2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించినందుకు ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ [...]
ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా [...]
నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది [...]
ఈ వ్యాసం తొలుత veturi.in లో ప్రచురింపబడినది. దయచేసి veturi.in ని సందర్శించండి.వేటూరి ఒక అచ్చతెలుగు కవి. ఆయనకు తెలుగు అంటే ఉన్న మమకారం మనందరికీ తెలుసును. ఆయన పాటల్లో తెలుగుదనాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు సంపదను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం ఇదివరకు చర్చిన్చుకున్నదే. వీటికి తోడు వేటూరి పాటల్లో నాకు నచ్చే మరొక అంశం ఏమిటి అంటే, ఆయన వాడే సంస్కృత సమాసాలు. కొన్ని [...]
ఎందుకో ఒక రోజు శారదాదేవిని తలుచుకుంటే ఈ పద్యం స్ఫురించింది. నాకు ఎంతగానో నచ్చిన పద్యాలలో ఇది ఒకటి. సంగీతం, సాహిత్యం అమ్మకు రెండు స్తనాలు అని పెద్దల ఉవాచ. అదే అమ్మ మళ్ళీ నా చేత చెప్పించింది. తోటకంకలుషారికి మంగళకారిణికిన్కలితామృతకావ్యవికాసినికిన్కలకంఠికి శ్రావ్యసుగానఝరీజలదాయినికిన్ నమ (నతి) శారదకున్అమ్మవారు మాయా. అంటే స్వతహాగా గుణాతీతమైన బ్రహ్మానికి రంగులు [...]
మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.సందర్భంఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. [...]
చం:-శివయను మాట బిందువయి జిహ్వను తాకినయంత తానుగాఅవిరళమైన తీపి చని ఆవలి సంగతులెల్ల మాయమౌదివిధుని పాపరాశులను తీర్చినయట్టుల నాదు హృత్తునన్భవలవభావతాపములు భంజనమొందును భక్తివాహినిన్
 శా:-స్తన్యంబీయని తల్లియున్, శిశువులన్ సాకేటి దొడ్డాలియున్మాన్యంబౌ సిరియున్ దురాశగొలిపే మాయాత్మికాశక్తియున్కన్యల్ మ్రొక్కెడి మాతయున్! పురుషులన్ కాల్చేటి కామాగ్నియున్సన్యాసుల్ సుఖభోగులున్ కొలుచుయా శర్వాణివీవే గదే! భా:-బిడ్డకు పాలివ్వని తల్లివీ, పిల్లలను సాకే తల్లివీ నీవే. గౌరవప్రదమైన సంపదవూ నీవే, దురాశ కలిగించే మాయవీ నీవే. కన్యలు కొలిచే జగన్మాతవూ నీవే, [...]
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారంలక్షణం:(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైఃనయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)వరుస దప్పని కారణావళులతోడఁగీలు కొల్పినఁ గారణమాలయగునునీతిచే సిరి సిరి చేత దాతృతయునుదాతృతను భూరియశమన్నరీతి శర్వభావం: కారణం [...]
దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు [...]
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం లక్షణం:సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతేఅసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)కార్యకారణములు రెండు గలియఁబలికెనేని యది హేత్వలంకృతి నా నెసంగునుదయ మందెడు నీ శశి మదవతీ కదంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకువివరణ: [...]
ఒక రోజు పొద్దున్నే రాంబాబు & కో మధ్య సంభాషణలు.వెం: ఆకలేస్తోందిరా. ఏమైనా తినడానికి ఉందా?రాం: వెళ్ళి వంటింట్లో వెతుక్కో.వెం: ఇక్కడ biscuit packet ఉంది? ఎప్పటిది?రాం: అది తినకు, ఎప్పుడో పరమపదించింది.వెం: (packet పై label చదువుతూ) ఇది September 1st న manufacture ఐందిరా. Best before 2 weeks of manufacture. ఫరవాలేదు.(వెంకట్ packet తెరిచి ఒక biscuit ముక్క తిన్నాడు. తింటూనే గొంతులో మండినట్టైంది, ఒక రకమైన చేదు నాలికని ముంచేసింది.)వెం: [...]
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారంలక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోఃవివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.ఉదా:- (చంద్రాలోకం)సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః  కింతు ప్రకృతి [...]
మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.ఈ రోజు కూడా సియాటల్లో వర్షం [...]
"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా [...]
బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి [...]
ఈవేళ సియాటల్లో వర్షం పడుతోంది. సియాటల్ గురించి తెలియని వాళ్ళు "ఔనా?" అనుకుంటారేమో కానీ సియాటల్ గురించి తెలిసినవాళ్ళు "అందులో పెద్ద విశేషమేముంది?" అనడగుతారు. సియాటల్లో ఏటికి సుమారు అరవై-డబ్భై రోజుల్లో మాత్రమే సూర్యుడు నిరాటంకంగా గగనవీధిలో సంచరిస్తాడు. మిగతా రోజుల్లో మబ్బులూ, వర్షం సహజం. సియాటల్ ని అందరూ ఎప్పుడూ చీకటిగా ఉండే చోటని ఆడిపోసుకుంటారు. కానీ నాకు సియాటల్ [...]
"పెళ్ళిచేసి చూడు" అనే అంకంలో ముందు భాగాలు: 1, 2.రాం: ఆసక్తితో పాటు విరక్తిని కూడా కలిగించడం నీకే సాధ్యం రా!వెం: Thank you. Of course, ఉత్త విరక్తి కలిగించాలంటే నీకు నువ్వే సాటిలే.చం: ఇంకా కథలు చెప్పరా అబ్బాయ్!వెం: కొన్ని matrimony profiles, e-mails లాగా ఉంటాయి. వీళ్ళు eye-tex నేటి మహిళలు అన్నమాట. Profile description లో వాళ్ళ గురించి చెత్తా చెదారం రాసి జనాలను ఊదరగొడతారు. ఉదాహరణకిHi This is Rota. Myself, a software engineer in a reputed MNC in Hyderabad. I have studied in IIT Amalapuram. My [...]
మొదటి భాగం ఇక్కడ చూడవచ్చును.చం: ఒక్కోసారి ఇదంతా చూస్తుంటే వెనకతరం మగవాళ్ళు చేసిన పాపాలు శాపాలై మనకు తగులుతున్నాయి అనిపిస్తూ ఉంటుందిరా. ఆడవాళ్ళని కట్నం అని, లాంఛనం అని వేధించారు. రాం: బాబు, ఏ కథకైన రెండు వైపులూ ఉంటాయి. తెలివైన ఆడవాళ్ళు మగవాళ్ళనీ ఏడిపించారు. మా ఊళ్ళో కొంతమంది మగవాళ్ళైతే వాళ్ళ జీవితమంతా "నేనంటే మా ఆవిడకి దడ" అనే అమాయకత్వంలో ఉంటూనే వాళ్ళ పెళ్ళాళ్ళకు [...]
ఒక ఆదివారం మధ్యాహ్నం రాంబాబు, వెంకట్, చందు ముగ్గురూ భోజనం చేసి కూర్చున్నారు.రాం: ఏరా వెంకట్, మీ danger బాబాయ్ నీకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడట? ఎవరో పిసినారి మాష్టారు అట? వాళ్ళ అమ్మాయిని చూసావా?వెం: ప్రశాంతంగా ఉన్న మధ్యాహ్నాన్ని ఎందుకు చెడగొడతావురా?రాం: పెళ్ళంటే భయమా, బాబాయంటే కంగారా, పిసినారి మాష్టారు అంటే చిఱాకా, వాళ్ళ అమ్మాయి ఇష్టం లేకా? వెం: (నుదుటి మీద చెయ్యి [...]
చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే [...]
నిప్పు లేనిదే పొగ పుట్టదు అంటారు. అలాగని వందమంది అన్నంతమాత్రాన కాకి కోకిలా అవ్వదు కదా? అందుచేత ప్రజలలో ఎక్కువగా వినబడే అభిప్రాయాన్ని రెండు వైపుల నుండీ జాగ్రత్తగా విశ్లేషించి కానీ ఒక అభిప్రాయానికి రాలేము. ఇంతకీ ఆ పొగ ఏమిటి అంటే "వేటూరి అనువాదగీతలు సరిగ్గా వ్రాయలేదు. వాటిల్లో చెప్పుకోదగ్గ పాట ఒకటి కూడా లేదు. దానికి కారణం ఆయనలో ఉన్న అశ్రద్ధ." ఇది ఒక వాదన. కొంతమంది ఈ [...]
(ఉపోద్ఘాతం: రాంబాబు, వెంకట్, చందు బెంగుళూర్లో ఒక ఇంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.)అది అర్థరాత్రి అమావాస్య. జుట్టు విరబూసుకున్న దెయ్యాలు అన్నీ ఒక చోట చేరాయి. వాళ్ళ పెదాలు నెత్తురు పూసుకున్నట్టు ఎఱ్ఱగా ఉన్నాయి. చుట్టూ చెవులు పగిలిపోయేలాగా కేకలు వినిపిస్తున్నాయి. అంతా చీకటిగా ఉన్నా అక్కడక్కడ అదో రకమైన తెలుపులో వెలుగు, అప్పుడప్పుడు ఎఱ్ఱని కాంతి వచ్చి మాయమైపోతోంది. [...]
రాత్రి రెండు దాటాక నేను మాట్లాడేదానికే అర్థం ఉండదు (అప్పుడప్పుడు పగలు కూడా). అలాంటిది జాలపౌరులు అందరూ చూడగలిగే బ్లాగు వ్రాస్తున్నాను. ఏమైనా అర్థరహితంగా (అదే, పిచ్చి పిచ్చిగా) అనిపిస్తే క్షమించాలి.అసలు విషయానికి వస్తే: మొన్న ఒక పూటకూళ్ళయింటికి (restaurant) వెళ్ళాను. అక్కడ తిండిని అందించే ఒక అమ్మాయి వర్ణించలేనంత అందంగా క/అనిపించింది. సరే, ఈ మధ్య మనం కాస్త సృజనాత్మకంగా [...]
(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు