నీవేనా...నిశబ్దపు ఆవలి ఒడ్డు నుంచి నన్ను కలవరించినదినీవేనా...ఒంటరితనపు అవతలి వైపు నుంచి నన్ను పలకరించినదిఇప్పుడునేనేం అర్ధం చేసుకోను!!!ఈ నిశ్శబ్దాన్నా లేక నీ శబ్దాన్నా???నేనెలా బ్రతకను!!!ఆ ఏకాంతంలోనా లేక నీ కాంతగానా???అయినా నా పిచ్చి గానికలల్లో కూడా ఈ కలవరపాటు ఎమిటో!!!
కళ్లలో పుట్టి కన్నీటితో జారిపోయేది కాదు ప్రేమంటేమనసులో పుట్టి మరణించే వరకూ వెంటాడేది ప్రేమంటే
అమ్మ పిచ్చిదిచందమామ రాదని తెలిసినా పిలుస్తునే ఉంటుందిఅమ్మ వెర్రిదినాకు మాటలు రావని తెలిసి తానూ నాలాగే మాట్లాడుతుందిఅమ్మ మూర్ఖురాలుఎప్పుడూ నా విషయం లో నాన్నతో వాదిస్తుంటుందిఅమ్మ కోపిస్టిదినన్ను ఎవరన్నా ఎమన్నా అంటే వాళన్ని తిడుతుందిఅమ్మ చెవిటిదినేను ఎన్నిసార్లు కసురుకున్నా వినిపించదుఅమ్మ స్వార్ధపరురాలుఎంత సేపూ పిల్లలు బాగుండాలి అనే కోరుకుంటుందిNote: ఇన్ని [...]
సరోగసీ నిర్మూలన ఆకలి కడుపుకుఆశగా రూపాయి రుచిని చూపించిఅద్దెకు గర్భమనిఅభాగ్యులకు వరమని నమ్మించిఅంగడి సరుకులాగాఅమ్మతనాన్ని అమ్మించిఆర్ధికంగా అంచెలంచెలుగా పైకి ఎగబాకిన దళ్ళారులారా మేలుకోండి ఇకనయినాఅమ్మంటే అమృత కలశమని తెలుసుకోండి ఎప్పుటికయినా
కొన్ని క్షణాలే నేను నిన్ను చూసింది కొన్ని క్షణాలే కోపాన్ని, కొంత మొహాన్ని మౌనాన్ని, మాటల ప్రవాహాన్ని ప్రేమని, పరిహసించే హాస్యాన్నినేను నీ కళ్ళ లో చూసింది కొన్ని క్షణాలే మరి దేనికోసం ఈ శోధన... దేనికోసం ఈ వేదన... కత్తుల్లాంటి ఆ కళ్ళ కోసమా???మురిపించే నీ మాట కోసమా!!!
ఎదలయల శృతుల్లో అపశృతులు దొర్లుతుంటేతారా స్థాయిలో వేదన వినిపించాలి అని ఉన్నామనస్సు సవరించిఆనంద రాగం ఆలపించే ప్రయత్నం చేస్తున్నాతెగిపడిన తీగలని సరిచేసుకుంటూమరచిపోయిన స్వస్థానాన్ని గుర్తు చేసుకుంటూఅలనాటి ఆనందపు గమకాల్ని నెమరేసుకుంటూమౌన రాగం మీటుతున్నా!!!
వనితను నేనువేధింపులకు విడిదిని కానువిద్య నేర్చిన వినయాన్నిఆడదాన్ని నేనుఅంగడి సరుకును కానుఅమ్మతనపు ఆత్మీయతనుపడతిని నేనుపడటింట బొమ్మను కానుఇంతిని నేనుఇంటి పనిమనిషిని కానుఈ దేశపు గౌరవాన్నిరాముడి వెంట సీతను నేనుకృష్ణుడి వేబ్త సత్యను నేనుమౌనంగా భారించినాధైర్యంగా ఎదిరించినాచల్లని చూపుల సిరి గల తల్లిని నేనుస్త్రీ శక్తి ని నేను!!!
విశాఖను నేనుమహా సుందర నగరాన్నిసముద్రపు సవ్వళ్ళతోపచ్చదనపు నవ్వులతోపలకరించే నేస్తాన్నివిశాఖను నేనులక్షల జనానికి నివాసాన్నిజ్ఞానదీప్తి ప్రకాశాలతోఎన్నెన్నో కొలువులతోఆదరించే అక్షయ పాత్రనువిశాఖను నేనుశాంతికి చిహ్నాన్నిరంగు రంగుల చిలుకలతోచిన్ని చిన్ని పిచ్చుకలతోఅల్లుకున్న పోదరింటినికానీ ఈనాడు హుద్ హుద్ తుఫానునా మెడను వంచేసిందితలను దించేసిందిఅయినా [...]
అచేతనమైన ఆకాశానికిఅతి చంచలమైన చూపుని అతికించిఈ జనారణ్యం లో బ్రతుకెలా అని చూస్తూ ఉండిపోయిందినలుపు రంగు పూసుకున్నఆ నీలాకాసం లోని నక్షత్రాలన్నినిన్నటి వరకు ఆమె కళ్ళలో మెరిసేవికాని ఆధునికత వీధుల్లో వెర్రి విహారం చేస్తున్న ఈనాడుఆమె మాత్రందురాచారాల జ్వాలలకు దిష్టిబొమ్మలా తగలబడిపోతూనే ఉందికామంధుల రక్కసి గోళ్ళకు బలై రక్తం చిందిస్తూనే ఉందికన్నీళ్ళతో [...]
కలలు కనే రాతిరిలోపలకరించే వెన్నెలలాఅలలు పొంగే కన్నులలోతడిని పీల్చే కాలంలానన్ను అల్లుకుంది నీ వలపుల వలకలవర పెడుతున్న నిశబ్దంలోప్రణవమై శృతిలయలు పెంచుతావనీమనస్సుని తరుముతున్న చీకటిలోమిణుగురువై అందమైన ఆనందాన్ని పంచుతావనీఅనుకున్న నన్ను అదుకుంటావు అనుకున్నానుకానీ ఆడుకుంటావు అనుకోలేదుకొన ఊపిరి తో ఉన్న హృదయాన్ని కొలిమిలో కాల్చికొండంత విజయాన్ని సాధించాననే [...]
She loves him so muchHe never felt it soShe cares for him very muchHe never did suchHunger in his stomachMakes her feel like a motherTears in his eyesMakes her cheeks wetSmile on his lipsCan make her laughBoredom on his faceCan even make her a cartoonIn fact he is her everythingBut she is his nothingYet she loves him so much...
నెర్రెలే నగలైన నీ మనస్సునిఅణువణువునా తడిపే జల్లునైపగలంతా పడిన అలసటనితీర్చటానికి కమ్ముకొచ్చే చీకటినైచెలిమి చంద్రుడి ప్రేమ వెన్నెల్లోపరుగులు తీసే పిల్లగాలి మొసుకొచ్చే మల్లెల సుగంధమైనీ తలపుల హరివిల్లుకివలపుల ఊయల కట్టినీ జంటనై ఊగాలనే నా చిన్ని ఆశ తీరేదేనాటికో!?!
ఏనాడో తాళం వేసిన నా మనస్సు గదిని తెరిస్తేఅందులోచిరిగిపోయిన చిత్తు కాగితాల్లాచెదపట్టిన చెక్క ముక్కల్లాచెల్లా చెదురుగా పడి ఉన్న నీ జ్ఞాపకాలు కనిపిస్తాయినాకు మిగిలింది నువ్వు కాదు నీ  జ్ఞాపకాలే అనిగుర్తొచ్చి నేను మౌనంగా రోధిస్తానుఅందుకే మనస్సుకి తాళం వేసి పారేశా!!!అది దొరికిన వారు నా మనస్సుని మరలా తెరవకండితెరచిన వారు నన్ను మరలా ఒంటరిగా విడవకండి
దారిద్ర్యపు దారుల్లోఆకలి చావులెన్నోదప్పిక కేకలెన్నోచీకటి త్రోవల్లోచితికిపోయిన బ్రతుకులెన్నోసిధిలమవుతున్న దేహాలెన్నోమురికి వాడల్లోముగిసిపోయిన కధలెన్నోమగ్గిపోతున్న జీవితాలెన్నోమసక బారిన మనసుకు పరోపకారం అనే పెద పెదకళ్ళద్దాలను తొడిగికళ్ళలో పేరుకుపోయిన ఇసుక పొరను తొలగించి చూడండివీరిలో కొందరికైనా మన వంతుసహాయం చేసిచేయూతను అందించాలనిపిస్తుందేమో!!!
వసంతాల తీరంలోవిషాంతాల అలైప్రశాంతాల దారుల్లోప్రమాదాల ముళ్ళైనీ నిషా కళ్ళ తలపులునను నిసి రాతిరి లో వేధిస్తుంటేఉషా కాంతుల వెల్లువ దరి చేరనీకబాధనే వరించానుకన్నీటిని అక్షతలుగా కురిపిస్తూనీ గురుతులనే సాక్ష్యులు చేస్తూ...
తొలి రోజులుతొలి పలుకులుతుది మజలి ఏదైనాఈప్రయాణం తీయనిదినా ప్రణయం మరువనిదినా మలి శ్వాస విడిచే వరకూనీ తొలి చూపుల స్పర్స నన్ను వదిలిపోదునా ప్రాణాలు ఈ అనంత వాయువులలో కలిసే వరకూనాకు ఈ అనంతము నీవే సఖి!ఇట్లు నీ నేను...నా నువ్వు అవుతావని ఎదురు చూస్తూ...
కళ్ళ నిండా కలలతోగుండె నిండా ధైర్యంతోఆనందపు ఆల్చిప్పలను ఏరుకుంటూలోకులు అనే సొర చేపల నోటికి చిక్కకుండాకష్టాలు అనే సుడిగుండాలకు బెదరకుండాజీవితపు సంద్రాన్ని ఓర్పుగా ఈదుతూమనసు కోరిన తీరంలో విజయాలు అనే గవ్వల్నిదోసిటి నిండా చేజిక్కించుకో గలిగితేవందల్లో ఒక్కడిగా నిలుస్తావుపది మందికి ఆదర్శం అవుతావు!!!
నాచుట్టూ ఆనందాన్ని వెలివేశానువిషాదాలతీరంలో విహరించాలనిరెప్పలమట్టున ఉప్పెన ముంచుకొస్తున్నానామనస్సనే శిలా ఫలకం పై చెక్కిన నీ గురుతులు చెరిగిపొవనే ధీమాతోనాపెదవి పై చిరునవ్వుని తరిమేశానుగాయపరిచేగ మ్యానికి దగ్గరగా ఉండాలనిగుండెల్లోగునపాలు దిగుతున్నానాలోఆశ చివరి శ్వాస విడిచేలోగా నీ నీడనైనా చేరుకోగలననే ధైర్యంతోకానీనాలో ధైర్యాన్ని, ధీమాని నేల [...]
మండు వేసంగిలో సీతలత్వాన్ని వెతకినట్టునిసి రాతిరిలో సూర్య కాంతిని వెతకినట్టుపట్ట పగలు చుక్కల్ని వెతకినట్టుకటిక పేదవాడు జోబి వెతకినట్టుపరమ లోభి ప్రశంతతను వెతకినట్టుఅవకాశం లేని చోట ఆశాగా వెతుకుతున్నాపాషానం లాంటి నీ హృదయంలో                   నా పై ప్రేమనిగాయపరిచే నీ మాటల్లో                   నా జీవిత గమనాన్నిలోకం [...]
రాభంధులుఅంతరించి పోతున్నాయని భయమేల?నీచుట్టూ ఉన్నవి చూడు అవి కాదా!గుడ్లగూబలుఅంతరించి పోతున్నాయని భయమేల?నీమెదడును తట్టె చెడు ఆలొచనలు చూడు అవి కాదా!చిరుతపులులుఅంతరించి పోతున్నాయని భయమేల?నీస్వార్ధపూరిత పనులు చూడు అవి కాదా!ఇంకెందుకుకౄర మృగాలు అంతరించిపోతాయి!?!నువ్వు, నీ చుట్టు ఉన్న వాళ్ళు బ్రతికున్నంత కాలం!!!
రాలిపోయే ఆకువాలిపోయే కొమ్మకురిసిపోయే మేఘంసాగిపోయే గాలిఅన్నీ మానవుని ఉనికికి సహాయపడితేమానవుడు మాత్రం వాటిని కలుషితం చేస్తూతన మనుగడని తనే కష్టతరం చేసుకుంటున్నాడుతోటి వారికి సహాయ పడకపోయినరండి మనకి మనం సహాయపడదాంపర్యవర్ణాన్ని పరిరక్షిద్దాం!!!
కలనైనా మర్చిపోదామని ప్రయత్నించానుకనుపాపలలో నింపుకున్న నీ రూపాన్నికలలన్ని కన్నీటిగా జారినాకవ్వించే నీ రూపం కనుమరుగవ్వదే!ఊహనైనా నీ ఊసు మర్చిపోగలనని ఊహించానుఊహలన్ని ఉప్పెనై ముంచుతున్నాఊరించే నీ మాటల మధురిమ నన్ను విడిచి పోదే!నన్నింతలా మార్చి, ఏమార్చి ఎటు పోయావు!?!నన్నిలా వెంటాడి, వేధించి ఏం సాధిస్తావు!?!
ఆత్మ ఆకాసంలోకి రివ్వున ఎగిరిందిమానవ శరీరం మట్టిలో కలిసిందిఅనుకోనే లేదుఆనాటి సంతోషాలు ఇంతలా బాధిస్తాయనినీవు కలిసిన మట్టినంతటిని చేర్చి నిన్ను గా చేసిఅనంత వాయువు లో నీ ఊపిరిని వెతికి నీకు పోయలనిపిస్తుందికానీ నాకా అవకాశం లేదే!నేను చేయగలిగిందల్లా ఒక్కటేనిరంతరం నీ చింతనలో చింతను దిగమింగిఆత్మంతరాల్లోకి వెళ్ళి నీతో కలిసి బ్రతకటం
ఏముందని నీకు నాకు మధ్య?కంటికి రెప్పకి మధ్య నలిగిన కన్నీళ్ళు తప్ప!ఏముందని నీకు నాకు మధ్య?మాటకి మౌనానికి మధ్య మిగిలిన నిశ్శబ్దం తప్ప!ఏముందని నీకు నాకు మధ్య?నింగికి నేలకి మధ్య ఉన్నంత దూరం తప్ప!ఏముందని నీకు నాకు మధ్య?ఏడారికి మంచి నీటికి మధ్యనున్న బంధం తప్ప!అయినా ఎందుకో ఈ మనసునిన్ను చూసి మురిసిపోతుందినిన్ను తలచి నవ్వుకుంటుంది!!!
నా దంటూ ఉన్నదని గురుతేరాకనా మనస్సు నీ భావనలు పలికిస్తుంటేనేనంటూ ఉన్నానని మరిచేపోయినా అడుగులు నీవెంటే పడుతూ ఉంటేనువ్వంటూ ఏమి మిగలకనాలో లీనమైపోతేమనదంటూ ఓ ప్రేమ కధ మొదలవుతుంది!!!
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు