మాస్టర్ గారండీ ఇంట్లో తలనొప్పయిపోయింది . మా అమ్మ బీపీ పెరిగినట్లు అరుస్తుంది వచ్చి కంప్లైంట్ చేశాడు .,మా శిష్యుడు అంజిరెడ్డి . అదేమిట్రా పెళ్లయి పది రోజులు కాలేదు అప్పుడే గొడవేమిటి కొత్త కోడలి ముందు ? వాళ్లటీచర్ గారు [మా ఆవిడ ] అంది . అదేనండి పెద్దగా అరుస్తుంటే ఎందుకలా అని నేను ఎదురు మాట్లాడితే ఇంకా ఎక్కువచేస్తుంది . నాకళ్ళముందు వద్దు వెళ్ళిపో అంటుంది . ఇది చూసి ఆ [...]
