ఓ హెన్రీ కథల్లో ముగింపులు అద్భుతంగా ఉంటాయి. మిగిలిన కథాభాగం అంతా ఒకింత వెటకారంతో, కొంచెం సాగబీకినట్లుండే వర్ణనతో ఒకలాగా సాగినప్పటికీ, కథల అంతాలు మటుకు కత్తివేటు వేసినట్లే- ధడాలున నెత్తి మీద పడతాయి, అకస్మాత్తుగా. మనసుపెట్టకుండా కథని పైపైన చదివే వాళ్ళు, ఈ అంతాల మెరుపుల్ని అసలు అర్థం చేసుకోగలరా, అనిపిస్తుంది ఒక్కోసారి. టోబిన్ తల రాత!మూలం: "టోబిన్స్ పామ్‌"రచన: ఓ. [...]
మౌనం ఊరికే గర్జిస్తోంది. రెండ్రోజుల్లో అంతా అయిపోతుందని తెల్సినకొద్దీ యీ గర్జనలు ఎక్కువౌతున్నాయి. మెదడుని తొలిచేసే మౌన సాగరంలో ఇప్పుడు చెలరేగుతున్న అలల్ని ఆపటం ఇక సాధ్యం కావటం లేదు.  పగలు-రాత్రి అనేది లేక గబగబా వచ్చి వాలి మీదపడి దహించే మౌనకెరటాలు...  యీ మౌనపు కెరటాలనే కొందరు పిచ్చోళ్ళు 'ఆలోచనలు' అంటారు కాబోలు.  నిజంగా పిచ్చోళ్ళే.మౌనం‌ యీ విశ్వమంతటికీ ఆధారంగా [...]
జెన్ గురువు 'మత్సు' కి  చాలామంది శిష్యులుండేవాళ్ళు.  వాళ్ళలో ఒకాయన పేరు 'పండు' ('బిగ్ ప్లమ్').ఒకసారి ఎవరో ఓ సన్యాసి పండుని అడిగాడట- "మత్సు నీకు ఏమి నేర్పించాడు?" అని." 'ఈ మనసే, బుద్ధుడంటే' " చెప్పాడు ప్లమ్." ఈ మధ్య అట్లా చెప్పట్లేదాయన- 'ఈ మనసు కానిది ఏదీ బుద్ధుడు కాదు' అని చెబుతున్నాడు" అన్నాడు సన్యాసి." 'ఈ మనసు కానిదేదీ బుద్ధుడు కాదు' ని ఆయన దగ్గర పెట్టుకొమ్మనండి- 'ఈ మనసే [...]
చాలా కాలం క్రితం ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. పవిత్ర జీవితం గడుపుతూ అతను చాలా సంతోషంగా ఉండేవాడు. ఊళ్లో అతనికి చాలా మర్యాదా, మన్ననా ఉండేది. అనేకమంది శిష్యులూ ఉండేవాళ్లు. ఒకసారి అతనికి ఒక సంకల్పం కలిగింది- కొండ మీద ఒక పెద్ద బుద్ధ మందిరం నిర్మించాలని. మరుసటి దినమే అతను పని ప్రారంభించాడు: విరాళాలు వసూలు చేయటం, పనివాళ్లను తీసుకురావటం, సామాన్లు కొనటం, రాళ్లు [...]
దుఖమూ, సంతోషమూ మాట్లాడుకుంటూ కూర్చున్నై, నది ఒడ్డున.నదిలో నీళ్లు పారుతుంటే రెండూ ఆ నీళ్లలో కాళ్ళు అల్లాడిస్తూ కూర్చున్నై.కొన్ని నీటి కణాలు సంతోషపు పాదాలకు తగిలి నిండా సంతోషం‌ అయిపోయాయి.మరికొన్ని నీటి కణాలు దు:ఖపు పాదాలకు తగిలి నిండా దు:ఖం అయిపోయాయి.చాలా కణాలు, వీటి కాళ్ళకు తగలనివి, నిస్తేజంగా ప్రవహించినై.అందుకనే, ప్రవాహంలోకి దిగి స్నానమాడే వాళ్ళు చాలామంది [...]
ఒక యీగ, తేనెటీగ కలుసుకున్నాయి పూలతోటలో."ఏమవ్వా, కులాసానా?" అడిగింది తేనెటీగ."ముసలిదాన్ని. నా కులాసాకు ఏమొచ్చింది గాని, మీరు పిల్లలు కులాసాగా ఉంటే అంతే చాలు" అన్నది ఈగ."ఈ పూలతోట ఎంత అందంగా ఉంటుందో, కద అవ్వా!?" అనంది తేనెటీగ."ఏమి అందంలే, ఎంత ఉన్నా పూలే కద!" అన్నది ఈగ."ఒక్కొక్క పువ్వులోంచీ యీ వసంతంలో వచ్చే సువాసన ఎంత మత్తెక్కిస్తుందో!" అన్నది తేనెటీగ, ఓ పువ్వు చుట్టూ [...]
చాలా సంవత్సరాల క్రితం ఒక రాజుగారు ఉండేవారట.ఆ రాజుగారికి పులులంటే చాలా ఇష్టమట.చిన్న చిన్న పులి పిల్లలంటే మరీ ఇష్టమట. వేటకోసం అడవికి వెళ్ళినప్పుడల్లా ఒక బుజ్జి పులి పిల్లను ఇంటికి తెస్తూ ఉండేవాడట.అట్లా ఆయన ఆస్థానంలో వందలాది పులులు తయారయ్యాయి.'పులుల్ని ఊరికే బోనుల్లో‌బందీ చేసి ఉంచితే ఎలాగ?' అని వాటికోసమే ప్రత్యేకంగా ఒక అడవిని కేటాయిద్దామనుకున్నాడాయన.అయితే వాళ్ల [...]
చాలా సంవత్సరాల క్రితం ఒక గురుకుల పాఠశాల.ఆ బడిలో పిల్లలందరూ నిజంగా ఆణిముత్యాలు. ఐదో తరగతిలోనూ, ఏడో తరగతిలోనూ అద్భుత ప్రతిభ కనబరచిన పిల్లలు. ప్రభుత్వం ఇలాంటి గొప్ప బడులను వాళ్లకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పిల్లలకోసం చాలా వసతుల్ని కల్పించింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వాళ్లకు మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పేవాళ్లు. అక్కడ పని చేసే తెలుగు అయ్యవార్లకు [...]
గొర్రెపాటి నరేంద్రనాథ్.. ఇంకా ఉన్నాడు. పోయిన సంవత్సరం ఈరోజున చనిపోయినప్పటికీ, మిత్రులందరి హృదయాల్లో నరేన్ ఇంకా పదిలంగానే ఉన్నాడు. రాజకీయాల్లో అరాచకీయాన్ని చూస్తున్నా, రక్షకుల అకృత్యాలను చూస్తున్నా, కులాల పేరిట జరిగే కొట్లాటల్ని చూస్తున్నా, చదువుల పేరిట తెస్తున్న దుర్మార్గపు చట్టాల్ని చూస్తున్నా, నేలను దోచుకునే దళారుల్ని- తిరుపతి వేంకటేశ్వరునికి వాళ్లిచ్చే [...]
సుబ్బారావుకి కూడా, అందరిలాగే, ప్రాణం అంటే తీపే. చచ్చిపోవాలని అస్సలు లేకుండింది అతనికి.సుబ్బారావుకి ఒక భార్య, ఒక కొడుకు. వాడికి రెండేళ్ళు. వచ్చీరాని మాటల్తో వాడు ముద్దు ముద్దుగా "ఓయ్, నాన్నా, అవ్వా" అని అరుస్తుంటే సుబ్బారావు మనసు పులకరించిపోయేది. తను చచ్చిపోతానని అసలు ఏనాడూ అనుకోలేదు అతను.అందుకనే, డాక్టర్లు తన కిడ్నీలో రాళ్ళున్నాయని గుర్తించినప్పుడు, బాగా నీళ్ళు [...]
అనగా అనగా సుందుడు ఉపసుందుడు అనే అన్నదమ్ములిద్దరు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ అందగాళ్ళు, చాలా బలశాలులున్నూ. ఇద్దరూ జీవితంలో పైకి రావాలనే తపన ఉన్నవాళ్ళు ; అధికారం కోసం గానీ గౌరవ మర్యాదల కోసంగానీ ఏమైనా చేసేవాళ్లు. ఇద్దరూ చాలా నియమనిష్ఠలతో బ్రహ్మ గురించి దీక్షగా తపస్సు చేశారు. అనేక సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు వారికి ప్రత్యక్షమై, వరాలు కోరుకొమ్మన్నాడు. సుందోపసుందులు [...]
పరమశివుని అర్ధాంగి ఉమాదేవికి ఎవరో చెప్పారు- జనక మరణ చక్రం గురించీ, సృష్టి ప్రారంభమైననాటినుండి ఈ చక్రం నిరంతరంగా ఎలా తిరుగుతూ ఉన్నదీనీ. ఆమెకు అదంతా గొప్పగా అనిపించింది- దానిగురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక కలిగింది. ఒకనాడు ఆమె పరమశివుడిని అడిగింది- “నేను ఇప్పటివరకూ ఎన్ని జన్మలెత్తానో చెప్పగలరా, మీరు?” అని. శివుడన్నాడు- “ఓ., వేల జన్మలు-అనేకానేక రూపాలు!" అన్నాడు [...]
నానక్ తండ్రి కాలూరాం ఒక కిరాణా వ్యాపారి. పట్టణంలో పేరుగాంచిన దుకాణాల్లో వారి దుకాణం ఒకటి. పంట కాలంలో ఆయన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, దాన్ని నిలువ చేసి, సంవత్సరమంతా వినియోగదారులకు అమ్మేవాడు. ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడి, పంటలు పండక, మార్కెట్లో ధాన్యపు కొరత ఏర్పడింది. ప్రభుత్వం వారు తమ గిడ్డంగుల్ని తెరిచి, ఉన్న ధాన్యాన్ని అందరికీ పంచేందుకు గానూ చౌకధరల దుకాణాల [...]
రాష్ట్రంలో బందులను చూస్తుంటే తిక్క రేగుతోంది.చాలు స్వామీ! ఈ బందులు ఇక బందు చేయండి. మామూలు జనాల్ని బొంద పెట్టకండి.మీకు ఏది కావాలో అది తీసేసుకోండి- తొందరగా- ఈ ఒక్క సారికీ. మళ్ళీ‌మీక్కావలసింది మీకు దొరుకుతుందో, దొరకదో. ఇప్పుడే తీసేస్కోండి. మామూలు జనాల్ని బందు చేయటం మాత్రం ఆపేయండి ఇంక.'ఉద్యమాలవాళ్ళూ'! మీ బ్రతుకు తెరువులేంటి? ఉద్యమాలేనా? ఉద్యమాలు బాగా కూడు పెడుతున్నాయా? [...]
పట్టణపు పొలిమేరల్లో ఓ గుడిశలో నివసించేవాడు నర్సీ. పేదవాళ్ళూ, తిక్కవాళ్ళూ అతని చుట్టూ చేరి ఉండేవాళ్ళు ఎప్పుడూ. నర్సీ వాళ్ళతోటి అవీ ఇవీ మాట్లాడుతూ, నవ్వుతూ-నవ్విస్తూ ఉండేవాడు. ఉత్సాహం, ఆవేశం ఎక్కువైనప్పుడు అతను పాటలు పాడేవాడు. ఆ పాటల్లో భక్తిరసంతోబాటు తాత్విక అంశాలు పుష్కలంగా ఉండేవి. "ఇతరుల బాధని అర్థం చేసుకోగలవాడే నిజమైన భక్తుడు- వైష్ణవజనతో తేనే కహియె జె పీర్ [...]
అమ్మా! నేను బడికి పోనే!నేనొట్టి చిన్న పిల్లనే, అమ్మా. నాకెవరైనా కథలు చెప్పాలి, నాకెవరైనా నేర్పించాలి.కప్పపిల్లల్నీ, సీతాకోక చిలకల్నీ చూడటం నాకిష్టం- అవేం తింటాయో, ఎక్కడ నిద్రపోతాయో తెలుసుకోవటం నాకిష్టం. ఇంకా నేనో కొండనెక్కాలి, పైన ఎగిరే మబ్బుని పట్టుకొని, అది దేంతో తయారైందో చూడాలి.పారే ఏరులో చేతులు పెట్టి చూడాలి నేను. ఈదే చేపలు నా వేళ్ళకి తగిల్తే ఎంత బాగుంటుందో [...]
ఇంగ్లీషులోగాని, హిందీలోగాని కథ చదువుతూ తెలుగులో రాయటం ఓ వ్యసనం అయిపోయింది ఈమధ్య. పాపం, మూలకర్తలు సంతోషపడతారో, బాధ పడతారో తెలీదుగానీ, నేను మాత్రం టకటకా స్వేచ్ఛగా అనువాదాలు చేసేస్తున్నాను. వాటిలో కొన్నిటిని, ముఖ్యంగా పిల్లలకు పనికొచ్చేవాటిని, కొత్తపల్లి పత్రిక (http://kottapalli.in) లో పెట్టాను. మరికొన్ని 'నారాయణీయం' బ్లాగులో ఉన్నై. ఈ మధ్య చేస్తున్నవాటిలో పిల్లల సందర్భాలకంటే, [...]
జనక మహారాజు ఒక ప్రక్కన రాజుగా విధులు నిర్వర్తిస్తూనే, మరో ప్రక్కన ఆత్మచింతనలో మునిగిఉండేవాడు. 'మనసు గురించిగానీ, బుద్ధి గురించి గానీ, ప్రవర్తన గురించిగానీ ఏమైనా సందేహాలుంటే జనకుడిని అడగాలీ అని చెప్పుకునేవాళ్ళు.ఒకసారి గొప్ప పండితుడు ఒకయన జనకరాజుగారి దర్బారుకు విచ్చేశాడు. వచ్చీరాగానే, సమయాన్ని వృధా చేయకుండా, ఆయన "రాజా! మన దు:ఖాలన్నిటికీ‌ కారణం మన మనస్సే గదా? కనుక, [...]
మూలం: కారెంస్ పేజ్, చికాగో ట్రిబ్యూన్,కథనం: పర్తాప్ అగర్వాల్2006 అక్టోబరు రెండున పెన్సిల్వేనియాలో ఒక ఆమిష్ తెగవారి పల్లెలో ఒక భయానక మారణకాండ జరిగింది. పాల వ్యానును నడిపే డ్రైవరొకడు, చేత తుపాకీ పట్టుకొని, ఊరికి దూరంగా ఉన్న బడిలోకి జొరబడ్డాడు. ఆ చిన్న బడిలో ఉన్నది ఒకే గది. లోనికి జొరబడ్డ ఆ దొంగ తుపాకీ చూపి బెదిరించి, తరగతి గదిలోని టీచరును, మగపిల్లలను అందరినీ బయటికి [...]
రామారావు, సరళ రైలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. రైల్వేస్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నది. రైలు వచ్చి ఆగగానే, ఉన్న రెండు జెనరల్ బోగీల్లోకి దూరేందుకూ జనాలు పోటీపడి కొట్టుకోవటం మొదలెట్టారు.రామారావు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది- S1లో. S1బోగీ జెనరల్ బోగీని ఆనుకొనే ఉన్నది. అయితే దేవుని దయవల్ల, దాన్నీ, దీన్నీ వేరుచేస్తూ మధ్యలో గోడలున్నై. ఆ గోడలు లేకపోతే వీళ్లూ, వాళ్లూ [...]
ఈ మధ్య "తెలుగు పద్యం" బ్లాగును చూశాను. మళ్ళీ నా చిన్నతనం గుర్తుకొచ్చింది. చిన్నతనంలో నేను, మా నాన్న పోటీగా తెలుగులో సొంత పద్యాలు చెప్పుకునేవాళ్ళం. ఆ తరువాత నేను గద్యాన్ని- అందులోనూ మామూలు జనాలు మాట్లాడుకునే వచనాన్ని- అలా అలా చిన్నపిల్లలు ఇష్టపడే కథల్ని- ఇష్టపడటం మొదలుపెట్టాను. 'తెలుగు పద్యం' ద్వారా భైరవభట్లగారు నాకు పద్యాలంటే మళ్ళీ ఓసారి అభిమానం పుట్టించారు. [...]
రెండువేల ఐదు వందల సంవత్సరాల క్రితం- గౌతమ బుద్ధుడు తాను కనుగొన్న సత్యాలను ప్రజలందరితోటీ పంచుకుంటున్న సమయం- అప్పుడాయన విదిశా నగరపు ఆవలనున్న మామిడితోపులో విడిది చేసి ఉన్నాడు. బుద్ధుడితోసహా భిక్షువులందరూ భిక్షాపాత్రలు చేతబట్టుకొని, ప్రతిరోజూ ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్ళేవాళ్లు- భిక్షనర్ధించేందుకు.ఒకనాడు బుద్ధుడు నగరపు వీధుల్లో నడుస్తుండగా ఆయన ప్రక్కనే ఒక రథం ఆగింది. [...]
పర్తాప్ అగర్వాల్ గారు వారానికొకటి చొప్పున, అనేక సంవత్సరాలుగా తనకు గుర్తుకొచ్చిన కథలు రాస్తున్నారు-ఇంగ్లీషులో. ఉడతాభక్తిగా వాటిలో కొన్నింటిని తెలుగులోకి చేద్దామని ప్రయత్నం మొదలెట్టాను... ఆ క్రమంలో ఈ బ్లాగుకు మొదటి కథ ఇది:జపాన్ లో బౌద్ధభిక్షువులు చాలామంది కాలినడకన దేశమంతటా తిరిగేవాళ్ళు. వాళ్ళకు సాయంగా ఉండేందుకని, దారిలో, ఎక్కడపడితే అక్కడ, జెన్ ఆరామాలు ఉండేవి. [...]
In death there is release.నిజమనిపిస్తుంది.నరేంద్రనాథ్ వెళ్ళిపోయాడు. విలువైన విషయాలు చెప్పీ, చెప్పీ అలిసిపోయి, ఇక చెప్పాల్సిన పనిలేకుండా వెళ్ళిపోయాడు.ఇక ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటలకు నరేన్ వస్తాడు మనసులోకి- ఏ మాటల్లో ఉన్నా తొమ్మిదికల్లా అతని మెదడు స్విచాఫ్ అయిపోయేది... ఇప్పుడు పూర్తిగా స్విచాఫ్ అయిపోయింది.ఘోరమైన జీవిత సత్యాన్ని తన కుళ్ళుజోకుల మాధ్యమంగా పలికించీ, పలికించీ- [...]
రామారావు ఈరోజెందుకో అన్యమనస్కంగా ఉన్నాడు. తెలుగు తల్లికి పదనీరాజనాలు అర్పించాలని అతనికి చాలా కోరిక. పాత కర్పూరాలకంటే కొత్త కర్పూరాలే మంచివని ఎవరో చెప్తే, తెలుగమ్మకోసం కొత్త పదకర్పూరాల్నే వెలిగించాలని పట్టుబట్టి కూర్చున్నాడు అతను ఎంతో కాలంగా. కానీ ఎంత కాలం గడిచినా ఆ కర్పూరాలు అంటుకోవట్లేదు. నిల్వలు పేరుకు పోతున్నై; కానీ ఎందుకో సరుకు అమ్ముడవటం లేదు.జనాలందరూ పాత [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు