ఇందాకే  లైబ్రరి దాటిపోయిందిఅక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలుమనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్ ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయిఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతానుగ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుందినీకో విషయం చెప్పాలిఈ మధ్య ఫార్మర్స్ [...]
గుర్తుందా నీకు?ముడి  పడక  ముందు ఓ సారి చకోరంలా నా దగ్గర వాలావు ఆ సాయంత్రం ఆ పార్క్లో చెట్లు ఆకాశానికి మెట్లన్నట్టే  చేసావే!కొత్తలో పెదమామ ఇంట్లో ఓ సాయంత్రం.. టీ  కప్పులు ఇచ్చి వెళ్తూ గడప దగ్గర నువ్వు  ఓరగా విసిరిన నీ వాలుకంటి చూపులు ఎంత పని  చేసాయీ!ఓ సారి పొద్దు వాలాక నీ పుట్టింట్లో చిన్న డాబా మీద నీ ఒడిలోనిన్నూ  చుక్కలని ఎంత నిశ్శబ్ధంగా  [...]
చిన్నీ కృష్ణుడంట చిలిపీ కృష్ణుడంట దొంగా కృష్ణుడంట మాయల కృష్ణుడంటఆటలు ఆపడంట నిదురే పోడంట ఏమీ చేతునంట ఏమీ చేతునంటలలలలల్లాయీ లలలలల్లాయీజోజోజోజోజో లాలీ....లాలీ జో జో... జో జో లాలా...వేకువలో  చీకటిలో జగమూగే ఉయ్యాల ఆగదురా ఆగదురా ఊగే ఉయ్యాలాఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కలిమైనా లేమైనా ఊగూ ఉయ్యాల ఆపకురా ఆపకురా ఆశల ఉయ్యాలా  ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...కయ్యాల్లో [...]
చిన్నారీ చిన్నయ్యా చిన్నారీ కన్నయ్యా జో జో.. జో జోచిన్నారి చిన్నయ్యా చిన్నారి కన్నయ్యాపగలేమిటి?రేయేమిటి?చిన్నారి చిన్నయ్యా చిన్నారి కన్నయ్యాపగలేమిటి?రేయేమిటి?ఆహ? పగలేమిటి?! రేయేమిటి?!చిన్నారీ చిన్నయ్యా నీ మెలకువే నాకు పగలు నీ మెలకువే నాకు పగలుమా ఇంటా సూరీడువి జో జో.. జో జోమరి రేయేమిటి? రేయేమిటి?చిన్నారీ కన్నయ్యానీ నిదురే నాకు రేయి నీ నిదురే నాకు రేయినా కంటీ [...]
వేచి ఉన్న ఏకాంతం వశమై ఆ యుగళం పారవశ్యంతో  ఏకమవుతుంది...ఏమయిందో...మళ్లీ ఎదురవబోయే ఎడబాటు ఊహకంది ఆ క్షణంలో చొరబడింది..ఒక్కసారిగా ఆమె కంపించి ఆతని మీద వాలిపోయిందిచేతులు దండలా ఆతని కంఠాన్ని చుట్టుకున్నాయిమొహం ఛాతిలో దాగిపోయింది లాలనగా అతను ముంగురులు సవరించబోతేచేతుల బంధనం బిగుసుకుందిఫాలభాగామేమో ఆతని చుంబనాన్ని నిరాకరిస్తూ గారంగా ఛాతిని దోస్తుంది కొనతేరిన ఆమె [...]
గోదావరీ తీరంశరత్ నాటి సాయంత్రం మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి  ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలుఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు  అలలని తాకి [...]
మాటలతో మొదలైన బంధం చూపులతో రూపు దిద్దుకుందిచూపుల్లోనే బయట పడ్డ మనసులు బలంగా పెనవేసుకుంటున్నాయి...మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడునా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుందినీ చిలిపి విసురుల్లో నీ వెవ్వెవ్వేల... ఆ ఆ ఆ కారాలగారాల నయగారాల్లో పులకించిపోతున్నానుయధేచ్చగా నువ్వు నన్ను నీలో కలుపుకుంటుంటేనన్ను నేను మరిచిపోతున్నానుచుట్టూ ఏమవుతున్నా, కాలం [...]
ఏదీ నా చుక్కని తారా తీరంలో నే చూడని దిక్కు లేదునిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది అయినా ఆశ కోల్పోలేదు అలుపు రానీలేదుమరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..నా ఏకాంతాన్ని వరిస్తానన్న ఆ  నా జాబిల్లి...  వర్ధిక!
లాలా    లా  లా ల లలలలాచిరు గాలి..  ల లా లా.. సరాగాలలా...వెండి వెన్నెల ల లా లా వెంటాడే ఊహలా...వాన  న నా నా వెల్లువయి పొంగే వలపులా...తార  ర రా రా తారాడే నీ తలపులా..మే...ఘం! మ్ హు హూ నిండు కుండ నా హృదయంలా..ఎందుకీ ఎందుకీ పరవశం?పరవశం!
చిరుగాలి కవ్వింపుగా కదం తొక్కుతోంది ఏ కార్యం తలపోసిందో!ఆతని కోసమేనేమో!దూరంగా గాలికి విన్యాసాలు చేస్తున్న ఆ కురులు ఆమె ఉనికిని ఇట్టే తెలిపేసాయి!గుండె కవాటపు వేగంతో ఆతని అడుగులుఆతని రాకని గమనించిన ఆమె క్షణాల్లో మొహం చాటుకుందిఎదురుచూపులకి ఎరుపెక్కిన ఆమె కళ్ళుఆతని చూసిన కోపంతో ఎరుపెక్కిన ఆమె బుగ్గలుఇంకాసేపట్లో ప్రళయం అన్నట్లు...అడుగులు మందగించాయి..చూపులు కలిపే [...]
అభిరుచులో, అభిమానాలో మన జీవితాలని పెనవేస్తాయి.. సమాంతరంగా..మరేవో కారణాలు వాటిని అదుపులో ఉంచుతాయిమన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందేనిన్ను నువ్వు కోల్పోబోతున్నప్పుడు  నేను నీకే తెలియని నీ బందీని నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్నినీ చుట్టూనే ఉండే ఏమీ కాని వాడిని   నా పరిధిలోనే బతికే పరాయివాడినినేస్తం! [...]
ఎటు నుండి వస్తాయో..అనుకోని వేళల్లో గొడుగు పడతాయిఎండల్లో సేదతీరుస్తాయివెన్నెల్లో అలరిస్తాయికరిగి కదిలిస్తాయికదిలి కరిగిస్తాయివాటి ఉనికిని కోల్పోయి నా ఉనికిని ప్రశ్నిస్తాయికాని నా ఉనికిని ఇష్టంగా చూసేది వాటి నీడల్లోనే ఎటు నుండి వస్తాయో... ఎటెళ్తాయో.. మేఘాలు ఆడవే అన్నాను కదూ! .
గది ఐమూలన కిటికీ వెనక చందమామ ఎదుగుతుంది పడక మీద కంబళి చాటున దేహం ముడుచుకుపోతుంది మొహమంతా వెన్నెల పరుచుకుంటుంది ఏదో తెలియని శక్తి లోలో యుగాల నిర్లిప్తతని బుజ్జగించి నను బయటకు లాగింది బయటేమో రెపరెపల గాలి..రెప్పలని విప్పారనీయడం లేదుఅది మోసుకొస్తున్న చలి నిలువనీయడం లేదు చూపులకీ చందమామ చిక్కడం లేదు నిలువలేక నిదుర రాక పడక మీద అటు ఇటు అవుతూ నేనువెన్నెల కన్నులలో  [...]
ఏనాడు కనుగున్నానో నినుచీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టానుకవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసిందిఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయానుఆకాశమంత దూరంగా నువ్వు..నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదునా నీడే నిను [...]
నాకు తెలిసిన ప్రపంచం ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవించడం లేదు... ఆదర్శాలు కూడా స్వార్ధంలో నుండి పుట్టుకొచ్చిన కోరికలే. మనకిష్టమైన వాటిని( అవి ఏవైనా) కుటుంబమో, సమాజమో, ప్రభుత్వమో ఏవో చెప్పి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆదర్శం పుట్టుకొస్తుంది... (లేకపోతే అప్పటివరకు పట్టించుకోని ఆదర్శాలని ఆశ్రయిస్తారు) అది ఒక్కోసారి వెంటనే అందరి అంగీకారం పొంది మార్పుకి దోహదం చేస్తుంది. [...]
ఎదురు చూసిన పున్నమి రానే వచ్చిందిఎన్నాళ్ళయ్యింది ఆకాశం కేసి చూసి? పిల్ల గాలీ ఒక్కసారిగా పలకరిస్తున్నట్టుందిఏమైపోయింది ఇప్పటి వరకూ? తారలన్నీ నన్నే చూస్తున్నట్టున్నాయివాటి తళుకులు నా కన్నుల్లో! ఏది నా జాబిల్లి?అదిగో!ఒక చిన్న మాట ఇవ్వవా?తనని నా దరికి చేరుస్తానని
ఏమైనా, హృద్యమైన భావోద్రేకాలని సూటిగా చెప్పాలి అంటే నేను రాయడాన్ని ఆశ్రయించను. కవితా మార్గాన్ని అసలు ఎంచుకోను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చేత చెప్పించుకోవాలి అంటే, ముందు తను నాకేంటో అనేది నేను చెప్తుంటే వినాల్సిందే.. :) అలా చెప్పడం మొదలుపెట్టిన తరవాత, తను ఎంత ఎదురు చూసినా అసలు తనని ప్రేమిస్తునానని కూడా చెప్పకపోవచ్చు. కానీ, నా మాటలని తను వెతుక్కుంటే అంత కన్నా [...]
ఒకో క్షణం,నన్ను ప్రశ్నిస్తాయినా అసహాయతని నిలదీస్తాయిఈ విశాల ప్రపంచంలో,నా అస్థిత్వాన్ని శోధించమంటాయినేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయిచంచలత్వంతో మోసం చేస్తాయినా నమ్మకాన్ని వెక్కిరిస్తాయివాటిని పంచుకున్న పదిమందిలోనన్ను అల్పుడుని చేస్తాయిఅనుక్షణం వెంటాడుతూనాతో పోరాడతాయినే పోరాడలేనని ఎదిరిస్తేనాకు దూరమై శిక్షిస్తాయి...
ఎడారి దాటి అలసిన నాకు సముద్రమే ఎదురైందిఅలలా కవ్విస్తూ నను తాకావు నీవునేను ఆరాటపడ్డానునీ మనసు తెలుసుకోవాలనినీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నానునీ మనసులో చోటు సంపాదించాలనినా ఆరాటాన్ని ఆరాధించావునువ్వూ నా కోసం ఆరాటపడ్డావునీ మనసు విప్పే ప్రయత్నం చేస్తావుఆశగా అమాంతం లోనికి చొరబడాలని చూస్తానులోన ఇంకెవరో ఉంటారువాకిట నుండే వెనుదిరుగుతానునే వెళ్ళిపోతుంటే నను [...]
పున్నమి తెచ్చిపెట్టే ఆకాశపు అందాలు చూస్తూఆ పున్నమి తనలో పుట్టించే ఆశల కెరటాలతోఆకాశాన్ని అందుకోవాలనుకునే కడలికడలి ఆశలని తనివి తీరా ఆస్వాదించే ఆకాశంపున్నమి జారిపోయిందిఆశలూ అణిగిపోయాయిఎవరెవరు ఎవరెవరికి ఎవరో?భావావేశపు అలలు సద్దుమణిగిలోపలికి వెలుగు వ్యాప్తి చెందితేకడలి ఆకాశాన్ని అందుకోవాలనుకోదేమోఆశ పడ్డ ఆకాశాన్ని నిందించకుండాదాని అందాన్ని [...]
ఆతను నా చెంత చేరి నా పక్కనే ఆసీనుడైనాడు, అయినా నే మేలుకో లేదుఎంతటి పాడు నిద్ర! దౌర్భాగ్యుడిని కదా!నిశీధి నిశ్శబ్ధతలో చేతిలో వీణతో చేరి రాగాలు పలికించాడు.ఆ రాగాల మాధుర్యంతో నా కలలు అనునదించాయినిదురలో తన ఉనికి నను తాకినా , ఎందుకు ఆతని దర్శనం ఎప్పుడూ చేజారిపోతుంది?అయ్యో! ఎందుకు నా రాత్రులు అలా జారిపోతున్నాయి?చావా కిరణ్ అనువాదం ఇక్కడ He came and sat by my side but I woke not. What a cursed sleep it was, O miserable me!He came [...]
బడలికైన రేయిలో నన్ను ప్రయాస పడకుండా నిదురలోకి జారుకోనివ్వు, నా నమ్మకాన్ని నీపై ఉంచినీరసిస్తున్న నా చిత్తాన్ని నీ ఆరాధనకై నిస్సారమైన సన్నాహానికి నెట్టుకోనీకు స్వామీ!హాయిగొలుపు తొలి వేకువ మేల్కొలుపులో పొద్దు వెలుగుని పునరుద్ధరించేందుకుతన అలసిన నయనాలపై చీకటి దుప్పటి కప్పేది నీవే కదా స్వామీ! చావా కిరణ్ అనువాదం ఇక్కడ In the night of weariness let me give myself up to sleep without struggle, resting my trust upon thee.Let me not force my [...]
పొద్దుగూకిపోతేకిలకిలలిక లేకపోతేవీచేగాలి అలసిపోతేనీవు ఈ జగత్తుని మత్తు ముసుగుతో చుట్టివేస్తూసందెవేళ వాలిపోయే ఆ కలువల రేకులని సుతారంగా దగ్గర చేస్తూఅపుడు నా పైనా చీకటి తెరని కప్పు స్వామీ!ఏ బాటసారి వనరులు గమ్యం చేరకుండానే నిండుకుంటాయోవస్త్రాలు చిరిగి మకిలౌతాయోబలం ఉడిగిపోతుందోఅతని చిన్నతనాన్ని, దీనతని తొలగించు.చీకటి చాటున ఆ పూవుని ఆదరించినట్టు అతని జీవనాన్నీ [...]
ఈ తుఫాను రేయి నీ ప్రేమ యాత్ర లో ఎక్కడ ఉన్నావు, నా నేస్తమా?నింగి నిస్పృహతో నిట్టూర్చుతుంది.ఈ రేయి నాకు కునుకు లేదు.అప్పుడప్పుడూ తలుపు తెరచి చీకటిన నీకై వేచి చూస్తున్నాను, నేస్తమా!నా ఎదుట ఎమీ కాన రావడం లేదు.నువ్వు ఎక్కడున్నావో అని మథనపడుతున్నాను.నా చెంత చేరడానికిఏ కాళ నదీ మసక తీరాన్నో,కాఱడివి అంచుల్లోనో,కటిక చీకటి చిక్కుల గుండానో నీ గమనాన్ని సాగిస్తున్నావా, నా [...]
కారు శ్రావణపు పెన్నీడల మాటున,నిశీధిలా నిశ్శబ్దంగా రహస్య అడుగులతో కాపరులని తప్పించుకు తిరుగుతావు.ఈ రోజు పొద్దు కళ్ళు మూసుకునే ఉంది,తీవ్రమైన తూర్పు గాలుల పట్టు విడవని పిలుపులని లెక్క చేయక.నిత్య జాగరూకమైన నీలాకాశం మీద నీరంధ్రమైన తెర పరచబడింది.వనాల్లో స్వనాలు సద్దుమణిగాయి. ప్రతి ఇంటా తలుపులు మూసుకున్నాయి.ఈ నిర్జన వీధిలో ఏకాకి బాటసారివి నీవు.ఓ నా ఏకైక మిత్రమా, [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు