ఉదయం పది గంటలకన్నా పది నిమిషాల ముందు  ఎండలు బాగా ముదిరిన మార్చి నెల  ఎండ మాడ్చేస్తుంది.  బురఖా వేసుకున్నామె ఒకరు  బాంక్ లోపలకి ప్రవేశిస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డ్  అడ్డుకున్నాడు. లోపల పూజ జరుగుతుంది చెప్పులు విప్పి  రండమ్మా అని. "ఇదేమన్నా గుడా! బ్యాంక్.  ఇక్కడ అలాంటివి  పాటించాల్సిన పనేంటి? " అంటూ చెప్పులు విప్పకుండానే లోపలికి ప్రవేశించి  చుట్టూ పరికించింది.  ఇంకా [...]
మామూలేగా ... ఉదారవాద ప్రదర్శన పై మనుషులకెందుకో వ్యామోహం క్షణానికో సారి చచ్చి మరుక్షణమేమళ్ళీ పుడుతుండగా నడకలోనూ నడతలోనూ నటనే జీవితమంతా రంగులరాట్నమే అని వక్కాణిస్తూ.. ఎవరిదో ఒక పాదం క్రింద ఆలోచనలని అణగద్రొక్కడం జీవితం ఖల్లాస్ అనుకోవడం మామూలేగా ..
Life is blended with Kitchen వాక్యాన్ని చెక్కుతుండగా కాఫీ ఇవ్వవే .. అంటావ్ అధికారం ధ్వనిస్తూ నిమిషాల్లో బ్లెండెడ్ కాఫీ పొగలు కక్కుతుంది కానీ వాక్యమెక్కడికో జారుకుంటుంది నిసృహగా కలల బరువుతో ఈ రెప్పలు బాధ్యతల బరువుతో ఆ రెక్కలు ఎన్నటికీ విచ్చుకోలేవని నిత్యం సరిక్రొత్తగా అర్ధమవుతాయి. తడిచిన కళ్ళతో పాఠం నేర్చుకుని మరీ ..భోదిస్తాం. అమ్మలూ... వంటిల్లు స్త్రీలకి కిరీటం ఎప్పుడైనా [...]
రమ్మంటే రాదు  ఎంత విదిల్చినా రాని సిరా చుక్కలా   తనంతట తానే వచ్చి  పాతదే అయినా మళ్ళీ సరికొత్తగా వొచ్చి  తిరిగి  పోనట్లు బెట్టు పోతుంది  రాలుతున్న ఆకుల రాగాన్ని  కొత్త చివురులందుకున్నంత గ్రాహ్యంగా  ఆలోచన పోగు అతుక్కోక తగని అవస్థలవుతుంటే  పడమటి సంజె  వెలుగులో సాగే పొడుగు నీడలా  పక్కుమంటుంది, సౌందర్య తృష్ణ మరీ రగులుకుంటుంది   గరిక కొమ్మ మీద నీటి పక్షిలా మనసు [...]
ఒకానొకప్పుడు నిజంగా చెప్పాలంటే  ఓ పదహారు ప్రాయంలో రేడియోలో ఏ పాట విన్నా .. అబ్బా ! ఈ పాట ఎంతబావుంది, ఎవరు పాడుకున్నారో , అబ్బాయి చిలిపిగా నవ్వుకున్నాడా ? అమ్మాయి బుగ్గలు సిగ్గులతో కెంపులయ్యాయా? పాట సాహిత్యం ఎంత బాగుంది ..నీ మనసు నా మనసు ఏకమై ..అంటున్నారు. ఏకమైతేనే ఇలా అనిపిస్తుందా ? లేకపోతే ఇలా అనిపించదా ? ఇలా పాట పాడుకోవాలంటే శోభన్ బాబు లాంటి అబ్బాయిని ఎక్కడ వెతుక్కోవాలి [...]
తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏకబిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ .. నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన. కౌశిక్ అనుకుంటాడు..కల్హార మనసు నాది. ఆమె [...]
 ( తెలుగు వన్ వారి ఉగాది 2017 కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ) త్వరపడి   ఈ లింక్ లో చదవగలరు .  త్వరపడి "మమ్మీ సెకండ్ షో  సినిమాకి వెళతున్నాను " అంటూ క్రిందికి వచ్చింది రజిత. "ఇప్పుడా ?  అదీ నువ్వొక్కదానివే వెళతావా? వద్దులేమ్మా" అంది లక్ష్మి . 'ఒక్కదాన్నే అయితే మాత్రం ఏమైంది మమ్మీ! నాకిప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది వెళతానంతే!" పంతంగా అంది.  "ఇప్పుడు వద్దని [...]
నేను వ్రాసిన కథ ఈ నెల ప్రజాసాహితి మాస పత్రికలో ..  "మార్పొద్దు మాకు, మార్పొద్దు" బావ గారు... బావగారూ  బాగున్నావా ? రామారావు నవ్వుకుంటూ తలూపాడు. నీ నెత్తిన  ముత్యాల వాన కురవ, ఎంత బాగ నవ్వుతావ్ ! ముచ్చుమొహం నాయాళ్ళు,మమ్మల్ని చూస్తే చాలు మీదబడి ఏం చేత్తామో అన్నట్టో, ముళ్ళ పంది పక్కన ఉండట్టో అవతలకి పో.. పో  అని తరుముతారు. నువ్వట్టా కాదు,  బంగారు బావ వి .. ఓ ప్లైయింగ్ కిస్ [...]
కొన్నాళ్ల క్రితం  ఒక విషయం నా అనుభవంలోకి వచ్చింది . ఒకటే నవ్వుకున్నాను. ఇదంతా చదివి.అంతగా నవ్వేది ఏముంది ..అనుకోవచ్చు కొందరు. కానీ కొన్ని విషయాలు పంచుకోవాలి తప్పదు. మా వారికి అనారోగ్యం కారణంగా వైద్య పరీక్ష biopsy తీయించి diagnostic చేయడానికి ఓ  డయాగ్నొస్టిక్స్ సెంటర్ కి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి రిసెప్షన్ లో ఉన్నామె భోజనం చేస్తున్నారు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం అప్పటికే చాలా [...]
ఈ ప్రభాతాన ఆహ్లాదకరమైన విరిబాలల నవ్వులని చూపి ఆయువు కొంచమైనా అలాగే ఉండటం నేర్చుకోమన్నావ్ ఏ సీతాకోకచిలకల గుంపుకో ఈ వనానికి వచ్చే దారిచూపించి ఆ అక్షరాలని మీతో పాటు ఎగరేయమని చెప్పేవుంటావు వీనులవిందైన సంగీతాన్ని భావ పరిమళాలని కలగలిపిన పాటని రవాణా చేయమని చిరుగాలిని ఆదేశించే ఉంటావు ఉదయిస్తున్న సూర్యుడిని చూపించి ఎవరి పనిని వారు బాధ్యతతో చేసుకుపోవడమెలాగో [...]
పొరలు విప్పుకుంటున్న బాధ పొగిలి పడుతుంది రాలుగాయి రాత్రి ముందుకు కదలనంటుంది మనసంచున వ్రేలాడుతున్నదాన్ని పుటుక్కున తెంపేయలేను, మాటేసిన సంవేదనని కన్నీళ్ళతో కడిగెయ్యలేను అనుభవాలన్నీ ఆవేదనలో విభజన చెందాక రెండు సగాలు నిశ్శబ్ధ సంపుటాలై గాలికి రెపరెపలాడతాయి ప్రవాహమైనా మాటైనా గడ్డ కట్టి ఎక్కువ కాలం ఉండలేనట్లు మనాదిపడి మనిషి మిగిలి ఉండగలడా తీరం దాటే తరుణం [...]
మిత్రులారా ! 22/01/2017 ఈ రోజు ఆదివారం ఆంధ్రజ్యోతిలో నేను వ్రాసిన కథ " దాహం" చదవండి...చదివి మీ అభిప్రాయం చెప్పండి.. ప్లీజ్! -వనజ తాతినేని.చదవడానికి వీలుగా ..లింక్ కూడా ఇదిగోండి. http://epaper.andhrajyothy.com/1078931/Sunday/22.01.2017… మందుల వాసన కొడుతున్న రూమ్ లో నుండి బయటకి అడుగు పెట్టగానే  ఏరు ముందా ఏకాశి ముందా అన్నట్టు ఎత్తిపోస్తున్న గాలి కూడా  ఆహ్లాదంగా అనిపించింది.
కిటికీ పై కొలువుదీరిన మా చేమంతి చెలులు . తెలిమంచు కురిసే సమయాన చిరునవ్వులు చిందుతూ నా నిద్రమత్తుని అటకెక్కించి .. హేమంతమంటే ఏమనుకున్నావ్ ... చంచలమైన మీ నయనాలని కాస్త కుదురుగా నిలబెట్టేది మేమే కదా ! ఇదిగో విరబూసిన మా ముఖారవిందాన్ని చూసే అదృష్టాన్ని మీకివ్వడమే కదా .. అని అల్లరిగా గుసగుసలాడతాయి. నగర జీవనంలో ఓ మొక్కని పెంచడం,పువ్వు పూయించడం అనే కష్టాన్ని ఇష్టంతో సాధించడం [...]
2017 జనవరి సంచికలో "తెలుగు వెలుగు " లో వచ్చిన నా కథ .. ఆత్మీయ స్పర్శ అసలే వేసవి కాలం . ఎంత మెత్తని దిండు క్రింద అయితేనేం ? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. ఇది లేకపోతే  నాకు ఒక్క క్షణం కూడా తోచదు అనే ఈమె ఇవాళ  నన్నసలు పట్టించుకోదేమిటీ ?  కాస్త తీసి బయట పడేస్తే  బావుండును . అందరినీ  చూస్తూ నైనా కూర్చోవచ్చు . ఎవరూ పలకరించే దిక్కులేక అటూ ఇటూ తిరక్కుండా ఓ మూలపడి [...]
         నా ప్రధమ కథా సంపుటి "రాయికి నోరొస్తే" ఈ ఇరువురికి అంకితం ..                                    
మనసుపొరల్లో ..ఆఖరి మూడు భాగాలు చదివిన తర్వాత ..నా స్పందన ఇలా ... ఓ ప్రేమికుడి విషాద పయనం .. గత కొద్దీ రోజులుగా స్క్రీన్ పై చదవడం అంటే విరక్తి కల్గింది. కొందరి రచనలు వైరాగ్యంలో ముంచెత్తిస్తే మరికొందరి బీభత్సమైన కవిత్వాలు చదివి భళ్ళున వాంతి చేసుకున్న భావన కల్గింది. మందెక్కువైతే మజ్జిగ పలుచన అయినట్లు పేస్ బుక్ వేదిక భావాలని పలుచన చేసి పాలరాయిమీద పాలు జారినంత తేలికగా [...]
నా కథల సంపుటి "రాయికి నోరొస్తే" విడుదలైంది. అందులో నా మాట ఇలా .. విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని . చదువుకునేటప్పుడు కాలేజ్ మేగజైన్ లో వ్యాసాలూ చిన్న చిన్న కవితలు వ్రాసిన నేను తర్వాత తర్వాత ఆకాశవాణికి చిన్నచిన్న స్క్రిప్ట్ లు వ్రాసి,కవిత్వం వ్రాసి ప్రశంసలు అందుకుంటానని అప్పట్లో తెలియదు . అలాగే సొంత బ్లాగ్ ఒకటి రూపొందించుకుంటానని కూడా అనుకోలేదు. ఎప్పుడూ ఇలా [...]
ఇదిగో ..ఇప్పుడే పుట్టినట్టు ఉంటుంది సంబరం. నా కళ్ళల్లోకి నిండు వెలుగు నిండుకున్న క్షణాలు ఇవిగో ..అంటూ ఆ క్షణాలకి వెనక్కి ప్రయాణం చేస్తుంటాయి. ఈ పేగు బందానికి అప్పుడే 29 ఏళ్ళు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మధ్య మధ్యలో అమ్మ రెక్కల నుండి దూరంగా జరిగినప్పుడూ ప్రాణమంతా ఓ తలపుగా మారి శ్వాసంతా ఆకాంక్షగా మారి నువ్వు పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ప్రేమ,భాద్యత రెండూ [...]
అతని కోసం వెతుకుతున్నాను .  వెతికి వెతికి అలసి పోయాను . కనబడ్డప్పుడు యాధాలాపంగా చూసిన చూపే తప్ప  ఓ తాలు నవ్వు నవ్వని పొదుపరితనం  గుర్తొస్తుంది    గింజ నేలబడితే చిగురంత పొగరైనా కానరాకుండా  కళ్ళకద్దుకున్న అతనిని చూసి  అపహాస్యం చేసిన రోజొకటి జ్ఞప్తికొస్తుంది    జనారణ్యంలో తప్పిపోయినతన్ని  ఇప్పుడు  హృదయాన్ని కళ్ళు కుట్టి  మరీ వెతుకుతున్నా  ఆకాశ హర్మ్యాల [...]
ఇదిగో వింటున్నావా ..? ఈ రాత్రి నా నిశ్శబ్ధాన్ని అందులో కలగలిసిన కొంత జ్వలనాన్ని విప్లవ గీతాన్ని కన్నీటి భాషానినాదాలని కొంచెం మనసు పెట్టి విను  అలా వెన్నుముక  చూపకు ఎవరి వంతులో ఉన్నది వారే అనుభవించాల్సి ఉన్నా అయిష్టంలో నైనా వినితీరాల్సిన సమయమిది జ్ఞాపకాల ఊరేగింపులో అడుగు కలపలేని ఈ   నిశ్శబ్దాన్ని చెవి ఒగ్గి... కొంచమైనా విను నా వీపున సంధించలేని [...]
   ఉదయాన్నేలేచి  తన ఇంటి ముందు నిలబడి సూర్యోదయాన్ని కంటారా చూసి "పొడుస్తూ భానుడు పొన్నపువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ " అని పాడుకుంటూ  యధాలాపంగా చుట్టూ చూసింది. తెల్లారేసరికల్లా ఆకాశంలో నల్లగా కమ్ముకొచ్చిన మబ్బులకి మల్లే  లేచొచ్చిన భవనాలని చూసి రోజూ లాగే దిగులుపడింది మోహన. ఆ దిగులుతోనే అన్యమనస్కంగా ఇంటి పని [...]
ఇరవయ్యేళ్ళ క్రితం ఒకానొక సిగ్గుమాలిన పని చేసి మీ పెదనాన్న  ముందు  రఘు దోషిగా నిలబడ్డాడు . మా ఎదురుగా పెదనాన్న  స్నేహితుడు రాఘవరావు మాస్టారు ఆయన భార్యజానకమ్మ , కూతురు మోహన.  కందిరీగ నడుమేసుకుని సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోయే మోహనని  ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవాడు. ఆమె వాటిని సరదాగానే తీసుకునేది.  కాలేజ్ కి వెళ్ళడానికి రోడ్డు మీద  ఒంటరిగా నించున్నప్పుడు చూస్తే మరింత [...]
మర్నాడుదయమే  రఘు కాలేజ్ కి వచ్చేసరికే పనిలో బిజీ అయిపోయిన ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు ఆక్వాటిక్ ప్లాంట్స్ నాటడం కోసం చిన్న చెరువుని తవ్విస్తూ  తవ్విన మట్టిలో వర్మీ  కంపోస్ట్ కలిపి కుండీలలో  సగం పైగా నింపి  ఒక ప్రక్కకి పెట్టిస్తూ ఉంది. దగ్గరకొచ్చి "అప్పుడే పని మొదలెట్టేసారా? ఈ రోజు రెస్ట్ తీసుకావాల్సింది" "నర్సరీ వాళ్ళు ఈ రోజు సాయంత్రానికల్లా లోడ్ పంపిస్తామని [...]
లతాంతాలు రెండవ భాగం రెండోసారి అతనొచ్చినప్పుడు వాన లేదు కానీ  పుష్యమాసపు వెన్నెల్లో  ఇంటి ముందు దడికి అల్లుకున్నతీగపై  తెల్లని అనపపూల సౌందర్యాన్నిచూసి మైమరపులో పడినప్పుడు  ప్రక్కనే వచ్చి నిలబడి చిన్నగా దగ్గాడు. ఉల్కి పడింది. "మీతో చిన్నపని  పడింది అందుకే రాక తప్పలేదు" అన్నాడు. "లోపలి రండి." ఆహ్వానించింది . "ముందుగా మీరు  నాకొక హామీ ఇవ్వాలి. మీ మార్క్ కాఫీ [...]
ఫ్రెండ్స్ .... లతాంతాలు అనే కథ వ్రాసాను. అనుకోకుండా అది కాస్త పెద్దదిగా అయిపోయింది. పత్రికల వారికి పంపినా ప్రచురణకి ఎంపిక అవదు. ఈ సంశయంతోనే  కథని అలాగే ఉంచేసాను. అందుకే బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను .. చదివి ఎలావుందో ...చెప్పండి ప్లీజ్ !  ఉదయాన్నేలేచి  తన ఇంటి ముందు నిలబడి సూర్యోదయాన్ని కంటారా చూసి "పొడుస్తూ భానుడు పొన్నపువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ శ్రీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు