మహోగ్రరూపం,మహాగ్రరూపం మహా ప్రతాపం,మహాప్రతాపం మరుభూమిని తలపిస్తూ... ప్రకృతి మ్రోగించిన మరణమృదంగం .‌.‌‌.‌ మలయాళనేలపై మహాగంగమ్మ ప్రళయతాండవం‌ బ్రద్దలయిందేమో... భళ్ళునఆకాశం.... వరుణుని భీకర ప్రకోపానికి.... చిగురుటాకులా ‌.... వణికిపోతున్న మలబారుతీరం ఎక్కడ చూసిన.... ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్న వాగులు,వంకలు కుప్పకూలుతున్న నిలువెత్తు కట్టడాలు [...]
కదిలే కాలం ఒక జీవనది నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది... ఎన్ని కన్నీటిధారలు తనలో కలిపేసుకుందో... ఎన్నెన్ని గతచరిత్రలను తనలో ఇముడ్చుకుందో... అలుపెరుగని తన పయనంలో... అడుగడుగునా... అంతులేని కధలెన్నున్నా... కన్నీటమ్రగ్గుతున్న వ్యధలెన్నున్నా.... అరక్షణమైనా... ఆగి చూడదుగా... సాగి పోవడమే....ఠీవీగా.. ఆనందాలైనా‌‌.... ఆక్రోశాలైనా... సంతోషాలైనా... సంతాపాలైనా... జననమైనా... మరణమైనా.. గమనం [...]
నేడెలే‌...నేడెలే‌..నేడెలే‌...నేడెలే‌ భారతకుసుమం వికసించెను నేడెలే నవభారత గీతం వినిపించెను నేడెలే భరతావని సంకెళ్ళను వీడెలే నేడెలే భరతజాతి మైమరచి ఆడెలే నేడెలే‌ నేడెలే‌...నేడెలే‌..నేడెలే‌...నేడెలే‌ భరతమాత గుండెల్లో హరివిల్లు విరిసింది ......నేడెలే మన బానిస బ్రతుకు ల్లో మణిదీపం వెలిగిందీ......నేడెలే ప్రతి గువ్వ,ప్రతిఅవ్వా పరవశించి పాడినది......నేడెలే నలుమూలల [...]
అరుణారుణ కిరణంలా.... ఎర్రగా పండిన నా అరచేతి గోరింటనుచూసి మూగబోయింది మా పెరటి ముద్దమందారం... విరబూసిన నా అరచేతినిగని, వికసించిన సుమమనుకొని, ఝుమ్మని తుమ్మెద ఝంకారం... చేసింది. తమజాబిలి‌...తరలివెళ్ళి తరుణిఅరచేత కొలువుదీరెనా...అని తరచితరచి చూసింది ఆకాశం ఆశ్చర్యంగా....! అతిశయమనుకోవద్దు అందంగా పండింది ఆషాఢమాసంలో నా అరచేయి.. అమ్మ తన అనురాగాన్నంతా రంగరించి పెట్టింది [...]
ఎందుకయ్యా...శివా!    ఎంత పిలిచిన రావు ఎందుకయ్యా....శివా!   ఎంత తలచిన రావు అమ్మైనా చెప్పలేద     తల్లడిల్లుతున్నానని, చెమ్మగిల్లిన కళ్ళను   ఒక్కసారి తుడవాలని, ఎందుకయ్యా...శివా....2 కన్న కలలు కన్నీరై కరిగిపోతున్నాయి కనులముందు కలతలే కలవరపెడుతున్నాయి పదేపదే వేడుకొంటే కధలా...వింటున్నావా.‌.. కదలి వచ్చి, వ్యధను తీర్చ ఒక్కసారి రాలేవా... ఓదార్చి పోలేవా... " ఎం" నీకోసం తపించీ నీ సేవలో [...]
ఉరికే ఘన సాహిత్యపు ఝరి *సినారె* వెలిగే కవన రాజ శిఖరి *సినారె* మధురిమల పలుకుసిరి .... *సినారె* సిరి చందనాల విభావరి........ *సినారె* రసరమ్య పద లాహిరి.....  *సినారె* తెలుగు భాషలో వెలుగై విరబూ *సినారె* వేల హృదయాలు మధురంగా దోచే *సినారె* అక్షరాలలో అమృతాన్ని కలబో *సినారె* పదములనె పంచదార పాకంలోముంచి తీ *సినారె* అశేష భారతావనిని తన పాటల పల్లకిలో పరవశింప చే *సినారె* మమ్మలరింప  చే [...]
కరువాయెను కవితకు ఆదరణ అని బరువెక్కిన హృదయంతో, ఎరుపెక్కిన వదనంతో వెనుదిరిగిన తరుణంలో గురువాయెను మాధవుడే, దిశానిర్దేశం చేయ మార్గదర్శియై... కన్న తల్లి పాలు , తండ్రి మురిపాలు పసిబిడ్డకు జీవం పోస్తే , గురువు ఆశీస్సులే చాలు   కలం పట్టిన కవి కావ్యం పండడానికి  అల్లిబిల్లి అక్షరాలు కవితా సుమాలై విరబూయాలన్నా  , హిమశిఖరపు అంచులంత ఎత్తుకెదిగిపోయినా... ఒదిగిపోనా [...]
అరక్షణమూ ... ఆదమరచక అక్షర యాగం చేస్తున్నా... అనుక్షణమూ...అన్వేషిస్తూ.. అచ్చమైన తెలుగును ఔపోసన పడ్తున్నా... అభిజ్ఞను కానునేను అతిసాధారణ అతివను హృదయం చవిచూసిన అనుభూతులను అక్షరీకరిస్తున్నా... ప్రకృతితో ప్రతీ సౌందర్యాన్నీ పదాలతో పదిలం గావిస్తున్నా... ఉదయించే ప్రతి కిరణం కవితనై ప్రతిబింబిస్తున్నా... సమాజానికి నవఉషస్సునివ్వాలని ఆకాంక్షిస్తూ... నాలో మెదిలిన [...]
మౌనంగా...ఉన్నా... నా మనసంతా నువ్వే... మాటలాడ లేకున్నా... నా ధ్యాసంతా... నువ్వే నా కనుపాపలో నిన్ను కాపాడుకొంటున్నా... కవి(కవయిత్రి)ని కదా...కవనంతో కాలం గడిపేస్తున్నా.... అక్షరాలతో..నిన్ను అభిషేకిస్తున్నా... నా పద భావాలపల్లకిలో ఊరేగిస్తున్నా.... నీ ఊహలకు ఊయలేసి ఊరడిస్తూనే ఉన్నా... నీతలపులలో తలవాల్చుకు నిదురిస్తున్నా.... మరచిపోలేను..ప్రభూ... నువు నా మది గీసిన [...]
ఓ...మనిషీ....చచ్చిపో.. మనసంటూ...ఉంటే మానవజాతికి శాశ్వతంగా శలవుచీటీ ఇచ్చిపో... దారుణాలు చూడలేక ధరణి బ్రద్ధలవ్వక మునుపే అవమానభారంతో అవని అంతరించక మునుపే కనులముందు కలికాలం తాండవిస్తోంది. మరులు గొన్న మనభూమి మరుభూమిని తలపిస్తోంది రాక్షసత్వం రాజ్యమేలుతోంది పైశాచికత్వం పడగవిప్పి బుసలుకొడ్తోంది. అడుగడుగునా.‌.. ఆడబిడ్డల ఆక్రందనలే... అరసెకనుకొక [...]
అప్పుడే తెల్లారింది కాబోలు... చప్పుడు చేయక నా మోమును స్పృశియించిది.. తూరుపు సింధూరం.. కనులు విప్పానో లేదో కిటికీ నుండే శుభోదయం చెప్పేసింది నావైపే... రెప్పేయక చూస్తూ అప్పుడప్పుడే రేకులు విచ్చుకొన్న ఎర్రని మందారం ఎప్పటిలాగే మంచుదుప్పటికప్పుకున్న పచ్చిక ప్రశాంతంగా నవ్వుతూ పలకరించింది...ప్రకృతిలో పరవశమంతా ...తన వశమన్నట్లు ..... నా కన్నులు చూసిన దృశ్యాలన్నీ [...]
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి శిల్ప కళావైభవం లో 1116మంది కవులతో శిల్పులకు అక్షరనీరాజనాలర్పిస్తూ.. శ్రీలక్ష్మీ నారసింహుని దివ్య సన్నిధిలో నిర్వహించబడిన ప్రపంచరికార్డు కవితోత్సవంలో పాల్గొని సత్కారం అందుకొన్న శుభతరుణం‌..
విశాఖపట్నం పౌరగ్రంధాలయంలో బాలబాట మాసపత్రిక దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా తెలుగురక్షణవేదికజాతీయ అద్యక్షులు కళారత్న శ్రీపొట్లూరిహరికృష్ణగారు, బాలబాట అద్యక్షురాలు శ్రీమతి స్వరాజ్యం రమణమ్మగారు, కేంద్రసాహితీఅకాడమీ బాలసాహిత్య పురస్కారగ్రహీత శ్రీనారంశెట్టి ఉమామహేశ్వరరావు గారిచేతులమీదుగా.... ఆత్మీయ సత్కారం పొందిన శుభతరుణం
నెల వంక సాక్షిగా... నెల రోజుల ఉపవాస ధీక్షగా ... సాగిన మీ భక్తికీ, అక్షరాలా... మహిమాన్విత పవిత్ర ఖురాన్  రక్షగా .... పొందిన మీ శక్తికీ, ప్రేమకుశాంతికి నెలవైన మీస్ఫూర్తికీ సహనానికిక్షమకూ.. మానవత్వ మాన్యతగా సాగిన మీ లక్ష్యానికీ, దానం,దయాగుణాలకు దర్పణమై వెలిగిన మీకీర్తికి సత్యతకుసఖ్యతకూ.. సత్ప్రవర్తనా విధేయతకు కట్టుబడిన మీ ధర్మనిరతికీ మానవసేవయే దైవ సేవయని [...]
ఓ..స్వంతత్ర భారతమా ...  అవినీతికి,అన్యాయానికి   నీవుఆలవాలమా ? ఓ..ప్రజాస్వామ్య  దేశమా  ప్రజల పాలిట శాపమా ...  విన్నావా .. సగటు జీవిఆర్తనాదాలు? కన్నావా .. కన్నీటి కధనాలు ? మరచినావా .. మానవత్వం  నేర్చినావా .. పైశాచికత్వం ? కలచివేసే బ్రతుకులే కన్నులకగుపిస్తున్నా  కాలానికి వదిలేసి కళ్ళు మూసుకొంటున్నావా .. తెల్ల దొరల కాలంలో బానిస బ్రతుకే...బ్రతికాం  నేటి ప్రజాస్వామ్య [...]
ఏగానగాంధర్వుని కన్నానని తెలుగునేల గర్వంతో ఉప్పొంగిపోతుందో... ఏఘనసంగీతమాలకించి గగనం సైతం పులకించిందో... ఏస్వరమైతే అశేషభరతావనికీ... అద్భుత వరమయ్యిందో ఏ"బాలు"ని గానం విని ఆబాలగోపాలమూ... అమృతాన్ని..చవిచూసిందో ఏస్వరమాలకించగానే ప్రకృతిలో పరమాణువుసైతం పరవశమైపాడుతుందో.. ఏగాత్రంవింటూనే.. ప్రతిహృదయానికి చైత్రం ఎదురవుతుందో... ఏరాగం వింటూనే.. ఎద వెన్నెల్లో [...]
తెలుగు తేజం అతడు తెలుగు రాజసం అతడు తెలుగు పౌరుషం అతడు తెలుగు వారి ఆత్మగౌరవమతడు తెలుగుజాతిగుండెల్లో ఉప్పొంగిన చప్పపుడతడు తెలుగుజాతి గొప్పతనం దిగ్ధిగంతాలా... చాటిచెప్పిన మాతృభూమి సేవాతత్పరుడతడు తెలుగు జాతి కీర్తి అతడు తెలుగు వారి స్ఫూర్తి అతడు తెలుగు నేలపై ఉదయించిన నవ చైతన్యమూర్తి అతడు మాన్యుడతడు మహనీయుడతడు మానవతామూర్తి అతడు కర్తవ్యధీక్షలో మొట్టమొదటి [...]
మామిడిపండును చూసి మనసు పారేసుకోనిదెవరు? మధురసాల రారాజును మనసారా కోరుకోనిదెవరు? పుల్లనిమావిళ్ళను చూసినంతనే మన ఉల్లము జిల్లనదా... అల్లన మామిడిఫలమును కాంచినంతనే అలవోకగ మననాలుక అధరపుటంచులతాకదా... సురులకు మాత్రమే అమృతాస్వాదనమా.. అని అలిగిన ప్రకృతి పట్టుబట్టి మనకోసం మామిడిలో మధురసుధను గుమ్మరించెనేమో... మనపై పట్టరాని మమకారంతో... మండువేసవిలో వేసారిన [...]
😥అరుగును నేను😥 వీధిఅరుగునునేను పరుగులలోకంలో కరిగికరిగి మరుగునపడిపోయాను కనుమరుగైపోయాను అంతస్ధుల మోజులో అడుగునపడిపోయాను అసలునేనూ.. ఊరుమ్మడిచుట్టాన్ని ఊరుమంచి కోరేదాన్ని ఊరడింపునిచ్చేదాన్ని ఊసులాలకించేదాన్ని ఊ..కొట్టేదాన్ని ఊళ్ళోకొచ్చినదెవరైనా కూర్చోమంటూనే కుశలమడిగేదాన్ని పొరుగింటిముచ్చట్లైనా... ఇరుగింటఅగచాట్లైనా ఇంటింటి రామాయణాన్ని ఇట్టే [...]
🌹తెలుగు సాహితీ లోకంలో మెరిసిన మహిళామణిదీపం తెలుగు నవలారచనలలో అత్యున్నత శిఖరం అద్భుతకధలను ఆంధ్రావనికందించిన అమృతకలశం ఆమె..కలం అజరామరం ఆమెకధలు కరతలామలకం ఆమే మన సుప్రసిద్ధ నవలాసామ్రాజ్యాధినేత్రి యద్ధనపూడి సులోచనారాణి మద్యతరగతి మగువలను తనకలంతో కలల అలలపై తేలియాడించి, మద్యతరగతిజీవితాలను కధావస్తువులుగా... సగటుజీవితాలకు సజీవసాక్ష్యాలుగా.. కడురమ్యమైన [...]
సిరిమువ్వల సవ్వడయినా  చిరు జల్లులుసడియైనా  విరి తేనియ చిలికినా  మరు మల్లెలు పరచినా ప్రణయసుధాఝరిలో ఇరుమనసులు మైమరచినా పల్లవించును పాటై అది సిరివెన్నెల పాటై మది దోచే మరువంపుతోటై అది మకరందపు తేట  ఆణిముత్యాల మూట మంచి గంధాల పూత  మధురోహల పూదోట మధురాక్షరాలుఒలికించే అక్షరాల అక్షయపాత్ర ఎలకోయిలమ్మపాట కులికే సరాగాల సయ్యాట అది సిరివెన్నెల పాట  మదిదోచే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు