గత ఏడాది ఉద్యోగం, దేశం మారినందువల్ల ఆఫీసుకీ ఇంటికీ దూరం పెరిగి, కొంత పుస్తక పఠనం పెరిగింది అనిపించింది. ఇక్కడా దగ్గర్లోనే ఓ పబ్లిక్ లైబ్రరీ ఉండడం వల్ల కొత్త దేశం తాలూకా రచనలనే కాక, ఇతరత్రా కూడా కొత్త రచయితల గురించి తెలిసింది. అయితే తెలుగు పుస్తకాలు మట్టుకు దాదాపు అసలు చదవలేదనే చెప్పాలి. ఈ ఏడాది అది మారుతుందని ఆశిస్తున్నాను. గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఈ‌ టపా. [...]
She walks in beauty: A woman’s journey through poems Caroline Kennedy మా ఊరి లైబ్రరీలో ఈబుక్స్ కిండిల్ లో చదివే ఫార్మాట్లో రావు. కానీ, వాటికి ఒక మొబైల్ ఆప్ ఉంది. నాకూ రోజూ సీటు దొరకని ఒక ట్రెయిను ప్రయాణం పోనూ రానూ చెరో అరగంట ఉన్నందువల్ల, కొంచెం మొబైల్ స్క్రీన్ మీద చదవడానికి అనువుగా ఉండేవి ఏమిటి? అని ఆలోచిస్తే కవిత్వం నయం అనిపించింది. సహజంగా కవిత్వం అంటే భయం […]
కన్నడ సాహిత్యంతో/సాంస్కృతిక జీవితంతో పరిచయం ఉన్నవారు శివరామ కారంత్ పేరు వినే ఉంటారు. బహుశా 1970లలో జ్ఞానపీఠం వచ్చిన వారిలో ఆయనా ఒకరని కూడా తెలిసే ఉంటుంది. నేను మొదటి కారంత్ నవల, తెలుగు అనువాదంలో పద్దెనిమిదేళ్ళ వయసులోనే చదివినా‌ (త్రివేణి గారి అనువాదం అనుకుంటాను), కొంచెం శ్రద్ధగా, ఇష్టంగా చదివింది ఒక ఐదేళ్ళ క్రిందట. అప్పుడు జర్మనీ లో నేను ఉన్న ఊళ్ళో‌ భారతీయ (ముఖ్యంగా [...]
గత ఏడాది కెనడా దేశం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా వెలువడిన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ మధ్య కెనడా వలస వచ్చాక ఈ దేశం గురించి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయేమో అని చూస్తూంటే లైబ్రరీలో ఈ పుస్తకం కనిపించింది. మామూలుగా చరిత్ర పుస్తకమంటే తేదీలు, పాలకులు, ఆ యుద్ధం,‌ ఈ యుద్ధం – ఈ తరహాలో సాగుతాయి కనుక నేను చదవలేనంత సమాచారం, చదవలేని అకడమిక్ భాషలో ఉంటుందేమో అని నా భయం. అయితే, […]
కెనడా నేపథ్యంలో వచ్చిన కథలో, నవలలో ఏవన్నా‌ ఉన్నాయేమో అని Ames Public Library వెబ్సైటులో వెదుకుతూ ఉంటే “Caged Eagles” అన్న నవల కనబడింది. దాని తాలూకా ఒక పేరా పరిచయం చదివాను – కథ ఒక జపనీస్ పూర్వీకులున్న కెనడియన్ టీనేజీ పిల్లవాడి కథనంతో నడుస్తుంది, కథా వస్తువు పెర్ల్ హార్బర్ బాంబింగ్ తరువాత జపనీస్ పరంపర ఉన్న కెనెడియన్ల జీవితంలోని మార్పులు, అని తెలిసింది. ఇదివరలో అమెరికాలో ఇదే సమయంలో [...]
మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ మంచి చదువరి. ఆరునెలలకి ఒకసారి ఆయన గేట్స్ నోట్స్ అన్న తన వెబ్సైటులో పుస్తకాల జాబితాలు విడుదల చేస్తూ ఉంటారు. అలా గత వారం సమ్మర్ రీడింగ్స్ అని ఒక ఐదు పుస్తకాల గురించి రాశారు. ఆ పోస్టులో ‘Everything Happens for a Reason and Other Lies I’ve Loved’ అన్న పుస్తకం గురించిన రాసినది నన్ను ఆకర్షించింది (ఆయన వివరంగా రాసిన సమీక్ష ఇక్కడ). ముప్పైలలో […]
ఈ పుస్తకం ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, మాజీ నంబర్ వన్ అయిన ఆంద్రె అగస్సీ ఆత్మకథ. పుస్తకం రిలీజైనప్పుడు చదవాలనుకుని, సైజు, ఖరీదు చూసి జడుసుకుని ఊరుకున్నాను. ఇన్నేళ్ళ తరువాత ఎందుకో గత వారాంతంలో అగస్సీ ని తల్చుకున్నాను – దానితో లైబ్రరీలో చూస్తే ఆత్మకథ తాలూకా ఈ-పుస్తకం కనబడ్డది. నేను ఊహించిన దానికంటే వేగంగా, ఒక రోజులోనే పూర్తి చేశాను – అలా చదివించింది. అందువల్ల దాని [...]
ఈ పుస్తకం ఒక దళిత కుటుంబం తమ కులవృత్తిని, పూర్వీకుల గ్రామాన్ని వదిలిపెట్టి, ఉద్యోగాలు, చదువుల బాట పట్టి క్రమంగా జీవన విధానాన్ని మార్చుకున్న వైనాన్ని గ్రంథస్తం చేసింది. రచయిత మూడు-నాలుగు తరాల తమ కుటుంబ కథని తన తండ్రి ప్రధాన పాత్రగా చెప్పారు. ఆయన వృత్తి రిత్యా కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో పెరుగుతున్న తన మనవరాళ్ళకు తమ కథ తెలియడానికి [...]
మన భాషలో పదసంపద కాలానుగుణంగా వృద్ధి చెందాలంటే, ఆధునిక శాస్త్రాల్లోని విషయాలను మన భాషలో వ్యక్తం చేయాలంటే, కొత్త పదాలు సృష్టించుకోవడం తప్పనిసరి. మరి ఆ కొత్త పదాలు ఎలా సృష్టించాలి? అన్నది ఒక చర్చనీయాంశం. కొన్నాళ్ళ క్రితం తెలుగు బ్లాగుల తొలినాళ్ళలో కొంతమంది చేరి ఒక గూగుల్ గుంపును ఏర్పరిచారు – తెలుగుపదం అనుకుంటాను పేరు. అప్పట్లో అంతర్జాలానికి, సాంకేతికతకీ [...]
ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధునిక నాగరికత అంతగా సోకని ఇతర భాషల వాళ్ళ గురించి, వాళ్ళ భాషల స్వరూపాల గురించి కొంచెం కుతూహలం కలిగింది. ఆ విషయానికి సంబంధించి తెలుగులో ఎవరన్నా ఏవైనా రాశారా? అని ఆలోచిస్తూ ఉండగా గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి గుర్తువచ్చింది. సరే, ఆయన సవరల గురించి, వాళ్ళ భాష గురించి చేసిన కృషిలో ఏదన్నా [...]
మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడానికి ఈ టపా. ముఖ్యమైన సంగతులేమిటంటే: * ఈ ఏడాది ఎక్కువ పుస్తకాలు చదవలేదు కానీ, ఉన్నంతలో కొందరు రచయితలు బాగా ఆలోచింపజేశారు. * ఇదివరలో బాగా నచ్చిన ఒకరిద్దరు నవలాకారుల తాజా నవలలు బాగా నిరాశకు కూడా గురిచేశాయి. * అలాగే, ఈ ఏడది రిపీట్ మోడ్ లో కొన్ని గత మూడు నాలుగేళ్ళలో చదివినవి మళ్ళీ చదివాను [...]
కాళోజీ నారాయణరావు గారి గురించి, ఆయన “నా గొడవ” కవిత్వం గురించీ, ఆత్మకథ గురించీ వినడం తప్పిస్తే నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఎప్పటికప్పుడు ఏదన్నా చదవాలి అనుకోవడం, అందుబాటులో ఆయన రచనలు దొరక్కపోవడం జరుగుతూ వచ్చింది. మొన్న ఆమధ్య కాళోజీ జయంతి సందర్భంగా ఎ.కె.ప్రభాకర్ గారి “భాష కూడా యుద్ధ క్షేత్రమే” వ్యాసం, అదే సమయంలో నా మిత్రుడు రాకేశ్ వాళ్ళ కాలేజీలో కాళోజీ [...]
ఈమధ్య ఒక ప్రాజెక్టు పనిలో భాగంగా చాలా రోజులు భద్రిరాజు కృష్ణమూర్తి, జె.పి.ఎల్.గ్విన్ గార్ల “A grammar of modern Telugu” పుస్తకంలోని ఉదాహరణలు, వివరణల గురించి బాగా చర్చించడంతో భద్రిరాజు గారు రాసిన ఇతర పుస్తకాల గురించి చూస్తూండగా worldcat.org వెబ్సైటులో ఈ పుస్తకం ప్రస్తావన కనబడ్డది. ఇదివరలో ఈమాట పత్రికలో ఈయన ఇంటర్వ్యూ, ఆయన మరణించినపుడు వచ్చిన వ్యాసాలూ అవీ చదివాను కానీ, అంతర్జాలంలో ఈ [...]
“Deep Thinking: Where Machine Intelligence Ends and Human Creativity Begins” – ఈ పుస్తకం గురించి Halley ఒక రెండు మూడు వారాల క్రితం మాటల సందర్భంలో చెప్పాడు. ప్రముఖ చెస్ ఆటగాడు గారీ కాస్పరోవ్ Mig Greengard అన్న చెస్ రచయిత తో కలిసి రాసిన పుస్తకం ఇది. కాస్పరోవ్ రాసినది అని కాదు కానీ, ఆ టైటిల్ తో రాసిన పుస్తకం అనగానే కొంచెం కుతూహలం కలిగింది. కొత్తగా విడుదలైన పుస్తకమే […]
చిన్నప్పుడు “హరి కథా పితామహుడు” ఆదిభట్ల నారాయణ దాసు అని చదువుకున్నాము స్కూల్లో. “నా యెఱుక” అన్న పుస్తకం ఒకటి ఉందని కూడా అప్పట్నుండీ తెలుసు గానీ, అసలా పుస్తకం ఏమిటి? అసలాయన గొప్పతనం ఏమిటి? అన్నది నాకు ఇప్పటిదాకా తెలియదు. ఈమధ్య ఈ పుస్తకం మా తమ్ముడి దగ్గర కనబడ్డంతో చదివాను. పుస్తకం గురించి ఓ నాలుగు వాక్యాలు: పుస్తకం దాసు గారి స్వీయచరిత్ర. తెలుగులో మొదటి ఆత్మకథ [...]
విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కానీ, కథలెప్పుడూ చదవలేదు – “జీవుని ఇష్టం”, “ఉరి” తప్ప. అనుకోకుండా ఈమధ్యనే చదివాను. వాటిని గురించి నాకు తోచిన నోట్సు ఇక్కడ రాసుకుంటున్నాను. అభిమానులకి, అనభిమానులకి: ఇది సమీక్షో, భావజాలం తాలూకా పరామర్శో కాదు. ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ [...]
Fatal Guidance by William Bainbridge (కథ సబ్స్క్రైబర్లకి మాత్రమే. పీ.డీ.ఎఫ్ ఇక్కడ షేర్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన అవుతుంది అని రాశారు. ముఖచిత్రం CACM పత్రిక నుండి.) ఒక నెలన్నర క్రితం ఒక చక్కటి చిన్న కథ చదివాను, Communications of the ACM మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో. నాకు మొదట చదివినప్పుడే చాలా నచ్చి నలుగురైదుగురు స్నేహితులకి దాన్ని చదవమని షేర్ చేశాను. నా Statistical Natural Language Processing క్లాసులో కూడా ఈ […]
వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన పాత్రలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. బలమైన పాత్రలు నావకు తెరచాపలాగా కథాగమనాన్ని సూచిస్తూ ఉంటాయి. ఒక పాత్ర తన వ్యక్తిత్వం ద్వారా, ప్రవర్తన ద్వారా కథపై బలమైన ముద్ర వేస్తాయి. రచయిత ఒక వ్యక్తిత్వంతో కూడిన పాత్రను సృష్టించడం ద్వారా ఏ పరిస్థితుల్లో ఒక పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అంచనా [...]
జంపాల చౌదరి గారి పోస్టు చూసి ఆ స్ఫూర్తి తో రాస్తున్న పోస్టు ఇది. గత ఏడాది నాకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫాకల్టీగా చేరడంతో మొదలైంది. అందువల్ల చాలా మట్టుకు నా పఠనం క్లాసుల్లో పాఠాలకూ, పరిశోధనకూ సంబంధించినదే. దీనివల్ల ఇక్కడ రెండు పెద్ద పబ్లిక్ లైబ్రరీలకి access ఉన్నప్పటికీ నేను 2016 లో నేను చదివింది చాలా తక్కువ, ఇంతోటి దానికి మళ్ళీ దాన్ని గురించి రాసుకోడం కూడానా? అని ఓ పక్క [...]
ఈ పుస్తకం Tim Parks గతంలో న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ లో రాసిన వ్యాసాల సంకలనం. వ్యాసాంశాలు – పుస్తకాలు, రచయితలు, ప్రచురణ, అనువాదం – వీటికి సంబంధించినవి. పుస్తకాలు చదవడం ఎందుకు? కథలు చదవడం అవసరమా? రాయడం ఎందుకు? డబ్బులిస్తే బాగా రాస్తారా రచయితలు? – అంటూ రకరకాల ప్రశ్నలతో మొదలవుతుంది పుస్తకం ముందుమాట. మా లైబ్రరీలో ఈ పుస్తకం చూసి ఆ ముందుమాట చదివాక ఇంక పుస్తకం తప్పక [...]
ఓ పది-పదిహేనేళ్ళ క్రితం నాకు క్రైం నవలల మీద ఆసక్తిగా ఉండేది. డిటెక్టివ్ సాహిత్యం అదీ తెగ ఆసక్తిగా చదివేదాన్ని. క్రమంగా అది తగ్గిపోయింది కానీ, అడపా దడపా ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాను. రెండేళ్ళ క్రితం Millenium Trilogy చదివే దాకా నాకు స్కాండినేవియన్ క్రైం ఫిక్షన్ మీద అంత ఆసక్తి కలిగింది. ఆ టైములో ఇతర స్వీడిష్ క్రైం రచయితల గురించి తెలుసుకుంటున్నప్పుడు scandinavian noir ఒక పాపులర్ సాహిత్య [...]
రెండేళ్ళ క్రితం అనుకుంటాను Will Eisner గీసి, రాసిన A Contract with God and Other stories అన్న నాలుగు గ్రాఫిక్ కథల సంకలనం చదివాను. తరువాత ఆ టైటిల్ కథ గురించి చాలా సార్లు అనుకున్నాను, రెండు మూడు సార్లు అదొక్క కథని మట్టుకు చదివాను మళ్ళీ. పుస్తకం నామీద చాలా ప్రభావాన్ని చూపించింది. ఆ బొమ్మలని, అవి చెప్పిన కథలని చాలా సార్లు మరీ మరీ తల్చుకున్నాను. ఈ మధ్య కాలం లో […]
‘ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి గౌరవించటమే స్త్రీవాదం ప్రత్యేకత’ (విముక్తి మార్గాన స్వేచ్ఛా ప్రస్థానంలో ప్రముఖ రచయిత్రి ఓల్గా తో సంభాషణ ) ఇంటర్వ్యూ : ఎ.కె.ప్రభాకర్ (ఈ ఇంటర్వ్యూ మొదట పాలపిట్ట పత్రికలో వచ్చింది. పుస్తకం.నెట్ కి పంపినందుకు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ఇంటర్వ్యూని పుస్తకం.నెట్ లో రెండు భాగాలుగా వేస్తున్నాము. మొదటి భాగం ఇక్కడ.) ****************** ‘విముక్త’ లో పురాణ [...]
సమావేశం వివరాలు: తేదీ: ఫిబ్రవరి 7, 2016 సమయం: సాయంత్రం 5:30 కి వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడ వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.
వ్యాసకర్త: మణి వడ్లమాని ************ అసలు చేనేత అదేనండి, హ్యాండ్ లూం  చీరలు అంటే  మొదటినుంచి ఇష్టం. అసలు ఆడవాళ్ళకి చీరలకు అవినాభావ సంబంధం ఎలాగూ ఉండనే ఉంది. బండారులంక, పుల్లేటికుర్రు, భూదాన్ పోచంపల్లి, బొబ్బిలి, ధర్మవరం,గద్వాల్, ఉప్పాడ ఇలా ఆయా ఊళ్ళు వెళ్లి డైరెక్ట్ గ మగ్గాల దగ్గరనుండి మరీ కొనుక్కునే వాళ్ళము. ఒకసారి బొబ్బిలి వెళ్ళినప్పుడు కొన్ని చీరలు కొందామని ఒక ఇంటికి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు