కవితనై నీ కనుపాపలో బొమ్మనైపోనా మమతనై నీ మధురస్మృతుల గిలిగింతలు పెట్టనా భవితనై నీ భావిబాటన పూలు జల్లనా సన్నిహితనై నీ సాంగత్యసాగరాన ఓలలాడనా
ఎండాకాలం.మనసులోని చెమ్మ ఆవిరై చిరాకును తెప్పించేకాలం.సరదాగా కాసేపు బయట తిరుగుదామన్నా ప్రకృతి సహకరించని మాసం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయని వార్తలు.కానీ అతిముఖ్యమైన రెండు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.రెండూ ఆంధ్రప్రదేశ్ లోనే. ఒకటి ఒంగోలులో మరొకటి నరసరావుపేట దగ్గర నర్శింగపాడులో.ఈ రెండు పెళ్ళిళ్ళను చూడడంకోసం ఎలాగూ వెళుతున్నా కాబట్టి నేను [...]
మా అమ్మ పరమపదించి నేటితో నాలుగేళ్ళు నిండుకుంటుంది.2010 డిసెంబరు 25 వ తేదీ శనివారము వైకుంఠ యాత్ర చేసి శివైక్యం చెందారు.వైకుంఠ యాత్ర చేసి శివైక్యం పొందటమేమిటని తర్కపడకండి. శివకేశవులు అభేదులు. గీత లో పరమాత్మ చెప్పినట్టు ఉన్నది ఒక్కటే అది పరమాత్మ స్వరూపం. ఈ సమస్త జగత్తూ ఆత్మచేత నిండి ఈశ్వరునిచే వ్యాపించబడి వుంటుంది. అంతవంత ఇమేదేహః నిత్యస్యోక్తా [...]
నా చిరకాల మిత్రుడు, జాన్ జిగిరీ దోస్త్ నాయుడు లక్ష్మీనారాయణ హఠాత్తుగా ఈ రోజు గూగుల్ ఛాట్ లోకి వచ్చి "హెలో ఆనందా" అంటూ పలకరించాడు. ఈ ఆనంద ఎవరూ అని బట్టతలమీదున్న నాలుగు వెంట్రుకలను పీక్కోకండి. ఆయన సంబోధించిన "ఆనంద" వెనకాల ఓ చిన్న కథే వుంది. ఆ "ఆనంద" ను నేనే. వివరాలలోకి వెళ్తే..... నేను బి.టెక్ ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్టణంలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి. [...]
మరికాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుండటంతో మనలో వున్న ఉత్కంఠతకు కూడా తెరపడనుంది.ఈ లోపు మీ ఎక్జిట్ పోల్స్ ఫలితాలను కామెంట్ల రూపంలో వ్రాసుకోండి :-)
ఇది చాలా వినూత్నంగా వుంది. ప్రాక్టికల్ గా ఎంతవరకూ సాధ్యమో తెలియదు. http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/12052014/Details.aspx?id=2289692&boxid=25563810  
ఎలక్షన్లు అయిపోయాయి. ఇక రాజకీయనాయకులకూ ఇన్ని రోజుల శ్రమనుంచి కాస్త విరామం. ఎండనకా వాననకా రేయింబవళ్ళు ప్రచారం చేసిన అభ్యర్థులకు విరామంతోపాటు టెన్షన్లు కూడా. ఈ ఎలక్షన్ల సందర్భంగా పట్టుపడ్డ కోట్ల రూపాయల ధనాన్ని ఎవరికి అప్పగిస్తారో ఏమిచేస్తారో? అలాగే వేల లీటర్లమధ్యము వుండనే వుంది. నిన్నటిదాకా రెచ్చిపోయిన ఈనాడు పత్రిక కూడా ఒక్కసారిగా అమాయకంగా తనకేమీ తెలియదన్నట్లు [...]
ఇలా కొట్టుకుంటుంటే జనాలకు అసలైన విషయాలు తెలుస్తాయి :-).   ఈనాడు పై సాక్షి కథనం   జగన్ పై ఈనాడు కథనం    
2014 మే 7 వ తేదీ దగ్గరపడుతుంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం ఎప్పటికన్నా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనిపిస్తుంది. దానికి తోడు మనకు తెలుగులో వున్న న్యూస్ పేపర్లు అన్నీ సిగ్గూ,ఎగ్గూలను వదిలేసి పూర్తిగా పార్టీ లతో సంధానమైపోయినట్టు ప్రచారాస్త్రాలను ప్రజలమీదకు ప్రయోగిస్తున్నారు. ఈ మధ్య నేను తరుచూ ఈనాడూ, సాక్షీ పేపర్లను అనుసరిస్తున్నాను. సాక్షి వైయస్సార్ [...]
ఈ మధ్య చాలారోజుల తరువాత మళ్ళీ నాబ్లాగు రమ్మని పిలిచింది. ఇంతకాలం ఏదో ఇరగదీసే పనులున్నాయనుకుంటే అది పొరపాటే. గూగుల్ ప్లస్,ఫేస్ బుక్ లకు జనాలు వలస పోయిన తరువాత బ్లాగులు రాసేవాళ్ళూ తగ్గిపోయారు కదా! పాతనీరు పోయి క్రొత్తనీరు బ్లాగుల్లో ఏమన్నా ప్రసరిస్తుందేమో కానీ నా విషయానికొస్తే వ్రాయాలన్న ఉత్సాహం తగ్గిపోవడమే. అటు ఆంధ్రదేశమంతా రాజకీయ మాయగాళ్ళతోటి అట్టుడికి [...]
ఆలోచనలు అరిగిపోయి సన్నమై ఆవిరైపోతున్నాయ్ తెలుగు తరిగిపోయి తెరచాటున దాక్కుంది వ్రాయాలన్న తపనపోయి రాళ్ళమధ్య యిరుక్కుంది చదవాలన్న కోరిక చెట్టెక్కి కూర్చుంది ఇవేమీ లేని జీవితం నిస్సారమై తోస్తుంది. అసలు వ్రాయాలన్న కోరిక లేకపోతే వ్రాయలేము కదా. వ్రాయకపోతే వున్న భాషకాస్తా మాసిపోయి వెలుగు కోల్పోతుంది.అలా కొద్దినెలలు మూలన పెట్టెస్తే అసలు ఏమీ వ్రాయకుండానే, [...]
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైనప్పుడు సినిమా హాల్లొ చూస్తే అంతగా నచ్చలేదు కానీ ఈ రోజు ఇంట్లో టి.వి లో చూస్తే బాగానే నచ్చింది. కారణమేమై వుంటుందబ్బా? తొమ్మిదేళ్ళ క్రితం మా ఇంట్లో తీసిన వీడియో చూసిన తరువాత ఈ రోజు ఈ సినిమా చూడ్డంతో నచ్చిందేమో లేదా మా ఇంట్లో మల్లెపూల చెట్టు విశేషమో. Over all I am home sick today!!  
ఆకాశవాణి విజయవాడ కేంద్రం.... ఇప్పుడు సంస్కృత పరిచయం కార్యక్రమం అంటూ నా చిన్నప్పుడు ఉదయపువేళల్లో సంస్కృతం చదువుకొనే విద్యార్థుల కోసం విజయవాడ కేంద్రం వారు ఒక ధారావాహికను ప్రసారంచేస్తుండేవారు. ప్రసారకార్యక్రమానికి ముందుగా సంగీతంతో కలిపి ఓ శ్లోకాన్ని రోజూ ప్రసారం చేసేవారు. అప్పట్లో రేడియో అంటే వుండే ఇష్టంతో ఈ కార్యక్రమంతో పాటు మిగిలిన చిన్నపిల్లల కార్యక్రమాలను [...]
ఎంతో చక్కగా శ్రవణానందకరంగా ఆలపించి పదిమందితో  యు ట్యూబ్ ద్వారా ఈ ఆడియో వీడియో ను పంచుకున్న రూపకర్తలకు ధన్యవాదాలతో పులుంగు టెకిమీడవురా గిజిగాడా..  
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు