జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs రచయిత srinivasa kumar నుండి వ్యాఖ్యలు 
సవీతా టీచర్ ఇంటికి వెళితే ఇనుప వలల మధ్య భద్రంగా ఉన్న ఒక స్కూటర్ కనిపిస్తుంది. అదేదో కేరళ మహారాజులు ఉపయోగించిన  స్కూటర్ అనుకోకండి. దాని మీద వాలే హక్కును కేవలం పిచ్చుకలకు మాత్రమే ఇచ్చారు ఆ టీచర్. ఆ ఊరి వాళ్ళు రోజూ వచ్చి ఆ స్కూటర్‌ని ఓసారి చూసి పోతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీన్ మారి మళ్ళీ ఆ స్కూటర్‌ని ఆవిడ వాడుకుంటారనుకోండి. అది వేరే విషయం ఇంతకీ అసలేం [...]
కోడి పేరెత్తగానే ఎప్పుడు కూరొండుకుని తినేద్దామా అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌లో ఉన్న ఓ కోడిపుంజు ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసాన్ని చూపిస్తోంది. మామూలుగా అయితే, మనుషులు దగ్గరకు రాగానే కోళ్లు పరుగులు తీస్తాయి. కానీ సుల్తానాబాదులోని అమృతమ్మ ఇంటి దగ్గర కొత్తవాళ్ళు కనిపిస్తే కోడి వెంటనే దాడి చేస్తుంది. వెంటపడి, [...]
అవును... పేదోళ్ళకు ఎంతో సాయం చెయ్యాలని ఎందరో అనుకుంటారు. కానీ, జేబులోంచి డబ్బులు తీయాలనేసరికి 'తర్వాత ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చూద్దాం లే..' అనుకుని జీవితకాలం పాటు వాయిదా వేసుకుంటూ పోతారు. కానీ, హైదరాబాదు వాసి అయిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి గౌతమ్ కుమార్ మాత్రం తనకు ఆలోచన వచ్చిందే తడవుగా 'సర్వ్ నీడీ' (అవసరార్థులకు సేవ) అనే సంస్థను ప్రారంభించి ఎందరికో అండగా [...]
తెలంగాణ రాష్ట్రం కుమరం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న సావర్‌ఖేడ్ గ్రామానికి వెళితే ఉపాధ్యాయులనేవారు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునేవారంతా ఈ గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగయ్యను కలిస్తే ఈ వృత్తికున్న పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. తాను పనిచేస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులకు స్వంత డబ్బుతో డిజిటల్‌ పాఠాలు చెబుతున్నారు రంగయ్య. ఇది [...]
హైదరాబాదులో ఐదుగురు విద్యార్థినులు సౌమ్య, సంయుక్త, అద్వితీయ, అనూష, సాత్విక అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఫిబ్రవరి 5న నోవాటెల్‌ హోటల్‌లో  పాటలు పాడి డబ్బు సేకరించారు. సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించిన ఈ విద్యార్థినులు ఒక బృందంగా ఏర్పడి సుమారు మూడు గంటలకు పైగా పాటలు పాడారు. మొత్తం  5 లక్షల రూపాయలు సేకరించి ‘గ్రేస్‌ [...]
స్విట్జర్లాండ్ నివాసి నాన్సీ హోల్టన్‌ (42) గోవు మెడలో గంట వద్దంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నెదర్లాండ్‌లో జన్మించిన ఈమె తన ఎనిమిదేళ్ల వయసు నుంచి స్విట్జర్లాండ్‌లోనే నివసిస్తున్నారు. అవుల మెడలో తగిలించే గంటలు బరువుగా ఉంటాయని, అవి ఆవు చర్మానికి రాసుకుపోయి గాయాలు చేస్తుంటాయని నాన్సీ ఆవేదన చెందుతున్నారు. 100 డెసిబుల్స్‌ శబ్దం చేసే ఇలాంటి గంటలను మన కంఠంలో చెవులకు [...]
భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో ప్రజల్ని చిల్లర సమస్య ఎంతగా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనం చిన్న చిన్న అవసరాల కోసం ఏం కొనాలన్నా, వ్యాపారులు అమ్మాలన్నా ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు కూడా ఇబ్బందులు తప్పవనే అనుకున్నారు కానీ.... పుస్తక ప్రియులకు చిల్లర [...]
వెయ్యి, 500 నోట్ల రద్దయిన ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర కోసం జనం రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇలా వయో, లింగ భేదాలతో సంబంధం లేకుండా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద రేయింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు.  పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలు, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పెరుగుతున్న క్యూలను చూసిన ఓ వ్యాపారి వారి కష్టాలు తీర్చడానికి పెద్దమనసుతో [...]
పుట్టినరోజులనగానే మనలో చాలామంది స్నేహితులిచ్చి టాయ్స్ కోసం ఎదురుచూస్తుంటాం. అయితే, చెన్నైలో ఉంటున్న విద్యార్థిని అక్షయ (13) తన పుట్టినరోజు సంబరాన్ని కొత్తగా చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక, తన పుట్టినరోజు నాడు మరో పేద బాలికకు భలే బహుమతిని ఇచ్చింది. ఆమెకు టాయ్‌లెట్ కట్టించి చక్కని కానుకను ఇచ్చింది.  తన పుట్టినరోజున మరో బాలికకు ఇలాంటి సాయం చెయ్యాలని [...]
మీనా మెహతా... ఈ పేరు వింటే సూరత్, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బాలికలందరికీ ఒక ఆరాధనా భావం కలుగుతుంది. ఎందుకంటే, మీనా ఆ బాలికలకు అందిస్తున్న సాయం మిగతా దాతలకంటే భిన్నమైంది కనుక. సాధారణంగా పేద బాలబాలికలకు స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు, పెన్సిళ్లు, ఒక పూట భోజనం లాంటివి దాతలు అందిస్తుంటారు. కానీ, మీనా మెహతా రూటే సపరేటు. ఈమే ఆ విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. [...]
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నార్‌ఫోక్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి 1000 బార్బీ డాల్స్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమె పేరు గియానీ గ్రాహం (Gianni Graham) అవన్నీ తానొక్కత్తే ఆడుకోవడానికి కాదు. తనకి అలాంటి బొమ్మలు చాలానే ఉన్నాయి. కానీ, తనలాగా బొమ్మలతో ఆడుకునే భాగ్యం లేని నిరుపేద బాలికలకు పంచడానికి ఈ సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడుకునే తోడులేక ఒంటరిగా [...]
ప్రభుత్వాలు చెయ్యని (చెయ్యగలిగినవే...) పని 17 ఏళ్ల కుర్రాడు పూర్తి చేసి నేటి తరానికి, భావి తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ముంబై నగరంలోని సాతే నగర్ ప్రాంతంలో బడికి వెళ్లడానికి రోజూ మురికి కాలువను దాటుతూ నానా అవస్థలు పడుతుండేవారు. ఆ చిన్నారుల అగచాట్లను గమనించిన ఎషాన్ బాల్‌బలే వారి కోసం తాత్కాలికంగా సాతేనగర్ నుంచి పీజీఎంపీ కాలనీ వరకు 100 అడుగుల మేర వెదురుతో ఒక వంతెన [...]
సాయం చెయ్యాలన్న మనసుండాలి గానీ, అందుకు చేతి నిండా డబ్బుండాల్సిన పనిలేదని నిరూపించాడు నెల్లూరు వాసి చాట్ల వెంకటరత్నం. ఈ పట్టణంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న విద్యుత్‌భవన్ ఆఫీసు ప్రహరీగోడకు ఆనుకుని కనిపిస్తుంది ఒక చిన్నపాక. అందులో రోజూ చెప్పులు కుడుతూ కనిపించే వ్యక్తే వెంకటరత్నం. అక్కడికొచ్చి చెప్పులు బాగు చేయించుకునే వారికి ఒక బోర్డు కనిపిస్తుంది. అది చదివితే [...]
డాక్టర్లంటే రోగుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసేవారనే ముద్ర పడిపోయిన రోజులివి. కానీ వైద్య నారాయణులున్నారని నిరూపించారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ఉదయ్ కృష్ణ. ఒక లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు నుజ్జునుజ్జయిపోయి, ఇన్ఫెక్షన్ సోకి గుండెలు అరచేతిలో పెట్టుకున్న ఒక రోగికి ఆపరేషన్ ఖర్చు 1.66 లక్షల రూపాయల్ని ఆయనే భరించారు. ఆ రోగి గుంటూరు జిల్లా వినుకొండకు [...]
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాకు చెందిన ఉమ ఒక మామూలు గృహిణి. కానీ వీధి బాలల కోసం ఆమె చేసిన విద్యా సేవలు చూస్తే ప్రమాణాలు దిగజారిన మన విద్యావ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల పరిసరాల్లో చదువూ సంధ్య లేకుండా తిరిగే వీధి బాలల కోసం ఏదో ఒకటి నిశ్చయించుకుని 2003లో సిరాగూ మాంటిస్సోరీ స్కూలును ఏర్పాటుచేశారామె. బిచ్చగాళ్ల పిల్లలు, వీధి [...]
ఆ రైతు పేరు జ్ఞాన్ సింగ్. స్కూలు పాఠాల జ్ఞానమైతే ఆయనకు లేదు గానీ, తన సమాజానికేం చెయ్యాలో మాత్రం తెలిసిన జ్ఞాని ఆయన. బరేలా అనే గిరిజన జాతికి చెందిన జ్ఞాన్ సింగ్, మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా మెల్ ఫాలియా గ్రామంలో ఉంటారాయన. ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరిగితే, పాపం ఆయన కదలలేక... ఏ పనీ చేసుకోలేని అవస్థకు గురయ్యాడు. వైద్యం చేయించుకోవాలంటే, తమ ఊరికి అడ్డుగా ఉన్న ఒక కొండను [...]
ఎవరైనా సరే... ఆస్తులు, నగలు ఎప్పుడు అమ్ముకుంటారు? అప్పులు గాని, అనారోగ్య సమస్యలు గాని, పిల్లల చదువుల కోసమో... సొంతిల్లు కట్టుకునేందుకోవడానికో అమ్ముతారు. కానీ మరాఠీ గ్రామీణ మహిళ సంగీత అహాల్వే తన మంగళసూత్రంతో సహా నగలన్నీ అమ్మేసింది. మహారాష్ట్రలోని వషీం జిల్లా పరిధిలో ఉన్న సాయిఖేదా గ్రామ వాసి సంగీత అహ్వాలే. నగల కంటే మరుగుదొడ్డే తన కుటుంబానికి మేలు చేస్తుందని భావించింది. [...]
అతని పేరు అరుణ్ కృష్ణమూర్తి. 26 ఏళ్ళ వయసు వచ్చేసరికి అతను సాధించిన ఘనత ఏంటో తెలుసా.. దేశంలోని 6 సరస్సులకు జలకళ తీసుకొచ్చాడు. ప్రకృతి మాత మనకు వరంగా ప్రసాదించిన జలవనరులను కాపాడుతున్నాడు. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని తానే చేస్తున్నాడు. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి మరీ స్వచ్ఛంద సంస్థ స్థాపించి దేశ ప్రజల దాహార్తి తీర్చుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రోలెక్స్ [...]
ఒక పక్క క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. 91 సంవత్సరాల వయసులో 42 కిలోమీటర్ల దూరాన్ని 7గంటల 7నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేశారు బామ్మగారు హారియట్ థాంప్సన్. పైగా ఇదేదో రికార్డు కోసం కాదు. ఈ వయసులోనూ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనే ఆమెను పరుగు తీయించింది. తన స్నేహితురాలు నిర్వహిస్తున్న లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు బామ్మ పరుగు పెట్టి ఏకంగా 90 వేల [...]
హిజ్రాలంటే ఏహ్య భావంతో చూసే సమాజం ఇది. కానీ, తమిళనాడులో గ్రేస్ బాను అనే హిజ్రా తనకు  ఎదురైన అవహేళనల్ని తట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. అన్నా యూనివర్శిటీ కౌన్సిలింగ్ ద్వారా అరక్కోణంలోని శ్రీకృష్ణా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ట్రిపుల్ ఇ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్) కోర్సులో చోటు దక్కించుకుంది. పాలిటెక్నిక్‌లో గ్రేస్ 94 శాతం మార్కులతో [...]
మధ్యప్రదేశ్‌లో నివసించే శ్యామ్ లాల్ పతిదార్ తన కొడుక్కి ప్రతి ఏటా క్రమం తప్పకుండా పుట్టినరోజు వేడుక జరుపుతుంటాడు. కొడుకును ముద్దు పెట్టుకుని మురిసిపోతుంటాడు. ఇంట్లో తిండి గింజలు లేకపోయినా పట్టించుకోడు కానీ, తన చెట్టంత కొడుకు పుట్టినరోజున కేక్ కట్ చేసి, బుడగలు కట్టి నానా హడావుడి చేస్తాడు. ఇంతకీ ఆ కొడుకు అంత గొప్పవాడా.. అని మీరు అడగవచ్చు. అవును మరి. ఆ చెట్టంత కొడుకు [...]
రిటైర్ అయిన తరువాత హాయిగా ఇంట్లో కూర్చుందామనుకోలేదు ఆ పెద్దాయన. ఇస్తున్న పెన్షన్‌కు తగిన పని చేస్తానంటూ మళ్ళీ ఆఫీసు బాటపట్టారు. తమిళనాడులోని శ్రీరంగంలో నివసిస్తున్న రిటైర్డ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ వి గోపాలన్ గారి జీవితం ఇది. అక్కడికి 9 కిలోమీటర్ల దూరాన మన్నార్‌పురంలో పనిచేస్తుండేవారు. అయితే 2006లో రిటైర్ అయినప్పటికీ పెన్షన్ పేరిట డబ్బులిస్తున్నారు కనుక అందుక [...]
అతనే బాబర్ అలీ. 17 సంవత్సరాల ఈ కుర్రాడు 9 ఏళ్ళ వయసుకే ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి అలా అలా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ గ్రామానికి చెందిన అలీ బెర్హంపూర్‌లో ఉన్న కాసింబజార్ రాజ్ గోవింద సుందరి విద్యాపీఠ్‌లో ఒక పక్క ప్లస్ టూ చదువుకుంటూనే తన ఊళ్ళో పేదల కోసం తమ ఇంటి పెరడులో ఏర్పాటు చేసిన బడికి [...]
నాడు సత్యవ్రతుని కోసం భార్య సావిత్రి యముని వెంటపడి మాంగల్యాన్ని దక్కించుకుంటే... నేడు బిడ్డ సావిత్రి కోసం యజమాని సత్యమూర్తి తపనపడి చేప ప్రసాదం ఇప్పించాడు. అసలీ సావిత్రి ఎవరు?.. ఆమె చేప ప్రసాదం తింటే మాకేంటి?... అనుకుంటారేమో. మన మామూలు కళ్ళకు ఆమె ఒక కుక్కలా కనిపించవచ్చు గానీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నివసించే ఏసీ వ్యాపారి సత్యమూర్తికి మాత్రం సావిత్రి తన కన్నబిడ్డ [...]
ఒక జిల్లా కలెక్టర్ తన కూతురిని కార్పోరేట్ స్కూల్‌లో కాక సర్కారు బడిలో చేర్పించారంటే నమ్ముతారా!.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు 2011లో కలెక్టర్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ తన ఆరేళ్ళ కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకుని అలాగే చేశారు. తన కుమార్తె గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాలలో రెండవవ తరగతిలో చేర్పించారు. ఈ జిల్లాలో చాలా పెద్ద [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు