నేను శివ ని (నవల)Post no:24పార్ట్-3, యామిని వైపు నుంచిచాప్టర్ 7ఆగస్ట్ 19,2013మళ్ళీ మేము ఇద్దరం గోవా కి వచ్చాము.మధుర క్షణాలు ప్రోది చేసుకోవడానికి.ఇది నేను వరుణ్ కోసం బాకీ ఉన్నదే.వరుణ్ తో ఇక నా రోజులు ముగిసినట్లే అనుకున్నాను.భగ్న హృదయిని గా మిగలాలని ఉన్నదేమో అనుకున్నాను.వరుణ్ తో నా జీవితం ఎలా ఉండాలి అనేది ఈ సారి అనుభవం తో తేలిపోతుంది.ఇంకా ఎక్కువ పొరబాట్లని భరించే ఇది నాకు [...]
నేను శివ ని (నవల) Post no:23"ఓ.కె రాం...ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రద్ధ గా విను.చాలా గొప్ప విషయం ఇది" వరుణ్ గంజాయి పొగ వదులుతూ చెప్పాడు." తప్పకుండా.."" అజయ్...నువ్వేమైనా .." వరుణ్ అడిగాడు" ఓ.కె.,కాని ఎక్కడనుంచి మొదలెట్టాలి" అజయ్ అడిగాడు" మొదటనుంచి చెప్పు" వరుణ్ సమాధానం."వరుణ్ యొక్క కొత్త మిత్రుడు ...అదే గుణ అని ...ఒక బాబా లాంటి మనిషి అనుకో ..గుర్తుందాగతం లో చెప్పినట్టున్నా" అజయ్ అడిగాడు [...]
నేను శివ ని (నవల) Post no: 22" నేను చేసింది పొరబాటే,క్షమించు""సరే..మంచి ఉద్దేశ్యం తోనే నాతో పోట్లాడమని తనతో చెప్పావే అనుకో..వరుణ్ కి ఆ మత్తు ఎందుకు నేర్పినట్లు..చదువు లో నీ కంటే ముందు ఉన్నందు కా ""అతనికి ఉన్న నిజమైన మిత్రుణ్ణి నేను..అలా అంటే నువ్వు నమ్మకపోవచ్చు,ఏదో ఆనందిస్తాడని దాన్ని పరిచయం చేశా అంతే ""నేను లేనట్లుగా నే తను బిహేవ్ చేస్తున్నాడు.పది సార్లు కాల్ చేస్తే అప్పుడు [...]
నేను శివ ని (నవల) Post no:21" చూడబోతే రాం కి ఇదంతా నచ్చుతున్నట్లు లేదు" వరుణ్ అన్నాడు."నాకు సంతోషమే డ్యూడ్" అన్నాను." హ్మ్..సంతోషం..అంతకన్నా గొప్ప పదమే దొరకలేదా"" ఇంకా చెప్పాలంటే మహదానందంగా..మబ్బుల్లో తేలుతున్నట్లుగా ఉంది" అన్నాను." గంజాయి సంపాయించడం కష్టం గా మారింది బ్రో...ఒక షాకింగ్ న్యూస్ విన్నాను గత రాత్రి"  అజయ్ చెప్పాడు వరుణ్ తో." విన్నదేమిటో చెప్పు ముందు...అది షాకింగ్ [...]
నేను శివ ని (నవల) Post no:20" డ్యూడ్ ...నీకు ఇంకోటి చెప్పాలి"రెండో బీర్ ని పూర్తి చేసి చెప్పాడు వరుణ్." చెప్పు..."" ముందు నాకు ప్రామిస్ చెయ్..అది ఎవరకి చెప్పనని...అలా చేసినట్లయితే నీ జీవితం డేంజర్ లో పడుతుంది.అజయ్ కి,నీకు నాకు మాత్రమే తెలిసే విషయం అది "" ఏంటిరా బాబూ అది" గట్టిగా నవ్వగా నా కళ్ళ లో నీళ్ళు వచ్చాయి." ఇంకోసారి గనక నవ్వితే ఏమవుతుందో చూడు" గట్టిగా తన పెడికిలి బిగిస్తూ [...]
నేను శివ ని (నవల) Post no:18జనవరి 10,2013ప్రియమైన నా డైరీ...నా గ్రేడ్స్ ని పెంచుకోడానికి ఇదే కీలక సమయం.గ్రేడింగ్ ఘోరంగా,అయిదవ సెమిస్టర్ కి 5.2 కి దిగజారింది.ఇలా అయితే నేను కనీసం డిగ్రీ అయినా పొందగలనా...ఏదో ఒకటి చేయాలి.రేపటినుంచి మెకానికల్ ఇంజనీరింగ్ క్లాస్ లకి బోర్ అనుకోకుండా అటెండ్ కావాలి.వినాలి.రాసుకోవాలి.వారానికి రెండు మార్లు అయినా రివైజ్ చేసుకోవాలి.వరుణ్ పరిస్థితి [...]
నేను శివ ని (నవల) Post no: 19" ఆత్మలు ముందు ఇష్టపడాలి..మనతో మాట్లాడడానికి..!ఆత్మలతో కాంటాక్ట్ పెట్టుకోవడం ఈజీ " చెప్పాడు  అజయ్." చనిపోయిన వారి ఆత్మ వేరే శరీరం లో గనక చేరితే ఎలా" ప్రశ్నించాను నేను." ఆ సంగతి వరుణ్ కి వదిలిపెట్టు" అదీ అజయ్ ముక్తాయింపు." చెప్పు బ్రో ..ఏం చేస్తే మంచిది" అడిగాడు వరుణ్" గట్టిగా చెప్తూ ఉండు తనతో మాట్లాడాలని ఉందని..ఏమో ఒకనాటికి నీ ఆశ ఫలించవచ్చును" అజయ్ [...]
నేను శివ ని (నవల) Post no: 17PART-2, CHAPTER-5,రాం చెబుతున్నాడు.నవంబర్ 8,2012ఇప్పుడు ఇద్దరమల్లా ముగ్గురం అయ్యాము.అజయ్ రూం లో గంజాయి దమ్ము కొట్టే అవకాశం ..రెండు కారణాల రీత్యా దానికి థాంక్స్ చెప్పాల్సిందే.ఆ రూం దగ్గరకి ఎవరూ రారు.కలగజేసుకుని చికాకు చేసే వాళ్ళు ఎవరూ లేరు.కాలేజీ లో అటెండెన్స్ కూడా ఆప్షనల్.మా మేధో శక్తులు పెంచుకోడానికి మేం గంజాయి ని వాడుతున్నాం.పెంచినా పెంచకున్నా అలా అని [...]
నేను శివ ని (నవల) Post no: 16" ఆ చెప్పు..ఆ తరవాత "" విను.స్త్రీలు అనేవాళ్ళకి కూసింత ఎమోషన్స్ అనేవి ఎక్కువ.వాళ్ళ ప్రవర్తన గమనిస్తే నీకు అది తెలుస్తుంది.నాటకీయత నిండిన సీరియళ్ళు చూడటం,బోరింగ్ రొమాన్స్ నవల్స్ చదవడం వంటివి వాళ్ళకిష్టం.వాస్తవం కంటే ఎమోషన్స్ కే ప్రయారటీ ఇస్తారు" చెప్పాడు రాం." ఆ దోవ లో నేనెప్పుడూ ఆలోచించలేదు.నువు చెప్పింది రైటే" అన్నాను." నా వెర్షన్ లో సరుకుందా [...]
నేను శివ ని (నవల) Post no: 15ఆగస్ట్ 2,2012మూడో ఏడాది చదువు నిరాశ గా నే మొదలయింది.సెకండ్ ఇయర్ లో నా ర్యాంక్ తగ్గింది.కోర్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఎక్కువ గత ఏడాది..!ఇక మీదట బుద్ది కలిగి చదవకపోతే గడ్డు దినాలే ముందు ముందు.స్కూల్ లో ఐ ఐ టి సిలబస్ చదవటం మూలం గా ఈ మాత్రమైన లాగగలిగాను.యామిని తో రోజు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను.ఆమె ఏమిటో సరిగా అర్ధం కావడం లేదు.మా రిలేషన్ ఏ వేపు కి [...]
నేను శివ ని (నవల) Post no:14బాగా బీచ్ లో ఉన్న రెస్టారెంట్ లోకి యామిని ని తీసుకువెళ్ళాను.నేను కాస్త నెమ్మదించాను.అయితే ఆ షాక్ నుంచి పూర్తి గా కవర్ అయ్యానని చెప్పలేను.యామిని తో మరొకరు పడక పంచుకున్నారనే నిజమే నాకు జీర్ణించుకుండానికి అదోలా ఉంది.ఓ రకంగా చెప్పాలంటే ప్యూర్ కాదు." సారీ బేబీ" అన్నాను నేను. నాకే లోపల కాస్త ఓవర్ యాక్టింగ్ లా అనిపించింది." నువ్వూ ..బయట అందరి లాంటి వాడివే" [...]
నేను శివ ని (నవల) Post no: 13" ఎక్కడి కో ప్రపంచానికి దూరం గా వెళ్ళిన అనుభూతి " మంచం పై నే ఆమె ని చూస్తూ అన్నాను.సిగరెట్ వెలిగించి తాగుతూన్నాను.యామిని కి దగ్గర గా ఉంది నా తల." నువ్వు ప్రయత్నిస్తావా" " అదే నీ కోరిక అయితే ఓకె" నా భుజాల్ని చుట్టేస్తూ అంది ఆమె."ఒక అలవాటు గా కాకుండా ..సరదా గా " అన్నాను.ఈ సమయం లో ఇది ఒక హాయి అయిన విషయం గా తోచింది."అలాగయితే ఇటు తే" నా చేతి లోని సిగరెట్ [...]
నేను శివ ని (నవల)Post no:12జూలై 4, 2012బాగా బీచ్ దగ్గరున్న బ్రిట్టో రెస్టారెంట్ లో ఉన్నాము ఇప్పుడు.కేండిల్ లైట్ డిన్నర్.నా ఇరవై వ పుట్టినరోజు జరుపుకోడానికి ని ఇంతకంటే మంచి చోటు ఎక్కడుంది.చక్కటి మ్యూజిక్ ఇంకా ఇద్దరమే మేము.బీర్ తాగుతూ ఆమె అందమైన మోము ని గమనిస్తున్నాను." ఇది ప్రత్యేక సమయం కొన్ని ప్రత్యేక విషయాలకి" యామిని అన్నది." నువ్వు చెప్పు మొదట"" లేదు..నువ్వే""లేడీస్ ఫస్ట్"" [...]
నేను శివ ని (నవల) Post No: 11జూలై 3,2012నేను,యామిని గోవా చేరుకున్నాం.బాగా బీచ్ కి దగ్గర లో ఉన్న హసియాండా అనే హోటల్ లో రూం తీసుకున్నాం.ఆమె కొంత అలసట గా అయింది,నాకు ఉద్విగ్నంగా ఉంది.ఇదో రకమైన కొత్త అనుభవం. పెళ్ళి అయిన కొత్త లో ఉన్నట్లుగా..రాబోయే మా భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకునేదానికి ఇది ఓ అవకాశం." కొద్దిగా మగత గా ఉంది నాకు..వెళ్ళి స్నానం చేసి వస్తా..మనం చూడదగ్గవి చాలా ఉన్నాయి.టైం [...]
నేను శివ ని (నవల) Post no:10సెకండియర్ లో ఇంకా సెలవులు నెల ఉన్నాయి.రాం,నేను చెన్నై లో ఓ బార్ లో కూర్చొని ఉన్నాము.అది సెంట్రల్ రైల్వే స్టేషన్ కి దగ్గర గా ఉన్నటువంటిది.నేను ఎక్కాల్సిన బండి పదకొండు యాభై అయిదు నిమిషాలకి వస్తుంది.ఎంతగానొ ఎదురు చూసిన గోవా ట్రిప్ సాకారమవబోతోంది.అదీ యామిని తో కలిసి..!ఈ లోపు ఇక్కడ రాం తో రెండు పెగ్గులు తీసుకుందామని ఓ బార్ లో కూర్చున్నాను.సరదా గా పాత [...]
నా పేరు శివ (నవల),Post no:9CHAPTER-3"అమ్మాయిలు కాక్టైల్స్ తీసుకోరాని విన్నాను..నిజమేనా " అడిగాను నేను."వరుణ్..అమ్మాయిల పట్ల నీ అభిప్రాయాల్ని మార్చుకోవాలి..అవి బూజు పట్టినవి సుమా " యామిని జవాబిచ్చింది.  మేము ఇప్పుడు తిరుచ్చి లోని వైల్డ్ వెస్ట్ బార్ లో ఉన్నాము.చాలా అకేషనల్ గా అమ్మాయిలు కూడా సందర్శించే బార్ అది.నాకు నెర్వస్ గా ఉంది..అయితే ఎలాగో విజయవంతం గా లోపలికి వెళ్ళాము.నా [...]
నా పేరు శివ (నవల) Post no:8ఆగస్ట్ 10,2011పొద్దున్నే అయిదు గంటలకి తెలివి వొచ్చింది.ఒకటికి పోసి వచ్చిన తర్వాత నిద్రపట్టట్లేదు.ఎప్పుడో జూనియర్ కాలేజి రోజుల్లో పరీక్షలు రాసి ఆత్రుత గా రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన ఆ రోజులు మాదిరి గా ఉంది ఇప్పటి పరిస్థితి.రాబోయే సన్నివేశాల్ని ఫలితం ఏదైనా ఫెస్ చేసి తీరవలసిందే అని అనుకుని నిశ్చయించుకున్నాను.అద్దం లో నన్ను నేను చూసుకున్నాను.ఒప్పుకు [...]
నా పేరు శివ (నవల) Post No: 7" ఇక నేను మొదలెట్టనా" అన్నాను భావ యుక్తంగా..!కొత్త వ్యక్తి తో ఉన్నట్టుండి మరీ ఎక్కువ చొరవ గా నేను మాట్లాడలేను.అజయ్ ఏదో భాష లో గొణిగినట్లు చేసి నాకు వాటర్ బాటిల్ ని,ప్లాస్టిక్ గ్లాస్ ని అందించాడు." మరి మీ సంగతో" మందు లో నీళ్ళు కలుపుతూ అన్నాను." మేము ఈ మందు ని ఆపుజేశాం వరుణ్. మేం ఇప్పుడంతా గంజాయి లోకి వెళ్ళిపోయాం" అన్నాడు రాం ,అజయ్ కి సైగ చేస్తూ." ఈ రోజు [...]
నేను శివ ని (నవల), Post no:6CHAPTER-2"అదిగో విజేత వచ్చేశాడు..నా ఊహ నిజమే అయింది గదూ" రాం అన్నాడు,నేను రూం లోకి ప్రవేశిస్తుండగానే!గిటార్ ని గోడ కి ఆనించాను,నీరసం గా మంచం లో కూలబడ్డాను.ఆడిషన్స్ సంగతి ఏం చెప్పకుండా..!" నన్ను విన్నర్ అనేకంటే..ఫైటర్ అనడమే సబబు "" ఏమయింది మిత్రమా ..ఊహించిన దానికి భిన్నంగా ఏమైనా జరిగిందా " నాలోని నిరాశని పసిగట్టి అన్నాడు రాం." నా ప్రయత్నాలన్నీ నేల పాలయ్యాయి [...]
నేను శివ ని (నవల), Post no:5నా రెండవ సెమిస్టర్ అయిపొయింది.అనుకున్నంత స్కోర్ చేయలేకపోయాను.తరువాత ఇంకా శ్రద్ధ పెట్టి చదవాలి,దాన్ని పూడ్చుకోవాలి.చదువు పట్ల ఏకాగ్రత తగ్గింది.జీవితం అంటే ఏదో చెప్పలేని ఒక అననుకూలతా భావం ఏర్పడింది.ఎందుకని...అలా..!గత రెండేళ్ళుగా బాయ్స్ మాత్రమే ఉన్న స్కూల్ లో చదివినందుకా..లేకా యామిని తో మాట్లాడే చాన్స్ దొరకనందుకా...మెటాలికా వారి ఆ ప్రత్యేక విషాద [...]
నేను శివ ని (నవల) Post no: 4జనవరి 13,2011.రెండవ సెమిస్టర్ ప్రారంభమయింది.మొదట సెమిస్టర్ విషయానికి వస్తె 10 కి 8.6 CGPA సాధించాను.రాం కూడా ఫరవాలేదు.అతను 6.3 దాకా సాధించాడు.పాసవుతాడు.అంతే.తను ఎక్కువ గా ఇంటర్నెట్ లో సినిమాలు అవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.సరే,ఆ పని చేసినా చదువు పై ధ్యాస ఎక్కువగా పెట్టాను.రాం,నేను బి హాస్టల్ లో 409 వ నెంబర్ గల రూం లో ఉంటాము.మొత్తం మీద పది హాస్టల్స్ ఉంటాయి.మూడు [...]
నా పేరు శివ (Post No:3)" అబ్బా..దెబ్బ అయింది రా బాబు.." TASMAC ని సమీపించగానే నిట్టూర్చాడు రాం.ఆ షాప్ మూసి ఉంది." ఈ రోజు గాంధీ జయంతి,డ్రై డే.అందుకే వైన్ షాప్ మూసేశారు." నేనూ బాధ గానే ఫీలయ్యాను.నా లోపలి ఫీల్ నంతా ఆ మంది కొట్టే సమయం లో వెళ్ళగక్కుదామనుకున్నాను.విధి ఇంకో లా తలచింది."అసలు నిన్ననే మందు కొని దాచి ఉంచాల్సింది.." అన్నాడు రాం." డ్యూడ్ ...ఈ రోజు డ్రైడే అని నిన్న ఎక్కడ [...]
నేను శివ ని (నవల) Post no: 2మా కాలేజ్ లో అనేక బ్రాంచ్ లు ఉన్నాయి.ఒక్కోదానివల్ల ఒక్కో లాభం అనుకోండి.ఉదాహరణకి ఫోటోగ్రఫీ బ్రాంచ్ లో సభ్యులు గా ఉన్నవాళ్ళ లో అందమైన అమ్మాయిలు ఉంటారు.డెకరేషన్ బ్రాంచ్ లో క్రియేటివ్ స్పిరిట్ ఉన్న అమ్మాయిలు ఉంటారు.ఇక బ్యాక్ స్టేజ్ విభాగం కి వస్తే అల్లరి గా ఉండే టైపు ..ఆ విధంగా..!కేవలం మా Audi force లోనే అంతా మగపురుషులు ఉండేది.అయితే ఒకటి ఇలాంటి షోలు [...]
నేను శివ ని..! (నవల)ఆంగ్ల మూలం: రాఘవ్ వరదరాజన్అనువాదం: మూర్తి కె.వి.వి.ఎస్.  Post no: 1ప్రోలోగ్  " నువు నా పార్వతివి కావు.ఎవరో అబద్దాల కోరువి.అలగా మనిషివి.నన్ను నమ్మించాలని చూడకు,అవును ..నేను నీ మాయ లో చిక్కింది నిజమే..!అప్పుడు నాకు ఆలోచన లేకపోయింది.ఇప్పుడు తరచి చూస్తే నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలుస్తోంది." నా భుజాల్ని కుదుపుతూ అన్నాడు తను."ముందులాగ ఇప్పుడు నిన్ను ఎందుకు [...]
 వొట్టి బండ (కధ)ఆ రోజున రమేష్ బడి కి వచ్చాడా అని చెప్పి చూశాడు శ్రీనివాస్.రమేష్ అంటే ఎవరో వి.ఐ.పి.కాదు,ఆ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదివే ఒక కుర్రాడు.ఇక శ్రీనివాస్ ఆ బళ్ళో ఇంగ్లీష్ మేష్టారు.ఆ..వచ్చాడు,పక్క రూం కి వెళుతున్నట్లు గా పోతూ ఓ కన్ను వేశాడు ..మొత్తానికి కనిపించాడు.నీలం రంగు చొక్కా.రెండవ వరస లో..!తరవాతి పీరియడ్ శ్రీనివాస్ దే. వాడికేసి  చూడటానికే అదోలా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు