మనిషి తన లోటుపాట్లు తెలిసి కూడా తనను తాను ఇష్టపడటం మానడు. అవే బలహీనతలు ఎదుటివారిలో కనిపించినప్పుడు వారిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అదే ఈ సృష్టి విచిత్రం. 
ప్రతొక్కటీ తాత్కాలికమే.. నీ ఆలోచనలూ, భావోద్వేగాలూ, వ్యక్తుల పట్ల దృక్పథం.. వీటితో బంధం ఏర్పరుచుకొనే బదులు వాటిని అనుసరించడమే మేలు.. 
నీవు చేసింది సరైనదని అని నీకనిపిస్తే - ఇతరులు దాన్ని విమర్శిస్తారు, అరుస్తారు, బాధిస్తారు.. కానీ అవేమీ పట్టించుకోకు. ప్రతి ఆటలో చూసేవాళ్ళు మాత్రమే అలా చేస్తుంటారు..  ఆడేవాళ్ళు కాదు అని గుర్తుపెట్టుకో. నీమీద నీకు నమ్మకం ఉంచు.. నీవు చేసే పనిని మరింత బాగా చేసేలా శ్రమించు. 
ఏ బలహీనత లేని బలవంతుడిని ఆ దేవుడు ఇంకా సృష్టించలేదు..
కావ్యం లాంటి నా జీవితంలో -  కరిగిపోయే కాలానికి,  చెరిగిపోయే రాతలకి,  మిగిలిపోయే తీపి సంతకం నీతో నా పరిచయం.. 
గెలుపు : పదిమందికి పరిచయం.  ఓటమి : నీతో నీకు పరిచయం.. 
నాలుగు గోడల మధ్య ప్రతి మనిషికీ ఒక వికృత రూపం ఉంటుంది. 
నేస్తమా!.. అని పలకరించే హృదయం నీకుంటే -  నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా..  చిరునవ్వు లాంటి నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం.  నీ స్నేహం అంతులేనిది.. అతీతమైనది.. స్వార్థం లేనిది..  అలాంటి నీ స్నేహం ఎప్పటికీ, నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ..  ఎప్పటికీ నిన్ను మరచిపోలేని -  నీ నేస్తం.
నాలుగు గోడల మధ్య - ప్రతి మనిషికీ ఒక వికృత రూపం ఉంటుంది. 
ఎవరికి ఎవరెమో నిన్నటికి,  మిత్రులం అయ్యాము నేటికి,  మనం ఏమి అవుతామో రేపటికి,  విడిపోకు ఎన్నడూ ఏనాటికి కలిసి,  ఉండాలి ఎప్పటికీ,  ఇది నిజం కావాలి ముమ్మాటికీ..  
మనం చేసే ప్రతిపనిలోనూ ఆనందం లేకపోవచ్చు..!  కానీ ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము.. 
నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు..  వారన్నదానికి నువ్వెలా ప్రతిస్పందించావన్నది ముఖ్యం.  కొన్నిసార్లు తప్పుకొని వెళ్ళిపోవడం కంటే -  నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది. 
మనతో ఏకీభవించే వాళ్ళతో సౌఖ్యముగా ఉండగలం కానీ - ఏకీభవించని వాళ్ళ వల్లే ఎదుగుతాము. 
పిల్లలకు జన్మనివ్వడం కంటే ఒక తండ్రికి వేరే గొప్ప ఆనందం లేదు..  ప్రతి తండ్రికి గొప్ప తండ్రిగా అనిపించుకోవడమే పెద్ద విజయం. 
మనిషి తన లోటుపాట్లు తెలిసీ కూడా తనను తాను ఇష్టపడటం మానడు.  అవే బలహీనతలు ఎదుటివారిలో కనిపించినప్పుడు వారిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అదే ఈ సృష్టి విచిత్రం. 
మనిషి ఎన్నడూ ఒంటరి కాదు.. భౌతికముగా ఏకాంతముగా ఉన్నప్పటికీ - పదుగురి ఆలోచనలు, ప్రభావం తనని వీడనంత వరకూ అతనికి నిజమైన ఏకాంతం లభించదు. 
వందమంది ఉపాధ్యాయుల కన్నా కన్నతండ్రి మిన్న. 
విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతుల్లో విద్యను భోదించడం ఉపాధ్యాయుల పని. ఉపాధ్యాయుల్లోని సృజనాత్మకతను, అంతర్గత శక్తులను గుర్తించి అవి పెంపొందించే విధముగా ప్రోత్సాహించాలి. 
గురువు నుంచి జ్ఞానం పొందాలంటే - శిష్యుడికి ఆయన పట్ల నమ్మకం, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. ఈ రెండే ఆ శిష్యుని సంకల్పాన్ని దృఢ పరుస్తాయి. 
గురువు శిష్యుడి అజ్ఞానపు చీకటిని ప్రారదోలి జ్ఞాన పకాశాన్ని అనుగ్రహిస్తాడు. 
ఒక విద్యార్ధి నోటు పుస్తకములో ఒక చిత్రాన్ని గీస్తే - అలాంటి వాటికి వేరే నోటు పుస్తకాన్ని వాడాలని ప్రేమగా చెప్పాలి. అలాగే చిత్రకారుడిగా ఎలా ఎదగాలో వివరించాలి. దానికి బదులుగా తనని శిక్షిస్తే - భవిష్యత్తులో ఒక గొప్ప చిత్రకారుడు అవకాశాన్ని అయ్యే అవకాశాన్ని అతడు కోల్పోవచ్చు.. 
హృదయం ఉన్నది పగలటానికేనేమో..  ఎంత పగిలినా కొంత మిగిలే ఉంటుంది -  మళ్ళీ పగలటానికేనేమో.. !
ఓడిపోయిన ప్రతిసారీ నా మది ఒకమాట అంటుంది. అదేమిటంటే -  ఇంకో ప్రయత్నంలో నేను ఖచ్చితముగా గెలుస్తానని.. 
కొందరు ఇలా కూడా ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త.. 
మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ - ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని పొందలేము. 
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు