హేవళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి.ఇవిగో శ్రీ రాముని గొప్పదనం తెలుపుతూ నేను వ్రాసిన పద్యాలుసీ. ఎనలేని సంపద లొనగూడి నట్లుండి, మాయమై పోయినన్ మథనపడడెసిరులదేవతవంటి సీతమ్మ తోడుగా నడచిన చాలని నమ్మియుండివేవేల రక్కసుల్ వెనువెంట నిక్కట్లు వేగాన మూగినన్ వెతలబడడెఅనంత తేజుఁ డయ్యనుజుండు నీడగా నిలచిన చాలని నెమ్మదించితే. పోరు కుద్బలుఁ గెలువంగ పూనివచ్చెశత్రుభీకర రుద్రుండు [...]
అంతర్జాలము నుండి సంగ్రహించినది.  వ్రాసినవాఱెవఱో తెలియదు.--ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు [...]
ధనికొండవారి సమస్య.సమస్యను చదువగానే శ్రీ తో ఏది జోడిస్తే ధనవంతులకు నచ్చినిది వస్తుందా అని ఆలోచించగా, ఎక్కువగా సమయం పట్టలేదు మహాకవి శ్రీశ్రీ పేరు తట్టడానికి.ఇంకేమి, మిగతాదంతా శ్రీశ్రీగారి భావాలను కాస్త వడకట్టి వ్రాసేస్తే సరిపోతుంది కదా.అదే చేసాను ఈ పూరణలో, చూడండి. భావము సులభగ్రాహ్మమే.ఉ. సాయముజేతు మందఱికి, సంపద లున్నవి పంచిపెట్టి నీ నా యనుభేదభావముల నమ్మక ఎల్లరు [...]
ముఖపుస్తక ఛందోసమూహములో ధనికొండరవిప్రసాద్ గారు ఇచ్చిన దత్తపది ఇది. మూడు, ఆరు, ఎడు, పది - ఈ పదాలను సంఖ్యాపరంగా కాకుండా వేఱే అర్థాలు వచ్చేలాగ వ్రాయాలి. పురాణేతిహాసాలు నేపధ్యంగా ఉండాలి.ఇదిగో నా పూరణ సీ. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడుగండ్రగొడ్డలి పడి క్షత్రియు లారుట, వంగిన వంశము లంగలార్చునోడింప పదునాలు గేడులు పట్టుట, రణభూమి రావణు రాణు [...]
ఎన్నో రోజుల తరువాత శంకరాభరణం బ్లాగు సందర్శించాను. కంది శంకరయ్యగారు ఛందోప్రక్రియలకు చేస్తున్న సేవ లనల్ప మనితరసాధ్యమూను.ఆయన ఇచ్చిన క్రొత్త సమస్య రెండు రకాలుగా ఉన్నది,౧. మొదటిది కందములో - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్౨. రెండవది ఉత్పలమాలలో - నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్రెంటికీ నా పూరణలు ఇవిగోకం. నారాయణార్చనప్రియశారదగానప్రియ [...]
చరచర్చలకు నెలవు వాట్సాప్ లో ఒకానొక రోజు అవధాని గారికి ఎవఱో ఇచ్చిన దత్తపది నా కంటబడింది. ఏ అవధానమో, అవధాని గారెవరో తెలియదు.ఎలాగూ ప్రతివారమూ సమస్యలను పూరిస్తున్న అలవాటు ప్రకారము, ఇదీ తీసుకొని ఈ విధంగా పూరించాను.తే. నేడు చూత మన్నా!  మహనీయుఁ గృష్ణుమైత్రి షట్ రిపువుల రూపుమాపు చెలిమిరోస మంతా సడలగ శత్రువులు చెడఁగపోరు కా జలజాక్షుని పొత్తు వలయుఁగీతపద్యాలలో నాకు తేటిగీతి [...]
నేడు ముఖపుస్తకపు ఛందోసమూహములో ధనికొండ రవిప్రాసద్ గారు ఇచ్చిన వర్ణనాంశము, దుర్యోధనుని వ్యథ.ఒకవేళ కర్ణుఁడు ఏ కారణము చేతనో పరాయి పక్షమైన పాండవులను చేరినట్లు దుర్యోధనునికి తెలిసనట్లైతే ఆతడి మనోగత మేవిధముగా ఉంటుందో చిత్రీకరించాలి. స్వేచ్ఛా ఛందము.అంశాన్ని గూర్చి ఆలోచించగానే మొట్టమొదట తట్టినది, ద్రౌపదీ వృత్తాంతము. ద్రౌపది నల్లనిదైనా ఎంతో అందమైనదని జగద్విదితమే. ఆమె [...]
నేటి పత్రికలలో ఏది నమ్మాలో, ఏది నమ్మలేమో తెలియని పరిస్థితి.సీ. ఏది సత్యమొ మరి ఏది అసత్యమో, తేలిచి చెప్పుట వీలుకాదుమనవాడు పలికిన మాట విషమయిన ఆచరణీయము అమృత మదియెఆవలిప్రక్కవా రాడిన సూనృతము తెవులుగొనిన వీరి చెవుల బడదుమానవతావాద మానవాలు మతవాదముల బడినదయి సమసిపోయె    ఆ.  నిజము చాటుచు తమ నిష్పక్షపాతముకవచమై వెలుంగ ఘనముగాను నిలిచి సత్యమునకు నెలవులౌ పత్రికల్కాలగర్భ [...]
ఒక చరము (సెల్ఫోను) చేతి కందితే అంతకన్నా మహాప్రసాదం లేదు, పెద్దలకూ పిన్నలకూ నేడు.తే. ఆటల మయిదానము చేతి కందివచ్చెనురకలు పరుగులు తెరల నొదిగిపోయెకనులు చేతివ్రేళ్లు విడిచి కదుల వేవి జగము నింపుకొనె దనలో చరము భళిరమరింత చెప్పాలంటే, వెలుగునీడలు అనే పాతచిత్రంలోని ఈ క్రిందిపాటను ఒకసారి గుర్తుచేసుకోండి. అదే బాణీలో ఈ సాహిత్యాన్ని పాడుకోండి.  https://www.youtube.com/watch?v=kIEz9AtpqwIపల్లవి - [...]
పల్లవి - మంగాబుధి హనుమంతా, నీ శరణ మంగవించితిమి హనుమంతా.చరణం ౧ -బాలార్క బింబము ఫలమని పట్టిన,ఆలరిచేతల హనుమంతా.తూలని బ్రహ్మాదులచే వరముల,నోలి చేకొనిన హనుమంతాచరణం ౨-జలధి దాట నీ సత్త్వము కపులకునలరి తెలిపితివి హనుమంతాఇలయు నాకసము నేకముగా నటుబలిమి పెరిగితివి భళిహనుమంతాచరణం ౩ -పాతాళములోపలి మైరావణునాతల జంపిన హనుమంతాచేతుల మోడ్చుక శ్రీవేంకటపతినీతల గొలిచే హిత హనుమంతాపై [...]
ప్రక్కననిల్తు నాయుధము పట్టను పోరను నీ రథంబు పైనెక్కి రణాంగణంబుఁ జరియింతు ధనంజయ యుద్ధభూమియందక్కరవచ్చుపల్కులటు దక్క సహాయము జేయజాల నేనెక్కుడు యన్న వెన్నని విధేయుడ పాకగృహంబునందునన్సతీమణి వంటింట్లోకి సవ్యసాచిలా ప్రవేశించి నప్పుడు నా పాత్ర ఇదే. ప్రక్కన నిల్చి సలహా లీయడమే.
గన్నవరపు నరసింహమూర్తిగారు, వున్నావ నాగేశ్వరరావుగారు ఫేస్బుక్కులో గాలిబ్ కవితలను పెట్టి వారి అనువాదాలు ప్రచురించారు.అది చూసి నేను నరసింహమూర్తిగారితో ద్విపదలో వ్రాయుటలో సౌలభ్య ముండునని సూచించాను. దానిక ప్రతిగా వారు నన్నే ఆ కార్యము మీద వేసుకోమన్నారు.అది నిన్నటి మాట. ఈ రాత్రికి కానీ తీరికదొరకలేదు. కూచున్న కాసేపులో ద్విపదలోనే మూడు కవితలకూ అనువాదాలు [...]
ఈ మధ్యకాలంలో ఫేస్బుక్కులో దొరికిన సమస్యలకు, శంకరాభరణము బ్లాగులో తగిలిన ప్రశ్నలకూ పూరణలు వ్రాసాను. అన్నిటినీ కలిపి ఒకటపాలో ఉంచుదా మనిపించి చేస్తున్న పని ఇది.సమస్య - మాయని యనినంత మాయ మాయమ్మౌగాదీనికి ఏడు పూరణలు కం. తోయజనేత్రుం డవనీనాయకు డనఘు డమితసుగుణాకరు డిహసంధాయకు గని తారకరామా యని యనినంత మాయ మాయమ్మౌగాకం. మాయ మన తండ్రిని వలచిపాయని ప్రేమ ప్రకటించి పతిగ గొలువ నమ్మా [...]
కం. స్వాదు ఫలంబులఁ బరిఁ వస్తాదుల పోలికఁ నిలుప రసనములు బోరంవేదిక లైనవి మధురంబౌ దెలుగుదనంబు నెగ్గె బంగినపల్లుల్సింగపూరులో ధాయ్ మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. బంగినపల్లులు కాస్త తక్కువే అయినా, పట్టువిడని విక్రమార్కులైన ఆంధ్రులకు అవీ లభ్యమే.ఈ రెండు రకాల మామిడులు, రూపులో కాస్త వేఱుగా ఉంటాయి. ధాయ్మామిడి పొడవుగా నాజూకుగా, మేను బిగువుగా ఉండి, నోరూరించే లాగ ఉంటుంది. [...]
హనుమజ్జయంతి సందర్భంగా, వైశాఖబహుళదశమి నాడు (మే ౨౦౧౫) పద్య మొకటి అల్లుదామని ఉదయాన్నే మొదలు పెట్టాను.వ్రాసిన పద్యమిది. సీ. చంటి పాపడ వయ్యు మింటి పం డనుకొని సెగల గోళంబు పై కెగసినావు బాలుండవై పలువేలుపుల కృపకు బాత్రమై విద్యల బడసినావు పెరిగి సుగ్రీవుని ప్రియసఖుడవు నయి శ్రీరాము సఖ్యతఁ జేర్చినావు సరవి నయోనిజ జాడ తెలియ రిపుం గెలువ జలనిధి లంఘించినావు తే. వృద్ధరూపము [...]
ఈ రోజు ఫేస్బుక్కులో ధనికొండ రవిప్రసాద్ గారు పూరించమని ఒక సమస్య నుంచారు.వ్యాసుని వ్యాసు డందు రది భావ్యము గాదని నాకు దోచెడిన్.దీనిని నేను పూరించిన విధానం పంచుకుందామని ఈ టపా వ్రాస్తున్నాను.ముందుగా వ్యాసుని గూర్చి చదువుదామని ఆంధ్రభారతి నిఘంటువు తెరిచి చూస్తే ప్రస్తుత మహాయుగానికి ముందు ౨౭ మహాయుగాలలో, స్వయంభువు డాదిగా ఇరువది యేడుగురు వ్యాసులు వెలసి యున్నారని [...]
నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో నేపాల్ భూకంపాన్ని గూర్చి సీసపద్యము వ్రాయాలి, మానససరోవర ప్రసక్తి ఉండాలి కానీ వేఱొక అర్థముతో ఉండాలి. దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యమిది.సీ. సకలలోకాధిపప్రకటదేవాళి మానససరోవరము లనలము లగుటనా హిమవత్పర్వతాగ్ర మాగ్రహ మందిక్రింది నేలలఁ నణగించె నేమొభూమాత లోకాన [...]
కథ మొదలయ్యింది తిక్కనసోమయాజి వ్రాసిన ఉద్యోగపర్వములోని పద్యముతోనే.  దుర్యోధనుణ్ణి మాటిమాటికీ రాజ్యము సగపాలు పాండవులపాలు చేయమని ధృతరాష్టు్రడు కోరడం దానికి విసిగి దుర్యోధను డొక శార్దూలాన్ని అందుకోవడం - అదీ నేపధ్యం.  ఈ పాటికి నాకు నోటికి వచ్చేసిన ఆ పద్య మిదిగో.శా. రాధేయుండును దుస్ససేనుఁడును బోరం బా్రపుగా పాండవక్రోధజ్వాలల నార్తు నొండొకడు నాకుం దోడె నీ వింక [...]
అలోక్ నాథ్ ట్విట్టరులో కొద్దిరోజుల పాటు ఎవరికీ అంతుచిక్కని రీతిలో ప్రసిద్ధి గాంచాడు. తే. క్షణకాలపు పేరెన్నిక నిడి మరుగుపెట్టు మాయల లోకము ట్విట్ట  రదియభారతీయుల పాలిటి పసిడిగిరి యలోక నాథు డటు లెగసె పైకి మెరయమరొక ప్రక్క మౌనమోహనుడిగా వినుతికెక్కిన మన ప్రధాని విలేఖరుల సమావేశాన్ని ఎర్పరిచారు.తే. నోరులేని వాడు తుదకు నోరు తెరిచిమంచిచెడులు వివరించి మాటలాడెనిపుడు [...]
చ. అనువుగ ప్రక్కటింటి నగ నప్పుగదెచ్చి యలంకరించె పెద్దన తలమానికంబగు నిదర్శనమేర్పడ తెన్గుయోషితన్మణిమయ రత్నభూషణము నవ్విధి మేన ధరించి పెద్దనార్యుని చలువన్ గడుంగడు మెఱుంగులుబొంది తెనుంగుజాణ తానె నగకు వన్నెతెచ్చి తని నిక్కులుపోవ గ్రహించి కన్నడించెనొ పొరుగింతి పండితవిశిష్టులు కన్నడసేయ కుందెనోదీని వెనుక కథ తెలియాలంటే, నిరుపహతి స్థలమంటూ కామేశ్వరరావుగారు వేసిన ఈ [...]
సంజయ్ దత్తుడికి కారాగృహము నుండీ మళ్లీ ఆటవిడుపు దొరికింది.తే. చిక్కి చెరసాల గదులలో చితికిపోయిబ్రతుకు నీడ్చుట పేదవారి తల వ్రాతబలిసి అచ్చోట సారెకు బయట కేగిబ్రతుక నేర్చుట పెద్దవారి తల వ్రాత
ఇంట్లో ఈ మధ్యనే క్రోమ్కాస్టు పుణ్యమా అని యూట్యూబులోని సద్దృశ్యకాలు విస్పష్టముగా చూడగలుగుతున్నాము. ఈటీవీ వారి స్వరాభిషేకం ఆ విధంగానే పరిచయ మయ్యింది. తెలుగుతెరపై వెలసిన చక్కటిపాటలను ఏరికోరి క్రొత్తపాత గాయకులతో పాడించడం ఒక గొప్ప ఆలోచన.  బాలసుబ్రహ్మణ్యంగారు, వాణీజయరామ్ గారు మున్నగువారు సుప్రసిద్ధులే.  అసలు సిసలు సిసింద్రీలు వారికి తోడుగా నిలిచి పాటలు [...]
Thorly confused సీ.  థారను ముద్గరధారుని కథయిదిఒంటికంటి జనకు డోడిను కథతనవారి కనుగప్పు తమ్ముడు గద్దెకైప్రాకులాడి మెలగు లోకికథపరలోక మేగినా వదలక స్నేహముపాటింటి ప్రేమించు పడతి కథఈప్సితార్థ మిడుచు నీథరు పడగొట్టుచెడువారి నెట్టులో చెప్పుగాథతే. లోకములు తొమ్మి దొక్కట నేకమైనపగిది కనిపించు సమయాన పలువిధములుమాయలు జరుగునని చెప్పు మాయగాథతేటపఱచుట తెలియని తికమకకథ
ముఖపుస్తకములో నేను ప్రచురించిన కొన్ని పద్యాలను ఇక్కడ సేకరించి పెడుతున్నాను.సచిను తెందుల్కర్ క్రికెట్టాట నుండి విరమించుకొన్న సందర్భములోచ. ఇరువది నాల్గు వత్సరములేపుగ కాసిన చెట్టువోలె నీ పరువుల పంట పండె, యువభారతవీక్షకకోటితృప్తమై పరగెను, క్రీడ లన్యముల పట్టము గట్టని వింతదేశపా మరము నదృష్టమై వెలసె, మాన్యుడవైతివి దేశరత్నమా.విజయనామ సంవత్సర కార్తికపౌర్ణమి నాడు, [...]
తెలుగు పదం గుంపులో టూత్బ్రష్ పైన జరిగిన చిన్న చర్చ, అందులో రెండు కంద పద్యాలు, ఇవిగోనేను -క. పిలుతురు బ్రష్షని కుంచెనుసులువుగ నాంగ్లంబున, నతి సులువుగ టూతైచెలగెను పల్లున్, వాటినికలగలిపి నుడివిన వచ్చు గాదా టూత్బ్రష్Toothbrushను పల్లకుంచె లేక పంటికుంచె అని వ్యవహరించవచ్చునని నా ప్రతిపాదన.ఏమంటారు.నమస్సులు, గిరిసుబ్బాచారి గారు - ఇదే ట్రూ ట్రాన్స్ లేషన్ అంటే. తెలుగువారికి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు