దివ్వెల దానమో పువ్వుల దానమోఅధరాలను విరబూయించే చిరునవ్వుల దానం కన్నానా?కోవెల దీపమో దేవుని రూపమోసుధలొలికించే పలుకుల అపురూపం కన్నానా?ఆరాధనలో ఆశ్వాసనలోఆస్వాదనలు పంచే ఆనందం కన్నానా?ఇహలోకాలో పరలోకాలోసహగమనం చేసే బాటల కన్నానా?✍️
ఈ పాట నేను వ్రాయగా 26-11-18 న ఆకాశవాణిలో ప్రసారమైంది.గానం- డి వి మోహనకృష్ణ మరియు బృందం. సంగీతం - కే సూర్యనారాయణ దీక్షితులు ఆకాశవాణికి కృతజ్ఞతలు.హరినారాయణ యని మనసారగా అననీయరాకరివరదా నిను శరణాగతిగా కననీయరా ॥ హరి॥సుఖసౌఖ్యమ్ముల సంతోషమ్ములనంతో ఇంతో గాంచితినయ్యాకష్టమునోర్చి ఇష్టము విడచినిష్టూరమ్ముల నొచ్చితినయ్యా నీకడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా [...]
కం.యుక్తము కానిది యెయ్యద,యుక్తము కానిదది యేదియొ, తెలుపు సరియౌశక్తినొసంగు వివేకముముక్తి నొసంగును జగతిని ముమ్మాటికినిన్.అడిగియు తెలియందగు, నీజడుపును మొగమాటమియును చప్పున విడుమా!విడుమిక యజ్ఞానమ్మునువడిగా జ్ఞానుల పదముల బట్టుము సుమ్మా!గాడిద భంగిని పనులనునేడులు గడువగ, పనితనమెంతగనున్నన్పాడియు గాదది, జ్ఞానమునేడుగడగ తెలియక నరుడెచ్చట నున్నన్.చెప్పిన శ్రద్ధగ వినిననె, [...]
ఆకాశంలో అమావాస్య నిండా నక్షత్రాలే కనిపిస్తాయి. నిజానికి అవి నక్షత్రాలు కావేమో. అక్షరాలేమో. ప్రతిరోజూ తనతో పాటు ఆడుకునే చందమామ రాలేదేంటా అని ఆలోచించి ఆలోచించి గగనసఖి వ్రాసుకున్న ఉత్తరంలోని అక్షరాలేమో. ఎక్కడ ఉన్నా కనిపించేలా, ఆకాశం అంతటా నిండేలా మనసు పరచి చెప్పుకున్న భావాలేమో. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా ఆ భావమంతా చందమామని మళ్ళీ రమ్మనే కదా! చిన్న చిర్నవ్వంత [...]
. ఈ రెండు మూడు రోజులు నిమజ్జనం, ట్రాఫిక్ జామ్ తో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఈ పదిరోజులూ పనికిమాలినవీ భరించలేక అవాయిడ్ చేసిన పాటలన్నీ గణేశుడి పేర్లతో కలుపుకొని మైకులలో వినక తప్పదు. లడ్డూల వేలం వేయడాలు చిన్న ఊళ్ళకు కూడా పాకింది. డెబ్భై వేలు ఎనభైవేలు పలుకుతుంది. అక్కడ వాడిన హారతిపళ్ళాలు ఏవీ వేలానికి అనర్హాలు కాదు. అంటే ఇలా విగ్రహాలు పెట్టి వాటికి పెట్టుబడి [...]
విరిసే కిరణమైన పూర్ణచంద్ర కరస్పర్శకుఎగసిపడకపోతే కెరటమెందుకు?ఎగసి పడి అలలై తాకే సాగర కరస్పర్శకుకరిగి జారని సైకత తీరమెందుకు?సమీరడోలలలో ఊయలూగని తీవెలెందుకు?చినుకు తాకిడికి చిగురించని తరుశాఖ ఎందుకు?పలకరింపుకు పులకరించని ఎడదలవెందుకు?
మూసిన నీ కనురెప్పలలోజ్ఞాపకాల అలల నిటుల చెక్కిట చేయి చేర్చికన్నార్పక చూస్తూన్నా.విరిసిన నీ వదనములోదాపరికపు తలపులెన్నొలెక్కించే నెపము తెల్పువిన్నాణము కంటున్నా.ఒలికిన నీ పలుకులలోతీపి గుళిక గురుతులెన్నొసొక్కించే తీరు గాంచినన్నే కోల్పోతున్నా.
కళ్ళు ఆకాశాన్ని చేరుతున్నా,కాళ్ళు అవనిని వీడజాలవు.కనిపించే ఊళ్ళనూ, కనిపించని ఒత్తిళ్ళనూదాటడమొక కల ఐనా, కలనైనా దాటేనే!చిక్కు ముళ్ళై గుచ్చుకుంటున్నా,కొన్ని ముళ్ళు విడజాలవు.  ఆరని వాకిళ్ళుగా తడిసే పక్ష్మాలలోచాటడమొక కల ఐనాకలనైనా చాటేనే!
మెరిసే గగనసుమంనను గని మురిసిన తరుణంవిరిసే నవసుమంనాకై కురిసెనె మకరందంవీచే చిరుపవనంఒంపినదెంతో సుగంధంలేచే ప్రతి కెరటంనింపెను నాలో సంరంభంతలపుల పరుపుల శయనించికొలువులు సేయగ మదినెంచిపలవరింతల కలరవమ్ములకలతనిదురలకిరవై, రెప్పలు బరువైచలియించిన మది పాడినదిదియే రాగం.
శరీరంలో ఉంటూ శరీరక్రియకు తోడ్పడేవిసృష్టిలో ఉంటూ సృష్టి లయకు తోడ్పడేవి  పంచభూతాలు అని పెద్దలు చెప్తారు.http://sanchika.com/kandamulu-pancha-bhootamulu/
మౌనాలతో పేర్చుకున్న నిశ్శబ్దపు కోటలోకిగానాలతో చేరువై వేణువొకటి అలరించిందిప్రాణాలను తోడేస్తూ ప్రాణము లను పోస్తుందిగానమాగకుండగా ఊపిరూదవలెనంటేఅధరముపై చేర్చనెంచు కరములకది అందదేగాలివాటు కొకపరిమాలలల్లి విసరుతూమేలమాడుతోంది
          ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమైందని కవులంటారు. (ఆకాశం -శబ్దం, వాయువు-స్పర్శ, అగ్ని-రూపం, జలం-రసం, భూమి - గంధం)  వీటి నిరూపణ ఏమిటో అవగాహన లేదు.                  ఎప్పుడో ఉరిమినప్పుడు తప్ప ఆకాశం నుంచి శబ్దం వినలేని చెవుడుందేమో. లేదా ఆకాశం ఏం చెప్తున్నా ఎలా చెప్తున్నా తెలుసుకొనే అవగాహన లేదేమో. ఎప్పుడూ వీడని మౌనంగా ఆకాశం కనిపిస్తూ [...]
సంపెంగ గుబాళింపులైసాయంకాలాలు సాయం వస్తుంటేఇంపైన ఇచ్చకాలతోమాయాజాలంలో చిక్కుతుంటేకంపించే మదితీవలురాయబారాలు పంపుకుంటుంటేసొంపైన బాంధవమేదోఛాయామాత్రంగా దృశ్యమౌతోంది. ✉
ఆషాఢమ్మీ ప్రథమదివసంబందు మేఘమ్మ! నేడేే, యోషాపృథ్వీ నినుగనినదే యుల్లమందెల్ల- తా సం తోషానందమ్ముల, కలతలంద్రోసి త్రుళ్ళెంగదోయీ! పాషాణమ్ముల్ కరగునటులన్ వర్షమై చేరుమోయీ! మేఘమై శబ్దజాలమై (కాళిదాసు మేఘసందేశంలో) లయమాధుర్యాన్ని వర్షించిన మందాక్రాంతము గురించి  చదివిన ఆనందంలో  ఆషాఢప్రథమదినం కాబట్టి ఈ మందాక్రాంతం వ్రాస్తున్నాను. :) ********** ఎంతైనా కాళిదాసు మందాక్రాంతంలో [...]
ఇది కొత్తగా నేను కనిపెట్టిన వంటకమేమీ కాదు, పేరును చూసి కొత్తదనుకునేరు!పేరు మాత్రం నేను పెట్టానన్నమాట.కావలసిన పదార్థాలు ----శనగపిండి -  ఒకటి (ఎంత గిన్నె వంటివన్నీ ఎవరికి వారే నిర్ణయించుకోవాలి)చక్కెర    - రెండుకొబ్బెర    - 3/4 వంతు (ఒకటి లో)నెయ్యి   - ఒకటిపాలు   - ఒకటితయారు చేసే పద్ధతి ---మొదట తాజా శనగపిండిని జల్లించుకొని బాణట్లో మంచి వాసన వచ్చేవరకూ [...]
మబ్బు పట్టినా,  ముసురు కవిసినామన్ను, మాను తడిసిపోతాయి; మొలకెత్తుతాయి.మాట విన్నా, మనసు తెలిసినామేను, మనసు మురిసిపోతాయి; పులకరిస్తాయి.ఎదురు చూపులు ఫలించిన ఆనందమేవాటికకూ , మనోవాటికకూ కూడా.నేలా నింగీ అంత దూరమున్నాచక్రభ్రమణాలు తెలిసినపుడు నేలా నింగికున్నంత దూరమున్నా అంతరంగాలు కలిసినపుడుబీటలు వారడాలు, మాటలు పడడాలూ నమ్మకాలను వమ్ము కానీవుతమకాలను కోలుపోనీవు.
సమస్య ఏమిటి?                     ప్రపంచంలో అనేక మూలల నుంచి అనేక  కొత్త సిద్ధాంతాలు, కొత్త పరికరాలు నిరంతరం కనిపెట్టబడుతూ ఉన్నాయి. వీటివలన విద్యార్థులు, జనబాహుళ్యం అధికాధికంగా ప్రయోజనం పొందుతున్నారు. వీటన్నిటిలో నేటి కాలంలో మన భారతదేశంలో జరుగుతున్న పరిశోధనలెన్ని? ఆవిష్కరణలెన్ని? దాదాపు లేనట్లే. శాటిలైట్ ప్రయోగాలలో , సాఫ్ట్ వేర్ రంగంలో [...]
మౌనాల పంజరాల్లో నుంచిఊహల రెక్కలు కట్టుకొనిపలుకు చిలుక వాలితే...'రుచి'రమే!మేఘయానాల్లో తేల్చిమధుర ధ్యానాల్లో ముంచిమమత తీరగా పలికితే...సుభగమే!కలలు తీరాలను చేరలేనికలతల అలలు ఎన్నో విరుగుతూ,ఇంకెన్నో వరుస కడుతున్నాయి.మాయా మోహాల వీడలేనితలపులు వలలు బంధనాలు గాసంకేత స్థలాలకు చేరుస్తున్నాయి.సందేశాలందే దారుల్లోసందేహాలింకే తీరుల్లోపదం కలుపుతూపదం కదపలేమా?
నలుదిక్కులనూ చుక్కలు వెలిగిస్తున్నవేళ  అలి చూపులు చిక్కులు పడుతుంటే-కొలుకులైన పలుకుల ముడులు విడుతూ- దాటి వచ్చిన చిగురాకు వాకిళ్ళ గడియలు పెడుతుంటే-   ఒలికిన శర్కర చిరుచుక్కగా-చుబుకపు పుట్టుమచ్చై పుడుతూ-  రసనాస్వాదనలో ఆవిరౌతుంటే-ఇరుల తెరలు జారగా యామినులు ఆమనులను తలపించునో!---------☺
లక్షల కొమ్మల్లో కోట్ల కాయలైపండుతున్న ప్రకృతిని నేను. ఆకలి తీరగా!లక్షల స్థానాల్లో కోట్లపాయలైపారుతున్న ప్రకృతిని నేను.దాహం తీరగా!లక్షల తీవెల్లో కోట్ల పువ్వులైవేడుకైన ప్రకృతిని నేను.మోహం మీరగా!లక్షల మనసుల్లో కోట్ల ఆశలైప్రేమనైన ప్రకృతిని నేను.స్నేహం తోడుగా!---☺
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు