మాయని వసంతమిదిఇట పూయని లతాంతమేది!     తీయని మధుచంద్రికలివిఎడబాయని తడబాటున్నది.      వ్రాయనిదొక కావ్యమిదిఎలప్రాయపు పలు నవ్యతలున్నవి.------✍️
కర్కశమానసులకు, కటు మర్కట బుద్ధులకు కఠిన మరణము విధిగా నర్కుని యుదయము లోపల తర్కములాడక విధింప తామసమేలా? ధర్మపు మార్గమున్ విడచి తామసబుద్ధిఁ బ్రజాళినిట్టులే మర్మమెఱుంగజాలరని, మాయల నుచ్చుల వ్రేల్చునట్టి దు ష్కర్మలఁ జేయగాఁ దలచు క్రౌర్యముఁ జూపెడు వారి,నట్టులే దుర్మతితోడఁ గాదనని దుష్టులనెప్పుడు నోర్వబోకుమా! కిలకిల నవ్వుతో, పలుకు కీరముఁ బోలెడు బాలలిద్ధరన్ పలువుర [...]
చీకటి అలల్లో వెన్నెల తరగలానీలిజలధిలో ముత్యపుమెరుగులామనసు పొరల్లోలోపలి అరల్లోనిక్షిప్తమైన నిధివైజీవం పోసిన రాగసుధవైఉండిపో స్మృతిసౌందర్యమా!----లక్ష్మీదేవి. 
ఇది కన్నడ ప్రాంతాల వైపు చాలా పాతకాలపు ప్రసిద్ధమైన తీపిపదార్థము. వీటిల్లో కొద్ది కొద్ది తేడాలతో డీప్ ఫ్రై లేదా  రోస్ట్ విధానాల్లో రెండు మూడు రూపాల్లో చేయవచ్చును. సాధారణంగా మునుపు పెండ్లిండ్లలో ఇటువంటి ఘనమైన తీపి రకాలు చేస్తుండేవారు.కొద్ది పరిమాణంలో ఇంట్లో చేసుకొన డానికి తగిన పేణీల గురించి ఇప్పుడు చూద్దాం.పేణీ రవ - దీనిని చిరోటీ రవ , భక్ష్యాల రవ అన్న పేర్లతో కూడా [...]
కనుగవ మూసిన కలల జాతరలు!కలరవముల కలవర పరిచే సందడులు!మనముల విడనను మోహములు,మనుటను వీడని దేహములు.ఫలముల కోరని సేద్యములు,చలనము తెలియని పయనములు!
వెన్నెల నగవుల ఏ విలాసాలో, వన్నెలు చిలికిననే సరాగాలు.కన్నుల దాగిన ఏ సల్లాపాలో, చిన్నెలు చదివిననే ఉల్లాసాలు.అన్నున కురువగా ఏ పదాల జాలోమిన్నులు దాటునవే ఆనందాలు.--------లక్ష్మీదేవి.
పలుకుల ముత్యములెప్పుడుజలజల రాలునొ, కరగని చనువులతోడన్! చెలిమిని మొగమాటమ్ములుతొలగుటలెన్నడొ కరుగుట దూరములెపుడో! పరిపరి మూసిన కన్నులనరుగుటదేలనొ యొకపరి యనువుగ కనులన్తెరచిన వేళల కుదురుగనరుదెంచగ రాదొ! తపన నరయగ రాదో! ----లక్ష్మీదేవి.
     మొదట శాస్త్రీయంగా ఆలోచించి మొదలుపెట్టబడినా, కాలక్రమంలో అర్థం ఉద్దేశ్యం తెలియకుండా తరతరాలూ ఆచరించడంలో చాదస్తాలుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చదువులో కూడా ఏది ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియకుండా బోలెడు సబ్జెక్ట్ లు ఉంటున్నాయి. పిల్లలకు ఇదీ ఈనాడు చాదస్తమూ, మూఢనమ్మకంలాగే అయిపోయింది.:)అర్థం లేని చదువు వ్యర్థము అన్నట్టు మొక్కుబడిగా ఆచరించి ఇలా [...]
                                          విద్యావికాసం(ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారిచ్చిన ఒక అంశం మీద ఫిబ్రవరి 26 నాడు ప్రసారమైన నా ప్రసంగ పాఠం)                   ఇతర ప్రాణులనుంచి  భిన్నంగా నిలబెట్టేదీ, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసికెళ్ళేదీ ఒకటి ఉంది- అది ఆలోచనా భాండాగారం  మానవజాతికి గల గొప్పలక్షణం. దీనిని సక్రమమైన మార్గంలో [...]
ఈ ఉగాది కి కొత్తగా మొదలైన సంచిక పత్రిక లో వచ్చిన నా వ్యాసం-http://sanchika.com/kavi-hrudayam-lo-vaisvika-spruha/
గుండెసడి వినవచ్చే నీరవాలూఆరావాలు వినరాని సందోహాలూశ్రవణానంద తీర్థాలు వెదికే ఎడారులేమెత్తని హృదయ తల్పాలూవెచ్చని వేదనాశ్రు తర్పణాలూతలపుల పన్నీటి గంధాలచూపుల చిలకరింపులూఆ చిత్త చోరునికంకితాలే.
                  మనదేశం శాంతికాముక దేశం అని చెప్పడంలో ఉద్దేశ్యం ఇతరదేశాలపై దురాక్రమణ చేసే ఉద్దేశ్యాలు లేవనే గాని ఆవేశకావేషాలు లేనిదని కాదు. ఎప్పుడూ చైతన్యవంతమైన సమాజమే మనది. తను దాడి చేయదు కాబట్టి ఇతరదేశాల దాడిని ఊహించకుండా ఉండి పోయి తీరా ఆ సమయానికి ఉలిక్కి పడే సామాన్య నర/నారీ లక్షణం వంటిదే ఇక్కడా జరిగింది.            ముఖ్యంగా [...]
                  నాగాలాండ్ లో ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం మొదలైనవి కావాలని, ఇండో నాగా ఒప్పందం అమలు జరగాలని అక్కడి కొన్ని నాగాల బృందాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నదే. దాదాపు అక్కడి పార్టీలేవైనా  ప్రాంతీయభావోద్వేగాలకు వ్యతిరేకంగా నడచుకోవడం దాదాపు అసాధ్యమే. కానీ ఇన్నేండ్లనుంచీ ఉంటున్న ఈ భావాలు అక్కడి పరిస్థితులలో ప్రత్యక్షంగా [...]
           నోట్ల రద్దు ఆకస్మికంగా ప్రకటించడం వల్ల అక్రమంగా దాచుకున్న కోట్లాది రూపాయలు పనికిరాకుండా పోవడం అన్నది దేశానికి ఉపయోగకరమైన విషయం. వీటివల్ల అనేక అసాంఘిక కార్యకలాపాలకు కనీసం తాత్కాలికంగా ఆటంకం కలిగించినట్లైంది. సక్రమ సంపాదనలోనూ పన్ను కట్టకుండానో లేక చెల్లింపులు చేయకుండానో దాచుకున్న సొమ్ము చాలావరకూ పన్నులు, చెల్లింపుల రూపాల్లో ఆయా [...]
                     సూర్యోదయం ఎక్కడ చూసినా ఎంతో అందంగానే ఉంటుంది. కానీ నంది గిరిధామం (సాధారణంగా 'సొంత'భాషలో అందరూ నందీహిల్స్ అంటుంటారు.) లో సూర్యోదయం పర్యాటకులకు ప్రత్యేకం.           దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున్న కొండమీదికి పొద్దున్న ఐదుగంటలకు కారు చేరేసరికే, అక్కడ ఇంకో ఏడెనిమిది కార్లు, అంతే సంఖ్యలో బైక్ లలో సూర్యోదయాన్ని [...]
అల్లి బిల్లి భావవల్లిమైత్రీలతఎండానీడలు        ఆశాపాశాలు                 మోహామోహాలుజీవనం                                               ఆత్మవిశ్వాస ఊనికలు                                  ఒక పూవనం!
అనుభూతి ఒకటేదోతొలకరి చినుకల్లేమమతల జల్లైఅక్షరమై ఒలికేనోమట్టిని మరువమల్లేమనసును మురిపెంగా చేసేనోధాన్యపు మొలకలల్లేధ్యానపు పులకలనుపెంచేనో పంచేనో...
పండు మిరప ఎఱుపు, ఆపై నారింజ రంగు,అటు వెనుక పసిమి వెలుగులు పసుపు, ఇంద్రధనుస్సుల రంగులన్నీ నింగిలోవెలిగిపోయీ,కరిగి పోయీ,కలిసి పోతూదివినీ భువినీ నింపుతున్న తెల్లని వెలుగుశ్వేతాంబరంలాఏ రంగూ కాకపోయినాఎందుకంత అందమైనది?ఆ లోపల లోలోపలఆ రాగ రాజితాలునిక్షిప్తమైన వేడుకకనులకు కట్టినట్లుమనసును చుట్టినట్లుకానరాగాఎగసిపడే అలలు దాటినడిసంద్రపు నిరామయమైనది కనుక.--------లక్ష్మీ [...]
            వాస్తునిర్మాణంలో ఈశాన్య ప్రాధాన్యత తో పోలుస్తూ, గౌ. ప్రధాని చమత్కరించినా,ఈ నలభై యాభై ఏళ్ళ కాలంలో ఈశాన్య రాజ్యాలలో దేశసమగ్రత పరంగా బలమైన స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వాలు లేకపోవడం వల్ల దేశమంతటిపై ప్రభావం చూపే విధంగా ప్రక్కనున్న చైనా దురాలోచనలు మనందరమూ చూస్తూనే ఉన్నాము. దేశానికి పశ్చిమంగా ఏర్పడిన పాకిస్తాన్ కవ్వింపులు ఒక ప్రక్కనుండగా [...]
సంగోష్ఠి పై నివేదిక ఈ మాట పత్రికలో ప్రచురింపబడింది.వీటిలో నాకు తెలిసినంత మేరకు సంస్కృత శ్లోకాలకు భావం వ్రాశాను.కొన్నిటికి వాటిలోని టాపిక్ చెప్పి ఊరుకున్నాను.తెలిసిన వారు చెప్తే సంతోషమ్.http://eemaata.com/em/issues/201803/15214.html
కడలి నీలాలూ,తరువు పచ్చలూ,సంధ్యల పగడాలూ, గగన మరకతాలూ,పువ్వుల పుష్యరాగాలూ,నవ్వుల ముత్యాలూ,గోధూళి గోమేధికాలూ,చిగుళ్ళ కెంపులూ,మంచి మనసుల వజ్రాలూ,అనుభూతుల వైఢూర్యాలూ,విశ్వంభరునికే అలంకారాలై భాసిల్లే అసలైన నవరత్నాలు!
ఏల్చూరి మురళీధరరావు గారి పోస్ట్ --- వారికి కృతజ్ఞతలతో...ఈనాటి సుప్రభాత వేళ శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి అజ చరిత్రమును చదువుతున్నప్పుడు అవతారికలో ఈ స్తుతి కనబడింది. దైవదత్తమైన ఆ మహాపాండితికి, అపూర్వమైన ఆ కల్పనాశిల్పశోభకు, అపారమైన ఆ భక్తిపారమ్యానికి ఆశ్చర్యాతిశయం కలిగింది. ఇంతటి గాఢబంధంతోనూ, గంభీరమైన భావసంపుటితోనూ రచితమైన సరస్వతీ సంప్రార్థన ఇంకొకటి [...]
పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, ఆవాలు&మెంతుల పొడి, ఒక తిరగవాత. ఇంకేం?వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుంటే ఆహాఁ.. అనకుండా ఉండలేనిది కొరివికారమే.ఎఱ్ఱటి పండు మిరపకాయలు ఏమాత్రం కారం ఉండవు. రుచిగా ఉంటాయి.(ఫోటోలు మరీ క్లోజప్ లో తీసినట్టున్నాను.😛) పావు కేజీ పండుమిరపకాయలు కాస్సేపు నూనెలో మగ్గనిచ్చి, ఒక పిడికెడు (అందాజుగా) చింతపండు వాటిలో ఉంచేసి కాస్సేపు చల్లారనిచ్చి, [...]
చివరి పాదము సమస్యగా నేను చేసిన పూరణము- చక్కటి భావధారయును, శబ్దపు మాధురితోడ నింపుగా,పెక్కు సుభాషితమ్ములకు పేరిమి నిచ్చెడు అర్థ సంపదన్,మిక్కిలి నేర్చు పెద్దలును మెచ్చగ వ్రాయుము. ప్రాసకై సదాలెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖమెంతమాత్రమున్. ----లక్ష్మీదేవి.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు