కవులు సత్యాన్వేషులు. కవిత్వం సత్యాన్నావిష్కరించే సాధనం. కవులు ఆవిష్కరించే సత్యాలు వారి మనోలోకంలో పుట్టినవి కావొచ్చు లేదా సామాజిక పరిశీలనలో బయటపడినవి కావొచ్చు. “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు” అన్న వాక్యంలో –ఆ కవి ఊహలో ఒక సౌందర్యరాశి నల్లని కన్నులుకు వినీలాకాశానికి సామ్యం కనిపించింది. అది ఒక సత్యావిష్కరణ. ఇలాంటి కవిత్వం చదువరి హృదయానికి హాయినిచ్చి, [...]
చిన్నప్పుడుమా ఇంట్లో పాడి ఉండేదికనుమ రోజున మా అమ్మఆవుకు పసుపు, కుంకుమ పూసిగిట్టలకు బంతిపూల దండలు కట్టిచుట్టూ ప్రదక్షిణ చేసి, హారతి ఇచ్చిభక్తిశ్రద్ధలతో పూజ చేసేదిబతిమాలో బామాలో ఉద్దరిణిడుగోమూత్రం రాబట్టి తలపై చల్లుకొనేదిఅదే ఆవుఒంటిపూట పడి క్రమంగా ఒట్టిపోతేకబేళా బేరగాడితో గీసి గీసి బేరమాడి అమ్మేసిమరో ఆవును తెచ్చుకొనేది.***ఇపుడీ దేశానికి ఏమైందిఎవరిని వధశాలకు [...]
మానవలక్షణాలను వస్తువులకో, జంతువులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది. మెటానొమీ లేదా సింబల్ లాంటి టెక్నిక్ లతో పోల్చినపుడు పెర్సొనిఫికేషన్ చాలా సరళంగా ఉంటూ, పాఠకుడిని శ్రమపెట్టకుండానే కవిత్వానుభూతి [...]
కవిత్వంలో ఇమేజ్ అంటే పదాలతో నిర్మించిన ఒక చిత్రం. ఆ పదాలను చదువుకొన్నప్పుడు మనసులో ఒక దృశ్యం ఊహకు వస్తుంది.“వెన్నెలమబ్బుల మెట్లమీదుగానేలకు దిగే సమయాన" (మేఘనా - శిఖామణి)అనే వాక్యంలో రాత్రి చిక్కబడుతూండగా వెన్నెల మెల్లమెల్లగా బయటపడుతున్న ఒక దృశ్యం ఆవిష్కృతమౌతుంది. ఇక్కడ కవి ఒక ఆహ్లాదకరమైన సందర్భాన్ని సౌందర్యాత్మకంగా కవిత్వీకరించాడు.ఒక ఆలోచననో, దృశ్యాన్నో, [...]
ఈరోజు వివిధ లో నా కవిత. ఎడిటర్ గారికి, మంచి చిత్రాన్ని ఇచ్చినందుకు అక్బర్ అన్నకు ధన్యవాదములు.బొల్లోజుబాబా
ఇమేజ్ఒక చక్కని వర్ణన మాత్రమే.   ఇక వేరే అర్ధాలేమీ ఉండవు1. కిటికీలోంచి చూస్తేవెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలాఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు --  ఇస్మాయిల్2. నిన్నరాత్రి ఎక్కడెక్కడికోతప్పిపోయిననీడల్ని లాక్కొచ్చిభవనాలకు, చెట్లకుమనుష్యులకూ అతికిస్తున్నాడుసూర్యుడుతన కిరణాల దారాలతో! మొదటి ఉదాహరణలో ఒక రైలు రాత్రిపూట ఎలా కనిపిస్తుందో చేసిన వర్ణన ఉంది.  ఆ [...]
ఫ్రాగ్మెంట్స్1.అస్థిత్వం అనేదిగోనె సంచిలో తీసుకెళ్ళిఊరిచివర విడిచినాతోకూపుకొంటూ వచ్చి చేరేపిల్లిపిల్లలాంటిది.2.ఏకాంత సాయింత్రాలతోజీవితం నిండిపోయిందినిరీక్షణ దీపస్థంభంలాదారిచూపుతోంది.3.చెంచాలు గజమాలనుమోసుకెళుతున్నారు.ఏ జన్మలో చేసుకొన్న పాపమో అనిపూవులు దుఃఖపడుతున్నాయి.4.ఒక్కో విప్లవంలోంచిఒక్కో నియంత పుట్టుకొచ్చినట్లుఒక్కో విత్తనం లోంచిఒక్కో ఉరికొయ్య [...]
ఓ రోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరచిపోయింది. చాలా బెంగ పట్టుకొంది దానికి, గమ్యం లేని జీవితమేమిటని. తన గమ్యాన్ని వెతుక్కొంటూ ప్రయాణం కట్టిందా దారి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది.పిట్టల్ని పెంచే కులవృత్తిని కోల్పోయి ఏదో ఫాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఓ ముసలి చెట్టును అడిగింది "నా గమ్యాన్ని ఎక్కడైనా చూసావా" అని. "తూర్పువైపున బోల్డన్ని గమ్యాలుంటాయని [...]
భూమిని మింగిన పిల్లగాడు --- The Lad who swallowed Earth by Sri. K. Satchidanandanతినటానికి ఏమీలేక ఆ నల్ల పిలగాడుగుప్పెడు మట్టిని మింగాడువాళ్ళమ్మ బెత్తం తీసుకొనిరావటం చూసి నోరు తెరిచాడుఆ చిన్నినోటిలో ఆమెముల్లోకాలను చూసిందిబంగారంతో చేసిన యుద్ధవిమానాలతో ఒకటిదోచుకొన్న సంపద, జ్ఞానాలతో రెండవదిఆకలి, ఈగలు, మృత్యువులతో మూడవది.ఆ నోరు నింపటానికి పిడికెడు మెతుకులు లేక"నోరు ముయ్యి" అని బిగ్గరగా [...]
పాపం పసివాడులోకంఎదురుపడ్డప్పుడల్లాశోకంతోకన్నీరు మున్నీరయ్యేవాడువాడి బాధ చూడలేకఓ దేవత వాడి నేత్రాలపైబీజాక్షరాలను లిఖించికన్నీటి బిందువులు కవిత్వంగా మారేవరమిచ్చిందివిషయాన్ని పసికట్టిన లోకంమరిన్ని దృశ్యాలనుఅతని కళ్ళలోకి వంపికవిత్వాన్ని పిండుకొంటోందివేడుకగాబొల్లోజు బాబా
ఎలుగెత్తి చాటుదాంఎలుగెత్తి చాటుదాం అందరంఅంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడనిఅసంఖ్యాక హృదయాలలోనిత్యం ప్రకాశించే మార్తాండ తేజుడనిచదువు సమీకరించు పోరాడు అన్న మూడు పదాలలోమన జీవితాలకు దిశానిర్ధేశనం చేసినఆధునిక భోధి సత్వుడనివీధి కుళాయి నీళ్ళు తాగనివ్వని వివక్షా తిమిరంతోజ్ఞానమనే కాంతిఖడ్గంతో సమరం చేసినఅవిశ్రాంత యోధుడనీ, అలుపెరుగని ధీరుడనీ"మేం హరిజనులమైతే [...]
ఇంట్లోకి ఇంకా అడుగుపెట్టనే లేదుతల వెంట్రుకల చుట్టబండి చక్రంలా గాలికిదొర్లుకొంటూ దొర్లుకొంటూ వచ్చిగడప వద్ద ఆగిందిపెను దుఃఖంఒక ఆలింగనంఎడతెగని కన్నీరువెంట్రుకల్ని ఒక్కొక్కటీరాల్చుకొంటూన్న తరువుమెల్లమెల్లగాగతంలోకి కూరుకుపోతోంది.కటిక రాత్రిజుట్టుపట్టుకొని ఈడ్చుకుపోతూంటేతెగిన చీకటి దారాల్లా వెంట్రుకలుఎల్లెడలా మృత్యుశైత్యంఒక వేదనభయప్రవాహంవిచ్చుకొన్న [...]
మొన్నో నలుగురు వ్యక్తులుకొండపై రాత్రివిందుచేసుకొన్నాకాఉదయానికల్లా కొండ మాయమైందటఆ నలుగురేనదీవిహార యాత్రజరిపిన మర్నాటికల్లానదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయనిఆశ్చర్యంగా చెప్పుకొన్నారువాళ్ళేచెట్టపట్టాలేస్కొని పంటచేలల్లోతిరుగాడిన సాయింత్రానికల్లాపచ్చని చేలన్నీ కనిపించకుండా పోయాయటఈరోజు వాళ్లకో కొత్త ఊహ పుట్టిందటఅందరూ గుసగుసలుగా [...]
Putting her two hands in his armpits she lifted him up from toilet seat and brushed his teeth, washed his body blotted with towel, dressed him carefully moved him to the bed and made him lay down on it While searching the tablets she asked "you said your son is asking you to come home, why dont you go?" With tear filled eyes He was staring at the cieling for mentioning his son who stopped even ringing him. Bolloju Baba
ఆంధ్రప్రదేష్ భాషా సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో కవితాగానం మరియు మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి గారిచే సన్మానం.ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ జి.వి. పూర్ణచంద్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.వసంతసేన ఏమంది?శీతవేళ సెలవు తీసుకొన్నాకవసంతసేన మల్లెలపల్లకిలో అరుదెంచిందికోయిలలు, మామిడిపూతలు, వేపచిగుర్లు, వెన్నెల [...]
శ్రీ దాట్ల దేవదానం రాజు గారి దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష ఆంధ్రప్రభ లో.   ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.  పూర్తిపాఠం ఇదిదోసిలినిండా కవిత్వంమట్టినీ ఆకాశాన్నీనదినీ పర్వతాన్నీకరుణనీ మానవతనీఒక సమూహం కోసంఏకాంతంగా ప్రేమించేవాడే కవి ...... అన్న వాక్యాలు దాట్ల దేవదానం రాజు ఇటీవల వెలువరించిన “దోసిలిలో నది” కవితాసంపుటి  లోనివి.  పై [...]
జీవం కోల్పోయిఎండిన కన్నీటి చారికలామిగిలిపోయిన నదియూనిట్లు యూనిట్లుగా తరలించబడుతోందిఎడారి నగరాల నిర్మాణం కొరకుమెలికలు తిరిగి, లుంగచుట్టుకొనితరుచ్ఛాయల్ని తలచుకొంటూబుల్ డోజర్ కింద ఆదీవాసీ చేసినఅరణ్యరోదనను గుర్తుచేసుకొంటూఅపుడెపుడో మేసిన వెన్నెల్నిచందమామ రజనుగా రోడ్డుపై కార్చుకొంటూక్షతగాత్ర నదిట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోందినగరం వైపుబొల్లోజు బాబా
ఆంధ్రభూమిలో నా "వెలుతురు తెర" పుస్తకంపై వచ్చిన సమీక్ష. మిత్రులు శ్రీ రవికాంత్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.వెలుతురుతెర పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.http://kinige.com/book/Veluturu+Tera
అవును నిజమేచీరకింద తలగడ ఏదో కుక్కుకొనినెలలునిండిన దానిలానటిస్తూ అడుక్కొంటోంది ఆమె.జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.. తప్పే!పాయింటుబ్లాంకులో నీ సంతకాలు పెట్టించుకొందా లేకఉపాధికల్పన పేరుతో నీ భూములు లాక్కొందా?నీలా జరుగుబాటు లేనివాళ్ళుచచ్చిపోవాలా ఏమిటీ?బొల్లోజు బాబా
ప్రతీదీ ఏదోఒకదానిలోకితెరుచుకొంటుంది.కిటికీ ప్రపంచంలోకి ప్రపంచం అసమానతల్లోకిఅసమానతలు రక్తంలోకిరక్తం తిరుగుబాటులోకితిరుగుబాటు భానోదయంలోకిభానోదయం కిటికిలోకిప్రతీదీ ఏదో ఒకదానిలోకితెరుచుకొంటూనే ఉందిఅనంతంగా....బొల్లోజు బాబా
ఖాళీ రేకుడబ్బాలో మట్టి నింపిగులాబి మొక్కను పెంచుతోంది మా అమ్మాయిస్కూలునుంచి వచ్చాకాదానికి నీళ్ళు పోస్తూ, ఆకుల్ని సుతారంగానిమురుతూ మురిసిపోతుంది.మొగ్గలేమైనా వచ్చాయా అని ప్రతిరోజూజాగ్రత్తగా పరిశీలిస్తుంది"ఏ రంగు గులాబీలను పూస్తుందిఇంకా ఎన్నాళ్ళు పడుతుంది" అంటూవాళ్లమ్మను ఆరాలు తీస్తుంటుంది .ఒక రోజుతనకు బిగుతైన గౌనుల్ని బ్యాగ్గులో పెట్టుకొనిస్కూలుకు [...]
మనం చాలా పేదవాళ్లం బిడ్డా చాలా పేదవాళ్ళంఎలుకలు కూడా మనపై జాలి పడేవి.ప్రతీ ఉదయం మీ నాన్న టౌనుకెళ్ళిఎవరైనా శక్తికలవారు పని ఇస్తారేమోనని చూసేవాడు- గుప్పెడు బియ్యం కొరకు పసులకొట్టం శుభ్రం చేసే పనైనా సరే.యాచనల్ని, మూలుగుల్ని వినకుండా, కనీసం ఆగకుండాశక్తివంతులు ముందుకు సాగిపోయేవారు.మురికిదుస్తులవెనుక బక్కచిక్కిన దేహంతోరాత్రెపుడో మీ నాన్న వచ్చేవారు వెలవెలబోతూనేను [...]
1.కాలంలా ఒకసారిమొఖం చూపించి పారిపోదు కాంతిఇక్కడిక్కడే తారాడుతుందిపువ్వుల్లోనో, నవ్వుల్లోనో2.అందమైన సీతాకోకలుగాల్లో తేలిగ్గా అలా ఎగిరే దృశ్యంహాయిగా అనిపించేదిఒకరోజురైల్వే ట్రాక్ పై చెత్త ఏరుకొంటున్నమురికిబట్టల సీతాకోకనుచూసే వరకూ.....3.పెద్ద చేప వలలో చిక్కిందిభారంగా ఒడ్డుకీడ్చుకొచ్చారు.అదృశ్య కన్నీళ్ళకుసంద్రం అనాదిగా ఉప్పుతేరుతూనే ఉంది.4.పూవులపై [...]
The little boyis shooting at every onewith his toy pistolpurchased at a local fair.Mom, Dad, Sis are acting dead a whileThe little boy is laughing aloudchasing them joyfully to fire atMankind is weaning on the thoughts likegun means amusementcruelty is pleasure.Bolloju Baba
ఒక మంచి కవితపోలికలు – విన్నకోట రవిశంకర్తన అనుభవాలను తన ఆలోచనలను వాటి ద్వారా తాను గుర్తించిన విశ్వసత్యాలను కవిత్వంలో ఆవిష్కరించాలనే తపనేకాని కవిత్వం ద్వారా ఏదో ఒక లాభం పొందుదామనే ఆశ ఇతనిలో కనిపించదు. అందుకే ఈ నాటి కవిలోకంలో రవిశంకర్ అరుదైన కవి -- చేరా *****పునరపి మరణం పునరపి జననం అనేది ఒక ఉదాత్తభావన. అలా అనుకోకపోతే గతించిపోయిన ప్రియమైన వారి వియోగాన్ని తట్టుకొని ఈ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు