కొందర్ని చూస్తే ఎదలో కోటి రాగాలు వీణ మీటుతాయిరాగాలు రంజిల్లి మేళ తాళాల సాక్షిగా ఒక్కరు నీ గుండెలో గూడు కట్టుకుంటారు…కొందరితో పరిచయమవుతేకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుందిఆ ఆలోచనలకు అర్థవంతమైన భావాలతో ఆలంబన దొరుకుతుంది.ఆ పరిచయం పేరు చిరునవ్వు అయితే చిరునవ్వుకు చిరునామాగా నిలిచిన నిను చూస్తేస్నేహానికి కొత్త నిర్వచనం తడుతుంది స్నేహ సౌరభాలు వెల్లివిరిస్తాయి !
కడు జాగ్రత్తగా దాచుకుంటావు మదిలోని తలపులని  ఒక్కొక్కటిగా తలపుల తలుపులు తెరిస్తే  నిగూఢమైన నిక్షిప్త ప్రేమ సందేశాలెన్నో?  మస్తిష్కంలోని అస్తవ్యస్తమగు ఆలొచనల పరంపర  రూపు దిద్దుకొనక అణగదొక్కబడిన వేళ  వెన్నెల చిన్నబోయి జాబిలి కనుమరుగాయెనో కదా..?
శిశిరపు పొద్దుగూకే వేళ భానుడు తన గూటికి చేరే వేళ  విరిసిన విరితేనెల చందనమో  కురిసిన మెఘమధనపు గ్రీష్మ తాపమో  మెరిసింది ఓ అందం...  వందనాలు ఆ అందానికి చందనాలు సరి తూగవు ఆ వర్ణానికి  వనంలోని కవనంలా వసంతంలోని కోయిలలా  సెలయేటి జలపాతంలా చెలిపాడే లయ గీతంలా  ఏరువాకాన ఎదురొచ్చింది కోరుకున్నాక మనసిచ్చింది!
తడి ఙ్జాపకాలు తట్టిలేపుతుంటే ఆగనంది నా కలంరాలుతున్న పూలు రోదిస్తుంటే రాయమంది ఓ కవనంమస్తిష్కాన్ని కుదిపేస్తే              కదిపింది పదాల మది గ్రంధంవసంతపు గుమ్మంలో రంగులీనిన పువ్వులే ఆ జ్ఞాపకాల కు పునాదులైఅరుణిమ అందాలతో తరుణిల మనసు దోచిన కుసుమాలు కదా అవిగాలి కూడా వాటిని             అంతే సుతారాంగా ఊయలూపుతుందనుకుంటాం కానీ గాలే [...]
రమణీయ రాగాలను కమనీయ గానాలను,లాలి పాటల లాలిత్యాన్ని జోల పాటల గారాబాన్నిపల్లెలోని తియ్యదనాన్ని అమ్మ భాష కమ్మదనాన్ని ఏడిపించే అమ్మ గీతాలని వేడి పెంచే పడుచు పాటలసమ్మేళన షడ్రుచుల పసందైన విందులతో పండుగ పర్వదినాన్ని అందించే పూదోట వారధి బాట...అలరించే పాటలతో వారధి తోటలో విహరిద్దామా...పదండి వారధికివారధి... ఇది తెలుగువారిది                
తాగుతా మత్తుగా చిత్తుగాతాగుబోతులా తాగిపో మెండుగా నీ గుండె నిండుగా.. తాగుతుంటె తనువు కాస్త మొద్దు బడతదిమొద్దుపడ్డ మెదడు నీకు మరపు తెస్తదిమరపులోన మెరుపులాగ గురుతు వస్తది "2"అది  భార్యలా కంటపడి మత్తు దిగుతది     “తాగుతా మత్తుగా”సతి పెట్టే బాధలు విధి ఆడె వింతలు విస్కీలు బ్రాందీలు ఆపలేవురా..చెప్పుకున్న సిగ్గుచేటు  చెప్పకుంటె  తలపోటు ఓర్చుకోక తప్పదురా [...]
పని పాటా లేక తిరిగే ఓ జులాయిని ఇంటి నుండి గెంటేసిన పిదప జరిగే కథ.రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రెరోసం పుట్టి వీసాని పట్టీ  అమెరికాకు వచ్చేశానురింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రెబతకలేని బడిపంతులాగా  బాల్టిమోరులొ అడుగెట్టాను రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రెకడపలోన గడపలేక రోతే పుట్టి ..డాలరంటె తగని నాకు మోజే పుట్టి బాల్టిమోరు [...]
భర్తల బాధలు వింటే కడుపే చెరువు అవుతుందే..మగువల తెగువలు చూస్తే తగువే తగదు అంటారేఅంబానికైనా ఉందా అర్ధాంగిని కాదనె ధైర్యంబాహుబలి  వీరుడికుందా  చెలిపై తను గెలిచే శౌర్యంమగవాడి జన్మిక ఇంతేలే…పెళ్ళి మాట వినగానె మనసు మురిసి పోయిందే..మూణ్ణాళ్ళ ముచ్చట కాగా అసలు రూపు చూపిందహా పూటకో ప్రతిసారి తన అందం పొగడాలంటకోరినది కాదనకుండా షాపింగులు చేయాలంటపగలే నాకు చూపెట్టె పై [...]
మనసులు కలిసిన మమతలు కలుగుమనుషులు కలిసిన బేధాలు తరుగులేని ఘనతను సంపాదించుకుంటే రిపులు పెరుగుఆత్మీయ పలకరింపుతో బాధలు కరుగుసహనశీలి సావాసముంటే సమస్యలు మరుగుమందిలో మంచిగ తర్కిస్తే ఎదుగును  తన పరువు.
తరలివచ్చే పురజనులకు కరములు జోడించి చేయు విన్నపంధరణిలో సారముంటే రైతు జీవనం సస్యశ్యామలంతరుణిలో శరముంటే తరగని సుఖములు పురుషుడి సొంతంవరుడిలో వరములిచ్చే నరముంటే తన చరణమే వధువుకు శరణం వారధి మీ చెంత ఉంటే అవధులెరుగని ఆనందం అందరి సొంతం
Silsila-Parady -Dekh Ek Khwab..He: అందమైన చందమామ తొంగి చూసెనే..చూసినంత మేర జాజి పూలు విరిసెనే  "2"She:తడి ఆరని కన్నులతో నే పిలిచినాపూల మీద మనసుపడి నన్ను మరిచెనా..?"అందమైన చందమామ "He:నీ మేని గంధాలే శ్వాసలైనవేShe: ఆ శ్వాస నా ఆశల ఊపిరైనదే..He: నీ పైట పాటకే నాట్యమాడెలేShe: ఆ నాట్యమెనక నీ చూపు తాకిడేHe: చూపులన్ని కలబోసి కలలు రేపెలె She:  కలనైన కనలేని కానుకైతివే..."అందమైన చందమామ "She: నా ఎదే నీ మదిలో [...]
దీపావళి వేడుకలలో ..హైందవ ఆచార సంస్కృతికి ఆలవాలమైన దీపావళికి నిలయమైన మా నివాసంలో జరిగిన దీపావళి వేడుకలలో ..దివ్య జ్ఞాన జ్యోతులే నవ్య కాంతిధారలైకోమలి కొసరి అందాలే  కోవెల దీపపు చందాలై తరుణుల చిరు నవ్వులే అరవిరిసిన  తారాజువ్వలైలలిత లావణ్యములే హిమజపు చరణములై చంద్రకాంతులే  శివ పార్వతుల శిరపు మణికంఠికలైగీతాచార్యుడి చైతన్య స్రవంతులే దివ్య దీప ధారలై స్వప్న [...]
పరదేశపు నీడలో మ్రగ్గుచున్న ప్రవాసులంకట్టు బొట్టును పక్కనబెట్టిన నారి పరివారంకట్టుబాట్లకు కాలి మెట్టెలకు మంగళంపాడిన వయ్యారం పసుపు తాడుకు పలుపు తాడుకు భేధంఎరుగని ఆడువారంమెచ్చిన మగనితో నచ్చిన నగల కొరకు ఆడేవారం  అత్త ఆరళ్ళను ఆడ పడుచు వత్తిళ్ళనుచేరనివ్వని నెచ్చెలులం  పండగ పబ్బాలకు తిలోదకాలిచ్చిన ఆధునిక వనితలంవింతపోకడల చెంత చేరుతున్న కాంతామణులంనడి మంత్రపు [...]
నీ వంటలు నీవి ఎవరునూ అవి మెచ్చరుగా..నీ కూరలు నీవి ఎవరికీ అవి నచ్చవుగా..పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..అపుడో ఇపుడో తప్పదులే అని తింటుందా?కన్నోడే విసుగుతొ కడుపు మండి తిడుతుంటేముసి ముసి నవ్వుతో కడుపు నిండేనని తలచావా…వంటంటే అతి సులువా నీ వంటలు ఇక మారవా….ఓ……రుచి ఉండని రూపుండని వంటల్ని వండేవువద్దన్నా  వడ్డించి హింసించి చంపేవుపగలంత పొగ రేపుతు పగబట్టి వండేవునడి [...]
పదహారాణాల వయసు ఉరవడిలోన పడుచు గుమ్మాన హరిణి అడుగిడిన తరుణాన  నింగిని చేరుకోవాలని వడివడిగా అడుగులేయక నేలనంటిఉన్న మాతృమూర్తులను విడివడక జీవితపు లయ ఎరిగి ఎక్కడ ఆగాలో ఎక్కడ ఎగరాలో తెలుసుకుంటేనేజీవితపు అర్థం పరమార్థం తెలుస్తాయి..ఇపుడిపుడే ఎదుగుతున్న నీ చిన్న మనసుకు ఈ పెద్ద మాటల అర్థం  నీ ఆశల తీరానికి చేరుకొనేలోగా తెలుస్తుంది… జీవితం సుఖమయమవుతుంది !
వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఆ రోజు మొదలునవదంపతులుగా నలుదిక్కులు మాతో నడచిన రోజులెన్నో!పంచ భూతాలా సాక్షిగా జీవిత పల్లకి ఎక్కిన ఆ రోజు మొదలుఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపించేలా వినుతించిన  రోజులెన్నో!శ్రీరస్తు శుభమస్తు అని శ్రీకారం చుట్టిన ఆ రోజు మొదలుఆలు మగలుగ తోడు నీడగా ఆనందాన్ని చవి చూసిన రోజులెన్నో!ఆణి ముత్యాలు తలంబ్రాలుగ శిరమున కరములతో తడిసిన ఆ రోజు [...]
మాయమైపొతున్నదమ్మ పాటకు పేరడీ..మాయమైపొతున్నదమ్మ మన తెలుగుదనము రాయడమేమరచె నేడు రతనాల మనతెలుగు పదము దేశ భాషలు నందు తెలుగులెస్సని పల్కి  దేశ దేశాన వెలిగె వెలుగంటితెలుగు……..”మాయమై” ఆంధ్రభోజుడి అష్ట దిగ్గజపు కవులతోఅలరించె నాటి తెలుగందం   నన్నయతిక్కన ఎర్రన రచియించి అందించెతెలుగు మహా భారతం గురజాడశ్రీ శ్రీలు ఆంధ్రీకరించిన అచ్చతెనుగు మాట అంధకారితమయ్యె  ….. [...]
కరతాళ ధ్వనులే తెరచాప రణితములై శరవేగంతో దూసుకెల్తుంటేఅనుకోలేదు ఏనాడు  విధి ఇంతలా ఆడుకుంటుందని!దాతల వదాన్యతయే దేవ దూతల ఆశిస్సులుగా దీవిస్తుంటేఅనుకోలేదు ఏనాడు  శ్రమించిన వారికి వారధి రిక్తహస్తాలు మిగిలిస్తుందని!చప్పట్లు కొట్టి శభాష్ అన్న చేతులే తెర వెనుక పావులు కదిపితేనమ్మలేదు ఏనాడు తాగిన తల్లిపాల రొమ్మునే గుద్దుతారని!ఆరమరికలు లేకుండా తన మన భేదాలు [...]
కొన్ని పూలు వాడిపోయినా అవి దేవుని సన్నిధి వీడవుకొన్ని పరిచయాలు కరిగిపోయినా వారి స్నేహ హస్తం వీడరు జీవితపు ఏదో ఒక మలుపులో వారి జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి !నేస్తమా…చిగురించిన స్నేహం చితి వరకు నీ తోడై ఉండే ప్రాణం ..అదే స్నేహశీలి తత్వం! 
కనుల ముందు కదులుతున్న ఈ పండుగ క్షణాలురేపటికి గతమయ్యే విగడియలు..పది రోజులపాటు పండుగ దినాన్ని పావనం చేసుకుంటే..పది కాలాలపాటు మదిలో పదిలపరచుకోవచ్చు తీపి జ్ఞాపకాలుగా!రేపటి తరానికి కానుకగా...! విజయ దశమి శుభాకాంక్షలతో..
జమ్మలమడుగు దొరసాని జతగా జంటగ దక్కిందివన్నె చిన్నెలాడి ఓర చూపుతొ వరుడిగ మార్చింది ……”జమ్మల”కన్నె పిల్ల కౌగిలొలోన కరిగి మరిగి పోతుంటేకారు బైకు కావాలంటు కసురుకుంటు నెట్టింది 2హయ్ ఆ పై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చిందీకారు కొనగానె ముసి ముసినవ్వుతొ షికారు పద అంది……”జమ్మల”ఇంటిలోన బోరు కొట్టి ఇంటర్నెట్టు చూసిందిటొటారము సైటులోని వడ్డాణం కోరింది  2మొగుడిగ నడ్డే [...]
కాలేజి కుర్రవాడ కులాసాగ తిరిగెటోడ..అన్న పాత పాటకు పేరడి..లాఖీడ్ మార్టిన్ అనే కంపెనిలో ప్రతి సెప్టెంబర్ మాసంలో జరిగే లయొఫ్ఫ్స్ ని డృష్టిలో ఉంచుకొని రాసిన పాట..లాకీడు చేరినోడ ఏకీడు ఎరగనోడసెప్టెంబర్ మరవబోకురో ఓ ఇంజినీరు..ఫైరింగులు మొదలవ్వునురో ఓ ఇంజినీరు…బిల్లింగులు సూపరని బిల్డింగులు టాపు అనిఎటుచూసిన తెలుగువాడు కనపడడు తెల్లవాడుబడ్జెట్టు లేదు అంటె భారమే [...]
స్వాతంత్ర్యం అంటే ఎందరో త్యాగ మూర్తుల ఫలం..ఇది నేటి మన స్వాతంత్ర్య దినోత్సవం.. కానీ ఎక్కడ వచ్చింది స్వాతంత్ర్యం.?ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం.?ఆరు దశాబ్దాలు గడచినా ఆకలిని జయించలేని భారతావనికా..?భయం గుప్పిట్లో నిత్యం  సంఘర్షించే  సామాన్యుల జీవితాలకా..?అనుక్షణం మగ మృగాల కామకేళి కిరాతకానికి బలవుతున్న అబలలకా..?ధనార్జనే ఊపిరిగా దేశ సమగ్రతను తాకట్టు పెట్టే నీచ [...]
On behalf of My manager,...who got promoted higher level in short span of time..శ్రవణానందకర కబురు చెవిన చేరగనే మది తలపుల్లో ఊపిరి పోసుకున్న చిరు కవనం !ప్రభవించిన శాంతి పుట్టి పరిఢవిల్లె NGన తన అడుగు పెట్టి ప్రతిభనంత పదును బెట్టి పయనించు నీ గమ్యంమొక్కవోని దీక్షనెట్టి లెక్క చేయకు ఏ గాయం   ప్రజ్వలించు ధృవతారలా ఆగిపోదు నీ పయనంసూక్ష్మమైన దోషమున్న పసిగట్టును నీ నయనంధృఢ చిత్తపు యోచనతో మరుగుతున్న నీ [...]
ఓ మంచి మనసున్న స్నేహితునికి కానుకగా ...పండగ లా దిగి వచ్చావు ...పాటకు అనువుగా చేసిన చిన్ని ప్రయత్నం ఈ పేరడీ ...మిర్చీ సినిమా నుండి..నచ్చితే వ్యాఖ్యానించండి..అందరిలా ఒకడై వచ్చి స్నేహానికి రూపై నిలిచి నీమనసుతొ మమ్మే గెలిచావూ..ఓ నా ఆత్మకు తోడయ్యావు నాగుండెకు గూడయ్యావు నావెంటే నీడై నిలిచావూ..దరిచేరితె ఉల్లాసం సరిజోడుగ ఉత్సాహంమనిషంటే అభిమానం మనసుల్లొ కలకాలంఇట్టాగె పదికాలలు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు