మా తుఝే స(గు)లామ్! కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ... పాతలో లాగా జనానికీ, అల్లాగే (అయ్యో బూతర్థం తీయకండి. పడరాని వారి కంట బడితే నాకు బడితె పూజ కాదు, ప్రాణాలే టపా కట్టేయొచ్చు.  భూమ్మీదింకొంత కాలముండి మరి కొంత మంది చేత తిట్టించుకోవాల్సిన/శాపనార్థాలు పెట్టించుకోవాల్సిన పని ఉంది, నాకోసం కాకపోయినా, కనీసం వారికోసమన్నా తిన్నగా పోదాము) అజ్జనమునందలి వాడినే కనుక నాకునూ [...]
ఎంతగానో ఎదురు చూసిన ధనుర్మాసం నిన్న మొదలైంది. మధ్యాహ్నం మూడు గంటలకు. ఈ సందర్భంగా పాంచరాత్రాంతర్గతమైన, శ్రీరంగంలో వాడతారు అని చెప్పబడే శ్రీలాక్ష్మ్యష్టోత్తర శత నామ స్తోత్రాన్ని అందించాలని ఆశ. సాధారణంగా అందరికీ తెలిసిన స్తోత్రంలా కాకుండా ఇది చదువుకునేందుకు, వినేందుకు కూడా చాలా బాగుంటుంది. అలాగే అంగ న్యాస, కర న్యాసాలవీ లేవు కనుక పారాయణమ్ చెయ్యాలనుకునే వారికి [...]
నేను వంట చేసేప్పుడు ఒక ప్రత్యేకమైన సిస్టమంటూ ఫాలో అవుతాను. ఒక రెగ్యులారిటీ. కానీ చేసే విధానం మాత్రం తడవ తడవకీ మారుతూ ఉంటుంది. ఒకే రకమైన వంటకాన్ని ఒక్కోసారి ఒక్కోరకంగా చేస్తుంటాను. అందుకే ఎప్పుడన్నా రెసిపీ ఇవ్వాలంటే ఎందుకులే అని ఊరుకుంటాను. ఒకటి మాత్రం గ్యారంటీ... చేసినవి తప్పకుండా బాగుంటా(డాలి)యి.నా వంట మెథడ్లని ఇంకెప్పుడైనా చెప్తాను కానీ ప్రస్తుతానికి పుదీనా [...]
రామ రాజు తాతయ్య మీలవ్వు సంగతి సరే అబ్బాయీ, "ల" అంత్య ప్రాసగా ఏదన్నా చిన్న కవిత చెప్పు చూద్దామని, భోజనాల దగ్గర అడిగినప్పుడు చంటి చెప్పిన మాటలు ఇవీ...నువ్వు నాకు ఉయ్యాల...నేను నీకు జంపాలమన ఇద్దరి మురిపాలకాస్త ఆలోచించుకుని,చెయ్యి కడుక్కునేందుకు లేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ...పాపలిద్దరు కలగాల"ఇలా చెప్పానని నన్ను సాఫ్టనుకోకండి. చెప్పటానికి బానే ఉంది గానీ తాత గారూ... ఈ [...]
ఇవాళ మాకు రెగ్యులర్ గా కురలు ఇచ్చే మామ్మ వచ్చింది. ఇప్పుడు మానేసిందనుకోండి అమ్మకాలు. కాకపోతే నన్ను చూట్టానికి అని :) ఆ వచ్చినప్పుడు కొన్ని పళ్ళూ, కూరలూ పట్టుకొచ్చింది.వాటిలో నాకు పుదీనా కనిపించింది. పండక్కి ఏమన్నా స్పెషల్స్ చెయ్యాలని ఆలోచిస్తుంటే పుదీనా జంతికలు అయితే చంటి ఇష్టంగా తింటాడని చేశాను. ఈలోగా కాస్త తలనొప్పని అనిపిస్తే ఏంచేద్దామా అని ఆలోచిస్తుంటే పుదీనా [...]
కాస్త అల్లరి నేర్చుకోమ్మా, అని మా చంటోడు బుడుగు పుస్తకమిచ్చాడు ఆమధ్య. కొంచం కొంచం చదువుతుంటే ముళ్ళపూడి వారి శైలి నాకు బాగా నచ్చటం మొదలైంది. తరువాత మా దగ్గరే ఉన్న పుస్తకాల్లో కోతి కొమ్మచ్చి తీసి చదువుతున్నానిప్పుడు. అందులో ఒక చోట తనకి తొమ్మిది మంది తల్లులు అని చెప్పారు.ఇది నవరాత్రి సమయం కదా... నాకు కూడా బాగా ఇష్టమైన స్త్రీల గురించి (నా జీవితంలో ఆప్యాయతలు పెనవేసుకున్న [...]
హద్దన్నదే ఎరుగను నేను,నింగి నా నెచ్చెలి.తన తలపులు చదివాకకలిగింది నాకు వెచ్చలి.He always mixes up science or philosophy in his poems though on first reading they look romantic. So a RoMANట్రిక్ special this one. I liked the experiment వెచ్చలి... Pure romance :)Taken from his unpublished collection... Romancing the July RainsThis is not a separate poem, but two stanzas from different ones. When I asked for a romantic poem, he simply mixed these two
 2001:ఇప్పటి దాకా నా జీవితంలోని వ్యక్తులు, నా వాళ్ళు నాన్నా, అన్నయ్యానూ. స్నేహితులు అంటే సుజన, సెల్వి, ఇంకా కొంత మంది. అప్పుడప్పుడూ వచ్చే నాయనమ్మతో నా అనుబంధం. అప్పుడప్పుడు లానే ఉండేది. మరో ఎనిమిదేళ్ళ దాకా ఆవిడకి నా మీద పూర్తి స్థాయి మమతానుబంధాలు ఏర్పడలేదు.ఒక పదిహేనేళ్ళ అమ్మాయి జీవితంలో అప్పటికి నేను ఉన్నత స్థితిలో ఉన్నట్టే. కలలూ, ఆశలూ, ఊహలతో నా భావి జీవితం మీద కొన్ని [...]
ఇందాకన chronology of Frederick Nietzsche చూస్తూ శ్రీశ్రీశ్రీ పతి దేవులవారు కనిపిస్తే, మనం కూడా అలా ఒకసారి రాసుకుంటే బాగుంటుంది కదా అనిపించ మొదలెట్టిన ప్రయత్నం ఇది. సంవత్సరాల వారీ నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు...1986:జనవరి ఒకటిన బ్రాహ్మీ ముహుర్తంలో, అంటే 3:33 కి పుట్టాను. మన సంప్రదాయం ప్రకారమైతే డిసెంబరు 31 న పుట్టినట్టు. అంటే తెల్లవారితే జనవరి ఒకటి. ఆ సంవత్సరంలో మొదటి ఆరు నెలలూ, నాన్న [...]
అప్పుడే అరవై ఆరేళ్ళైపోయిందట నాన్న పుట్టి!ఏదో నిన్న మొన్న జరిగినట్టుంది నాకైతే :-) (కాసేపివాళ నాన్నకమ్మనిలే. అందుకే ఇలా).నాన్నతో నా అనుబంధం పేగు బంధానికన్నా ఎక్కువ. అవును మరి. నేను పుట్టిన కొన్ని నిమిషాలయ్యాక చేతుల్లోకి తీసుకున్నాక, ఇక నేను ఆ చేతుల్లోనే ఉండాలని రాసిపెట్టి ఉంటే, దాన్ని అయన చాలా చాకచక్యంగా గొప్పగా భావిస్తే, నన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటే, తన [...]
"ఏం చంటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?""ఆ ఏమీ లేదూ నీకూ గాడిద కూ  పోటీ పెడితే ఎవరందంగా ఉంటారా అని...""మా నాన్న వాడే కా౨మ్ తో ఫోటో తీస్తే సరి. ఎవరందంగా  ఉంటారో తేలిపోతుంది."ఒక రోజు పొద్దున్నే శ్రీవారు దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఏమిటా అని అడిగి మరీ బుక్కైన సందర్భమది.సరే అని మా నాన్న దగ్గర కా౨మ్ తీసుకుని అలా బైటకెళ్ళాక ఒక గాడిద కనిపించింది. వెళ్లి నించో అన్నాడు. సరే అని [...]
"నువ్వా పురచేతి రాత అపుతావా? చెయ్యి విరగ్గొట్టనా?" చేత మీద కర్రతో కొట్టే సరికి నా చేతిలోని బలపం విరిగిపోయింది. నొప్పి భరించ లేక ఒక్కసారిగా ఏడ్చేశాను, చెయ్యి విదిలిస్తూ. ఎడమ చెయ్యి పైన ఎర్రగా కందిపోయింది. కానీ, నేను నొప్పి పుడితే ఓర్చుకోగలను. వెంటనే తమాయించుకుని చేతులు వెనక్కి పెట్టి అలాగే నిలుచున్నాను. కానీ కళ్ళమ్మెట నీళ్ళు మాత్రం ఆగలేదు. "ఇంకోసారలా రాశావంటే [...]
దుర్గ గారు వాళ్ళ నాన్న గురించి చెపుతుంటే ఎందుకో నాకా ఎమోషన్, ఆ చెప్పిన తీరూ నచ్చాయి. ఎంతైనా నాన్న కూతురుని కదా. అందుకే ఆ కబుర్లన్నీ ఇక్కడ పెడుతున్నాను. ఎక్కడా ఎడిటింగ్ కానీ, స్పెల్ కరక్షన్స్ కానీ చెయ్యలేదు. డెలిబరేట్ గానే.అనుభూతులని ఎడిట్ చెయ్య కూడదని నా భావన. మీరూ ఆ నాన్న పరిమళాన్ని ఆస్వాదించండి...  This is the first and the last post in సృజనగీతం not by me or Chanti or Dad. I hope you will enjoy this expression, and appreciate itనాన్న అంటే [...]
ఫ్రెండ్షిప్ గురించి చాలా మంది చాలా కొటేషన్లు చెప్పారు కానీ, అవన్నీ నాకు అంతగా పట్టవు. అదేదో ఎసెమెస్ ఇచ్చినట్టుంటుంది... ఎవరి స్నేహం వారిదే, ఏ స్నేహపు మాధుర్యం ఆ స్నేహానిదే... అందుకే స్నేహం బదులు నా స్నేహితుల గురించిక్కడ పంచుకుంటానుస్నేహమని అనగానే నాకు మొదట గుర్తొచ్చేది నా సెల్వి. తన అసలు పేరు కన్నఘి సెల్వమ్, నేను సింపుల్ గా సెల్వి అంటాను. తను నాకు స్కూలు వయసు కాదు [...]
నాకు ఫ్రెండ్స్ అంటే ప్రొఫెషనల్ ఫ్రెండ్సో, లేక పోతే క్లాస్ మేట్సో, లేక పోతే ఎప్పుడూ నన్ను నా వృత్తి జీవితంలోనూ అంటి పెట్టుకుని ఉండే సెల్వి (తను నా కుడి భుజం లాంటిది. అయామ్ యువర్ ఎడ్డీ విల్లర్స్ అంటుంటుంది అప్పుడప్పుడు. ఇండియాలో నాకు వర్కున్నా, లేదా బయటి దేశాలకొచ్చినా తనే నా Major Aide).లేచినప్పటి నుంచీ పనీ, అప్పుడప్పుడూ సరదా ప్రయాణాలూ, చిన్న చిన్న సాహసాలూ, ఇలా నా జీవితం [...]
సెగలు కక్కించేసూరీడి ప్రేమకుమేఘం కరిగివాన కురిసింది.ముత్యాల్లాంటి చినుకులకుపుడమి తడిసినాట్యమాడిందిజులాయి వానకుఅనురాగం మొలకలెత్తిపున్నమి నాటికి పూలు పూసిందిచంద్రుని నవ్వుకుకలువ భామ సిగ్గు పడిందిగోధూళి లేఖతోఇద్దరి బంధం ముడి పడిందిఅలా...మరో ప్రేమ కథకుమొగ్గ తొడిగిందిJuly rains always beautiful.A్ translation of a few beautiful stanzas from గీతాచార్య's July rainsEnjoy the monsoons
For those who wished us, congratulated, blessed us, WE ARE INDEBTED TO U ALL FOR YOUR AFFECTIONThankQ very much :-)కొన్నాళ్ళు మా బ్లాగుకు విశ్రాంతండీ...సెలవ్,సృజన & గీతాచార్య
From the time of my childhood, He's always been saying...DreamAlways Delightfullyand made me dream big. Dad I love you is always an understatement. What to say? You are more than a mother for me. EVERY TIME I DREAM SOMETHING, AND ACHIEVE ITZ U I THINK OF FIRST. Because my Dreams Are Delightful, and You are a dream father, Always,Your Little Princess
తల్లీ కూతుళ్ళ బంధం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. అమ్మ ప్రేమను గురించి చెప్పిన సినిమాలూ చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో మరికాస్త స్పెషల్ అనిపించే సినిమా ...ing పేరు చూడగానే విచిత్రంగా ఉందే అనిపిస్తుంది. చూట్టం మొదలెట్టాక భలే ఉందే అనిపిస్తుంది. మధ్యలోకొచ్చాక ఇలా కూడా ఉంటుందా అనుకుంటాము. ముగిశాక అప్పుడేనా అనుకుంటాము.కధ చిన్నదే. చాలా క్లిషెడ్. ఎప్పుడూ మనం వినేదే. కధనం [...]
నేను పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టీ నాకు పల్లెటూళ్ళతో అనుబంధం తక్కువే. అలా అని పెల్లెటూళ్ళంటే నాకు వ్యతిరేక భావమేమీ లేదు. ఆమధ్య నాయనమ్మతో వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చాను కూడా. (ధవళేశ్వరం దగ్గరలో). ఆ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎప్పుడో అరుదుగా దొరికే అలాంటి అవకాశాలు తప్ప నాది నగర జీవనమే. నా చాలా అలవాట్లు కూడా అలాంటివే మరి. :-)నేను పుట్టి పెరిగింది వైజాగైతే [...]
అమ్మ!పెదవి పలికే మాటల్లోనే అతి తీయని మాట అని అన్నాడో కవి.ఒక కమ్మని మాట అని అన్నాడింకో కవి.అమ్మంటే ఊపిరి అని చెప్పాడు నా చంటిఎవరెన్ని చెప్పినా నాకు అమ్మ రుచి తెలియనే లేదు. మూన్నాళ్ళ ముచ్చట లాంటి బంధమొకటా భావనెలాఉంటుందో తెలిపినా తెలియని కారణాలు బాధించాయే కానీ, ఓదార్చలేదు నన్ను.ఇవాళ అమ్మ పుట్టిన రోజు. అందుకేనేమో, ఎప్పుడూ లేనిది నాన్న నాకు అమ్మ ఎలా ఉంటుందో తన [...]
Decently indecent -The life of a scamp Moving like a tramp.To have his foot prints stamp On the shore for ever.He preaches to Die hard,And says toLive it easy.Like a child Without going wildHis motto isA fight for The rightWithout flight
మాటలకందని నీ మౌనమే నాకు చాలుపై మెరుగులు చూపని నీవు కంటి కన్నామనసుని మురిపిస్తావుగుండెని తట్టే నీ ప్రేమనా జీవితానికో క్రొత్త అర్ధంనువ్విచ్చిన చిరు కానుకలుమరపురాని తీపి గురుతులునీ ఊసులతో కవితలల్లనునీ రూపు రేఖల చిత్రం గీయనుచెప్పనా నాకునీ ఉనికే అక్షరంనీ ఙ్ఞాపకం నాకు వరంAn attempt at Chanti's English poem. Am I succesful? ;-)
Laugh my friend as nothing changes In the world,Everything's fine, and simple,Cute and beautiful.Laugh my friend as nothing bothers You in the world,Every moment's 'be cherished,Nothing will ever be perished.Laugh my friend like when you wereA child And everything's at your feet,And did not know defeat.Laugh my friend 'cas it's heavenTo be and simple like A child, And the world's benevolent.And Laugh my friend 'cas Nothing's impossible in A benevolent universe,Impossible means I'm possible.Laugh my friend,It's just a matter of SeventeenMuscles it cost an effort, And nothing more.Laugh my friend till you die, And don't ask me why,'Cas it's your life's at it's highAnd never let your hope die.I thank Chanti for his quick response when I asked him to fill the poem after the first stanza.For a friend who is in need of a loud laughter...
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు