తూపులుగానై సుమముల ,చూపులు తాకెనొకొ! యెదురుచూపుల వోలెన్మాపులు మలి సందెలలోరూపులు గట్టెనొ! మరులివి రోమాంచితముల్. ✍️
అంతరంగంలోలోపల అణగిపోతూ    ఊపిరి అందక చిక్కుకుపోయిన ఉద్వేగాలకు అంతులేక ఎదురయ్యే మలుపులలో దారి తప్పలేక     ఎక్కడో ఆగిపోయిన  ఆవేశాలకుఅంతరించిపోవడమే సులువనుకుంటూ      దీర్ఘారామంలో మునిగిన ఉన్మాదాలకుఅంతమయ్యే వరకూ రాకపోకలకు తప్ప     ఉనికి లేకుండా పోయిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకుఊపిరి పోశావో!చేయందించావో!అమృతం చిలకరించావో! ఆకాశమే [...]
కరమునుఁ బట్టిన గడుసరికరమున నుండిన మహత్తు కథ యేమనగాగరిమనుఁ బెంచెడు నెయ్యముస్థిరముగ నుండుటనుఁ గోరు చేతమ్మగుటే.✍️
సీ.హొయళులు మీరగ హుమ్మనుచు కలికి వేసారి వేసారి వేచియుండరయమున వచ్చునొ రాడొకొ యనుచును పూబాల యుండుండి పొలయుచుండనయముగఁ గట్టిన నమిలంచు నీలంపు చేలమ్ము సవరించి సోలుచుండలయలనుఁ దప్పుచు లలనములాడెడు సుందరి చిరుగుండె సొక్కుచుండఆ. రాక, వచ్చిపోక రభసనఁ బెట్టెడునెలత ఱేఁడు వాడు నెలకు ఱేఁడుసాకు పోక చెప్పి సరిజేయు నలకలకలల జోడు వాఁడు కలువతోడు.✍️
జల్లులు కురిసినవోయి రేయి,ఝల్లనిపించగ భువికి జడిగా కురిసినదోయి వాన,వడిగా కలవగ భువినిసవ్వడి చేసినదోయి రేయి,మువ్వల అలికిడిగాచిత్తైపోయినదోయి నేలమత్తున మునిగిన తీరుగా!
ఆ దెస నుండి యీ దెసకు నాకసముండుటదేలయన్నచోనా దెస నుండి యీ దెసకు నా శశి దాగుడు మూతలాడగానాదర భావనా గరిమ నంతట పర్విన గాత్రమై ,మనోనాదపు విందులన్ గరపు నాయిక నాయక బంధమే సుమా!✍️
మతి తప్పిన మనసుకుగురి తప్పని ఆయుధమైమౌనం గుచ్చుకుంటూందిమౌనంగా...గతి తప్పిన పలుకులుగిరి దాటిన తలపులుచేయలేని గాయాలనుమౌనమే చేస్తూందిమౌనంగా...✍️
హత యురగాంగన నైనన్, ఖతలముఁ దాకు శిఖకీలగయినైనన్, సంతతమింపగు కూరిమితోస్మితవదనగ పలకరించు చెలియను గానో! ✍️ 
దూరమునున్ననేమి మది దోచిన దొంగవులే దొరా! నినున్దూరను దేనికైననొక దోషము లేదని యూరకుందు, నీభారము నోపగా విరహ బాధల తాళగ జాలు ధీరఁ గాబీరపు బల్కులన్ పలుకు బేలను, ప్రేమగ పల్కరించినన్తీరును చింతవంతలిక తీయని మాటల జాలమందునన్.✍️ 
మరులలో మైమరుపులందం, ఔను.మతిమరుపులు....ఊహూ..  ఝరులలో సడుల సవ్వడులందం, ఔను.  బంధనాలు, నిబంధనలు ... ఊహూ..కదా, అలాగే మరి!   విరులలో గంధవిహరణలందం, ఔను.   ప్రహరీలు, ప్రహారాలు....ఊహూ..కదా, అలాగే మరి! మరులలో మైమరుపులందం, ఔను.మతిమరుపులు ....ఊహూ...✍️
వాన పరీమళమ్ములివి వానలు తీర్చిన పిమ్మటంగదామేనుననావరించుకొనె మెల్లగ మెల్లగ మెల్లమెల్లగా! కానకపోయెనే వరుణకాంతుడు వానల నిచ్చునాతడేకోనలకేగెనో! ధరణి కొమ్మయి వేచెడివేళఁ గానడే!✍️
తెలుసా నీకు?ఒక్కఘడియ ఎలానో గడిచిపోతుంది.రెండో ఘడియకల్లా మనసు మారాం చేస్తుంది.ప్రతి రెండో ఘడియకూ... ప్రతి రెండో ఘడియకూ నీ తలపుల్లో మునకలేయకపోతే ఒడ్డున పడ్డ మీనమే అవుతుంది.ఇంకేమీ కాకపోతే నీ పేరు పలికే గుండెచప్పుడైనా వినాలంటుంది బయటి అన్ని సద్దులను ఆపేస్తూ..ఏకాంతంలో తనలో తననే వెదుక్కుంటూ..✍️
కాసారమ్మును, పూవు వైచి యలనై కంపించగా చూచితే! బాసాడింపుల వాయువై, నిలువునన్  కంపింపగా వీచితే! వేసారించుట చాలు చాలు, యిలపై వేంచేయగా నెంచుమా! వాసాగారము శోభపెంపుఁ గనగా వర్షించుమా మేఘమా! ✍️
మఖమలు వస్త్రముఁ దోపెడుసుఖకర స్పర్శ కలుగంగ చొక్కపు నుడులన్సఖుడలరించెడు వేళలముఖమున దోరనగవు నగ ముచ్చటఁ గూర్చున్.మధుమకరందముఁ గ్రోలగమధుపము కుసుమమునుఁ గూడ మధురస నాదమ్మధరము పైగొని చేరినవిధమహొ, మోహముఁ గలిగెను విరి మది లోనన్.✍️
నిలుమిట యంచు చెప్పగనె నిల్చు సశక్త మనమ్మయున్, సదా సులువుగ నిచ్ఛఁ గట్టగల చొక్కనియంత్రణ సొంతమయ్యు ,నాచెలిమిని వీడజాలగల చిత్తపు దార్ఢ్యము లేకపోయెనే! పలువిధ భంగపాటులను బాధలనోర్చగ తప్పకుండెనే!కలకలమింతయంతయని గట్టిగ లెక్కలు చెప్పజాల, నేవిలవిలలాడుచున్న పరి వేడుకఁ గాంచుచు నుంటివే, కటా! యెలనగవొప్ప రమ్మనెడు యింతి నుపేక్షల పాలుజేయుటే? కలువలరాయుడౌర! యెటు కల్లయె నీదు [...]
                     భారతదేశం పక్కదేశాలపైన దండెత్తదంటూ మన భుజం మనమే చరచుకోవడం గొప్పలకు బానే ఉంటుంది, అది నిజంగా ఎంతవరకు నిజం? అవతలి దేశపు బలహీనతలను దురుపయోగం చేసుకోకుండా ఉండగల స్వభావం, సత్ప్రవర్తన మనకు ఎంతవరకు ఉన్నాయో, ఆకాలం విషయాలు పక్కన బెట్టి సమకాలీన పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామో [...]
ఉత్పలమాలచీకటి చిక్కనై వెలుగు చేరని దారుల వేసటంది, నాకేకకు రాక యే బదులు కృంగిన వేళల, నేమి పల్క పాల్బోక, కడుంగడేనలసి, పొంది నిరాశల మాటికిన్, సఖా! రాక వెలుంగు తప్పదని, రమ్మనిఁ బిల్వగ నవ్వుకుందువో!చేత ధరించి నిల్చితిని చెల్వపుదీ పువుదండనొక్కటిన్,ద్యోతకమౌను రూపనుచు దుష్కరమౌ విరహమ్ము సొక్కుచున్!పూతనువంత వాడకనె ముంగిట వాలగ తీరదో! సదాయాతన లోన నుంచుదువె యక్కర సుంతయు [...]
కనుచినుకులోమారూసిరినగవులోమారూజలజలాకలకలాదొరలి పోతున్నాయిగురుతుల దారుల్లోనీ దరి చేరదామని కాబోలునిండు చీకట్లూపండువెన్నెల్లూముసిరినావిరిసినాఆకాశానివే కదాసరిగ్గా అలాగే మరి.✍️
నాయకుడు నాయికతో అంటున్నాడు -దీపాల వేళకు రావోయీ! మలిసంజె వేళకు రావోయీ!సంకేతస్థలిని మరువకుమా! నా ప్రేమను మరువకుమా!నా కనురెప్పల దారులు సిద్ధం చేస్తానునీ కోసం వేచి చూస్తానునా రాగాంజనమును నీ కనులనలదుకొని  ॥దీపాల వేళకు॥ తొలిగా కలిసిన చోటుననేజతగా నడిచిన బాటలనేఆశల నదీ తీరమునా ఆకాంక్షల తరుచ్ఛాయలకే  ॥దీపాల వేళకు॥ఇరుసంజెల కలయిక వాడుకగారహి తారలు వెలుగుట [...]
ఏకాంతమంతా ఏటిపాలవగాఏనాటి కొచ్చేవు ఏలుకొనగా?ఏ వూరికేగినా ఏ దిక్కునున్నాఎన్నెల్లు కురువగా ఎదురేది నీకు?ఏ చోటనున్నా ఏ దవ్వునున్నాఎగిరి రావాలంటె ఎదురేది నీకు?ఏకాంతమంతా ఏటిపాలవగాఏనాటికొచ్చేవు ఏలుకొనగా?ఏ చల్ల గాలైన ఏ కాలమైనాఏడెక్కజేయంగ ఎదురేది మనకు?ఏ మత్తు మందైన ఏ పాటిదోయీ,ఏ మర్మమేదీ ఎదురేది మనకు?ఏకాంతమంతా ఏటిపాలవగాఏనాటికొచ్చేవు ఏలుకొనగా?ఏ పనులు ఉన్నా ఏ [...]
మదిలోపలి లోతులలో సుడులు తిరిగే వేదనకనుల చివరి దారులలో సుడులు తిరిగే వేదనకపోలాల తిన్నెలు దాటి ఎదను తాకే వేదననోరు తెరిచి చెప్పలేని అంతులేని వేదననూక చెల్లే రోజు ఎపుడని తెలియరాని వేదనభూమి పైన బుగ్గి అయ్యే రోజు కోసం వేదననిలువనీని నిక్కమెఱుగని నీడవోలె వేదనశిక్ష ఏలనొ కక్ష ఎందుకొ అడగరాని వేదనఅగ్ని వోలె కాల్చివేసీ ఆరలేదీ వేదనతప్తమైనా మిగిలి ఉన్న తాపమీ వేదనఆశలేవీ [...]
                                                                నిన్న సంధ్యవేళలో                      మబ్బుల మీద ప్రయాణిస్తుండగా                        ఓ క్షణం ఆ గగనానికీ, నాకూ సామ్యం [...]
సీస పద్యములు, ఆటవెలదులుఐదు -శరత్కాలచంద్రకల్హారము 🙂శరత్కాల చంద్రకల్హారము౧.సీ.  నిసిరేయి గగనాన నెలవంక నావంకకడఁగంట నోమారు కనులు కలుపనతగాని కనుజూపు నయ్యదే మరుతూపుకుముదమ్ము లింకేమి కోరగలవు?శశికాంత నయి నాదు చలువల్ల నొకయింతపెరుగంగ నతగాని ప్రీతియందుమనసార విరిసేటి మదిలోన మురిసేటిపులకింత కలిగించె పొలతియందుఆ.   ఋతువులందు మేటి రేయి వెన్నెలలకుశారదంపు మెఱుగు చల్ల [...]
చుక్కల వెనుక అక్షరమైనట్టి ఆకాశం కనిపిస్తుంది.
అల్ల దూరసీమ నబ్బురపఱచేటిచల్లనైన వాడ చక్కనోడ!చేతికందకున్న చింత యేమిటికి?చనువు వీడనేల చందమామ?నోరు విప్పకుండ నూటొక్క మాటలనొకరు చెప్పుచుండ నొకరు వినగకాలమెంతొ గడచి కమనీయమగురీతిబంధనమ్ము గాని బంధమమరె.లోకమేమి గొప్ప లోలోన నొకరుంటె అధరమందు హాసమందగించుసంతసమ్ము మీర సాగుచుంటిమోయి!సంగతమునఁ గలదు సకల సుఖము.కోపమిపుడు విడచి కూరిమిఁ గనుగొనసంబరములు చేరు నంబరములు!పలుకు పనస [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు