జైశ్రీరామ్.జైశ్రీమన్నారాయణా!సోదరీ సోదరులకు నమస్సులు.ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవము. ఈ సందర్భముగా మహిళా లోకానికినా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకొంటున్నాను.మహిళాలోకమె మూలమై వెలుగునీ మాన్యప్రపంచంబు. సన్మహిళల్ జీవన మార్గదర్శకులు. ప్రేమన్ బంచి పోషింత్రు. నిస్పృహ పోకార్పుచు నిండు జీవనమిడే సౌమ్యాత్ములీ కాంతలే.మహనీయుండగు బ్రహ్మ వారికిడు సన్ మాంగళ్య [...]
జైశ్రీరామ్.77) తల్లి చేతి ముద్ద పిల్లలకనురాగ  -  బంధమరయఁ జేయు, బ్రతుకఁ జేయు.     తల్లి ప్రేమ కొలుపు మల్లెల మనసును.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి చేతితో పెట్టే భోజనము పిల్లలకు ప్రేమ బంధమును తెలియఁ జేయును. బ్రతుకునట్లు చేయును. తల్లి ప్రేమ మాలో మల్లెల వంటి మనసును కలుగఁ జేయును. జైహింద్.
జైశ్రీరామ్.76) ఎవరి శక్తి నెన్న నెవరికి సాధ్యము?  -  బాలలందు శక్తి ప్రబలకున్నె?     శోధనమున భావి మేధావులము మేము  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఎవరి యొక్క అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యముల నెవరు గుర్తించఁ గలరు? బాలలలో కూడా శక్తి ప్రబలి ఉండునని తెలుసుకొన వలెను. భావి కాలమున పరిశోధనలను చేయు మేధావులము మేమే కదా!జైహింద్..
 జైశ్రీరామ్.75) మమ్ము త్రోసిపుచ్చి మా మాట వినరేల?  -  మాకు విలువ లేదొ? మనసు లేదొ?     మమ్ము కూడ మీరు సమ్మతిఁ గనుఁడయ్య?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్మల్ని లక్ష్య పెట్టకుండా మా మాటలను గ్రహింపరేమి? మాకు మీ మధ్య విలువ లేదా? మమ్మల్ని కూడా మీరు సమ్మతితో చూడండి.జైహింద్.
  జైశ్రీరామ్.74) పిన్నలమగు మేము పెద్దవారిని పోలి   -  చూడఁ గలము. చూచి చెప్పఁ గలము.    చూచి చెప్పనిండు తోచిన భావన.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలమైన మేము కూడా పెద్దవారిలాగే వినకలము, దానికి స్పందించి మా అభిప్రాయము కూడా చెప్పఁగలము. మమ్మల్ని కూడా ఏమి జరుగుచున్నదో చూడనివ్వండి, చూచి చెప్పనివ్వండి.జైహింద్.
  జైశ్రీరామ్.73) పెద్దవారి నడుమ పిల్లలమగు మేము   -  చెప్పు మాట వినరు. తప్పనుదురు.     మమ్ము చెప్పనిండు. మా మాటవినుఁడయ్య  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాటలాడుకొనుచున్నప్పుడు మేము ఆ మాటలు విని స్పందించి మా అభిప్రాయమును చెప్పుటకు ఉత్సహిస్తున్నప్పుడు మమ్మల్ని మీరు అడ్డుకొని, అలా మధ్యలో మాటాడ కూడదు, తప్పు అని మా నోరు [...]
  జైశ్రీరామ్.72) ఆడుకొనెడి మమ్మునల్లరి యని తిట్టి  -  చేయనీరు. మాదు చేవఁ గనరు.     ఆట పాటలొసగు నద్భుత మేధను.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము ఆడుకొనే సమయమున మమ్ములను చూచి మీరు అల్లరి చేస్తున్నారేమిటి అని తిట్టుచుందురు. మమ్ములను ఆడుకోనివ్వరు. మీరు ఏ  ఆట పాటలను అల్లరి అంటున్నారో ఆ ఆట పాటలు మాకు అద్భుతమైన మేధా సంత్తిని [...]
 జైశ్రీరామ్.71) మీరు చదివి చెప్ప మేలగు కొంచెమే.  -  మేము చదివి నేర్వ మేలు హెచ్చు.    మమ్ము చేయనిండు మా మేధ గాంచుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!                     భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా కొఱకు మీరే చదువుతూ, మాకు బోధించుతూ ఉన్నట్లైతే ఫలితము కొంచెం మాత్రమే ఉంటుంది. అదే మీరు మమ్మల్ని చదవి చెప్పమనినచో మా మేధా శక్తి మీకు [...]
 జైశ్రీరామ్. 70) పుస్థకంబు చదివి ముక్కున పెట్టిన  -  ఫలితమెట్టుండు? భావి యెటుల?     నిండు మదిని చదువనిండుమమ్మిచ్ఛతో.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పుస్తకమును చదివి మేము ముక్కున పెట్టుకొనినచో ఫలితం ఏవిధంగా ఉంటుంది? భవిత ఎట్టులుండును?  మమ్ములను నిండు మనసుతో మనస్పూర్తిగా చదువనిండు. భవిత [...]
 జైశ్రీరామ్. 69) పాఠశాలలోన బలవంత పెట్టుచు  -  చదువు నేర్ప, మాకు చదువు రాదు.     నిజము చెప్ప మమ్ము నిలఁబెట్టి దండింత్రు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! బడిలో మాకు ఇష్టము లేని సమయమున ఉపాధ్యాయులు బోధింప యత్నించినచో మేము మా మనసులో ఉన్న యీ అభిప్రాయమును చెప్పినచో  వారు మమ్ము వారిని ఎదిరిస్తున్నామంటూ [...]
జైశ్రీరామ్.68) పాఠశాలలోన పదిమందితో పాటు   -  అచటనున్నవాటినరయుదుమయ.     మంచి చెడ్డలుండు. మన్నింపవలె మీరు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము బడిలో పదిమందితో కలిసి మసలుచున్నందున అక్కడి విషయములను అందరితో పాటు మేమూ నేర్చుకొందుము.  అట్లు నేర్చుకొనువాటిలో మంచివిషయములుండ వచ్చును, వాటితో పాటు చెడ్డ విషయములు కూడా ఉండ వచ్చును. [...]
 జైశ్రీరామ్. 67) చిన్నవారిమగుట నన్నియు తెలియక   -  తప్పుచేయుచుందుమొప్పనుకొని.     తప్పు తెలియఁ జిప్పి , దండింప మానుఁడీ..  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నపిల్లలమగుట చేత తెలియకపోయిన కారణముగా తప్పులనుకూడా చేయఁదగిన పనులుగానే భావించుట చేత ఆ తప్పులు చేస్తాము. అటువంటి సమయంలో మీరు మాకు ఇది [...]
జైశ్రీరామ్.66) తిండి తినెడు వేళ మొండి చేతుము మేము  -  అమ్మ బుజ్జగించు, నరుచు నాన్న.     అమ్మ నచ్చు, నాన్న యరుపు నచ్చదు మాకు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాకు భోజనము పెట్టేటప్పుడు మాకు వద్దు, మేము తినము అని మారాము చేస్తాము. అప్పుడు అమ్మ మమ్మల్ని బుజ్జగించి తిండి పెట్టుతుంది. నాన్న మాత్రం తినమని మాపై అరుస్తారు. అందుకే [...]
 జైశ్రీరామ్.65) నాది నీది యనుచు వాదించి నేర్పుచు,    -  మాది మేము గొనగ మమ్ము తిట్టి     స్వార్థపరులటంచు పలుకుట న్యాయమా?    -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!                            భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నవారిఁగా ఉన్నప్పుడు మీరు ఇది నాది, అది నీది అంటూ మాతో వాదించి మాకు స్వార్థాన్ని మప్పుదురు. పెద్ద [...]
జైశ్రీరామ్.64) తల్లి కడుపులోన తన్నితిమానాడు. -  తల్లి మనసు తెలిసి తల్లడిలుదు     మిప్పుడేమి చేసి మెప్పింప గలమయ్య?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నితిమి. పుట్టిన తరువాత ఆమె మనసు తెలుసుకొనిన మేము తల్లడిల్లిపోవుచున్నాము. ఇప్పుడు మేము ఆమెకు ఏమి చేసి మెప్పించఁ గలము?జైహింద్.
 జైశ్రీరామ్.63) తల్లి తండ్రి గురువు దైవంబులగు మాకు - వారి వృత్తియందు నేరమున్ననేర వృత్తి మాకు నేర్పకే వచ్చుగా! - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి, తండ్రి, గురువు, వీరు మాకు దైవములే. అట్టి దేవులతో సమానమైన వారి యొక్క వృత్తమునందు నేర ప్రవృత్తి యున్నచో ఆ నేర ప్రవృత్తి మాకునూ నేర్పకనే వచ్చును కదా! కాబట్టి మాకు మార్గదర్శకులైన పెద్దలందు సత్ [...]
జైశ్రీరామ్.62) పాఠశాలలందు పాఠముల్ చెప్పుచు  -  నాటఁలాఁడఁ జేయ హాయి కలుగు.!      ఆట లాడ మాకు నట చోటు లేదుగా!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!                       భావము. పాఠశలలలో  మాకు పాఠములు చెప్పుచూ, ఆటలు కూడా ఆడించుచున్నచో హాయిగా ఉండి, శారీరక మానసిక వికాశము మాకు కలుగును. ఐతే నేటి పాఠశాలలలో మేము ఆడుకొందామంటా ఆట [...]
జైశ్రీరామ్.61) కోరి ప్రేమఁగ మిము చేర వచ్చిన మమ్ము  -  చదువుకొండటంచు బెదర కొట్ట     నేమి చేయ నేర్తు మెచటికి పోదుము?    -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!                                   భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ప్రేమగా మేము కోరి కోరి మిమ్ములను చేర వచ్చుచుండఁగా వెళ్ళు, చదువుకో, అంటూ మమ్మల్ని మీరు [...]
                                                                  జైశ్రీరామ్.60) మనసులోని మాట వినిపించ యత్నింప    -  తిరగబడితిమనుచు తిట్టెదరుగ!      మనసు విప్పి మేము మాటాడ కూడదా?   -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! సందర్భానుసారముగా పెద్దలతో మా మనసులో ఉన్న మాట మేము చెప్పుటకు ప్రయత్నము చేస్తుంటాము. ఐతే వారి [...]
జైశ్రీరామ్.59) కంటి ముందు మాకు  కనిపించు వాటిలో  - మంచి నెంచు నేర్పు మాకుఁ గొల్పి,     మంచి చెడ్డలరసి మసలుట మప్పుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కంటి ముందు కనిపించే వాటిలో మంచినే మేము గ్రహించే నైపుణ్యము మాకు నేర్పి, మంచియేదో, చెడు ఏదో మేము తెలుసుకొని మసలుకొనే విధముగా మమ్ములను తీర్చి దిద్దండి.                        [...]
 జైశ్రీరామ్.58) పిన్నవానిపైన ప్రేమకొంచెము హెచ్చు.  -  పెద్దవానిపైన ప్రేమ తగ్గు     పెద్దలిట్లు చూడ భీతిల్లమా మేము?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలపై తల్లిదండ్రులు కొంచెము ఎక్కువ ప్రేమ చూపింతురు. చిన్న వాడు పుట్టగానే పెద్దవాడిని నిర్లక్ష్యము చేయుదురని మాకు తోచును. ఈ విధముగా చేయుచున్నచో మేము అభద్రతా భావముతో [...]
 జైశ్రీరామ్57) చిన్ననాడు మమ్ము మన్నన జేతురు  -  పెరుఁగుచున్న కొలది ప్రేమ తగ్గు     మన్నన కరువైన మాకెట్లు తోచును?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో మన్నిస్తూ ఎంతగానో ప్రేమ కురిపిస్తారు. కాని మేము పెద్ద ఔతున్న కొద్దీ మాపై వారికి ఉండే ప్రేమ తగ్గిపోతుందని మాకు అనిపిస్తుంది. [...]
 జైశ్రీరామ్.57) చిన్ననాడు మమ్ము మన్నన జేతురు  -  పెరుఁగుచున్న కొలది ప్రేమ తగ్గు     మన్నన కరువైన మాకెట్లు తోచును?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో మన్నిస్తూ ఎంతగానో ప్రేమ కురిపిస్తారు. కాని మేము పెద్ద ఔతున్న కొద్దీ మాపై వారికి ఉండే ప్రేమ తగ్గిపోతుందని మాకు అనిపిస్తుంది. [...]
 జైశ్రీరామ్.57) చిన్ననాడు మమ్ము మన్నన జేతురు  -  పెరుఁగుచున్న కొలది ప్రేమ తగ్గు     మన్నన కరువైన మాకెట్లు తోచును?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో మన్నిస్తూ ఎంతగానో ప్రేమ కురిపిస్తారు. కాని మేము పెద్ద ఔతున్న కొద్దీ మాపై వారికి ఉండే ప్రేమ తగ్గిపోతుందని మాకు అనిపిస్తుంది. [...]
 జైశ్రీరామ్56) కన్నతండ్రి మనసు కఠినమందురుకాని  -  వెన్నకన్న మృదువు. కన్న బిడ్డ     కాన రాని వేళ కలత చెందును తండ్రి.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కన్న తండ్రి యొక్క మనసు కఠినంగా ఉంటుందని అందరూ అందురు. కాని అది సత్యము కాదు. అతని మనసు వెన్నకన్నా సుకుమారమైనది. తమ కన్న బిడ్డ ఎదురుఁగా ఉన్నంత సేపూ అతనిలో ఉన్న ప్రేమ బైటకు చూపరు. తన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు