ఇది అలనాటి మాయాబజార్ సినిమాలో ఒక అందమైన సన్నివేశం. ఇక్కడ రచయిత పెండ్యాల నాగేంద్రరావు గారు హిడింబ చేత "అలమలం" అనిపిస్తారు. ఈ మాట విండానికి నవ్వుతెప్పించేటట్టుగా ఉండి, అదేదో అర్ధంలేని మాటగానో లేదా అర్ధంకాని ఆటవిక పదజాలం గానో పొరపడే ప్రమాదముంది. నిజానికి ఇది ఎంతో అందమైన సంస్కృతపదం. అలం అంటే సంస్కృతంలో "చాలు" అని అర్ధం. అలమలం అంటే "చాలుచాలు" అని అర్ధమన్నమాట. ఇప్పుడీ [...]
మనలో చాలా మంది “యథారాజా తథా ప్రజాః” అనే నానుడి విని ఉంటాం. అయితే ఇది ఒక మంచి సంస్కృత నీతి శ్లోకంలో చివరి అర్ధభాగమని ఎంతోమందికి తెలియక పోవచ్చు. ఇదిగో మరి ఆ శ్లోకం.రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః, పాపేపాపా-స్సమే సమాః ।లోకాస్త మనువర్తంతే, యథారాజా తథాప్రజాః ।।రాజు ధర్మంగా నడుచుకుంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజు పాపి అయితే ప్రజలూ పాపప్పనులే చేస్తారు. రాజు పాపపుణ్యాలు [...]
కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారుండేవారట, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈయన పద్యాలు మంచి సరదాగానూ, తెలివిగానూ చెప్పేవారు. సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.ముందు చెప్పినట్టు [...]
ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడాబ్రాహ్మడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడకదీనుల జంపక దేశంబు నొంపక -- [...]
మానాన్న నిర్దోషని బల్లగుద్ది ఋజువుచేసి,బూచాడమ్మా బూచాడని బడిపంతుల్నే మురిపించి,పదహారేళ్ళ వయసులో సిరిమల్లె పువ్వుగావిరిసి, పంటచేనులో పాలకంకిలా నవ్వి,వేటగాడితో ఆకుచాటుపిందెగా దోబూచులాడి,జాబిలితో చెప్తానని బెదిరించి, పరుగెత్తించి,బుర్రిపాలెం బుల్లోడిని ఘరానాదొంగ చేసి,కార్తీకదీపపు వెలుతుర్లో గోరింక పిలిస్తేముద్దుల చిలకమ్మగా ఓయని పలికి,హిమ్మతువాలాని [...]
C/o Kancharapalem చూసేరా? బాగుంది కదూ! ఇంకా చూడలేదా! ఐతే వెంటనే వెళ్ళి చూసెయ్యండి. మిగతా తెలుగు సినిమాలలాగా గందరగోళమైన పాటలూ, తొంభై శాతం బట్లరింగ్లీషూ, మిగతా పదిశాతం మహమూద్ హిందీతో కలిసిన తెలుగుతో నాటకఫక్కీలో చెప్పే మాటలూ, ఇవేమీ లేకుండా, మామూలు మనుషులతో మన చుట్టుపక్కల జరిగే విషయాలతో కథనల్లి దాన్ని సినిమాగా చూపించేరు. ఇందులో అనవసరమైన అలౌకిక దెబ్బలాటల్లేవు. చెత్త ఇంగ్లీషుతో [...]
తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితుడైన మాటల రచయిత, దర్శకుడు, తెలుగంటే ప్రత్యేకమైన అభిమానమున్నవాడూ అయిన త్రివిక్రమ శ్రీనివాస్ (త్రివిక్రమ్) కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక సభలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, సాహిత్య విలువలున్న పాటలకి అంతగా అవకాశం లేని ఉత్త వ్యాపారాత్మకమైన తెలుగు సినిమాలలో కూడా తన సాహిత్య భరిత కవిత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తారో [...]
అవలోకనమంటే చూడడం. ప్రత్యేకించి వెనక్కి లేదా క్రిందకి చూడ్డం.  దీనికి వ్యతిరేక పదం ఆలోకనం. అంటే ముందుచూపన్నమాట. సింహం తనదారిలో నడుస్తూ మధ్యలో ఆగి ఒక్కసారి అలా వెనక్కి చూస్తుంది. తనకి సంబంధించని వాళ్ళెవరైనా తనని రహస్యంగా అనుసరిస్తున్నారా, తనువెళ్లే దారి సరైనదేనా, ఇలాటి కారణాలవల్ల. అలాగే మనుష్యులు కూడా తామేదైనా చదవడమో , వ్రాయడమో, బొమ్మ గీయడమో, శిల్పం చెక్కడమో, లేదా [...]
పుస్తకం వనితా విత్తం, పరహస్తగతం గతం |అథవా పునరాయాతి, జీర్ణం భ్రష్టా చ ఖణ్డశః ||పుస్తకం, ఆడమనిషి, డబ్బు. ఇవి మూడూ ఒకసారి చేతులు మారితే మళ్ళీ రావు. ఒకవేళ వచ్చినా, పుస్తకమైతే చిరిగిపోయో, ముడతలు పడిపోయో, అనేకరకాలుగా జీర్ణమైపోయి వస్తుంది. మరి ఆడపిల్లైతే భ్రష్టు పట్టి వస్తుంది. ఇది ప్రస్తుత కాలానికి పూర్తిగా వర్తించదు. పాతరోజుల్లో కన్యాదానం చేసిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు [...]
ఒక అవధానికీ, ప్రవచనకర్తకీ చాలా తేడా ఉంటుంది. అవధానిగారు వేదికనెక్కి ఆయన ప్రజ్ఞనీ, ధారణ శక్తినీ బాగా ప్రదర్శిస్తూంటే పదిమందీ బాగుందనుకుంటారు. అప్పుడు ఆ పండితుడు చేసేది కేవలం కళాత్మకమైన భాషానైపుణ్య ప్రదర్శనమే తప్ప సమాజం, సంస్కృతి, దైవం, వేదాంతం మొదలైన విషయాల మీద ప్రసంగించటంగానీ (విషయాల్ని విడమర్చి చెప్పడం) ప్రవచించడంగానీ (మంచిమాట) చేయటం లేదు. ఇలాంటి అవధానం చేసే [...]
ఇది జరిగి అప్పుడే కొంతకాలమైంది. చాగంటి కోటేశ్వరరావుగారు అందరికీ తెలిసిన మంచి ప్రవచన కర్త. ఆయన పదిమంది మంచికోరి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం తన తృప్తికోసం తనకి తెలిసిన పౌరాణిక, ధార్మిక విషయాలని వాటి వెనుక నిగూఢంగా ఉన్న తత్త్వార్థంతో సహా మామూలు మనుషులకర్థమయ్యే భాషలో విడమర్చి చెప్తూ తనకి తెలియకుండానే ఎంతోమందికి మార్గదర్శకులైన మంచిమనిషి. అలాంటి చాగంటిగారు ఆ మధ్య [...]
శంకరా నాదశరీరా పరాశంకరాభరణం సినిమా గురించి తెలియనివాళ్ళూ, కనీసం అందులోని పాటలు విననివాళ్ళూ తెలుగువాళ్ళలో ఉండరేమో. సుమారు 38 సంవత్సరాల క్రితం, 1980 ఫిబ్రవరి 2వ తేదీ న విడుదలై, అప్పట్లో వచ్చే సినిమాకథలకి పూర్తి విరుద్ధంగా, సాంప్రదాయ సంగీతసాహిత్యాలకి సంబంధించిన కథతో వచ్చి, దేశాన్ని ఒక్క ఊపు ఊపి, గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి అస్తిత్వాన్నీ, దర్శకుడు విశ్వనాథ్ కి [...]
కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారు. ఈయన కాలం క్రీ.శ. 1430 - 1530 ల మధ్య. ఈయన సులువుగా అర్థం చేసుకునేలా  ఉండే మామూలు తెలుగుమాటలతో, మంచి చమత్కారంగానూ, సమయస్ఫూర్తి తోనూ పద్యాలు చెప్పేవారు.సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన [...]
శ్రీవాణిగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యేలోకానాం స్థితి మావహంత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాంతే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంథరా శ్శ్రేయశే ||పై శ్లోకం నన్నయగారు తెలుగించిన ఆంధ్రభారతం, ఆదిపర్వంలో మొదటిది. ఇది ఒక మంగళశ్లోకం. మొత్తం సంస్కృతమే. భారతం తెలుగులో వ్రాస్తానని మొదలు పెట్టడమే సంస్కృతంలో అవడం కొంత [...]
దేవకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |మనుష్య-కృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |పితృకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |ఆత్మకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |అన్యకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |అస్మత్‍కృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |యద్దివా చ నక్తం చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |యథ్స్వపన్తశ్చ జాగ్రతశ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |యథ్సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా [...]
केयूराणि न भूषयन्ति पुरुषं हाराः न चन्द्रोज्वला: न स्नानम् न विलेपनम् न कुसुमं नालंकृताः मूर्धजाः |वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणम् भूषणम् ||కేయూరాణి  న భూషయన్తి పురుషం, హారాః న చన్ద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం, నాలంకృతాః మూర్ధజా | వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృతా ధార్యతే క్షీయన్తే ఖలు భూషణాని సతతం, [...]
Andame Anandam - Anandame Jeevita Makarandamఅందమె ఆనందం ఆనందమె జీవిత మకరందంఇది February 6th, 1953 లో విడుదలైన బ్రతుకు తెరువు అనే సినిమాకి సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూ||) రచించిన పాట. ఈ పాట సినిమాలో ఒకసారి  స్వీయ స్వర రచనలో ఘంటసాల పాడితే  మరొకసారి పి.లీల పాడుతుంది. బ్రతుకుతెరువు సినిమాకి స్ఫూర్తి 1951 లో విడుదలైన  A Place in the Sun అనే హాలీవుడ్‌ [...]
అష్టావధానం -- ఒక పరిచయం Ashtavadhanam - An [...]
 A while ago, on November 20st of 2010, I had an interesting discussion with some of my fellow Indian-American(mostly Telugu) friends. In those days, we would meet at Shaun Udall Park in Tucson on every Saturday, just to socialize. One of the main attractions, for men and children on these meets was, playing Volleyball. Of course, these weekly meets have now stopped because of lack of interest among the community.On one such Saturday, we had to buy a volleyball from Wal-mart for a price of eighteen dollars. One gentleman looked at the ball’s nametag, and noticed that it was made in China. Then he started berating America’s pricing imbalance and wondered why American goods are so expensive that we all have to buy stuff that’s made in China. Though I didn’t say anything to him at that time, here are my thoughts in this regard.In America, the person who made this volleyball, makes a living that is very much comparable to the person who bought it in the store, as [...]
King George V 1911 లో సతీ(Queen Mary) సమేతంగా భారతదేశానికి వచ్చినప్పుడుచక్రవర్తి వచ్చాడు కదాఅని అధికారులూ, అనధికారులూ,మంత్రులూ, సామంతులూ, సంస్థానాధీశులూ,ఇంకా ఇతరులూ చాలాహడావిడి చేశారు. ఆస్పత్రులుకట్టించారు. (ఉదా: KGH Hospital, Vizag), వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించేరు. ఇంతహడావిడి జరుగుతూంటే కవులూరుకుంటారా!అసలే మన సాంప్రదాయంలోరాజంటే స్వయంగా విష్ణువుకూడానూ. వాళ్ళూ కవితలల్లేరు.కావ్యాలు [...]
ఉలిపికట్టె: తెలుగుసామెతల్లో ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరోదారి అనేదుంది. ఈ మాటకు ఉలిపికట్టె, ఉలిపిగొట్టు, ఉలిపిరిగొట్టు అనే రూపాంతరాలున్నాయి. ఈ పదం చివరి కట్టె మొండికట్టె, కష్టాలన్నీ ఈ కట్టెతోగాని పోవు వగైరా పదబంధాల్లో వాక్యాల్లో వినిపించే శరీరార్ధకమైన పదమేగాని కేవలం కర్ర అనే అర్థమిచ్చేదికాదు. శరీరాన్ని కట్టెతో పోల్చి, కట్టెగా భావించి చెప్పేమాటలివి. [...]
పద్యం:కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదోకైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓహాటకగర్భురాణి! నిను ఆకటికై కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ.టీక:కాటుక కంటినీరు = కాటుక కళ్ళలోనుండి నీరుచనుకట్టు పయింబడ = చనులమీద పడునట్లుయేల ఏడ్చెదో = ఎందుకేడుస్తావమ్మా,కైటభ దైత్య మర్దనుని = కైతభ రాక్షసుని చంపినవాని కోడలాఓ మదంబ = ఓ నా తల్లీ,ఓ [...]
1. రుక్మిణి: విదర్భరాజు భీష్మకుని కూతురు. వాళ్ళ అన్న రుక్మిని ఎదిరించి కృష్ణుణ్ణి పెళ్ళాడింది. 2. జాంబవతి: జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకున్నాడు. ఆమె పేరే జాంబవతి. కృష్ణుడు సత్రాజిత్తు పోగొట్టుకున్న శమంతకమణిని వెతికితెచ్చే ప్రయత్నంలో జాంబవంతునితో యుద్ధంచేసి గెలిచిన తర్వాత పెళ్ళాడినావిడ. 3. సత్యభామ: సత్రాజిత్తు కూతురు. కృష్ణుణ్ణి అపనిందలకి [...]
అ --> aఆ --> Aఇ --> iఈ --> Iఉ --> uఊ --> Uఋ --> Rౠ --> RUఎ --> eఏ --> Eఐ --> aiఒ --> oఓ --> Oఔ --> auఅం --> aMఅః --> a@hక(ka) ఖ(Ka) గ(ga) ఘ(Ga) ఙ (~m)చ(ch) ఛ(Ch) జ (ja) ఝ (Ja) ఞ (~n)త (ta) థ(tha) , ద (da) ధ(dha), న (na)ట(Ta) ఠ(Th) డ(Da) ఢ(Dh) ణ(N)ప (pa) ఫ(Pa) బ(ba) భ(Ba) మ (ma)య (ya) ర(ra) ల(la) వ(va) శ(S) ష(sh) స(sa) హ(ha) ఱ(~r)Special letters in Teluguanta@hpuram అంతఃపురంవిసర్గ @hj~nAnamu జ్ఞానము~n ఞ్~m ఙ్~ra ఱr"a ఱఅరసున్న ఁk@m కఁ
ఇది నా మొదటి బ్లాగు. ఎప్పటినుంచో ఏదో వ్రాద్దామని అనుకోడమేగాని వ్రాసిందేమీలేదు. ఓం ప్రథమంగా ఇప్పటికి తీరింది. నాకు పుస్తకాలు చదవడమన్నా, చదివినది మరొకరికి టూకీగా వివరించడమన్నా మహా సరదా. ఐతే, ఈమథ్య నా శ్రీమతికి తీరిక తక్కువై, నాకున్న ఒక్క శ్రోతా నాకు అందుబాటులో లేకుండా పోయింది. ఇక బ్లాగు వ్రాయడం తప్పనిసరైంది. ఎవరూ చదవకపోయినా, కనీసం వ్రాసేననే తృప్తి మిగులుతుంది. ఒకవేళ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు