అప్పుడే తెల్లవారుతున్నట్టుంది. బాల్కనీ నుండి మంద్రంగా వచ్చే సాగర ఘోష నెమ్మదించి, వాహనాల చప్పుడు మొదలయ్యింది. మగత నిద్రలో ఉన్న నాకు కాస్త కాస్తగా మెలకువ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే బాల్కనిలో గోడ మీద కూర్చుని తేజ బీచ్ వైపు చూస్తున్నాడు. వీడికి ఇదేం పిచ్చో ఎప్పుడూ ఆ సముద్రాన్నే చూస్తూ ఉంటాడు అనుకుంటూ లేచాను. కళ్ళు నులుపుకుంటూ, తలుపు తీసుకుని బాల్కనీలోకి [...]
కార్తీక మాసం కావోసు. ఆకాశం తొందరగా సూరీడ్ని ఆవలకి పంపేసి, రాతిరి రంగుని పులుమేసుకుంది. తుంటరి పిల్ల తెమ్మెరకు చలికాలం కదా అల్లరెక్కువ, రివ్వున చుట్టేసి గిలిగింతలు పెట్టి పోతోంది. ఊరంతా ఏదో తెరపరిచినట్టు మంచు పైనుండి మెల్లగా కురుస్తూ ఉంది. ఏ చెట్టుని, గట్టుని ముట్టుకున్నా చేతికి చల్లాగా తగిలి జిల్లుమంటుంది. నీ కోసం ఆ వీధి చివర స్ట్రీట్ లైట్ క్రింద ఎంతసేపో మరి అలా [...]
ఆ మూకలో ఒక రాక్షసుడు అప్పుడే భల్లూకదీవి నుండి వచ్చాడు. అక్కడ మహారాజు ఫణీభూషణుని శ్రీభాషిణి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెడుతున్నదీ, మృదుభాషిణి చేత ఏవిధంగా ఊడిగము చేయించు చున్నదీ వివరిస్తూ ఉంటే అక్కడున్న గుంపంతా “భళిభళి భళిభళి” అంటూ తమ ఏలిక అయిన కపాలుడ్ని కీర్తిస్తూ ఉన్నారు. యశోధరునికి ఆ గుంపు పై విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కొక్కరిని పిండి పిండిగా కొట్టి, [...]
ఆ హటాత్పరిణామానికి యశోధరుడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. “దాహం దాహం” అని ఆ మహాముని యశోధరునికి సైగ చేసాడు. వెంటనే తేరుకున్న యశోధరుడు దాపులనే ఉన్న కొలను వద్దకు పరుగున వెళ్ళి అక్కడ పడి ఉన్న ఒక ఆకుతో నీటిని తీసుకుని వచ్చాడు. మహాముని తలని తన ఒడిలో పెట్టుకుని ఆ నీళ్ళు తాగించాడు. మహాముని దాహం తీరి కాస్త తెప్పరిల్లి యశోధరుని వైపు ప్రసన్నంగా చూసాడు. యశోధరుడు చేతులు [...]
తెరచిన గుమ్మం తలుపుల నుండి ఉదయకాంతి, లోపలికి రావచ్చో లేదో అని తటపటాయిస్తూ ఉంది. సప్తపది సినిమా పాటలు పెట్టి కాఫీ గ్లాసుతో గడప దగ్గర కూర్చున్నా. రాత్రి కమ్ముకున్న పొగమంచు ఇంకా పూర్తిగా తొలగలేదు. వీధిలోకి చూస్తే అంతా మసకమసకగా కనిపిస్తుంది. ఎదురింటిలో పంతులమ్మగారి మనవరాలు పొందిగ్గా కూర్చుని ముగ్గులేస్తుంది. రోజూ పొద్దున్నే ఇంటిలో ఎవరూ లేవక ముందే కాసేపు ఇలా [...]
పండక్కి పుట్టింటికొచ్చిన కొత్త పెళ్ళికూతురికి కన్నతల్లి ఆప్యాయంగా తలంటు స్నానం చేస్తున్నట్టు ఆకాశం నుండి చినుకులు ఆగి ఆగి పడుతున్నాయి. స్కూల్ ఎగ్గొట్టి ఆడుకుంటున్న పిల్లల్లా చల్లగాలి వర్షంలో అల్లరిగా అటూ ఇటూ తిరుగుతూ ఒక్కసారి శరీరాన్ని తాకి ఝల్లుమనిపించి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద నిలిచిన నీరు మా కారు వేగానికి ఎగిరిపడుతుంది. రోడ్డుకి ఇరుపక్కల ఉన్న తోటల్లో [...]
టైటిల్ చూసాక హా ఏముందిలే రామూ భజనపరుడి వ్యాసం అని చాలామంది ఇగ్నోర్ చేసి పేజ్ మార్చేసుంటారు. క్షమించాలి నాకు భజన చేసే ఆసక్తి, ఓపిక రెండూ లేవు. కేవలం రాము పేరు చూసి నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ పుస్తకాలు కొని, చదివిన పాపానికి డబ్బు, టైం రెండూ నష్టపోయినవాడిగా, రామూని కసి తీరా తిట్టాలని వ్రాస్తున్నా. కానీ దెయ్యం, రాక్షసుడు, డెవిల్, రావణాసురుడూ, ధుర్యోధనుడు వంటి బిరుదుల్ని [...]
కపాలధ్వజుడు వస్తూనే అందరినీ చూస్తూ “ఎవడా మూర్ఖుడు? నా అనుమతిలేకుండా ఈ నగరంలో ప్రవేశించిన ఆ అర్ధాయుష్కుడెవడు? ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారిక్కడ?” అని ఆగ్రహంతో ఊగిపోతూ అరిచాడు. అక్కడే ఉన్న కపాలధ్వజుని సైన్యం భయంతో గజగజ వణుకుతూ నోట మాటరాక అతని ఎర్రని కన్నులు చూడలేక తలదించుకుని నిల్చున్నారు. ఇంతలో ఒక భల్లూక రాక్షసుడు రెండు చేతులతో ఒక మరణించిన జింకపిల్లను తెచ్చి తమ [...]
సూర్యుని ఉదయకాంతి సోకి గజముఖపర్వతం అరుణవర్ణంలో యశోధరునికి అల్లంత దూరాన కనిపిస్తుంది. నగరంలో ఎలా ప్రవేశించాలి? ఫణిభూషణ మహారాజుని ఎలా కలుసుకోవాలి? ఈ ఆపదల నుండి వారిని ఎలా రక్షించాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ పర్వతం వైపే నడకసాగిస్తున్నాడు. నగరంలో ఉన్న రాక్షసులంతా నిరంతరం ఏవో అరుపులు అరుస్తూ ప్రజలకు భయం కలిగిస్తూ ఉన్నారు. నగరంలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ దూపదీప [...]
ఆరు నెలల అమెరికా వాసం తర్వాత ఆరోజే ఇంటికొచ్చాను. అంతలోనే బావ పెళ్ళి అని వైజాగ్ బయలుదేరమని హడావుడి మొదలుపెట్టింది మమ్మీ. నాకింకా జెట్‌లాగ్ కూడా పోలేదు మొర్రో అన్నా వినిపించుకోలేదు. కావాలంటే కారులో పడుకో బయలుదేరు అని ఒకటే నస. అమ్మమ్మ, అత్తలు అందరూ నవ్వుకుంటున్నారు. మాతృవాక్యాపరిపాలనాబద్దుడిగా పాతికేళ్ళ ఇండస్ట్రీ మనది. ఈరోజున పుసుక్కున అందరి ముందు కాదంటే పాత్ర [...]
సెల్‌ఫోన్ మోతతో ఉదయం తొమ్మిది గంటలకి లేచాను. ఆఫీసు నుండి ఏదో పని గురించి ఫోన్ చేసారు. ఫోన్‌లో చెప్పాల్సినవి చెప్పేసి తిరిగి పడుకుందామనుకుని మంచం మీద వాలాను. కానీ తిరిగి నిద్ర పట్టలేదు. లేచి బెడ్‌రూం నుండి బయటకి వచ్చి చూసాను. అన్ని తలుపులూ మూసి ఉన్నాయి. “అంటే సాహిత్య ఆఫీసుకి వెళ్ళిపోయిందన్నమాట. కనీసం వెళ్ళేప్పుడు చెప్పొచ్చుగా” అనుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు [...]
1998 లో మాట కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతూ ఉంది. అమ్మ వంటకి ఏదో కావలంటే నేను మార్కెట్ కి బయలు దేరాను. కరెంట్ పోవటంతో ఊరంతా చీకటిగా ఉంది. అప్పటికే చాలా సేపటి నుండీ వర్షం పడుతూ ఉండటంతో రోడ్డంతా బురదగా ఉంది. నేను జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్తున్నా. ఎదురుగా ఎవరో అమ్మాయి సైకిల్ మీద వస్తూ కనిపించింది. సైకిల్ కాస్త దగ్గరగా వచ్చినప్పుడే ఒక [...]
ఒక్కగానొక్క బిడ్డని కన్నులెదుటే పోగొట్టుకున్న తల్లి దుఃఖంలా రెండురోజుల నుండీ అంతనేది లేకుండా వర్షం కురుస్తుంది. ఆకాశం తను పోగొట్టుకున్న బంధాలేవో నేల మీద ఆత్రంగా వెతుక్కోటానికా అన్నట్టు మెరుపులు పదే పదే మెరుస్తున్నాయి. గుండెల్లో వణుకు పుట్టిస్తూ మధ్య మధ్యలో ఉరుములు. ఈదురుగాలుల దాటికి ఎక్కడో కరెంటు తీగలు తెగిపోయాయేమో కరెంటుపోయింది. కిటికీలో నుండి వచ్చిన [...]
పచ్చని వనంలో ఎర్ర మట్టితో అలికి, రంగవల్లులు తీర్చిన ఆ పర్ణశాల ప్రకృతిమాత మడికట్టుకుని వెలిగించిన కార్తీకదీపంలా వెలిగిపోతుంది. వాకిట్లో వృక్షాలన్నీ నిన్నటి ముచ్చట్లు నెమర వేసుకుంటూ, ఆకులతో, కొమ్మలతో పలకరించుకుంటున్నాయి. కొమ్మలపై వాలిన పక్షులన్నీ సందడి చేస్తూ ఆ ముచ్చట్లకు అడ్డు తగులుతున్నాయి. చెట్లకు చుట్టూ గుబురుగా పరుచుకున్న పూల మొక్కలన్నీ మౌనంగా రేపటి తమ [...]
సాయంత్రం అయిదు గంటలవుతుంది. వేడి కాఫీ బాల్కనీ రెయిలింగ్ మీద పెట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నా. పైన నల్లని మేఘం ఆకాశం మొత్తం కమ్మేస్తుంది. ఆదివారం కావటంతో రోడ్డు మీద జనాలు పెద్దగా లేరు. ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. చిన్నగా జల్లు మొదలయ్యింది. పిల్లల అమ్మలనుకుంటా అందరినీ లోపలికి రమ్మని అరుస్తున్నారు. నేను కూడా లోపలికి వెళ్దామని [...]
పసిపాపల దగ్గర నుండి పండు ముదుసలి వరకు అందరి మనసుల్ని ఆహ్లాదపరిచే దృశ్యాల్లో ఖచ్చితంగా మొదటి మూడు ఎంపికల్లో ఉండే దృశ్యం, వర్షం. తొలకరి చినుకులు పడటం మొదలవ్వగానే తన్మయత్వంతో ఆకాశం వైపు చూస్తూ, ఆ తడి మట్టివాసన ముక్కుపుటాలకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల నిండా గాలిని పీల్చుకుని ఆ వాసనను అనుభవించని జీవి జీవికాదు వాడి జీవితం జీవితమే కాదు. ఆరోగ్యపరంగా చల్లని వాతావరణం [...]
యశోధరునికి విషయం అర్ధమయ్యింది. చచ్చిపడి ఉన్న జీవులన్నీ సర్ప రూపంలో ఉన్న రాక్షసుని విషం ఘాటుకి మరణించాయని తెలుసుకున్నాడు. యక్షులు చెప్పినట్టుగా ఆ సర్ప రాక్షసుడు వాసన ద్వారా తన ఉనికిని గ్రహిస్తే తిరిగి ఇటు వైపుగా విషం చిమ్ముతాడని అనుమానించాడు యశోధరుడు. తక్షణం యక్షులిచ్చిన లేహ్యాన్ని తన సంచి నుండి బయటకు తీసి తన శరీరమంతా రాసుకున్నాడు. మహానగరానికి కాపలాగా ఉన్న [...]
“నాకు తెలుగు సంస్కృతియన్న ఇష్టము. తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగుభాషయందు మక్కువ ఎక్కువ.” అని చూపులు కలిసిన శుభవేళలో కోటా శ్రీనివాసరావు గారంటే మా సెడ్డ కామెడీ చేసాడ్రోయ్ అని నవ్వేసుకున్నాం కానీ ఆలోచించలేదు. మనం ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకొన్నాళ్ళకు హిస్టరీ చానెల్లో “పదికోట్లకు పైగా జనాభా కలిగిన ఒక భాష తన ఉనికిని కోల్పోయిందంటే, ఆ జాతి ఎంత నిర్లక్ష్యం చేసింది. [...]
మహానగరానికి పట్టిన దుస్థితిని అంతవరకూ చెప్పిన మంత్రాలమఱ్ఱి కాసేపు మౌనం వహించింది. యశోధరుడు, ఇద్దరు రాక్షసులు కూడా మౌనంగా మంత్రాలమఱ్ఱి వైపే చూస్తున్నారు. మంత్రాలమఱ్ఱి తిరిగి చెప్పటం మొదలుపెట్టింది. “యశోధరా! శతృ ధుర్భేద్యమయిన ఆ మహానగరానికి నీవిప్పుడు వెళ్ళటం సాధ్యం కాదు. కావున నీవు వెనుదిరిగి పోయి నీ ఆచార్యులకు జరిగిన వృత్తాంతమును వివరింపుము” అని చెప్పింది [...]
ఆకాశంలో ఎగురుతున్న భల్లుకాలన్నీ ఒకేసారి అరుచుకుంటూ కిందకు దూసుకువచ్చాయి. దొరికిన వాళ్ళను పంజాలతో కొట్టి గాయపరిచాయి. కొందర్ని కాళ్ళతో తన్నుకుపోయాయి.భయంతో ప్రజలంతా ఇళ్ళలోకి పారిపోయి తలుపులు వేసుకున్నారు.భల్లూకాలు ఇళ్ళ పైకప్పులపై దూకాయి, పెద్ద పెద్ద శబ్ధాలు చేసాయి.కొన్ని ఇళ్ళకు పైకప్పులు విరగొట్టాయి.ప్రజల భయంతో బిక్కుబిక్కుమంటు ఇంటిలోనే ఒక మూల అందరూ [...]
ఆస్థానవైద్యులు వచ్చారు. ఫణిభూషణునిని పరీక్షించి వైద్యం చేసారు. ఫణిభూషణుడు స్పృహలోకి వచ్చాడు. చుట్టూ చూస్తే విచార వదనాలతో ప్రజలంతా నిద్రాహారాలు మాని కూర్చున్నారు. మృధుభాషిణి ఏడ్చి ఏడ్చి నీరసించి ఉలుకుపలుకు లేకుండా కూర్చుంది. నగరమంతా చీకటి ఆవరించి ఉంది. మహానగర శోభ,కళ మచ్చుకైనా కానరాలేదు.ఘనీభవించిన విషాదంలా నగరమంతా నిశ్శబ్దంగా ఉంది.ఒక మూల మహామంత్రి దండనాధులు [...]
హిమోగ్లోబిన్ అడుగంటిన రక్తం రోడ్ల మీద ఎర్రగా మెరిసింది కండలేని దేహం ముక్కలుగా నింగికెగసింది కాల్షియం కరువయిన ఎముకలు గుండగా మారాయి కారిడార్లో మాంసపు ముద్దలతో సైలెన్స్ అని అరుస్తున్న ఆసుపత్రులు వెర్రిగా చిందులేస్తూ వికటాట్టహాసం చేస్తూ మృత్యువు కుట్లుపడ్డ పెదాల మీద రక్తం చిమ్ముతూ గులాబీలా విచ్చుకుందో చిరునవ్వు మంటలుపెట్టే మతాలు కుమ్ములాడే కులాలు నిలువునా [...]
ఆత్మలింగం శ్రీభాషిణి చేతిలో పడగానే భరించలేని బరువు మీద పడినట్టుగా తూలిపడింది. అదృశ్యరూపంలో అక్కడే ఉండి అంతా గమనిస్తున్న కపాలుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. శ్రీభాషిణికి చేయి అందించి ఆమెను లేపాడు.శ్రీభాషిణి నారవస్త్రాలనుండి తన సహజరూపంలోకి మారింది. కపాలుని వైపు చూసి వికటాట్టహాసం చేసింది.శక్తితో దొరకని దానిని యుక్తితో ఎలా సాధించానో చూసావా అని పిచ్చిపట్టినదానిలా [...]
అమృత నార వస్త్రాల్లో ఉన్న శ్రీభాషిణికి నమస్కరించి “అమ్మా తమరెవరు? ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? అలసిన మా పరివారానికి మీరు ఎంతో మేలు చేసారు. నేను బదులుగా మీకు ఏమి చెయగలనో చెప్పండి” అని వినయంగా పలికింది. “కుమారి నీ ముఖంలో వర్ఛస్సు నీవు సాదారణ కాంతవు కావని తెలియజేస్తుంది. నీవెవరు? ఈ పరివారంతో కూడి ఎచ్చటకు పోవుచున్నావు.” ఏమీ తెలియని అమాయకురాలి వలె అడిగింది [...]
ఫణిభూషణునికి మహాలక్ష్మీ కళతో ఒక కూమర్తె పుట్టింది. శివుని అనుగ్రహంతో ప్రతీ తరంలోనూ మగసంతానమే కలిగిన వంశంలో మొట్టమొదటిసారిగా అమ్మాయి పుట్టింది.గంధర్వరాజు తను శ్రీభాషిణికి ఇచ్చిన వరం వల్లనే ఇలా జరిగింది అని మొత్తం ఫణిభూషణునికి వివరించాడు.ఫణిభూషణుడు నవ్వి శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు.మా ఇంటికి మహాలక్ష్మిని పంపటమే మహాదేవుని నిర్ణయమేమో. అందుకే ఇలా జరిగింది [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు