కేతుగ్రస్థ చంద్ర గ్రహణం వివరాలుగ్రహణ ఛాయా ప్రారంభ సమయం - 17 Jul, 00:13:51గ్రహణ ప్రారంభం – 17 Jul, 01:31:43గ్రహణ ఉఛ్చ స్థితి – 17 Jul, 03:00:44గ్రహణ విరమణ ప్రారంభం – 17 Jul, 04:29:39ఛాయా గ్రహణ సమాప్తం – 17 Jul, 05:47:38* భోజనాలు వంటివి 16న, దాదాపు 13:30 గంటలలోపు ముగించుకోవాలి* అస్వస్తులు, ఆహార సేవనాన్ని, తేలికైన విధంగా, దాదాపు 20:45 లోపుగా ముగించుకోవాలి* గర్భిణిలు చక్కగా పూలు ధరించి, వీలుచేసుకుని గ్రహణ సమయంలో ఇంట్లో దీపార్చన [...]
భర్త మాట వినని భార్య ఉండటం సహజమైపోయింది.తండ్రి మాట వినని బిడ్డలు లేని కుటుంబం లేదనుకోవచ్చు.గురువు చెప్పే మాట వ్యతిరేకించడం విధ్యార్దుల నైతిక హక్కు అనుకుంటున్నారు. యజమాని మాట వినే పనివాడు ఉన్నాడు అని చెప్పడం సాహసం అనుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఇంతకాలం సాఫ్ట్ వేర్  వ్యవస్థలో నేను నిలదొక్కుకుని ఉండగలిగానంటే దానికి ఒక్కటే ఆయుధం. అదే ఎజైల్.. దానిలో చెప్పే విలువలు [...]
ఏదో వ్రాయాలని ఉంది.. ఇంతకాలం గెలిచానో తెలియదు ఓడానో కూడా నాకు తెలియదు.. గెలిచాను అనుకొని ఓడిపోతూ వచ్చానా !! ఓడిపోతూ గెలిచానా !! కాలం మాత్రం గడిచిపోయింది.. ఎన్నో భావాలు [...]
దీపావళి అనేది రాక్షస సంహారార్దం జరుపుకునే ఓ పండుగ.అలాంటి కారణాన్ని అడ్డు పెట్టుకుని, చైనా వస్తువులు ఎన్ని భారత దేశంలో అడుగుపెడుతున్నాయో తలచుకుంటే, భారతదేశ ప్రజలు చైనా ఆర్దిక వ్యవస్థకు ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్దం కావటం లేదు. ఫెస్టివల్ ఆఫర్సు ద్వారా కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా దాదాపు లక్షకోట్లు వారికి చేరుతున్నాయి అంటే అది [...]
ఈ పోస్టు చాలా మంది ఆడవాళ్లకు నచ్చక పోవచ్చు. ఎందుకంటే, ఇది మా జీవితం, మా ఇష్టం, నువ్వెవ్వడివి నన్ను’ఇలా ఉండాలి..’ అని శాసించడానికి అనేది వారి యొక్క భావన.అలాంటి భావన ఉన్నవారు, ఈ పోస్టుని ఇక్కడితో చదవడం ఆపేసి, మీకు ఇష్టమైన మఱో పని చేసుకోండి. భారతీయ సాంప్రదాయానికి పట్టుకొమ్మలాంటిది రామాయణం. రామాయణాన్ని విష వృక్షంగా అభివర్ణించినది ఓ ఆడది. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. ఆ విషయం [...]
జీవితం ... ఈ క్రింద ఉన్న వీడియో ఒక ప్రింటర్ వారి వ్యాపారాత్మక ప్రకటన. కాకపోతే, ఇందులో ఉన్న కధనం బాగుంది.చివ్వరలో ఇచ్చిన వాక్యాన్ని కొంచం మార్చితే చాలా నచ్చింది.to live side by side with someone, is a life worth livingఈ చిన్న మాటలో ఎంత అర్దం దాగిఉందో కదా అనిపించింది .. భారతీయ సాంప్రదాయంలో విడాకులు అనే ప్రశక్తే లేదు .. ఆ విషయాన్ని ఎందుకు గమనించరో భారతీయులు. పాశ్చాచ్య దేశాలను చూచి వారి ఆత్మగౌరవాన్ని [...]
Emma Watson's "HeforShe" Speech as UN Women Goodwill Ambassador from UN Women ఎమ్మా వాట్సన్ .. ఈ అమ్మాయి మాట్లాడిన విషయాలు చాలా సూటిగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే, ఎప్పుడు.. నేను కాకపోతే ఎవ్వరు .. అంటూ నిగ్గదీసిన తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను.చాలా కాలం తరువాత వ్రాస్తున్నందున, ఇక్కడితో ఆపేస్తాను.------------------------------------------- వినదగు నెవ్వరు జెప్పినన్ వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసినమనుజుడే పో [...]
వివిధ దేశాలలో ఉండే తెలుగు వారికి, ఓ విన్నపం.నాకు తెలిసిన ఓ స్నేహితురాలు, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఆ డిగ్రీకి అనుసంధానంగా, ఓ సర్వే చేయవలసి ఉన్నది. కావున, మీకు వీలైతే ఓ ఐదు నిమిషాల సమయం కేటాయించి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయ మనవి.నా స్నేహితురాలి పేరు శూసన్, Susan. ఆ అమ్మాయికి మీరు సహాయం చేయ్యాలంటే, https://umsbe.eu.qualtrics.com/SE/?SID=SV_5w4mKRsT4zgYG1f (లేదా) http://j.mp/1mEvCIP గమనించ గలరు. ఆ అమ్మాయి మాటలలో [...]
భారతీయ సంస్కృతిలో రెండు అంతకన్నా ఎక్కువనదుల సంగమమాన్ని ప్రయాగ అంటారు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మొన్నామధ్య నాన్నగారి అస్తికలు ప్రయాగలో, అలహాబాద్ లోని ప్రయాగలో నిమజ్జనం చెయ్యడానికి వెళ్లి వచ్చిన తరువాతనే ఈ విషయం అర్దం అయ్యింది.   పేరు ఏ ఏ నదుల సంగమము ప్రయాగ రాజ్ గంగ యమున సరస్వతి సంగమము దేవ ప్రయాగ అలకనంద భాగీరధి సంగమము రుద్ర [...]
ఈ నెలలో నాన్నగారి మొబైల్ నుంచి ఒక్క కాల్ కూడా లేదు. పోనీ నేను చేద్దాం అనుకుంటే, అన్నయ్య ఆన్సర్ చేస్తున్నాడు. లేరు అన్న విషయం ఎంత నిజమైనా, తెలియకుండా ఏదో ఒక సమయంలో నాన్నగారి తో మాట్లాడాలన్న ఆలోచన వస్తునే ఉంది.             భావాలు ఎన్ని ఉన్నా, ఎమీ వ్రాయలేకపోతున్న నా చాతకాని తనానికి సిగ్గుపడుతున్నా.
గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.   ఉపోద్ఘాతం: ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు. ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు. ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ [...]
  నాకు వివాహం అయ్యి ఆరు సంవత్సరాలైనా ఇంతవరకూ పిల్లలు లేరు, అది ఇక్కడ అప్రస్తుతం. కానీ ప్రస్తుతమైనదేమిటంటే, పిల్లల గురించి. ఇలా ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, పైన చిత్రంలో ఉంచిన విఘ్నేశ్వర స్వామిని నా చేత్తో చేసుకున్న ప్రతిమ. ఈ ప్రతిమను చేసిటప్పుడు నేను ఎంత శ్రమ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. చక్కగా ఓ ముద్రించిన మట్టి మూర్తిని కూడా తెచ్చుకున్నాను, అయినా ఇలా [...]
ప్రస్తుతం వ్రాస్తున్న భావనలు మూడో సారి అమెరికాని విజిట్ చేసిన తరువాత వ్రాస్తున్నవి. మొదటి సారిగా 2008లో అమెరికాని చూడటమైనది. మఱో రెండేళ్ల తరువాత 2010లో, మఱో రెండేళ్ల తరువాత ఇప్పుడు. ఈ నాలుగేళ్లలో అమెరికా ఏమీ మారలేదు. మొదటి సారి విచ్చేసినప్పుడు ఉన్న పరిస్తితులు, అప్పటి మనుష్యుల ప్రవర్తనలు, ఆ అలవాట్లు, నేను గమనించాను అని అనుకున్నవి అన్నీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఏ మాత్రం [...]
ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం [...]
హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!! మొదటి కధ: ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి [...]
నిన్న యాదృశ్చికంగా ఏదో సినిమా టైటిల్ నా చెవిన పడింది. సీతా రాముల కళ్యాణం, లంకలో .. అన్న పట్టాన పెట్టాను ఈ పుటకి శీర్షిక. ఓ సంవత్సరం క్రిందట ఇలాంటిదానిని భవదీయుఁడు అనే బ్లాగులో పెట్టినట్లు గుర్తు. అప్పుడేమో మహిళలు అంతా కలసి, మహిళా బ్లాగర్ల సమావేశం అని పేరు పెడితే, ఈ సారి ఆ సమావేశాన్ని ప్లస్సర్ల సమావేసంగా పేరు మార్చారు. రాజకీయ నాయకులకి అలాగే మహిళలకు పేర్లతో పనేంమిటి? ఆ!!! [...]
ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు [...]
ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది. కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. [...]
ముందు ఈ లంకె చూడండి .. ఐదు భాగాలుగా విడగొట్టి చిత్రంలాగా ఉంచితే.. ఇంతౌతుంది------------------------------------------- వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే [...]
ఇవ్వాళ ఉదయం ఇంట్లో టిఫిన్ ఆలశ్యం అయ్యేటప్పటికి, బయటికి వెళ్ళి తిందాం అని బయలుదేరాను. ప్రస్తుతం నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను కదా, అదో పెద్ద చెత్త కుండి అని ఆలశ్యంగా తెలిసింది. ఉదయం వేళల్లో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళితే ఓ చోట చాలా మందు గుమ్మి కూడి ఉన్నారు. ఏంటిదిరా, అనుకుంటూ కొంచం నిశితంగా పరిశీలిస్తే అప్పుడు అర్దం అయ్యింది అక్కడ గుమ్మి కూడి ఉన్న [...]
నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని [...]
స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను. జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే [...]
ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది. ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు